టీ.నగర్ : అరెస్టయిన తమిళజాలర్లు 37 మందిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జాలర్లు కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న సమయం లో శ్రీలంక నావికాదళం చెర పట్టడం సర్వసాధారణమైపోయింది. ఈ సంఘటనల్లో జాలర్ల వలలను నావికాదళం ధ్వంసం చేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ జాలర్లు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు.
గత నెల 29వ తేదీ కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న రామేశ్వరం జాలర్లు 17 మందిని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. గత 5వతేదీ రామేశ్వరం, మం డపం జాలర్లు కచ్చదీవి సమీపంలోచేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళ సిబ్బంది 20 మంది జాలర్లను అరెస్టు చేసింది. వారిని విడుదల చేయాలని కోరుతూ రామేశ్వరం జాలర్లు ఒక సమావేశం జరిపారు. 20వ తేదీలోగా జాలర్లును విడిపించాలని, లేనిపక్షంలో 21 వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ మరపడవల దస్తావేజులను అప్పగించనున్నట్లు ప్రకటించారు.
26వ తేదీ పడవల్లో కచ్చదీవికి వెళ్లి ఆశ్రయం పొందనున్నట్లు తీర్మానించారు. 37 మంది జాలర్లను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి మళ్లీ లేఖ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపింది. శ్రీలంకలో జైళ్లలో మగ్గుతున్న 37 మంది జాలర్లను శుక్రవారం తలైమన్నార్ కోర్టులో హాజరు పరచారు. వారిని శ్రీలంక ప్రభుత్వం సిఫార్సుల మేరకు విడుదల చేస్తూ మన్నార్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో 37 మంది జాలర్లు భారత నావికాదళానికి శుక్రవారం అప్పగించారు.
37 మంది జాలర్ల విడుదల
Published Sat, Jul 12 2014 12:51 AM | Last Updated on Sat, Sep 2 2017 10:09 AM
Advertisement
Advertisement