Sri Lankan government
-
సీఎం మమతా బెనర్జీకి శ్రీలంక అధ్యక్షుడు ఆసక్తికర ప్రశ్న
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే ఆసక్తికర ప్రశ్న అడిగారు. ప్రస్తుతం దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఒక్కటైన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తారా..? అని రణిల్ విక్రమసింగే దీదీని అడిగారు. అందుకు ఆమె.. చిరునవ్వుతూ ప్రజల మద్దతు ఉంటే అధికారంలోకి వస్తాం అని సమాధానమిచ్చారు. ప్రస్తుతం మమతా బెనర్జీ దుబాయ్, స్పెయిన్ పర్యటనలో ఉన్నారు. దుబాయ్ పర్యటనలో భాగంగా ఎయిర్‌పోర్టులో శ్రీలంక అధ్యక్షుడు రణిల్ విక్రమసింగే, సీఎం మమతా బెనర్జీని కలిశారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. నవంబర్‌లో కలకత్తాలో జరగనున్న బిజినెస్ సమ్మిట్‌కు ఆయన్ని మమతా బెనర్జీ ఆహ్వానించారు. శ్రీలంకలో పర్యటించాలని సీఎం మమతను రణిల్ విక్రమసింగే ఆహ్వానించారు. His Excellency The President of Sri Lanka Ranil Wickremesinghe saw me at the Dubai International Airport Lounge and called me to join for some discussion. I have been humbled by his greetings and invited him to the Bengal Global Business Summit 2023 in Kolkata. HE the President… pic.twitter.com/14OgsYjZgF — Mamata Banerjee (@MamataOfficial) September 13, 2023 ఇండియా కూటమి సమన్వయ కమిటీ నేడు ఢిల్లీలో భేటీ కానుంది. కమిటీలో నేతలు ఎన్సీపీ నేత శరద్ పవార్ నివాసంలో చర్చలు జరపనున్నారు. లోక్‌సభ సీట్ల షేరింగ్, పార్టీల మధ్య విభేదాలు, ప్రచారాలు వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. ఈ మీటింగ్‌కి టీఎంసీ దూరంగా ఉంది. తమ రాష్ట్రంలో కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలకు సీట్లను పంచుకునే ప్రసక్తే లేదని ఇప్పటికే మమతా బెనర్జీ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో కూటమిపై శ్రీలంక అధ్యక్షుడు అడిగిన ప్రశ్న ప్రాధాన్యత సంతరించుకుంది. ఇదీ చదవండి: ఈ నెల 17న అఖిలపక్ష భేటీకి కేంద్రం పిలుపు.. -
ఏప్రిల్ వరకూ శ్రీలంకకు ఫ్రీ వీసా!
న్యూఢిల్లీ: భారతీయులకు ఇస్తున్న ఫ్రీ వీసా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ కొనసాగించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది జరిగిన ఈస్టర్ దాడుల వల్ల పర్యాటక రంగానికి కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఫ్రీ వీసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచే ముసాయిదా కేబినెట్ పరిశీలనలో ఉందని ఆ దేశ పర్యాటక మంత్రి ప్రసన్న రణతుంగ శుక్రవారం తెలిపారు. -
కాంగ్రెస్‌తో పోల్చద్దు
సాక్షి, చెన్నై: కాంగ్రెస్ ప్రభుత్వంతో బీజేపీ ప్రభుత్వాన్ని పోల్చుకోవద్దంటూ శ్రీలంక ప్రభుత్వాన్ని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. ఆయన ఆదివారం కమలాలయ సందర్శనకు రావడంతో కార్యకర్తలు సందడి చేశారు. రాష్ట్రంలోని ఇతర పార్టీలకు భిన్నంగా బీజేపీ ఐదేళ్ల క్రితం ఓ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు ఏడాదిలో ఓ రోజు పార్టీ కార్యాలయాన్ని సందర్శించే విధంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి వినూత్న స్పందన వస్తోంది. ప్రతి ఏటా జరిగే ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులు తమ కుటుంబ సమేతంగా తరలి వస్తున్నారు. శనివా రం సాయంత్రం నుంచి రాత్రి వరకు ఈ సందర్శన వేడుక కమలాలయంలో జరిగింది. అందరి కన్నా భిన్నంగా అక్క డ ఏర్పాట్లు చేశారు. పార్టీ మైకులు, స్పీక ర్లు, ప్రసంగాలకు చోటు ఇవ్వకుండా, టీ నగర్‌లోని పార్టీ కార్యాలయ పరిసరాల ను ఓ పెళ్లి వేడుకను తలపించే విధంగా తీర్చిదిద్దారు. తరలి వచ్చిన కార్యకర్తలను పార్టీ అధ్యక్షుడు, కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్, నాయకులు ఇలగణేషన్, తమిళి సై సౌందరరాజన్, వానతీ శ్రీనివాసన్, మోహన్ రాజులు, హెచ్ రాజా తదితరులు ప్రవేశ మార్గంలో స్వాగతం పలకడం విశేషం.విందులతో సందడి: పార్టీ కార్యాలయం లో విందులు, సంగీత విభావరిలతో కార్యకర్తలు, నాయకులు సందడి చేశా రు. దేశ భక్తి గీతాల సంగీత విభావరి, మోడీ వేషధారణలతో ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. అలాగే, గ్రామీణ సం స్కృతి ఉట్టి పడే రీతిలో దుకాణాలు సైతం ఏర్పాటు చేయడం విశేషం. 20 రకాల వంటకాలను కార్యకర్తలకు విందుగా అందజేశారు. రాత్రి పొద్దుపోయే వరకు కుటుంబంతో కలసి పార్టీ కార్యకర్తలు ఆనందాన్ని తమ నేతలతో పంచుకున్నారు. కొందరు నాయకులు, కార్యకర్తలు తమ సమస్యల్ని, తమ ప్రాంతాల్లోని సమస్యల్ని వినతి పత్రాల రూపంలో తెలియజేశారు. అండగా ఉంటాం: కార్యకర్తలతో మాట్లాడిన పొన్ రాధాకృష్ణన్ అందరికీ అం డగా ఉంటామని హామీ ఇచ్చారు. కేంద్రంలో ఇది వరకు కాంగ్రెస్ అసమర్థ ప్రభుత్వం అధికారంలో ఉన్నదని, ఆ ప్రభుత్వంతో బీజేపీని పోల్చుకోవద్దంటూ శ్రీలంకను హెచ్చరించారు. ప్రధాని నరేంద్ర మోడీ, సీఎం జయలలితను ఉద్దేశించి వ్యంగ్యాస్త్రాలు సంధించడాన్ని తీవ్రంగా ఖండిచారు. శ్రీలంక క్షమాపణలు చెప్పడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే, తమ వెబ్ సైట్లోకి అవి ఎలా వచ్చాయో తెలియవంటూ శ్రీలంక పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ విషయంలో మాత్రం తాము శ్రీలంకతో ఏకీభవించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సాగించిన ఆటలు తమ ప్రభుత్వ హయూంలోనూ కొనసాగించే యత్నంలో శ్రీలంక ఉన్నట్టుందని ధ్వజమెత్తారు. తమిళ జాలర్లకు ఇచ్చిన హామీని నెరవేర్చి తీరుతానని, మరో రెండు మూడు రోజుల్లో విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్ తో భేటీకి చర్యలు తీసుకుంటానంటూ ఈసందర్భంగా ఓ కార్యకర్త సంధించిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇవ్వడం విశేషం. -
నిరసన జ్వాల
- శ్రీలంక వెబ్సైట్లో అమ్మపై అనుచిత కార్టూన్ - అన్నాడీఎంకే శ్రేణుల ఆందోళన - క్షమాపణలు చెప్పిన శ్రీలంక ప్రభుత్వం శ్రీలంక వెబ్సైట్లో జయలలితను అవమానిస్తూ ఒక కార్టూన్‌ను పొందుపరిచారు. అందులో జయలలిత, ప్రధాని మోడీకి రాసే లేఖలను, ప్రేమ లేఖలుగా వర్ణించడంపై తమిళనాట నిరసన జ్వాలలు రేగారుు. శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే దిష్టిబొమ్మలను తగులబెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. చెన్నైలోని దౌత్య కార్యాలయూన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శ్రీలంక ప్రభుత్వం క్షమాపణలు చెబుతూ ప్రకటన విడుదల చేసింది. టీ.నగర్: శ్రీలంక సైనిక వెబ్సైట్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలితను కించ పరిచే విధంగా ఒక కార్టూన్ చిత్రం విడుదలైంది. దీంతో రాష్ట్రంలోని రాజకీయ పార్టీలు, తమిళ ప్రజలు అనేక చోట్ల శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు, నిరసనలు తెలిపారు. నుంగంబాక్కంలోని శ్రీలంక దౌత్య కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించిన అన్నాడీఎంకే కార్యకర్తలను పోలీసులు భద్రతా సిబ్బంది అడ్డుకోగా వారు లయోలా కళాశాల సమీపంలో ఆందోళనకు దిగారు. ఆ తరువాత శ్రీలంక ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ శ్రీలంక అధ్యక్షుడు రాజపక్షే దిష్టిబొమ్మలను దహనం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో దాదాపు మూడు గంటల సేపు వాహన రాకపోకలు స్తంభించాయి. నుంగంబాక్కంలో అన్నాడీఎంకే నేత ఆధ్వర్యం లో అన్నాడీఎంకే మహిళా కార్యకర్తలు, శ్రీలంక చర్యలకు నిరసనగా ఆందోళన జరిపారు. శ్రీలంక ప్రభు త్వ భద్రతా శాఖకు విడిగా ఒక వెబ్సైట్ ఉంది. భద్రతా శాఖ కార్యదర్శిగా శ్రీలంక అధ్యక్షుడు రాజ పక్సే సోదరుడు కోత్తప్పయే ఉన్నారు. ఈయన పర్యవేక్షణ కింద పని చేసే ఈ వెబ్సైట్లో ముఖ్యమంత్రి జయలలిత వైఖరికి వ్యతిరేకంగా ఒక వ్యాసం విడుదలైంది. శ్రీలంక రచయిత ఒకరు జయలలిత రాష్ట్ర జాలర్ల సమస్య గురించి ప్రధాని మోడీకి లేఖలు రాయడాన్ని విమర్శించారు. ఇందులో జయలలిత అనవసరంగా లేఖలు రాస్తున్నారని, దీంతో మోడీకి మాత్రమే సమస్యలు ఏర్పడుతున్నాయని, మోడీజయలలిత ఆదేశాల మేరకు నడుచుకోరని పేర్కొన్నారు. ఇటువంటి వ్యాసాలకు శ్రీలంక ప్రభుత్వం బాధ్యత వహించదని పేర్కొన్నప్పటికీ ఆ వ్యాసానికి సంబంధించి జయలలిత మోడీకి రాస్తున్న లేఖను ప్రేమలేఖను రాస్తున్నట్లు చిత్రించి అవమానించార ని చెప్పారు. ఈ చర్య రాష్ట్ర ప్రజల మనోభావాలను గాయపరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. పలువురు రాజకీయ నేతలు దీనిపై నిరసనలు వ్యక్తం చేశారు. ఇందులో వైగో, రాందాసు, పళ నెడుమారన్ ఉన్నారు. వ్యాపార సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెల్లయ్యన్ ఈ చర్యను ఖండిస్తూ రాజపక్సే దిష్టిబొమ్మను తగలబెట్టనున్నట్లు ప్రకటించారు. శ్రీలంక క్షమాపణ జయలలితను కించపరిచే విధంగా శ్రీలంక సైనిక వెబ్సైట్లో కార్టూన్ విడుదల చేయడం పట్ల శ్రీలంక ప్రభుత్వం జయలలితకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణలు తెలిపింది. -
37 మంది జాలర్ల విడుదల
టీ.నగర్ : అరెస్టయిన తమిళజాలర్లు 37 మందిని శ్రీలంక ప్రభుత్వం విడుదల చేస్తూ ఉత్తర్వులిచ్చింది. జాలర్లు కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న సమయం లో శ్రీలంక నావికాదళం చెర పట్టడం సర్వసాధారణమైపోయింది. ఈ సంఘటనల్లో జాలర్ల వలలను నావికాదళం ధ్వంసం చేస్తోంది. దీన్ని అడ్డుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలంటూ జాలర్లు అనేకసార్లు విజ్ఞప్తులు చేస్తున్నారు. గత నెల 29వ తేదీ కచ్చదీవి సమీపంలో చేపలు పడుతున్న రామేశ్వరం జాలర్లు 17 మందిని శ్రీలంక నావికాదళం అరెస్ట్ చేసింది. గత 5వతేదీ రామేశ్వరం, మం డపం జాలర్లు కచ్చదీవి సమీపంలోచేపలు పడుతుండగా శ్రీలంక నావికాదళ సిబ్బంది 20 మంది జాలర్లను అరెస్టు చేసింది. వారిని విడుదల చేయాలని కోరుతూ రామేశ్వరం జాలర్లు ఒక సమావేశం జరిపారు. 20వ తేదీలోగా జాలర్లును విడిపించాలని, లేనిపక్షంలో 21 వ తేదీ జిల్లా కలెక్టర్‌ను కలిసి తమ మరపడవల దస్తావేజులను అప్పగించనున్నట్లు ప్రకటించారు. 26వ తేదీ పడవల్లో కచ్చదీవికి వెళ్లి ఆశ్రయం పొందనున్నట్లు తీర్మానించారు. 37 మంది జాలర్లను వెంటనే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి జయలలిత కూడా విజ్ఞప్తి చేశారు. దీనిపై ప్రధాని నరేంద్రమోడీకి మళ్లీ లేఖ రాశారు. దీంతో కేంద్ర ప్రభుత్వం శ్రీలంకతో చర్చలు జరిపింది. శ్రీలంకలో జైళ్లలో మగ్గుతున్న 37 మంది జాలర్లను శుక్రవారం తలైమన్నార్ కోర్టులో హాజరు పరచారు. వారిని శ్రీలంక ప్రభుత్వం సిఫార్సుల మేరకు విడుదల చేస్తూ మన్నార్ కోర్టు ఉత్తర్వులిచ్చింది. దీంతో 37 మంది జాలర్లు భారత నావికాదళానికి శుక్రవారం అప్పగించారు.