
న్యూఢిల్లీ: భారతీయులకు ఇస్తున్న ఫ్రీ వీసా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ కొనసాగించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది జరిగిన ఈస్టర్ దాడుల వల్ల పర్యాటక రంగానికి కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఫ్రీ వీసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచే ముసాయిదా కేబినెట్ పరిశీలనలో ఉందని ఆ దేశ పర్యాటక మంత్రి ప్రసన్న రణతుంగ శుక్రవారం తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment