Ranatunga
-
ఏప్రిల్ వరకూ శ్రీలంకకు ఫ్రీ వీసా!
న్యూఢిల్లీ: భారతీయులకు ఇస్తున్న ఫ్రీ వీసా పథకాన్ని ఈ ఏడాది ఏప్రిల్ 30 వరకూ కొనసాగించేందుకు శ్రీలంక ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. గతేడాది జరిగిన ఈస్టర్ దాడుల వల్ల పర్యాటక రంగానికి కలిగిన నష్టాలను పూడ్చుకునేందుకు ఫ్రీ వీసా పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ గడువును ఏప్రిల్ 30 వరకూ పెంచే ముసాయిదా కేబినెట్ పరిశీలనలో ఉందని ఆ దేశ పర్యాటక మంత్రి ప్రసన్న రణతుంగ శుక్రవారం తెలిపారు. -
చిన్న చేపలే దొరికాయి
కొలంబో: గత వారం వెలుగులోకి వచ్చిన గాలే స్టేడియం పిచ్ ఫిక్సింగ్పై శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ స్పందించారు. ఈ ఉదంతంలో చిన్న చేపలే బలయ్యాయని... పెద్ద చేపలు తప్పించుకున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం శ్రీలంక ప్రభుత్వంలో మంత్రిగా వ్యవహరిస్తున్న రణతుంగ... తమ దేశ క్రికెట్లో అవినీతి తారస్థాయికి చేరిందని, మ్యాచ్ ఫిక్సింగ్ వంటి ఘటనలను నిరోధించడంలో ఐసీసీ విఫలమైందంటూ తీవ్రంగా విమర్శించారు. ఇలాంటివి చాలాకాలంగా సాగుతున్నాయని... వీటిపై తప్పనిసరిగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఆల్ జజీరా చానెల్ స్టింగ్ ఆపరేషన్ వీడియోలో గాలే టెస్టులో పిచ్ ట్యాంపరింగ్‌తో పాటు భారత్–ఇంగ్లాండ్, భారత్–ఆస్ట్రేలియా మధ్య జరిగిన టెస్టుల్లో స్పాట్ ఫిక్సింగ్ చోటుచేసుకున్నట్లు వెల్లడైన సంగతి తెలిసిందే. దీనిపై ఐసీసీ విచారణ సైతం చేపట్టింది. మరోవైపు గాలే పిచ్ విషయంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఓ శ్రీలంక ఆటగాడు, సస్పెన్షన్‌కు గురైన గ్రౌండ్స్‌మన్ తరంగ ఇండికా, జిల్లా కోచ్ తరిందు మెండిస్‌లు చాలా చిన్నవారని రణతుంగ వివరించారు. ‘ఇందులో ఓ పెద్ద వ్యక్తి ప్రమేయం ఉంది. అతడిపై చర్యలు తీసుకోవాలి. ఇంత జరుగుతున్నా ఐసీసీ అవినీతి నిరోధక విభాగం ఏం చేస్తోంది? ఇలాంటివి అరికట్టలేకపోతే వారెందుకు? అందుకే కొన్నేళ్లుగా ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ప్రతిష్ఠ దెబ్బతింటోంది’ అంటూ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా శ్రీలంక క్రికెట్ చీఫ్‌గా తిరంగా సుమతిపాల హయాంలో వచ్చిన ఆరోపణలనూ ప్రస్తావించారు. ఐసీసీ ఇకపై గట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. రణతుంగ... భారత్–శ్రీలంక మధ్య జరిగిన 2011 ప్రపంచకప్ ఫైనల్ ఫిక్స్ అయిందంటూ గతేడాది ఆరోపణలు చేశారు. -
మా క్రికెట్ మ్యాచ్ లు చూడను..!
కొలంబో:2011 వరల్డ్ కప్ లో భాగంగా భారత్-శ్రీలంక జట్ల మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ లో ఫిక్సింగ్ జరిగిందంటూ ఇటీవల సంచలన వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ.. మరొకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ జట్టు ఆడే మ్యాచ్ లను చూడనంటూ కొత్త పల్లవి అందుకున్నాడు. ప్రస్తుతం శ్రీలంక క్రికెట్ పరిపాలనలోఉన్న అసహ్యకర వాతావరణమే తనను తమ మ్యాచ్ లు చూడకుండా చేయడానికి ప్రధానకారణమని రణతుంగ పేర్కొన్నాడు. 'శ్రీలంక క్రికెట్ లో చీదరించుకునే వాతావరణం నెలకొని ఉంది. దాంతో మా జాతీయ జట్టు ఆడే మ్యాచ్ లను చూడాలని అనుకోవడం లేదు. మా జట్టు ఏ సిరీస్ ఆడుతున్నా చూసే ఆసక్తిమాత్రం నాకు లేదు. దక్షిణాఫ్రికా-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగున్న టెస్టు సిరీస్ ను చూడాలని నిర్ణయించుకున్నా. ఆయా జట్ల మధ్య జరిగే సిరీస్ ను చూస్తున్నా'అని రణతుంగా పేర్కొన్నాడు. శ్రీలంక క్రికెట్ లో ప్రక్షాళన కోసం తాత్కాలిక కమిటీని ఏర్పాటు చేయాలంటూ ఆ దేశ ప్రధాని రాణిల్ విక్రమ్ సింఘేకు రణతుంగా లేఖ రాస్తానని రణతుంగా వెల్లడించారు. -
2011 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచ్ ఫిక్సయింది..!
♦ శ్రీలంక మాజీ కెప్టెన్ రణతుంగ సంచలన వ్యాఖ్యలు కొలంబో: 2011 వరల్డ్‌కప్ ఫైనల్ శ్రీలంక- భారత్ మ్యాచ్ ఫిక్సయిందని శ్రీలంక మాజీ క్రికెటర్ అర్జున్ రణతుంగ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మ్యాచ్‌పై వెంటనే విచారణ చేపట్టాలని శ్రీలంక ప్రభుత్వాన్ని రణతుంగ శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ ఫైనల్ మ్యాచ్ కు కామెంటేటర్ గా వ్యవహరించిన రణతుంగ ఫిక్సింగ్ ఆరోపణలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది.దీనికి సంబంధించి ఓ వీడియోను రణతుంగ ఫేస్బుక్లో పోస్టు చేశాడు. ‘2011 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్‌లో శ్రీలంక ఓడిపోవడం నిరాశ కలిగించింది. అప్పుడే నాకు ఈ మ్యాచ్ ఫిక్సయిందని అనుమానం నెలకొంది. ఇప్పుడు ఈ మ్యాచ్ పై పూర్తి విచారణ జరుపాలి’ అని రణతుంగ వీడియో పోస్టు చేశారు. ప్రస్తుతం ఎవరి పేర్లు చెప్పదల్చుకోలేదని ఏదో ఒకరోజు నిజం తెలుస్తుందని రణతుంగ తెలిపారు. ఈ ఫైనల్ మ్యాచ్‌లో సంగక్కర కెప్టెన్సీలో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక భారత్‌కు 275 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించింది. ఆ తరువాత బ్యాటింగ్ దిగిన భారత్, ఓపెనర్లు సచిన్, సెహ్వాగ్‌ల వికెట్లు త్వరగా కోల్పోయింది. దీంతో శ్రీలంక విజం ఖాయం అనుకున్న సందర్భంలో శ్రీలంక చెత్త ఫీల్డీంగ్ బౌలింగ్ తో మ్యాచ్ ను చేజార్చుకుంది. ఈ అంశాన్ని అప్పట్లో శ్రీలంక లోకల్ మీడియా ప్రశ్నించినా అంత ప్రాధాన్యత సంతరించుకోలేదు. ఆరు సంవత్సరాల తర్వాత ఇదే అంశాన్ని అర్జున్ రణతుంగ లేవేనత్తడంతో శ్రీలంక క్రికెట్ లో కలకలం రేగింది. ఇంతటితో ఆగకుండా ఈ అంశాన్ని, శ్రీలంక క్రికెట్ బోర్డు వ్యవహారాన్ని ప్రెసిడెంట్ మైత్రిపాల్ సిరిసేన, ప్రధాని రాణీ విక్రమ్ సింగ్ లకు ఫిర్యాదు చేస్తానని రణతుంగ పేర్కొన్నారు. ఇక రణతుంగ కెప్టెన్సీలో శ్రీలంక 1996 ప్రపంచకప్ గెలిచింది.