పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు | Customs Seize Semi Precious Stones Worth Above Four Crores Chennai | Sakshi
Sakshi News home page

పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు

Published Sun, Mar 13 2022 8:23 AM | Last Updated on Sun, Mar 13 2022 8:23 AM

Customs Seize Semi Precious Stones Worth Above Four Crores Chennai - Sakshi

సాక్షి, చెన్నై: శ్రీలంక నుంచి చెన్నైకు వచ్చిన పార్శిల్‌లో రూ.4.45 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. శనివారం ఉదయం చెన్నై విమానాశ్రయానికి శ్రీలంకన్‌ ఎయిర్‌లైన్స్‌ విమానం వచ్చింది. ఇందులో వచ్చిన పార్శిల్‌పై అధికారులకు అనుమానం కలిగింది. చెన్నైకు చెందిన ఓ పారిశ్రామివేత్త చిరునామాతో రావడం.. రూ.5.85 లక్షల విలువైన సెమీ వజ్రాలు ఉన్నట్లు రశీదులో పేర్కొని ఉండటంతో అనుమానంతో తెరిచి చూశారు.

అందులో ఉన్న వజ్రాలు, రత్నాలను నిపుణుల ద్వారా పరీక్షించగా, వాటి విలువ రూ.4.45 కోట్లుగా తేలింది. దీంతో చెన్నైలోని ఆ పారిశ్రామికవేత్తను కస్టమ్స్‌ అధికారులు విచారించే పనిలో పడ్డారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement