‘రామ్‌ సేతు’లో అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్‌లుక్‌ చూశారా?‌ | Akshay Kumar New Look Out From Ram Setu Movie | Sakshi
Sakshi News home page

‘రామ్‌ సేతు’లో అక్షయ్‌ కుమార్‌ ఫస్ట్‌లుక్‌ చూశారా?‌

Published Wed, Mar 31 2021 8:16 AM | Last Updated on Wed, Mar 31 2021 11:28 AM

Akshay Kumar New Look Out From Ram Setu Movie - Sakshi

పురావస్తు శాస్త్రవేత్తగా అయోధ్యకు ప్రయాణమయ్యారు అక్షయ్‌ కుమార్‌. అభిషేక్‌ శర్మ దర్శకత్వంలో అక్షయ్‌ కుమార్, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, నుమ్రత్‌ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న హిందీ సినిమా ‘రామ్‌ సేతు’. ఈ సినిమా షూటింగ్‌ ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో ప్రారంభమయింది.

ఈ చిత్రంలో పురావస్తు శాస్త్రవేత్త పాత్రలో నటిస్తున్నారు అక్షయ్‌. ‘‘నా కెరీర్‌లోనే ఓ ప్రత్యేకమైన సినిమా ‘రామ్‌ సేతు’. ఈ సినిమా షూటింగ్, నా కొత్త లుక్‌ ఎలా ఉందో చెప్పండి’ అంటూ ఈ సినిమాలోని తన లేటెస్ట్‌ లుక్‌ను షేర్‌ చేశారు అక్షయ్‌. కొన్నేళ్ల క్రితం రామసేతు అనే బ్రిడ్జ్‌ ఉన్న మాట నిజమా? అబద్ధమా? అనే అంశం నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోందదని బాలీవుడ్‌ టాక్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement