‘రామ్ సేతు’లో నేను నటించిన సీన్స్ కథకు అత్యంత కీలకమైనవని తెలిసినా.. ఎడిటింగ్‌లో ఎక్కడ తీసేస్తారోననే భయం ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత నా సీన్స్ ఏవీ కట్ చేయలేదని తెలిసింది. నా సన్నిహితులు సినిమా చూసిన తర్వాత పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను’అన్నారు నటి జయశ్రీ రాచకొండ.
అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైంది. ఈ చిత్రంలో జయశ్రీ జడ్జిగా నటించారు. . అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలగానే ఉందని చెబుతున్న రాచకొండ... ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు.
ప్రస్తుతం తాను ‘లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది... చెప్పాలనున్నది, ‘బ్రేకింగ్ న్యూస్’ లాంటి చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘డాక్టర్ రెహానా’ లోనూ నటిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment