jayasri
-
‘రామ్ సేతు’లో నటించానంటే నమ్మలేకపోతున్న: జయశ్రీ
‘రామ్ సేతు’లో నేను నటించిన సీన్స్ కథకు అత్యంత కీలకమైనవని తెలిసినా.. ఎడిటింగ్‌లో ఎక్కడ తీసేస్తారోననే భయం ఉండేది. కానీ సినిమా చూసిన తర్వాత నా సీన్స్ ఏవీ కట్ చేయలేదని తెలిసింది. నా సన్నిహితులు సినిమా చూసిన తర్వాత పంపిస్తున్న స్క్రీన్ షాట్స్, కాంప్లిమెంట్స్ తో ఉక్కిరిబిక్కిరి అయిపోతున్నాను’అన్నారు నటి జయశ్రీ రాచకొండ. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘రామ్ సేతు’. రామ్ సేతు విశిష్టత, దాన్ని రక్షించేందుకు ఆర్కియాలజిస్ట్ చేసే సాహసోపేతమైన జర్నీ ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 25న విడుదలైంది. ఈ చిత్రంలో జయశ్రీ జడ్జిగా నటించారు. . అక్షయ్ కుమార్, నాజర్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ వంటి స్టార్స్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం ఇప్పటికీ ఓ కలగానే ఉందని చెబుతున్న రాచకొండ... ఈ చిత్రం ఈ దీపావళికి తనకు లభించిన అత్యంత విలువైన కానుకగా అభివర్ణిస్తున్నారు. ప్రస్తుతం తాను ‘లీగల్లీ వీర్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, మనసున ఉన్నది... చెప్పాలనున్నది, ‘బ్రేకింగ్ న్యూస్’ లాంటి చిత్రాలతో పాటు సల్మాన్ ఖాన్ బావమరిది ఆయుష్ శర్మ దర్శకత్వం వహిస్తున్న ‘డాక్టర్ రెహానా’ లోనూ నటిస్తోంది. -
పదవ తరగతిలో పెళ్లి.. ప్రధాన మంత్రి పాత్ర
డాక్టర్ కావాలనుకొని యాక్టరయ్యానని చాలా మంది నటీనటులు చెప్పుకుంటారు. కానీ లాయర్ కావాలని కలలుగన్న ఆమె మాత్రం లాయర్‌తో పాటు యాక్టర్‌గా తన సృజనను చాటుకోవాలని గట్టి తలంపుతో వెండితెరపై కూడా వెలిగిపోతున్నారు. ఒకవైపు హైకోర్టు న్యాయవాదిగా.. ఇంకోవైపు వెండితెరపై తన అభినయంతో ఆకట్టుకుంటున్నారు. ఆమె పేరు జయశ్రీ రాచకొండ. నాని నిర్మించిన ‘అ’, చేనేత కార్మికుల జీవితాలకు అద్దం పట్టిన మల్లేశం, బుర్రకథ, సీత ఆన్ ది రోడ్ వంటి చిత్రాల్లో ఆమె పోషించిన అరుదైన పాత్రల్లోనూ మంచి పేరు సంపాదించుకొని ముందుకు సాగుతున్నారు ‘లాయర్ టరŠడ్న్ సినీ ఆర్టిస్ట్’ జయశ్రీ రాచకొండ. బంజారాహిల్స్: ఆమె తాజాగా నటించిన ‘చదరంగం జీ–5’ వెబ్ సిరీస్ విశేష ఆదరణ పొందుతూ అందరి దృష్టిని అమితంగా ఆకట్టుకుంటోంది. ఇందులో ఆమె దివంగత ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పోలిన వసుంధర అనే ఓ పవర్ఫుల్ పాత్రను పోషించారు. ఈ ప్రధాన మంత్రి పాత్ర పోషణకు ఆమె అందుకుంటున్న ప్రశంసలు అన్నీ ఇన్ని కావు. ప్రపంచవ్యాప్తంగా ఉత్తమ ప్రధానమంత్రిగా పేరుగాంచిన ఐరన్ లేడీ ఇందిరాగాంధీ వంటి పవర్ఫుల్ లీడర్పాత్రను పోషించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని ఆమె పేర్కొంటున్నారు. విజయావకాశాలు మెండుగాఉన్న చిత్రాల్లో.. ప్రస్తుతం తాను ప్రముఖ దర్శకుడు వీఎన్ ఆదిత్య రూపొందిస్తున్న వాళ్లిద్దరి మధ్య, విటల్‌వాడీ చిత్రాలతో పాటు పాయల్ రాజ్‌పుత్‌తో తెరకెక్కుతున్న ఇంకా పేరు పెట్టని హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రంలోనూ నటిస్తున్నట్లు చెప్పారు. ఇవన్నీ విజయావకాశాలు మెండుగా ఉన్న చిత్రాలని, తనకు మంచి పేరు తీసుకొస్తాయని తెలిపారు. నా తల్లే మార్గదర్శి.. ప్రతికూల పరిస్థితుల్లోనూ సానుకూల దృక్పథంతో సంకల్ప బలంతో ముందుకు సాగి నిర్దేశిత లక్ష్యాన్ని సాధించాలనే తలంపుగా పెట్టుకున్నట్లుగా ఈ సందర్భంగా ఆమె వెల్లడించారు. మన కళ్లముందు తిరిగే వ్యక్తుల నుంచి ప్రేరణ పొందాలని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా టెక్నికల్ క్యాంపస్ అటానమస్ కాలేజీ విద్యార్థినులతో నిర్వహించిన మహిళా సాధికార సదస్సులో ఆమె సూచించారు. ముని మనవరాల్ని సాకుతూ ఆరు పదులకు చేరువలో డిగ్రీ పట్టా పుచ్చుకున్న తన తల్లి తనకు మార్గదర్శి అని ఈ సందర్భంగా ఆమె తెలిపారు. జయశ్రీ రాచకొండను సత్కరిస్తున్న సీఎంఆర్ టెక్నికల్ సంస్థ ప్రతినిధులు చిన్నప్పుడే పెళ్లి.. మాది కరీంనగర్ జిల్లా. ప్రస్తుతం అల్వాల్‌లో నివాసం. ఉన్నతాభ్యాసం హైదరాబాద్‌లోనే.. రామగుండం ఎఫ్‌సీఐ స్కూల్లో చదువుతున్న సమయంలోనే పదవ తరగతిలో పెళ్లైంది. ఆ తర్వాత ఏడాదికే పాప పుట్టింది. బాగా చదవాలనుకున్నా అప్పటికే బాధ్యతలు పెరిగిపోయాయి. నా భర్త జి.వేణుమాధవరావు పంచాయతీరాజ్ శాఖలో ఈఈగా పనిచేస్తున్నారు. తండ్రి నర్సింగరావు అకౌంట్స్ ఆఫీసర్. తల్లి విజయలక్ష్మి గృహిణి. నాకిప్పుడు మనవరాలు కూడా ఉంది. నేను చదవాలనుకున్న కోర్సులను పెళ్లి పిల్లల తర్వాత నెరవేర్చుకున్నారు. ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేసి ఉస్మానియా లా కళాశాలలో మెరిట్లో ఎల్ఎల్బీ సీటు సాధించాను. ప్రస్తుతం హైకోర్టు న్యాయవాదిగా పనిచేస్తున్నాను. ప్రతి రెండేళ్లకోసారి ఎఫ్సీఏ స్కూల్ రీజెనరేషన్ కార్యక్రమం నిర్వహిస్తుంటాను. 2016లో ఆ కార్యక్రమానికి వెళ్లినప్పుడు నా సహచర విద్యార్థి మాట్లాడుతున్నప్పుడు నా హావభావాలు గమనించి తన సినిమాలో యాక్ట్ చేస్తావా అంటూ ప్రశ్నించాడు. మొదట అంగీకరించలేదు. తర్వాత మాత్రం తప్పనిసరిగా నటించాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు. ఒకటి తర్వాత ఒకటి సినిమా అవకాశాలు వాటంతట అవే వచ్చాయి. ప్రయత్నిస్తే ఇంకా మంచి అవకాశాలు వస్తాయి కదా అని చాలా మంది అంటున్నా ఇప్పుడున్న సినిమాలు సరిపోతాయని అనుకుంటున్నాను. ఇప్పటికే మంచిమంచి సినిమాల్లో అవకాశాలు వస్తున్నాయి. -
లగేజ్ ట్యాగ్
ఇండిగో కౌంటర్ మీద ఉన్న అమ్మాయి లగేజ్ ట్యాగ్ ఇవ్వలేదు రాజీవకు. ‘అక్కర్లేదు మామ్. మీ హ్యాండ్‌బ్యాగ్‌ను అది లేకుండానే తీసుకెళ్లవచ్చు’ అంది– చెక్ ఇన్ బ్యాగ్‌ను కన్వేయర్ బెల్ట్ మీదకు దొర్లిస్తూ. బోర్డింగ్ పాస్ తీసుకొని సెక్యూరిటీ వైపు నడిచింది రాజీవ. ఇంతమునుపు ఎయిర్‌పోర్ట్‌కు వస్తే ఫ్లయిట్లో తీసుకెళ్లాల్సిన బ్యాగ్‌లకు లగేజ్ ట్యాగ్ ఇచ్చేవారు. అది ఉంటేనే ఫ్లయిట్ లోపలికి అనుమతి ఉండేది. ఇప్పుడు ఆ సిస్టమ్ లేదని ఆమెకు అర్థమయ్యింది. చాలా ఏళ్లయ్యింది ఆమె విమాన ప్రయాణం చేసి. ఒంటరిగా ప్రయాణం చేసి కూడా. హ్యాండ్‌బ్యాగ్‌లోని డ్రైవింగ్ లైసెన్స్ కార్డ్, ఆధార్ కార్డ్, ఓటర్ కార్డ్, ఎంప్లాయి కార్డ్ అన్నీ ఒకసారి చెక్ చేసుకుంది రాజీవ. మామూలుగా అయితే ఇవన్నీ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉండదామెకు. భర్తో, కొడుకో వాటిని తమ దగ్గర పెట్టుకుని ఇటు నడువూ అటు నడువూ అంటూ తీసుకెళ్లి తీసుకొచ్చేస్తుంటారు. ఇవాళ తనే సొంతంగా చేసుకోవాలి. సెక్యూరిటీ చెక్ అయ్యాక, ఫ్లయిట్‌కు టైమ్ చూసుకుంటే దాదాపు గంటన్నర ఉంది. కొంచెం ఆకలిగా కూడా అనిపిస్తూ ఉంది. ఎర్లీమార్నింగ్ ఏడున్నరకు ఫ్లయిట్ అంటే అయిదున్నరకు ఎయిర్‌పోర్ట్‌లో ఉండాలి. దాని బదులు ట్రైనే హాయి. కాని సెమినార్ కండక్ట్ చేస్తున్నవారు ఫ్లయిట్లోనే రమ్మని చెప్పారు. ఫ్లయిటే కరెక్ట్ కూడా. హైదరాబాద్ నుంచి కేరళకు ట్రైన్లో ఎప్పటికి చేరాలి. ‘నేను ఎవరినైనా తోడు తెచ్చుకుంటే మీకు అభ్యంతరమా?’ అని నిర్వాహకులను అడిగింది రాజీవ. భర్తనో, కొడుకునో పిలిస్తే కాదనరు. వాళ్లు లేకుండా ఎక్కడికీ కదలదు ఆమె. ‘అభ్యంతరం లేదు’ అన్నారు వాళ్లు. ఇవాళ ప్రయాణం అంటే మూడు రోజుల క్రితం భర్తను అడిగిందామె– ‘టికెట్లు బుక్ చేశారా మనిద్దరికీ’ అని. అతను చాలా క్యాజువల్‌గా ‘నాకు కుదిరేలా లేదు బుజ్జీ’ అని పేపర్లో మునిగిపోయాడు. ‘అంటే?’ ‘నేను లేకపోతే నువ్వూ వెళ్లవుగా. అందుకని చేయలేదు’ చేతి వేళ్ల నుంచి పాదాల వరకు ఏదో చురుకు పాకినట్టయ్యింది. ‘వాణ్ణి తీసుకెళ్లేదాన్నిగా’ ‘వాడికేదో యూత్ ఫెస్టివల్ ఉందట కాలేజీలో’ అన్నాడు. ‘మీరూ మీరూ మాట్లాడుకున్నారు. నాకు మాట మాత్రం చెప్పలేదు’ ‘ఏముంది చెప్పడానికి? టిఫిన్ రెడీనా?’ లేచి డైనింగ్ టేబుల్ దగ్గరకు నడిచాడు. కాలేజీలో చేసేది కాంట్రాక్ట్ ఉద్యోగమే కావచ్చు. ఎన్నాళ్లు చేసినా పద్దెనిమిది, ఇరవై వేల జీతమే వస్తుండవచ్చు. కాని దక్షిణాది భాషా సాహిత్యాల మధ్య ఉండే సామీప్యత, తులనాత్మకత పట్ల రాజీవకు అభిరుచి, లోతైన ప్రవేశం ఉన్నాయి. చాలా జర్నల్స్‌కు రాస్తూ ఉంటుంది. కాని ఇలా సెమినార్లకు పిలిచేవాళ్లు తక్కువ. వచ్చిన ఒకటి రెండు అవకాశాలు ఎవరో ఒకరి సెక్యూరిటీలో వెళ్లి రావాలి. వాళ్లకు కుదరకపోతే ఆ అవకాశం కూడా పోయినట్టే. ఆ రోజంతా మనసు మనసులో లేదు. కాలేజ్‌లో ఒక లెక్చరర్‌కి ఇలా టికెట్లు గట్రా బుక్ చేయడం బాగా తెలుసు. ‘అయ్యో మేడమ్. డేట్స్ చెప్పండి. టూ మినిట్స్‌లో బుక్ చేస్తాను’ అని చేసి ఇచ్చాడు. ఆ రాత్రి చెప్పింది ఇంట్లో ‘నేను ఒక్కదాన్నే వెళుతున్నాను’ అని. ‘ఎలా వెళ్తావ్?’ ‘ఒక్కత్తే ఎలా వెళ్లి రాగలవ్?’ ఇద్దరూ ఒకే ప్రశ్నను అటు ఇటుగా వేశారు. మౌనంగా కప్‌బోర్డ్‌లో ఉన్న బ్యాగ్‌ను బయటకు దించే పనిలో మునిగిపోయింది. తెల్లవారుజాము నాలుగూ నాలుగుంపావుకు క్యాబ్ ఎక్కుతుంటే భయం వేసింది. భర్త నిద్ర కళ్లతోనే కిందకు దిగి, క్యాబ్ నంబర్‌ను సెల్లో ఫొటో తీసుకొని, మొక్కుబడిగా జాగ్రత్త అని చెప్పి, క్యాబ్ కదలే లోపే లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. ఇప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో హ్యాండ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని తిరుగుతూ ఉంది. ఒకచోట చిట్టి ఇడ్లీల స్టాల్ ఉంది. పాలరంగులో ఉన్న, వేడివేడి ఇడ్లీలు అమ్ముతున్నారు. ‘ఒన్ ప్లేట్ ప్లీజ్’ అంది రాజీవ. టోకెన్ తీసుకుంటూ ఉంటే ఆమెకు ఏదోలా అనిపించింది. ప్రయాణాల్లో ఇలా ఒన్ ప్లేట్ ఎప్పుడూ తీసుకోలేదు. ఆ టూ, త్రీ ప్లేట్ల హక్కుదారులు లేకుండా కేవలం ఒన్ ప్లేట్ తీసుకోవడం కొత్తగా కూడా అనిపించింది. ఇడ్లీ, కారప్పొడి, చట్నీ, పొగలు గక్కే సాంబారు... ఒక్కతే తను. అందరినీ చూస్తూ తింటూ ఉంది. చుట్టుపక్కల అనేకమంది ప్రయాణికులు ఉన్నారు. వారిలో ఒంటరి మగ ప్రయాణికులు చాలా మందే ఉన్నారు. ఆడవాళ్లు మాత్రం పిల్లలతోటో, భర్తలతోటో, బంధువులతోటో ఏదో ఒక ముడితో ఉన్నారు. తనలా ఒంటరివాళ్లు చాలా తక్కువ. ఎదురుగా వున్న గోడకేసి చూసింది. వెలిగిపోయే రంగులతో రైన్బో అనే అక్షరాలతో ఏదో అడ్వర్టైజ్మెంట్. గతుక్కుమంది. అది ఒక కండోమ్ అడ్వర్టయిజ్మెంట్. కొంచెం దూరంగా కూర్చున్న బిజినెస్ ఎగ్జెక్యూటివ్ విచిత్రంగా చూడబోయి తల దించుకుని కప్పులో కాఫీ వెతుక్కున్నాడు. ఒక్క క్షణం ఆగి మళ్లీ యాడ్ వైపు చూసింది. ఏం..కండోమ్ యాడ్ చూడకూడదా? అనుకుంది. అది కూడా ఒక హెల్త్ ప్రాడక్ట్. ప్రివెంటివ్ డివైజ్. పెళ్లయిన కొత్తలో పిల్లలు అప్పుడే వద్దనుకుని భర్తను కండోమ్ వాడమని సిగ్గు విడిచి అడిగింది. ‘ఛీఛీ నేను వాడను’ అన్నాడతను. ‘నువ్వే పిల్స్వాడు’ అని ఫోర్స్ చేశాడు. భర్త ఆర్డర్. పిల్స్ తినడం భార్య వంతు. భార్య బాధ్యత. భార్య ధర్మం. ఈమారు మరీ తీక్షణంగా ఆ యాడ్‌ను చూసింది. గమనిస్తున్న బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఏముంది అందులో అలా చూస్తోంది అని చూసి లేచి వెళ్లిపోయాడు. ప్లేట్ ఖాళీ అయ్యింది. కపుచ్చినో గటగటా తాగేసింది. బ్యాగ్‌ను డ్రాగ్ చేస్కుంటూ గేట్ నంబర్ ఇరవై మూడు ఎక్కడా అని వెతుక్కుటుంటే షాపింగ్ చేద్దామన్న ఆలోచన వచ్చింది. వెళ్ళేది కొచ్చికి కనుక గాగుల్స్ తీస్కోవడం కరెక్ట్ అనుకుంది. ఇంట్లో రెండు జతల గాగుల్స్ ఉన్నాయి. ఒకటి భర్తది. ఒకటి పుత్రరత్నానిది. ఆడవాళ్లకు కూడా కళ్లు ఉంటాయి...వాళ్లకూ గాగుల్స్ పెట్టుకోవాలని ఉంటుంది...అని వాళ్లకు ఉండదు. అప్పటికీ ఒకసారి అడిగింది– ‘కాలేజీకి వెళ్లేటప్పుడు కళ్ల మీద ఎండ పడకుండా కావాలని’. ‘నువ్వేమైనా త్రిషావా?’ అని నవ్వేశాడు భర్త. ‘నీకు బాగుండవులే మదర్ ఇండియా’ అన్నాడు కొడుకు. నిలబడి, ఒక్క క్షణం కూడా బేరం చేయకుండా రెండు వేల ఐదువందలు పెట్టి గాగుల్స్ కొంది రాజీవ. ఆ తర్వాత వాటిని పెట్టుకుని చాలాసేపు చూసుకుంది. దారిన ఎవరో టీనేజీ అమ్మాయి వెళుతుంటే రిక్వెస్ట్ చేసి యాంబియెన్స్ అంతా వచ్చేలా ఒక ఫొటో దిగింది. చలో.. ఇదీ మజా అనుకుని గేట్ నెంబర్ 26 దగ్గర తీరుబడిగా సెటిల్ అయ్యింది. ఆరేడు నెలలుగా కాలేజీలో బాగా వొత్తిడిగా ఉంది రాజీవకు. పగలూ రాత్రీ తేడా లేకుండా ఊపిరి సలపని పనులు మీద పడ్డాయి. ఇన్సె్పక్షన్ అంటూ రిపోర్టులు అంటూ మేనేజ్మెంట్ పీక్కు తినిందనే చెప్పాలి. ఒళ్లు హూనం అయ్యింది. ఎప్పుడైనా నలతగా అనిపించి ఒక గంట పడుకుంటే ‘మానేయ్మని అన్నాను కదా’ అంటాడు భర్త. ఉద్యోగం మానేయగలదా తను? మానేస్తే పది, ఇరవై రూపాయలకు కూడా భర్తకు లెక్క చెప్పాలి. జాకెట్ కుట్టించుకోవాలన్నా ముందూ వెనుకా ఆడాలి. కొడుక్కు డబ్బులివ్వడానికి వచ్చే చేతులు భార్యకు ఇవ్వడానికి రావు. అమ్మలక్కలతో కాలక్షేపం కబుర్లు చెప్తే బంగారం, నగలు అని విసిగిస్తుందని పుస్తకాలు చదువుకుంటుంటే ఊరుకున్నాడు భర్త. రెండుమూడు సార్లు పెద్ద పత్రికలలో రాజీవ పేరు వచ్చింది. అప్పుడు మాత్రం ‘ఇది నీకు అవసరమా?’ అన్నాడు. ‘చదువుకో. రాయకు’ అని కూడా అన్నాడు. ఆమె రాయడం మానలేదు కానీ పెన్నేమ్తో రాస్తోంది. రాత్రి గదిలో జరిగిన రాద్ధాంతం గుర్తుకొచ్చింది. ‘నేను రాకపోతే నువ్వు వెళ్లవనుకున్నాను. ఇప్పుడు ఏడుస్తూ కూచుంటావని సరేనంటున్నాను’ ‘అది కాదు.. మాట పోతుంది కదా. వెళ్లకపోతే నన్ను మళ్లీ పిలువరు’ ‘అసలు ఇదంతా ఏమిటి? నేను నా పనులు చూసుకోవాలా... నువ్వు ఎక్కడ తిరుగుతావో వాటికి అరేంజ్మెంట్స్ ఎలా చేయాలో అనుకుంటూ టెన్షన్ పడాలా?’ ‘ఏమిటి అలా అంటారు? మీకు నా మీద ప్రేమ లేదా?’ ‘ఉంది. చాలా ఉంది. ప్రమాణం చేసి చెబుతున్నాను ఉంది. నేను ఇంటికొచ్చినప్పుడు ఇంట్లో కనిపిస్తూ, నేను ఇంట్లో లేనప్పుడు ఇంటిని చక్కదిద్దుకుంటూ, నేను ఇల్లు దాటిస్తే దాటేలా ఉంటే చాలు అనుకునేంత ప్రేమ ఉంది. ఇలా నేను అనుకుంటున్నది నీ కోసమే. నీ సుఖం కోసమే. నీకు అర్థం కాదు’... తెలియకుండానే కళ్లల్లో నీళ్లు నిండాయి. ‘ఊరుకో. నాకు నిజంగా కుదరకే రావడం లేదు. లేకుంటే తీసుకెళ్లుండేవాణ్ణి. పోనీ ఈసారికి ఒక్కదానివే వెళ్లు. కాని వీడియోకాల్స్ చేస్తుంటాను. నువ్వు నాకు కనపడుతుండాలి. సరేనా?’ ‘ఊ’... ఎందుకైనా మంచిదని పక్క మీద అతడు సంతోషపడేలా వ్యవహరించింది. అప్పటికిగాని శాంతించలేదు. అనౌన్స్మెంట్ వినిపించింది. ఒక్కొక్కరుగా ఫ్లయిట్‌లోకి ఎక్కుతుంటే సీట్ నంబర్ సరిగ్గా చెక్ చేసుకోకుండానే కూచుంది. ‘ఎక్స్‌క్యూజ్‌మీ. మీరు నా సీట్లో కూచున్నారు’ అంటున్నాడతను చిరునవ్వుతో. ‘ఓ.. సారీ’ సీటు మార్చుకుంది. అరసెంటీ మీటర్ కన్నా పొడుగు లేని జుత్తు, ఆరడుగుల ఎత్తు, పలచని చెంపలు, టాన్ అయినట్టున్న స్కిన్... ఏదో గెస్ క్వశ్చన్ లా ‘మీరు ఆర్మీలోగానీ ఎయిర్ ఫోర్స్లోగానీ చేస్తారా’ అడిగిందామె. అతడు ఆశ్చర్యంతో ‘అవును. అయితే మీరన్న రెంటిలోనూ కాదు.. నేవీలో. నా పేరు బాబీ’ అన్నాడు. కొంచెం సిగ్గుపడ్డాడు కూడా. ‘అది అమ్మాయి పేరు కదా’ నవ్వింది. ‘మా పేరెంట్స్‌కి ఆ సినిమా బాగా నచ్చి నాకు పెట్టేశారు’ అంటూ నవ్వేశాడు. సంభాషణ అంతా ఇంగ్లీష్‌లోనే జరుగుతోంది. అతడు పదాలు పలికే తీరులో మళయాళీ అని అర్థం అవుతూనే వుంది. ‘చిన్నప్పుడు మిలట్రీవాళ్లను చూడటం థ్రిల్లింగ్‌గా ఉండేది. మా ఊరి మీదుగా అప్పుడప్పుడు మిలట్రీ వెహికల్స్ వరుసగా వెళుతుంటే నోరు తెరుచుకుని చూసేవాళ్లం. ఇలా యూనిఫామ్ లేని మిలట్రీ మనిషిని చూడటం బాగుంది’ అంది. అతడు తలాడించి అన్నాడు. ‘యూనిఫామ్ లేని, డ్యూటీ లేని, సుపీరియర్ల కమాండ్లు లేని ఒక మనిషి నాలో ఉంటాడు కదా. ఆ మనిషిని ఊపిరి తిప్పుకోనివ్వడానికే ఇలా అవకాశం రాగానే ఊరికి వచ్చేస్తుంటాను. నాకు నేను మిగిలే ఈ నాలుగు రోజులే మళ్లీ నాకు ఊపిరిపోస్తూ ఉంటాయి’ ‘ఇన్ఫాక్ట్.. ప్రతి ఒక్కరూ తమ లోపలి ఒక మనిషిని బతికించుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉండాలి’ అన్నాడు మళ్లీ. సాలోచనగా తల ఊపింది. ప్లేన్ లాండ్ అయ్యింది. ‘కొచ్చి ఏర్పోర్ట్లో రెస్ట్‌రూమ్స్ చాలా బాగుంటాయి. హావ్ ఏ ట్రయల్’ రిసీవ్ చేసుకోవడానికి వచ్చిన ఆర్గనైజర్ కమ్ స్నేహితురాలు బయటి నుంచి మెసేజ్ పెట్టింది. ‘అటు నుంచే స్ట్రయిట్‌గా ముందుకి వచ్చేస్తే డిపార్చర్ అన్న బోర్డ్ కనిపిస్తుంది. ఆ కారిడార్ చివరికి వచ్చెయ్యి. అక్కడే వున్నాను’ అని కూడా మెసేజ్. ఫ్రెష్ అయ్యి తల దువ్వుకుంటూ ఉంటే మొక్కల సంగతి గుర్తుకు వచ్చింది. పని మనిషిని రావద్దని ముందే చెప్పేసింది. వీళ్లిద్దరూ వాటికి నీళ్లు పోయరు. పక్క ఫ్లాట్‌లో ఉండే ఆమెకు కాల్ చేసింది. ‘సునందా.. కొంచెం బయట ఉన్న మొక్కలకు నీళ్లు పోయవా?’ ‘అయ్యో. పోస్తానులే. మీ ఆయనా, కొడుకు వెళ్లిపోయాక పోస్తాను’ ‘అదేమిటి? వాళ్లు బయటకు వెళ్లలేదా?’ టైమ్ చూసుకుంది. తొమ్మిదిన్నర అవుతోంది. కొడుకు ఎనిమిదికంతా వెళ్లిపోతాడు. భర్త తొమ్మిదీ తొమ్మిందింబావుకే. ‘అసలు ఇంకా బ్రష్షులే చేసినట్టు లేరు. ఇద్దరూ కాఫీ కప్పులు పట్టుకొని తలుపు తెరిచి పెట్టి పెద్ద సౌండ్‌తో టీవీ చూస్తున్నారు. నెట్‌ఫ్లిక్స్ కాబోలు’ మౌనంగా ఫోన్ కట్ చేసింది.బయట కేరళ. ఆకుపచ్చగా. చినుకులు చినుకులుగా. చేతులు సాచి పిలుస్తున్నట్టుగా. ఎగ్జిట్‌లో నుంచి బయటకు వస్తుంటే వుత్సాహంగా చేతులు ఊపుతున్న స్నేహితురాలు. ఒక్క నిమిషం ఆగి భర్తకు మెసేజ్ చేసింది. ‘కేరళ వెదర్ అద్భుతంగా ఉంది. వాన చాలా అందంగా ఉంది. మీరు లేరన్న వెలితి డిస్ట్రబ్ చేస్తోంది. మీ కోసం ఈ కేరళ అంతటినీ నా కళ్లల్లో అనుక్షణం నింపుకోవాలనుకుంటున్నాను. మీ ఫోన్ వస్తే మీరు గుర్తుకొచ్చి డిస్ట్రబ్ అవుతాను. ఫోన్ ఆఫ్ చేసేస్తున్నాను. వచ్చాక ప్రతిక్షణం మీ సన్నిధిలో ఉండి ఆ విశేషాలు చెబుతాను. బై’ ఫోన్ ఆఫ్ చేసింది. మైండ్‌లో ముడిపడి ఊగులాడుతున్న లగేజ్ట్యాగ్ను కత్తిరించి పడేసినట్టయ్యింది. ఈ రెండు రోజులు ఆమెవి. అచ్చంగా ఆమెవే. - జయశ్రీ నాయుడు -
నావల్లే నీకు కష్టాలు.. నేనే పోతే...
హైదరాబాద్: కని.. కష్టపడి పెంచి.. పెద్ద చేసి... తన పెళ్లి కోసం రెక్కలు ముక్కలు చేసుకుంటున్న తల్లిని చూసి వేదన పడిన ఓ తనయ తనువు చాలించింది. పెద్ద వయసులో అమ్మను సుఖ పెట్టాల్సింది పోయి... భారంగా మారి కష్ట పెట్టాల్సి వచ్చిందంటూ ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన జయశ్రీ (19) జూబ్లీహిల్స్ రోడ్ నెం.70 అశ్వని హైట్స్‌లో ఉన్న ప్రముఖ సినీ దర్శకుడు ఎ.కోదండరామిరెడ్డి నివాసంలో నెల రోజులుగా పని చేస్తోంది. కొంత కాలం కిందట ఊర్లో ఉన్న తల్లి నాగమణి కూడా హైదరాబాద్‌కు వచ్చి స్థానికంగానే ఓ ఇంట్లో పనికి కుదిరింది. తన పెళ్లి చేసేందుకు తల్లి కూడా ఇంటింటికి తిరిగి పనిచేస్తుండడాన్ని జయశ్రీ తట్టుకోలేకపోయింది. ఈ బాధలన్నీ తనవల్లేనని, తానే లేకుండా పోతే తల్లికి ఈ కష్టాలు ఉండవని భావించిన జయశ్రీ శనివారం ఉదయం సర్వెంట్ క్వార్టర్స్‌లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. ముందు రోజు రాత్రి జయశ్రీ బాధ విన్న కోదండరామిరెడ్డి దంపతులు ఆమెను ఓదార్చారు. జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. -
ప్రముఖ డైరెక్టర్ ఇంట్లో అనుమానాస్పద మృతి
హైదరాబాద్: టాలీవుడ్ దర్శకుడు కోదండరామిరెడ్డి ఇంట్లో పని చేస్తున్న యువతి అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. తూర్పుగోదావరి జిల్లా కట్టమూరు గ్రామానికి చెందిన జయశ్రీ(19) కోదండరామిరెడ్డి ఇంట్లో ఏడాదిగా పనిచేస్తోంది. అక్కడే ఇంటి ఆవరణలోని ఓ గదిలో నివాసముంటున్న జయశ్రీ ఫ్యానుకు ఉరి వేసుకొని చనిపోయింది. జయశ్రీ మరణంపై ఇంట్లోని వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
క్షణికావేశమే ఊపిరి తీసిందా...?
విద్యార్థి హర్షవర్థన్ మృతి నేపథ్యం... సాక్షి,సిటీబ్యూరో: ఆ క్షణం వరకు వాళ్లు శత్రువులు కాదు... ఆ ఇద్దరి మధ్య పగ, ప్రతీకారాలు లేవు. హతమార్చేందుకు కుట్రలు పన్నినదాఖలాల్లేవు. కానీ క్షణికావేశమే నిండు ప్రాణాన్ని బలితీసింది. అమాయకుడైన హర్షవర్ధన్‌ను పొట్టనబెట్టుకుంది. ఒక్క ప్రగతి మహావిద్యాలయలో విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణే కాదు. చాలా సందర్భాల్లో ఇలాంటి అసహనం, క్షణికోద్రేకమే ఒకరినొకరు కొట్టుకోవడం, హత్యలకు పాల్పడటం వంటి ఘటనలకు దారితీస్తోంది. ఘర్షణకు దిగిన వారిలో ఏ ఒక్కరైనా కొద్దిగా సహనం పాటించినా ఇలాంటి దారుణానికి అవకాశం ఉండదు. సోమవారం హర్షవర్ధన్ మృతికి సంతాపంగా విద్యార్థులు శాంతి ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో విద్యార్థులు స్పందించారు. జరిగిన ఘోరాన్ని తలచుకొని బాధపడ్డారు. ఈ ర్యాలీ సందర్భంగా కళాశాలకు వచ్చిన హర్షవర్ధన్ తల్లిదండ్రులు నర్సింగ్‌రావు, జయశ్రీలు కన్నీరు మున్నీరుగా విలపించారు. వారు సైతం అదే సందేహాన్ని వ్యక్తం చేశారు. ఎవ్వరితోనూ ఎలాంటి గొడవలు, ఘర్షణలకు దిగని తమ కొడుకును ఎందుకు చంపాల్సి వచ్చిందో పోలీసులు దర్యాఫ్తు చేసి చెప్పాలని కోరారు. హర్షవర్ధన్ తల్లి జయశ్రీ మాట్లాడుతూ, ‘‘ ఎవ్వరితోనూ మాట్లాడడు. తన పని తాను చేసుకుంటాడు. ఉదయం 11 గంటలకు కాలేజీకి వెళ్లి మధ్యాహ్నం 1.30కి ఇంటికి వస్తాడు. భోజనం చేసి 2.30కి అపోలోకెళ్తాడు. తిరిగి రాత్రి 12 గంటలకు ఇంటికి వస్తాడు. అలాంటి మా బాబును అంత దారుణంగా కొట్టాల్సిన అవసరం అతనికి ఎందుకు వచ్చింది. వాళ్ల మధ్య ఎలాంటి పగ ఉన్నదీ మాకు తెలవాల్సి ఉంది.’’ అని అన్నారు. యాజమాన్యం బాధ్యత వహించాలి కాలేజీ ప్రిన్సిపాల్, లెక్చరర్ల నిర్లక్ష్యమే నా కొడుకును బలితీసుకుంది. పిల్లవాన్ని అలా కొడుతూంటే వాళ్లంతా ఏం చేశారు. ఎందుకు ఆపలేకపోయారు. మా కొడుకు చీమకు కూడా హానితలపెట్టని వాడు. అలాంటి వాన్ని చావబాదుతుంటే వాళ్లకు ఎట్లా చూడబుద్దయింది. మా వాడు అమాయకుడు. సంతాప ర్యాలీకి తరలి వచ్చిన విద్యార్థులే ఇందుకు నిదర్శనం. పోలీసులు, కాలేజీ యాజమాన్యం మాకు న్యాయం చేయాలి. - నర్సింగ్‌రావు, తండ్రి సతీష్ రిమాండ్ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్‌రావు హత్య కేసులో సీనియర్ విద్యార్థి సతీశ్‌ను సోమవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు సుల్తాన్‌బజార్ ఇన్స్పెక్టర్ జి. శ్రీనివాస్ తెలిపారు. మృతుడు హర్షవర్ధన్ తండ్రి నర్సింగ్‌రావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి.. సతీష్‌ను కాచిగూడ రైల్వే స్టేషన్ వద్ద అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుడిపై 302, 509 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఉద్రిక్తతకు దారితీసిన శాంతి ర్యాలీ సుల్తాన్‌బజార్: హర్షవర్ధన్ మృతికి సంతాపంగా తోటి విద్యార్థులు నిర్వహించిన శాంతి ర్యాలీ ఉద్రిక్తతకు దారితీసింది. సోమవారం హనుమాన్టేకిడీలోని ప్రగతి మహావిద్యాలయ కళాశాలలో శాంతి ర్యాలీ నిర్వహించేందుకు ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. విద్యార్థుల ర్యాలీ నిర్వహించేందుకు వస్తున్నారని తెలిసి సుల్తాన్‌బజార్ పోలీసులు కళాశాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాలేజీ గేట్లు మూసివేసి, ర్యాలీకి అనుమతిలేదని అడ్డుకున్నారు. దీంతో విద్యార్థులు అక్కడే బైఠాయించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు విద్యార్థులను అక్కడి నుంచి బొగ్గులకుంట వరకు తరిమికొట్టారు. కాగా, కళాశాలలో ఉన్న కొంత మంది విద్యార్థులతో కళాశాల అధ్యాపకులు సంతాపసభ నిర్వహించారు. హర్షవర్ధన్ చిత్రపటానికి కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ టీవీ రావు పూలమాలలు వేసి, రెండు నిముషాలు మౌనం పాటించారు. హర్షవర్ధన్ మృతికి సంతాపంగా కళాశాలకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించామని ప్రిన్సిపాల్ తెలిపారు. కళాశాలలో బీసీఏ పరీక్ష జరుగుతున్న నేపథ్యంలోనే శాంతి ర్యాలీకి విద్యార్థులను అనుమతించలేదన్నారు. -
పెళ్లి వేదికపై వధువు కాల్చివేత
భోపాల్: మధ్యప్రదేశ్‌లో ఓ భగ్న ప్రేమికుడు ఉన్మాదిలా మారాడు. తాను ప్రేమించిన మరదలు మరొకరిని పెళ్లిచేసుకోవడాన్ని తట్టుకోలేక ఆమెను హతమార్చాడు. పెళ్లి వేదికపై అందరూ చూస్తుండగానే డాక్టర్ జయశ్రీ నామ్‌దేవ్ (29) అనే నవవధువును తుపాకీతో కాల్చి చంపాడు. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో గురువారం రాత్రి ఈ దారుణం చోటుచేసుకుంది. పెళ్లి తంతుకు ముందు వేదికపై వరుడితో కలిసి జయశ్రీ అతిథుల ఆశీర్వాదాలు, శుభాకాంక్షలు అందుకుంటుండగా రాత్రి 11:15 గంటలకు అక్కడకు వచ్చిన ఆమె మేనత్త కొడుకు అనురాగ్... అతి సమీపం నుంచి జయశ్రీని కాల్చాడు. గొంతులోకి తూటా దూసుకుపోవడంతో ఆమె కుప్పకూలిపోయింది. ఆమెను హుటాహుటిన ఆస్పత్రికి తరలించ గా చికిత్స పొందుతూ మృతిచెందింది. జయశ్రీని కాల్చిన అనంతరం అనురాగ్ తనను తాను కాల్చుకునేందుకుయత్నించగా ఆ తూటా మరొకరిని తాకుతూ పక్కకు దూసుకెళ్లింది. ఈ ఘటన అనంతరం మృతురాలి బంధువులు అనురాగ్‌ను చితకబాది పోలీసులకు అప్పగించారు. జయశ్రీ తనను మోసం చేసిందని..అందుకే కాల్చి చంపానని నిందితుడు పోలీసులకు చెప్పాడు. -
అయ్యయ్యో... టైమైపోయింది..
ఇంటర్మీడియెట్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. నిమిషం ఆలస్యమైనా అనుమతించేది లేదని అధికారులు చెప్పడంతో చాలా మంది విద్యార్థులు ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. సమయం ముంచుకురావడంతో కొందరు విద్యార్థులు ఇలా పరుగున కేంద్రాలకు చేరారు. ఇంటర్మీడియట్ పరీక్షలు బుధవారం తొలి రోజు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు అధికారులు చేపట్టిన ముందస్తు చర్యలు ఫలించాయి. పరీక్ష కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు తలెత్తక పోవడంతో పరీక్షలు సజావుగా సాగాయి. విద్యార్థులు అరగంట ముందు పరీక్ష కేంద్రాలకు చేరుకున్నారు. జిల్లావ్యాప్తంగా 111 పరీక్ష కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షలకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు 49,955 మంది హాజరయ్యారు. జనరల్ గ్రూప్‌లో 46,263 మంది విద్యార్థులకు 44,174 మంది పరీక్షలకు హాజరయ్యారు. ఒకేషనల్ గ్రూప్ లో 3,692 మంది విద్యార్థులకు 3,159 మంది పరీక్షలకు హాజరయ్యారు. మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని ఆర్ఐవో ఎల్.జె.జయశ్రీ తెలిపారు.