అమెజాన్‌లో ప్రైంలోకి అక్షయ్‌ ‘బెల్‌ బాటమ్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే.. | Akshay Kumar Bell Bottom Release On OTT Amazon Prime Video | Sakshi
Sakshi News home page

OTT: అమెజాన్‌లో ప్రైంలోకి అక్షయ్‌ ‘బెల్‌ బాటమ్‌’, స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..

Published Sun, Sep 12 2021 4:15 PM | Last Updated on Sun, Sep 12 2021 4:15 PM

Akshay Kumar Bell Bottom Release On OTT Amazon Prime Video - Sakshi

బాలీవుడ్ యాక్ష‌న్ హీరో అక్ష‌య్ కుమార్ న‌టించిన బెల్ బాట‌మ్ మూవీ అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కానుంది. ఈ నెల 16న ఈ మూవీని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేస్తున్న‌ట్లు అక్ష‌య్‌కుమార్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ గ‌త నెల 19న థియేట‌ర్ల‌లో విడుదలైన సంగతి తెలిసిందే. 1984లో జ‌రిగిన ఓ ఇండియ‌న్ ఎయిర్‌లైన్స్ విమానం హైజాక్ క‌థే ఇతివృత్తంగా ఈ మూవీ తెర‌కెక్కింది.

ఈ సినిమాలో అక్ష‌య్ రా ఏజెంట్‌గా న‌టించాడు. బాక్సాఫీస్ వద్ద పాజిటివ్‌ టాక్‌ తెచ్చుకుని బాగానే వ‌సూళ్లు రాబ‌ట్టిన ఈ మూవీ.. ఇక ఓటీటీలో సంద‌డి చేయ‌నుంది. ‘డేట్ మీరు గుర్తుంచుకోండి.. మిష‌న్ నేను గుర్తు చేస్తా’ అంటూ బెల్ బాట‌మ్ ఓటీటీ రిలీజ్‌పై అక్ష‌య్ ట్వీట్ చేశాడు. ఈ మూవీ ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తులో నిర్మించిన ల‌ఢాక్‌ థియేట‌ర్లోనూ ప్ర‌ద‌ర్శించిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement