
మాటల్లో చెప్పలేనంత ఆనందంలో ఉన్నారు హీరోయిన్ వాణీ కపూర్. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించే అవకాశాన్ని దక్కించుకోవడమే ఆ సంతోషానికి కారణం. అక్షయ్ కుమార్ హీరోగా రంజిత్ ఎమ్. తివారి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. కన్నడ హిట్ మూవీ ‘బెల్ బాటమ్’కు ఇది హిందీ రీమేక్. ఇందులోనే అక్షయ్ సరసన నటించబోతున్నారు వాణి. గురువారం అధికారిక ప్రకటన వెల్లడైంది. ‘‘అక్షయ్‌కుమార్‌గారికి జోడీగా నటించబోతున్నందుకు ఆనందంగా ఉంది. చిత్రీకరణ ఎప్పుడు మొదలవుతుందా? అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను’’ అని పేర్కొన్నారు వాణీ కపూర్. ఇది కాకుండా ‘షంషేర్’ అనే హిందీ చిత్రంలోనూ నటిస్తున్నారామె. ఇందులో రణ్‌బీర్ కపూర్, సంజయ్ దత్ కీలక పాత్రధారులు.