
అక్షయ్ కుమార్
యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ తన తదుపరి చిత్రం ‘బెల్ బాటమ్’ కోసం గూఢచారిగా మారారు. 80ల బ్యాక్‌డ్రాప్‌తో నడిచే ‘బెల్ బాటమ్’ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు అక్షయ్. రంజిత్ తివారీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో లారా దత్తా, హ్యూమా ఖురేషీ, వాణీ కపూర్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. బుధవారం అక్షయ్ కుమార్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఈ సినిమాలో ఆయన లుక్‌ను విడుదల చేశారు. లాక్‌డౌన్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించిన తొలి హిందీ చిత్రమిదే. ప్రస్తుతం స్కాట్‌ల్యాండ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. హైజాక్ వల్ల విమానంలో ఇరుక్కుపోయిన 200 మంది ప్రయాణికులను అక్షయ్ ఎలా కాపాడాడన్నది చిత్రకథ అని సమాచారం. వచ్చే ఏడాదిలో ఈ సినిమా విడుదల కానుంది.
Comments
Please login to add a commentAdd a comment