ఆహా! ఏమి ఛాన్సు!! | Gossip | Sakshi
Sakshi News home page

ఆహా! ఏమి ఛాన్సు!!

Published Mon, Oct 5 2015 11:12 PM | Last Updated on Sun, Sep 3 2017 10:29 AM

ఆహా! ఏమి ఛాన్సు!!

ఆహా! ఏమి ఛాన్సు!!

గాసిప్
 
ఆదిత్య చోప్రా దర్శకత్వంలో రానున్న ‘బేఫికర్’ సినిమాలో హీరో రణ్‌వీర్ సింగ్ అనేది సినీప్రియులకు తెలిసిన విషయమే!
 మరి తెలియని విషయం, కాస్త కన్‌ఫ్యూజ్‌కు గురిచేస్తున్న  విషయం... ఇంతకీ ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది! మొదట్లో అనుష్కశర్మను హీరోయిన్‌గా అనుకున్నారు. ఆదిత్య చోప్రాకి ముక్కు మీదే కోపం. ఆయనతో ఎక్కువ మాట్లాడినా సమస్యే, తక్కువ మాట్లాడినా సమస్యే, అసలు మాట్లాడక పోయినా సమస్యే అంటుంటారు.

మరి అనుష్క తక్కువే మాట్లాడిందో, ఎక్కువే మాట్లాడిందో తెలియదుగానీ... మొత్తానికైతే ‘బేఫికర్’లో రణ్‌వీర్‌తో కలిసి నటించే అవకాశం ఆమెకు రాలేదు.ఆ తరువాత పరిణితి చోప్రా పేరు తెర మీదికి వచ్చింది. ‘అబ్బే... ఆమె కాదు’ అన్నాయి విశ్వసనీయవర్గాలు. ఇప్పుడు మాత్రం బలంగా వినిపిస్తున్న పేరు ‘వాణీ కపూర్’.

 ఎక్కడో విన్నట్లుందే పేరు అనుకుంటున్నారా?
 అవును పాపం... 2013లో ‘శుద్ధ్ దేసి రొమాన్స్’ సినిమాలో తార పాత్రలో మెరిసింది. ఆ తరువాత మన తెలుగులో నాని సరసన ‘ఆహా కళ్యాణం’ సినిమాలో నటించిందిగానీ ఆ సినిమా హిట్ కాలేదు. ఇక అప్పటి నుంచి ఆమెకు సినిమాలు లేవు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ‘బేఫికర్’ సినిమాలో హీరోయిన్‌గా బంపర్ ఆఫర్‌ను ఆదిత్య ఇచ్చినట్లు వినికిడి. నేడో రేపో ఆమె పేరును బహిరంగంగా ప్రకటించడం కూడా ఖాయం అంటున్నారు. చూద్దాం మరి ఆమె అదృష్టబలం ఎంత బలంగా ఉందో!
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement