టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లి భారత దేశపు అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. సెలబ్రిటి బ్రాండ్ వాల్యుయేషన్ నివేదిక (KROLL) ప్రకారం కోహ్లి బ్రాండ్ వాల్యూ 2023 సంవత్సరంలో రూ. 1901 కోట్లకు చేరింది. 2022తో పోలిస్తే గతేడాది కోహ్లి ఓవరాల్ బ్రాండ్ వాల్యూ 29 శాతం మేర పెరిగింది.
2022లో రెండో స్థానంలో నిలిచిన కోహ్లి.. గతేడాది బాలీవుడ్ స్టార్లు రణ్‌వీర్ సింగ్ (రూ. 1693 కోట్లు), షారుఖ్ ఖాన్‌లను (రూ. 1001 కోట్లు) అధిగమించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీగా అవతరించాడు. కోహ్లి 2017 నుంచి వరుసగా (మధ్యలో 2022లో రెండో స్థానం) ఆరు సార్లు భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు.
క్రికెట్‌కు సంబంధించి భారత దేశంలో అత్యంత విలువైన సెలబ్రిటీల జాబితాలో కోహ్లి తర్వాతి స్థానంలో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని, ప్రస్తుత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఉన్నారు.
ప్రస్తుతం టీ20 వరల్డ్‌కప్ 2024తో బిజీగా ఉన్న కోహ్లి గతేడాది వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలువడంతో పాటు ఆ ఏడాదంతా పలు బ్యాటింగ్ రికార్డులు కొల్లగొట్టాడు. 35 ఏళ్ల కోహ్లి ఈ ఏడాది ఐపీఎల్‌లోనూ అదరగొట్టాడు.
ఈ పరుగుల యంత్రం 2024 ఐపీఎల్ సీజన్‌లో లీడింగ్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. కోహ్లి 2023 ఐసీసీ వన్డే ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకోవడంతో పాటు ఐసీసీ పురుషుల వన్డే టీమ్ ఆఫ్ ద ఇయర్ అవార్డుకు ఎంపికయ్యాడు.
ఇదిలా ఉంటే, ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో విరాట్ ఆశించిన మేర రాణించనప్పటికీ టీమిండియా సూపర్-8కు చేరింది. సూపర్-8లో భారత్.. ఆఫ్ఘనిస్తాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్‌లతో తలపడనుంది.
Comments
Please login to add a commentAdd a comment