టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ జీవిత కథ వెండితెరపై ఆవిష్కృతం కానున్న విషయం తెలిసిందే. ప్రముఖ దర్శకుడు విక్రమాదిత్య మోత్వాని హిందీలో ఈ సినిమాను తెరకెక్కించనున్నాడు. ఈ సినిమాలో తొలుత బాలీవుడ్ విలక్షణ నటుడు ఆయుష్మాన్ ఖురానా లీడ్ రోల్‌లో నటిస్తాడిని ప్రచారం జరిగింది. అయితే డేట్స్ కుదరక ఖురానా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు.
🚨 RAJKUMAR RAO AS GANGULY. 🚨
- Rajkumar Rao likely to play Sourav Ganguly in Dada's biopic. (Sumit Ghosh). pic.twitter.com/zReuoMSp4h— Mufaddal Vohra (@mufaddal_vohra) January 24, 2025
తాజాగా గంగూలీ బయోపిక్‌లో రాజ్‌కుమార్ రావు లీడ్ రోల్ పోషిస్తాడని ప్రచారం జరుగుతుంది. ఈ విషయమై ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. నిర్మాతలు లవ్ రంజన్, అంకుర్ గార్గ్ (లవ్ ఫిల్మ్స్) ఇప్పటివరకు స్పందించలేదు.
కాగా, గంగూలీ బయోపిక్‌లో లీడ్ రోల్ కోసం తొలుత ఓ ప్రముఖ బెంగాలీ నటుడిని కూడా సంప్రదించారని తెలుస్తుంది. గంగూలీ స్నేహితుడైన ప్రొసేన్‌జిత్ ఛటర్జీని బయోపిక్‌లో నటించమని దర్శక, నిర్మాతలు కోరారట. ఇందుకు ప్రొసేన్‌జిత్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. అయితే ఏమైందో ఏమో తెలీదు కానీ ప్రొసేన్‌జిత్ సైడ్ అయిపోయి కొత్తగా రాజ్‌కుమార్ రావు తెరపైకి వచ్చాడు.
గంగూలీ క్రికెటింగ్ కెరీర్ విషయానికొస్తే.. టీమిండియా గొప్ప కెప్టెన్లలో గంగూలీ ఒకడు. భారత క్రికెట్‌కు గంగూలీ దూకుడు నేర్పాడు. గంగూలీ సారథ్యంలో టీమిండియా ఎన్నో చిరస్మరణీయ విజయాలు సాధించింది. గంగూలీ నేతృత్వంలో భారత్ 146 వన్డేల్లో 76 విజయాలు.. 49 టెస్ట్‌ల్లో 21 విజయాలు సాధించింది. క్రికెట్‌కు వీడ్కోలు పలికిన అనంతరం గంగూలీ బీసీసీఐ అథ్యక్షుడిగా పని చేశాడు. ప్రస్తుతం గంగూలీ ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment