ఏడాదికి ఐదారు సినిమాలు చేసే హీరోలు సంవత్సరానికోసారో, రెండేళ్లకోసారో బాక్సాఫీస్ ముందుకు వస్తున్నారు. హీరోయిన్లు ఒక భాషలో కాకపోతే మరో భాషలో కనిపించి కనువిందు చేస్తున్నారు. అయితే బాలీవుడ్ నటి దివ్య దత్త మాత్రం ఓసారి రెండు, మూడు సినిమాలు కాకుండా ఏకంగా 22 సినిమాలకు సంతకం చేసిందట!
22 సినిమాలు..
అప్పుడు తాను కెరీర్‌లో తారా స్థాయికి చేరుకున్నట్లు ఫీలైందట. కానీ యశ్ రాజ్ ఫిలింస్ బ్యానర్ నిర్మాత ఆదిత్య చోప్రా మాటలతో నేలపైకి దిగివచ్చానని చెప్పుకొచ్చింది. దివ్య దత్త మాట్లాడుతూ.. ఆజ నచ్‌లే (2007) సినిమా రిలీజ్‌కు ముందో, తర్వాతో గుర్తులేదు కానీ ఓసారి ఆదిత్య చోప్రాను కలిశాను. ఏంటి? కెరీర్ ఎలా సాగుతోంది? అని అడిగాడు. నేను 22 సినిమాలు చేస్తున్నానని చెప్పాను. తను సంతోషించి మెచ్చుకుంటాడనుకున్నాను. కానీ ఆయన మౌనంగా ఉండిపోయాడు.
నచ్చిన పాత్రల ఎంపికతో..
నాకేమీ అర్థం కాలేదు. నీకు హ్యాపీగా లేదా? అని అడిగాను. అందుకాయన నీకు డబ్బు అవసరం ఉందా? అన్నాడు. లేదన్నాను. నీకు వచ్చిన గుర్తింపును కాపాడుకో.. ఎందుకిన్ని సినిమాలు చేస్తున్నావు? అని ప్రశ్నించాడు. అప్పుడు నాకు విషయం బోధపడింది. ఏది పడితే అది చేస్తూ పోవడం కన్నా నిజంగా నా పాత్రకు ప్రాధాన్యత ఉండి, నాకు నచ్చినవాటినే చేయడం బెటర్ అని ఫీలయ్యాను. అలా తర్వాత సెలక్టివ్‌గా పాత్రలు చేసుకుంటూ పోయాను. దానివల్ల నా గ్రాఫ్ కూడా మారింది అని దివ్య దత్త చెప్పుకొచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment