
బాలీవుడ్ చాక్లెట్ బాయ్ రణ్‌బీర్ కపూర్ తాజాగా నటించిన చిత్రం షంషేరా. ఈ మూవీ జులై 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా నుంచి ఒక్కొక్కో అప్‌డేట్‌ను వదులుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్, పోస్టర్స్, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటి వరకు అన్ని లవ్‌స్టోరీస్ చేస్తూ వస్తున్న రణ్‌బీర్ ఇందులో సరికొత్తగ కనిపించనున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం.
ఈ ట్రైలర్‌లో రణ్‌బీర్ స్వాతంత్ర్యం కోసం ఆంగ్లేయులతో పోరాడే ఓ తెగ యోధుడిగా కనిపించాడు. ఇందులో అతడు ఆంగ్లేయులతో విరోచితం పోరాడే సీన్స్ గూస్‌బంప్స్ తెప్పించేలా ఉన్నాయి. ఇందులోని పలు సీన్స్ చూస్తుంటే బాహుబలి మూవీని గుర్తు చేస్తున్నాయి. ఇక సంజయ్ దత్ మాస్ లుక్ ఆసక్తిగా ఉంది. రణ్‌బీర్, వాణికపూర్‌లకు సంబంధించిన సీన్స్ సాంతం ఆకట్టుకుంటున్నాయి. మొత్తానికి షెంషేరా ట్రైలర్‌లోని యాక్షన్ సీన్స్ మూవీపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment