
బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణ్‌బీర్- ఆలియా త్వరలో పెళ్లిపీటలెక్కనున్న విషయం తెలిసిందే! ఏప్రిల్ 14న వీరి పెళ్లి జరుగుతుందని ప్రచారం జరగ్గా అది కాస్తా 20కి వాయిదా పడింది. ఇప్పటికే రణ్‌బీర్, ఆలియా పెళ్లి షాపింగ్‌లో బిజీ అవగా వారి ఫ్యామిలీ పెళ్లి పనుల్లో తలమునకలైంది. తాజాగా ఈ జంట వివాహం గురించి బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ స్పందించాడు.
'రణ్‌బీర్ పెళ్లిపీటలెక్కబోతున్నాడంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆలియా నా ముందే పెరిగి పెద్దదైంది. పెళ్లి అనేది ఇద్దరూ కలిసి జీవించడానికి చేసుకునే ఒక ఒప్పందం వంటిది. కష్టసుఖాల్లో, అన్ని రకాల పరిస్థితుల్లో ఒకరికోసం ఒకరు కలిసే ఉంటామన్న మాటకు కట్టుబడి ఉండాలి. మీ జంట సంతోషంగా జీవించాలి. అలాగే త్వరలోనే పిల్లలను కనివ్వాలి రణ్‌బీర్' అని సరదాగా సంభాషించాడు కేజీఎఫ్ యాక్టర్ సంజయ్ దత్. ఇదిలా ఉంటే ఈ బాలీవుడ్ ప్రేమజంట పెళ్లితో ఫ్యాన్స్ ఒకింత బాధలో ఉండిపోయారు. ఆలియా ఇక రణ్‌బీర్ సొంతం అవడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వీడియోలతో సందడి చేస్తున్నారు.
చదవండి: పెళ్లి తేదీ వాయిదా వేసుకున్న లవ్‌బర్డ్స్, కారణం ఇదేనా?
Comments
Please login to add a commentAdd a comment