Shamshera Movie Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe - Sakshi
Sakshi News home page

Shamshera Movie Teaser: రణ్‌బీర్ కపూర్‌ 'షంషేరా' టీజర్‌ విడుదల..

Jun 22 2022 3:27 PM | Updated on Jun 22 2022 3:49 PM

Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe - Sakshi

బాలీవుడ్‌ లవర్ బాయ్‌ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్‌ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్‌పై ఫోకస్ ‍పెట్టాడు రణ్‌బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన ‍అప్‌డేట్ ఆసక్తికరంగా ఉంది.

Shamshera Teaser: Ranbir Kapoor Battle With Sanjay Dutt For His Tribe: బాలీవుడ్‌ లవర్ బాయ్‌ తన ప్రియసఖి, క్యూటీ అలియా భట్‌ను వివాహం చేసుకుని పెళ్లిపుస్తకం తెరిచాడు. ఇక తన సినీ కెరీర్‌పై ఫోకస్ ‍పెట్టాడు రణ్‌బీర్. ఇటీవల 'బ్రహ్మాస్త్ర' సినిమా ట్రైలర్ విడుదలై ఆకట్టుకోగా మరో సినిమాకు సంబంధించిన ‍అప్‌డేట్ ఆసక్తికరంగా ఉంది. యశ్‌రాజ్ ఫిల్మ్స్ పతాకంపై రణ్‌బీర్ కపూర్‌ హీరోగా నటించిన చిత్రం 'షంషేరా'. కరణ్‌ మల్హోత్రా దర్శకత్వం వహించిన ఈ మూవీకి సంబంధించిన పోస్టర్లు ఇప్పటికే నెట్టింట వైరల్ అయి అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

తాజాగా ఈ మూవీ టీజర్‌ను బుధవారం (జూన్ 22) విడుదల చేసింది చిత్రబృందం. ఈ టీజర్‌ చారిత్రక నేపథ్యంతో కూడిన యాక్షన్‌ సీక్వెన్స్‌తో ఆద్యంతం ఆసక్తిగా ఉంది. పోరాట యోధుడిగా, ఆపదల్లో చిక్కుకున్న తన వర్గాన్ని కాపాడుకునే వీరుడిగా రణ్‌బీర్‌ యాక్టింగ్, రగ్గ్‌డ్ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ మూవీలో సంజయ్ దత్ విలన్‌గా అలరించనున్నాడు. జులై 22న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రం ట్రైలర్‌ను శుక్రవారం (జూన్‌ 24) రిలీజ్‌ చేయనున్నారు మేకర్స్. అలాగే ఈ చిత్రం హిందీ, తమిళం, తెలుగు భాషల్లో విడుదల కానుంది.  

చదవండి: బుల్లితెర నటి ఆత్మహత్య.. 'ఐ లవ్‌ యూ సాన్‌' అంటూ సూసైడ్‌ నోట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement