అభ్యర్థుల ప్రొఫైల్‌ | Telangana Political Leaders Profile In Nizamabad | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల ప్రొఫైల్‌

Published Mon, Nov 19 2018 1:35 PM | Last Updated on Sun, Apr 7 2019 3:47 PM

Telangana Political Leaders Profile In Nizamabad - Sakshi

ఒకరు రాజకీయ కుటుంబం నుంచి వచ్చి అదే బాటలో రాణిస్తుంటే.. మరికొందరు ఎలాంటి అనుభవం లేకున్నప్పటికీ రాజకీయాల్లోకి వచ్చి తమ చరిష్మా చూపించారు. అతిచిన్న వయస్సులోనే క్యాబినెట్‌ హోదా పొందినవారూ ఉన్నారు. ఇ లా ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులు రాష్ట్రరాజకీయాల్లో చక్రం తిప్పుతున్నారు. 2018 అసెంబ్లీ ఎలక్షన్స్‌ సందర్భంగా వారి ప్రొఫైల్స్‌ ఇవే..

పోచారం శ్రీనివాస్‌రెడ్డి

బాన్సువాడ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ప్రొఫైల్‌ 
పేరు               :    పరిగె శ్రీనివాస్‌రెడ్డి 
తల్లిదండ్రులు    :    పరిగె రాజారెడ్డి, పాపమ్మ 
వయస్సు        :    10–02–1950 
కులం             :    రెడ్డి (ఓసి) 
విద్యార్హత         :    ఇంజనీరింగ్‌ (బీఈ–డిస్‌కంటిన్యూ) 
స్వగ్రామం        :    పోచారం (బాన్సువాడ మండలం) 
కుటుంబం        :    భార్య పుష్ప, ముగ్గురు కుమారులు, ఒక కుమార్తె (రవీందర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి)  


రాజకీయ ప్రస్థానం:

  • 1978లో దేశాయిపేట సింగిల్‌విండో  చైర్మన్‌గా ఎన్నిక
  • 1989లో నిజామాబాద్‌ ఎంపీగా పోటీచేసి కాంగ్రెస్‌ అభ్యర్థి తాడూరి బాలాగౌడ్‌ చేతిలో ఓడిపోయారు.
  • 1992లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నిక
  • 1993–1997లో టీడీపీ జిల్లా కన్వీనర్‌గా పదవీ బాధ్యతలు 
  • 1994లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 
  • 1998లో గహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు 
  • 1999లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 
  • 1999–2000 భూగర్భ గనుల శాఖ మంత్రిగా బాధ్యతలు 
  •  2001–02 గ్రామీణ, పంచాయతిరాజ్‌ శాఖ మంత్రిగా బాధ్యతలు 
  •  2004లో కాంగ్రెస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌ చేతిలో ఓడిపోయారు. 
  •  2005 నుంచి 07 వరకు టీడీపీ జిల్లా అధ్యక్షునిగా ఎన్నిక 
  •  2009లో కాంగ్రెస్‌ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్‌పై గెలుపు 
  •  2011లో టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, అనంతరం జరిగిన ఉప ఎన్నికల్లో భారీ మెజారిటీతో బాన్సువాడ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 
  •  2014లో టీఆర్‌ఎస్‌ తరుపున పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థిపై 23వేల మెజారిటీతో గెలుపొందారు. 
  •  అనంతరం రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా నాలుగేళ్ల, 3 నెలలు కొనసాగారు.

కాసుల బాల్‌రాజ్‌

బాన్సువాడ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాసుల బాల్‌రాజ్‌ ప్రొఫైల్‌ 
పేరు               :    కాసుల బాల్‌రాజ్‌  
తల్లిదండ్రులు    :    కాసుల బాబురావు  
వయస్సు        :    01–01–1960 
కులం             :    మున్నూరు కాపు  
విద్యార్హత         :    ఎస్‌ఎస్‌సి 
స్వగ్రామం        :    బాన్సువాడ 


రాజకీయ ప్రస్థానం:

  • 1984–  మున్నూరు కాపు సంఘంయువజన అధ్యక్షుడు. 
  • 1985 నుంచి 1990–యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు 
  • 1990 నుంచి 1998వరకు బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షులు 
  • 1992 నుంచి 1995 వరకు మార్కెట్‌ కమిటి అధ్యక్షులు–బాన్సువాడ 
  • 1995 నుంచి 2001 వరకు బాన్సువాడ సర్పంచ్‌ 
  •  22–7–2006 నుంచి 17–8–2008వరకు బాన్సువాడ ఎంపిపి 
  •  2009లో ప్రజా రాజ్యం పార్టీలో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా బాన్సువాడ ఎమ్మెల్యే     స్థానానికి పోటీ చేసి 6వేల ఓట్లు సాధించారు. 
  •  2014లో కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీచేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో 23వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. 
  •  పొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి

పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి

ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పొద్దుటూరి వినయ్‌కుమార్‌రెడ్డి ప్రొఫైల్‌

పూర్తి పేరు               :    పొద్దుటూరి వినయ్‌ కుమార్‌రెడ్డి 
తండ్రి పేరు               :    సురేందర్‌రెడ్డి 
తల్లి పేరు                 :    అరుణ 
భార్య                      :    అనన్య రెడ్డి
స్వగ్రామం                :    కోమన్‌పల్లి,  ఆర్మూర్‌ మండలం, నిజామాబాద్‌ జిల్లా    ప్రస్తుత నివాసం    :    విల్లా నెంబర్‌ : 177, అపమ ఫామ్‌ మిడోస్ కోంపల్లి, హైదరాబాద్‌ 
పిల్లలు                    :    హృదయ్, అన్వి 
విద్యార్హత                 :    బీటెక్‌ (ఈఈఈ) 
వృత్తి                       :    రియల్‌ ఏస్టేట్‌ వ్యాపారం, బిల్డర్‌ 
నిర్వహించిన పదవులు :  టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుడు 
ప్రత్యేకతలు               : టీఆర్‌ఎస్‌ పార్టీ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించిన ప్రస్తుత తాజా మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డికి వ్యాపార భాగస్వామిగా, మిత్రునిగా గుర్తింపు ఉంది.

గంప గోవర్ధన్‌
కామారెడ్డి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న గంపగోవర్ధన్‌ ప్రొఫైల్‌ 
అభ్యర్థి పేరు     :    గంప గోవర్ధన్‌  
స్వస్థలం         :    బస్వాపూర్, భిక్కనూరు మండలం 

రాజకీయ ప్రస్థానం :  

  •  1987లో బస్వాపూర్‌ సింగిల్‌విండో చైర్మన్‌గా రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు.  
  •  భిక్కనూరు మండల టీడీపీ అధ్యక్షునిగా పనిచేశారు.  
  •  1994 లో తొలిసారిగా టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు.  
  •  1999లో టిక్కెట్‌ దక్కలేదు. ఆయన స్థానంలో యూసుఫ్‌అలీకి టీడీపీ టిక్కెట్‌ రావడంతో స్తబ్ధుగా ఉన్నారు.  
  •  1999 నుంచి 2000 వరకు ఉమ్మడి నిజామాబాద్‌ జిల్లా టీడీపీ అ«ధ్యక్షుడిగా పనిచేశారు.  
  •  ఆ తర్వాత రెండు సంవత్సరాల పాటు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా కొనసాగారు.  
  •  2004లో    కామారెడ్డి స్థానం పొత్తులో భాగంగా బీజేపీకి దక్కింది. దీంతో టీడీపీ అభ్యర్థిగా ఎల్లారెడ్డి నుంచి పోటీ చేసి ఓడిపోయారు.     
  •  2009లో టీడీపీ అభ్యర్థిగా కామారెడ్డి నుంచి పోటీ చేసి షబ్బీర్‌అలీపై విజయం సాధించారు.  
  •  2011లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరారు.  
  •  2012 ఉప ఎన్నికల్లో పోటీ చేసి టీఆర్‌ఎస్‌ నుంచి గెలుపొందారు.  
  •   2014 లో మరోసారి టీఆర్‌ఎస్‌ నుంచి గెలిచి ప్రభుత్వవిప్‌గా అసెంబ్లీ రద్దు వరకు పనిచేశారు. 

గడ్డం ఆనంద్‌ రెడ్డి

నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న గడ్డం ఆనంద్‌రెడ్డి ప్రొఫైల్‌
పేరు               :    గడ్డం ఆనంద్‌రెడ్డి 
తండ్రి పేరు       :    గడ్డం గంగారెడ్డి 
తల్లి పేరు         :    గడ్డం లక్ష్మీకాంతమ్మ 
భార్య పేరు       :    ఇందిరా రెడ్డి 
పిల్లలు            :    శిల్పారెడ్డి, కావ్యరెడ్డి 
చదువు           :    డిప్లొమా ఇన్‌ సివిల్‌ ఇంజినీర్‌ 

రాజకీయ ప్రస్థానం :  

  •  2008 లో డిచ్‌పల్లి నియోజకవర్గంలో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసిన ఓటమి పాలయ్యారు. 
  •  2014లో  నిజామాబాద్‌ రూరల్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

ఆశన్నగారి జీవన్‌ రెడ్డి

ఆర్మూర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆశన్నగారి జీవన్‌ రెడ్డి ప్రొఫైల్‌ 
పూర్తి పేరు                 :    ఆశన్నగారి జీవన్‌రెడ్డి 
తండ్రి పేరు                 :    వెంకట రాజన్న 
తల్లి పేరు                   :    రాజాబాయి 
భార్య                        :    రజితరెడ్డి 
స్వగ్రామం                  :    జాన్కంపేట్, వేల్పూర్‌ మండలం, బాల్కొండ  
ప్రస్తుత నివాసం           :    ఇంటి నెం:  4–70/8/డీ/8, వెంకటేశ్వర కాలనీ, మామిడిపల్లి, ఆర్మూర్‌ మండలం, నిజామాబాద్‌ 
పిల్లలు                      :    అనౌషికారెడ్డి, అనణ్యరెడ్డి 
విద్యార్హత                   :    ఎంఏ (రాజనీతి శాస్త్రం), ఎల్‌ఎల్‌బీ 
వృత్తి                         :    వ్యవసాయం, వ్యాపారం, న్యాయవాది 
తమ్ముడు                  :    రాజేశ్వర్‌రెడ్డి 
చెల్లెలు, బావ               :    కరుణ, శ్రీనివాస్‌రెడ్డి 
నిర్వహించిన పదవులు   :    టీఆర్‌ఎస్‌ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్‌ నియోజకవర్గం ఇన్‌చార్జి. 
నిర్వహించిన బాధ్యతలు  :    2014–2018 వరకు ఆర్మూర్‌ ఎమ్మెల్యే 
ప్రత్యేకతలు                   :    టీఆర్‌ఎస్‌ 13వ ఆవిర్భావ సభను 2013 ఏప్రిల్‌లో ఆర్మూర్‌లో నిర్వహించారు. 2014లో మాజీ స్పీకర్‌ కేఆర్‌ సురేష్‌రెడ్డిపై సుమారు 13 వేల ఓట్ల  మెజారిటీతో గెలుపొందారు.

మహ్మద్‌ అలీ షబ్బీర్‌

కామారెడ్డి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న మహ్మద్‌అలీ షబ్బీర్‌ ప్రొఫైల్‌
అభ్యర్థి           : మహ్మద్‌అలీ షబ్బీర్‌  
స్వస్థలం        : మాచారెడ్డి, (కామారెడ్డిలో స్థిరపడ్డారు) 
పుట్టిన తేది    : 15–02–1957
 

రాజకీయ ప్రస్థానం :  

  •   షబ్బీర్‌అలీ 1970లో ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. తక్కువ కాలంలో ఎన్‌ఎస్‌యూఐ నాయకుడిగా, యువజన కాంగ్రెస్‌ నాయకుడిగా పనిచేశారు.  
  •  1987లో మాచారెడ్డి మండలం ఎంపీపీగా కాంగ్రెస్‌ నుంచి పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి గడ్డం రాజిరెడ్డి చేతిలో కొద్ది తేడాతో ఓడిపోయారు.1989లో కామారెడ్డి ఎమ్మెల్యేగా కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ   చేసి గెలుపొందారు. మర్రి చెన్నారెడ్డి క్యాబినెట్‌లో 31 ఏళ్లకే మంత్రిగా పనిచేశారు.  
  •  1994లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్‌ చేతిలో ఓడిపోయారు.  
  •  1999లో టీడీపీ అభ్యర్థి యూసుఫ్‌అలీ చేతిలో ఓటమి చెందారు.  
  •   2004లో బీజేపీ అభ్యర్థి మురళీధర్‌గౌడ్‌ పై భారీ మెజార్టీతో గెలుపొంది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి క్యాబినెట్‌లో విద్యుత్‌శాఖ మంత్రిగా పనిచేశారు.  
  •   2009లో టీడీపీ అభ్యర్థి గంపగోవర్ధన్‌ చేతిలో ఓడిపోయారు.  
  •   2010లో జరిగిన ఎల్లారెడ్డి నియోజకవర్గ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఇక్కడి నుంచి పోటీ చేసి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఏనుగు రవీందర్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. 
  •   2014లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గంపగోవర్ధన్‌ చేతిలో మరోసారి ఓటమి చెందారు.  
  •   ప్రస్తుతం కామరెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థిగా బరిలో ఉన్నారు.

రేకులపల్లి భూపతి రెడ్డి

రూరల్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న  డాక్టర్‌ ఆర్‌ భూపతిరెడ్డి ప్రొఫైల్‌ ఇది.. 
పేరు               :    డాక్టర్‌ రేకులపల్లి భూపతిరెడ్డి  
తండ్రి పేరు        :    ఆర్‌.రాజారెడ్డి 
తల్లి పేరు          :    లక్ష్మీ నర్సమ్మ 
భార్య పేరు        :    వినోదిని. 
పిల్లలు             :    శ్రీనిత్‌రెడ్డి (కుమారుడు). 
పుట్టిన తేదీ        :    12/02/1964 
చదువు             :    ఎంఎస్‌ ఆర్థో 
స్వగ్రామం           :    జలాల్‌పూర్,  నిజామాబాద్‌ రూరల్‌ మండలం  
ప్రస్తుత నివాసం    :    మారుతినగర్, కంఠేశ్వర్,  నిజామాబాద్‌ 

  • 1995లో నగరం ఖలీల్‌వాడీలో తిరుమల ఆర్థోపెడిక్‌ నర్సింగ్‌ హోం ప్రారంభించారు. 
  •  2001లో ఐఎంఏ ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక 
  •  2001 టీఆర్‌ఎస్‌లో చేరిక 
  •  2002లో టీఆర్‌ఎస్‌ పార్టీ రూరల్‌ ఇన్‌చార్జీగా నియామకం. 
  •  2002లో టీఆర్‌ఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియామకం 
  •  2015లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవ ఎన్నిక 
  •  2018లో    ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ లో చేరిక

పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డి

బోధన్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి ప్రొఫైల్‌
పేరు                     :    పొద్దుటూరి సుదర్శన్‌ రెడ్డి  
తండ్రి                    :    గంగారెడ్డి   
తల్లి                      :    రుక్మవ్వ
నివాసం                 :    నవీపేటలోని సిరన్‌పల్లి, ప్రస్తుతం  హైదరాబాద్‌లో స్థిరపడ్డారు.  
పుట్టిన తేది             :    02–08–1950 
విద్యాభ్యాసం            :    డిగ్రీ బీఏ 
భాషలు                  :    తెలుగు 
సతీమణి పేరు          :    సుచరిత   
పిల్లలు                   :    రాధిక, రచన, రజిత్‌రెడ్డి 
కుటుంబం నేపథ్యం    :    సాధారణ రైతు కుటుంబం


చేపట్టిన పదవులు :

  • 1986–87లో సుదర్శన్‌ రెడ్డి కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా, ఉమ్మడి రాష్ట్ర పీసీసీ డెలిగెట్‌గా పని చేశారు. 1989లో బోధన్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా ఎమ్మెల్యేగా పోటీ చేసి, టీడీపీ అభ్యర్థి కొత్త కొత్త రమాకాంత్‌ చేతిలో ఓటమి చెందారు. 
  • 1994లో ఎమ్మెల్యే టిక్కెట్‌ రాలేదు. కాంగ్రెస్‌ పార్టీ రెబెల్‌ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచి పార్టీ అధిష్టానం సూచన మేరకు పోటీ నుంచి నిష్క్రమించారు. 
  • 1999, 2004,2009 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 
  •  2006 నుంచి 2009 వరకు రెండు పర్యాయాలు టీటీడీ బోర్డు సభ్యుడిగా పదవీ బాధ్యతలు నిర్వర్తించారు. 
  •  దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ హయాంలో, రోశయ్య, కిరణ్‌ కుమార్‌ రెడ్డి హయాంలో ఉమ్మడి రాష్ట్ర వైద్య విద్యాశాఖ, భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా పని చేశారు. 
  •  2014లో జరిగిన  తెలంగాణ అసెంబ్లీ తొలి ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. టీఆర్‌ఎస్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహ్మద్‌ షకీల్‌ ఆమేర్‌ చేతిలో ఓడిపోయారు. 
  •  2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో ఉంటున్నారు. 

బాజిరెడ్డి గోవర్ధన్‌

నిజామాబాద్‌ రూరల్‌ టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి బాజిరెడ్డి బయోడేటా.. 
పేరు              :    బాజిరెడ్డి గోవర్థన్‌ 
తండ్రి పేరు      :    బాజిరెడ్డి దిగంబర్‌ 
పుట్టిన తేదీ     :    17/02/1954 
చదువు          :    బీఏ 
స్వగ్రామం        :    సిరికొండ మండలం చీమన్‌పల్లి 
ప్రస్తుత నివాసం :    వాసవి స్కూల్‌ సమీపంలో, మహాలక్ష్మినగర్, నిజామాబాద్‌ 
పదవులు.. 

  •    1973 లో పోలీస్‌ పటేల్‌ 
  •     1981లో  సర్పంచ్‌ 
  •    1987– 1990లో మండల పరిషత్‌ అధ్యక్షుడు (ఎంపీపీ) 
  •     1994–2004లో ఆంధ్రప్రదేశ్‌ ఫైనాన్స్‌ కార్పోరేషన్‌ డైరక్టర్‌  
  •    1994లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.  
  •     1999–2004లో ఆర్మూర్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక 
  •     2004–2008లో బాన్సువాడ ఎమ్మెల్యేగా ఎన్నిక 
  •     2009లో బాన్సువాడ ఎమ్మెల్యేగా పోటీ చేసి పోచారం శ్రీనివాస్‌రెడ్డి చేతిలో ఓటమి చెందారు 
  •     2014లో నిజామాబాద్‌ రూరల్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక

బిగాల గణేశ్‌ గుప్తా

నిజామాబాద్‌ అర్బన్‌ టిఆర్‌ఎస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేష్‌ గుప్త ప్రొఫైల్‌
పూర్తి పేరు             :    బిగాల గణేశ్‌గుప్తా 
భార్యపేరు              :    లత  
పుట్టిన ఊరు          :    మాక్లూర్‌ 
పిల్లలు                  :    ఇద్దరు కుమార్తెలు(రిది, రియ) 
పుట్టిన సంవత్సరం    :    17/04/1970 
తండ్రిపేరు                :    కృష్ణమూర్తిగుప్తా 
తల్లిపేరు                  :    సువర్ణమాల 
రాజకీయం               :    2009లో నిజామాబాద్‌ పార్లమెంట్‌ సభ్యుడిగా పోటీ ,2014లో నిజామాబాద్‌ అర్బన్‌ ఎమ్మెల్యేగా ఎన్నిక 
మాట్లాడే భాషలు       :    తెలుగు, ఇంగ్లిష్, హిందీ, మరాఠీ, కనడ, ఉర్దూ 
తమ్ముడు                :    మహేశ్‌ బిగాల 
చెల్లెళ్లు                    :    రాణి, వాణి 
స్కూల్‌ విద్యాభాస్యం   :    జెడ్పీహెచ్‌ఎస్‌(మాక్లూర్‌) 
ఇంటర్‌ విద్య              :    సీఎస్‌ఐ కళాశాల(నిజామాబాద్‌) 
ఉన్నత విద్య             :    బీఈ సివిల్‌ గురునానక్‌ ఇంజినీరింగ్‌ కళాశాల(బీదర్‌) 
బిగాల గణేశ్‌గుప్తా తాత బిగాల గంగారాం మాక్లూర్‌ గ్రామానికి 1961లో మొట్టమొదటి గ్రామ సర్పంచ్‌ పనిచేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement