![Jeet Adani Diva Shah wedding Anupam Mittal Quirky Wedding Gift goes viral](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/10/JeetAdani-DivaShah-anupammittalgift.jpg.webp?itok=CNDCq7EW)
బిలియనీర్,అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ(Gautam Adani) చిన్న కుమారుడు జీత్ అదానీ (Jeet Adani), వజ్రాల వ్యాపారి జైమిన్ షా కుమార్తె దివా జైమిన్ షా (Diva Jaimin Shah) ను ఈ నెల ఏడున పెళ్లాడాడు. అహ్మదాబాద్‌లో వీరి వివాహం వైభవంగా జరిగింది. ఈ సందర్బంగా గౌతమ్ అదానీ తన కుమారుడి వివాహ సమయంలో, వివిధ సామాజిక సమస్యలకుపయోగించేలా రూ. 10వేల కోట్లు విరాళంగా ప్రకటించడం విశేషంగా నిలిచింది. ఇందులో ఎక్కువ భాగం ఆరోగ్య సంరక్షణ, విద్య మరియు నైపుణ్యాభివృద్ధిలో భారీ మౌలిక సదుపాయాల కార్యక్రమాలకు నిధులు సమకూర్చనున్నారు. అంతకుముందు, జీత్ అదానీ ,దివా షా జంట ప్రతీ ఏడాది 500 మంది వికలాంగుల మహిళల వివాహానికి ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు విరాళంగా ఇస్తామని ప్రకటించారు. 21 మంది నూతన వధూవరులు (వికలాంగ మహిళలు), వారి భర్తలను కలిశారు.ఈ వివాహంలో మరో విశేషంగా కూడా ఉంది.అదేమిటంటే..!
షాదీ.కామ్ వ్యవస్థాపకుడు, షార్క్ ట్యాంక్ ఇండియా ప్యానలిస్ట్ , అనుపమ్ మిట్టల్ (Anupam Mittal) జీత్ అదానీకి ఒక ఆసక్తికరమైన వివాహ బహుమతి (Wedding Gift) ఇచ్చాడు. మ్యాట్రిమోనియల్ వెబ్‌సైట్‌లో చాలా కాలంగా ఉండిపోయిన జీత్ ప్రొఫైల్‌ను తొలగించాడు.ఈ విషయాన్ని స్వయంగా అనుపమ్‌మిట్టల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. తన వివాహానికి కొన్ని రోజుల ముందు షార్క్ ట్యాంక్ 'బియాండ్ ది ట్యాంక్' విభాగంలో మిట్టల్‌తో సంభాషించాడు జీత్. ఈ సందర్భంగా మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించాడు జీత్. చిన్న వయసులో తన పాఠశాల స్నేహితులు చిలిపిగా షాదీ డాట్ కామ్‌లో ఒక ఖాతా క్రియేటర్ చేశారనీ, అది ఇప్పటికీ అది అలాగే ఉందని, దయచేసి దాన్ని ఇప్పటికైనా తొలగించాలని అభ్యర్థించాడు.
As promised, here’s a small wedding gift from me to you & Diva @jeet_adani1. We have had ur profile deleted from @ShaadiDotCom now that u have confirmed ur participation in @sharktankindia 🤗💜 pic.twitter.com/1rNMtWmAhf
— Anupam Mittal (@AnupamMittal) February 8, 2025
దీనికి అనుపమ్ సరేనని సమాధాన మిచ్చారు. ఈ సందర్బంగా అదానీ గ్రూపు ఉద్యోగుల్లొ ఐదు శాతం వికలాంగులుగా ఉండాలని ఆదేశించినట్టు కూడా వెల్లడించారు. వాగ్దానం చేసినట్లుగామీ దంపతులకు ఇది ఒక చిన్న వివాహ బహుమతి అంటూ మిస్టర్ మిట్టల్ ఎక్స్‌లో ఒకపోస్ట్ పెట్టారు. దీనికి సంబంధించిన స్క్రీన్‌షాట్‌ను కూడా ఆయన జత చేశారు.
![](https://www.sakshi.com/s3fs-public/inline-images/jeetadani-anupammittal.jpg)
జీత్ అదానీతో షార్క్ ట్యాంక్ "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్
వికలాంగుల కోసం పనిచేసే వ్యవస్థాపకులకు ఏమి చేయవచ్చనే దానికి సంబంధించిన ఒక ఎపిసోడ్ ఉండాలని జీత్ అదానీ సూచన మేరకు షార్క్ ట్యాంక్ ఇండియా "దివ్యాంగ్ స్పెషల్" ఎపిసోడ్ ప్రకటించింది. ఈ ఎపిసోడ్ కోసం రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 15 వరకు అనుమతి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment