Anupam Mittal
-
70 గంటల పని: ప్రముఖ సీఈఓ ఏమన్నారంటే?
భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమితా థాపర్ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.ఈ విషయం మీద షాదీ.కామ్ వ్యవస్థాపకుడు 'అనుపమ్ మిట్టల్' మీద స్పందిస్తూ.. నారాయణ మూర్తి మాటలతో ఏకీభవించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. తప్పకుండా కస్టపడి పనిచేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటల చొప్పున పని చేశానని పేర్కొన్నారు. మనిషి ఎదగాలంటే.. పనిగంటలతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు. -
క్లిష్ట సమయంలో అవే కాపాడాయి..!: సీఈవో అనుపమ్ మిట్టల్
షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడి అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారిగా ఊహించని నష్టాలతో వ్యాపారం దివాళ తీసే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో తనకు సహయపడిన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అటువైపుకి వెళ్లి ఉండకపోతే మళ్లీ ఇలా నిలబడి మీ ముందుకు వచ్చేవాడిని కాదంటున్నాడు. ఇంతకీ అతడిని వ్యాపారంలో మళ్లీ నిలబడేలా చేసినవి ఏంటో తెలుసా..!చిన్న వయసులోనే కోట్టు గడించారు. ఆయన మైక్రోస్ట్రాటజీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలోనే కంపెనీ విలువ రూ.300 కోట్లకు చేరుకుంది. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు అతడి బిజినెస్ ఢమాల్ అని పడిపోయింది.మళ్లీ తిరిగా కోలుకోలేనంత నష్టాలు, అప్పులు చవిచూశాడు. చెప్పాలంటే అనుపమ్‌కి అది అత్యంత గడ్డుకాలం. క్షణమో యుగంలో భారంగా గడుస్తున్న సమయం. అయితే ఆ సమయంలో అతడిని మళ్లీ బిజినెస్‌లో తిరిగి నిలదొక్కుకునేలా చేసింది యోగా, ఆధ్యాత్మికత సాధన అని చెప్పారు. తాను ఆ సమయంలో ఓటమి అంగీకరించడానికి సిద్ధంగా లేని స్థితిలో ఉన్ననని చెప్పారు. ఒక్కసారిగా తన కలంతా చెదరిపోయిన బాధ ఒక్క క్షణం నిలువనియడం లేదు. అయినా ఏదో తెలియని ధైర్యం ఏం చేసి దీన్ని మార్చేయాలి అనే ఆలోచనలే బుర్ర నిండా అంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో తాను శారీరకంగా, మానసికంగా చాలా క్రుంగిపోయానని అన్నారు. అప్పుడే తాను ధ్యానం, ఆధ్యాత్మికత వైపుకి మళ్లానని, అవే తనను మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలో నిలదొక్కుకునేలా చేశాయి. మళ్లీ ఇదివరకిటిలా విజయాలను అందుకునే స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. అంతేగాదు అలాంటి క్లిష్టమైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండటమే అతిపెద్ద ఐశ్వర్యం అన్నారు. అది తనకు యోగా, ఆధ్యాత్మికత వల్లే సాధ్యమై తిరిగి పుంజుకోగలిగానని చెప్పుకొచ్చారు అనుపమ్. ఒక థెరపిస్ట్ సాయంతో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు. తాను ఆ సమయంలో విజయాన్ని అందుకోలేనేమో అన్నంత ఉద్విగ్న స్థితలో ఉన్నాట్టు చెప్పారు. తనకి వైఫల్యం అంటేనే వెన్నులో వణుకు వచ్చేంత భయం కలిగిందని నాటి పరిస్థితిని వివరించారు. ఇక్కడ ఆధ్యాత్మికత మన గందరగోళ పరిస్థితిని చక్కబెట్టలేదు గానీ, అది మనం ప్రతిస్పందించే విధానంలో మార్పు తీసుకొస్తుంది. గెలుపే జీవితం అనే ఒత్తిడి నుంచి బయపటడి ఎలా తనను తాను శాంతపరుచుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించానని అన్నారు.ఆ సమయంలో మనకు మద్దతుగా కుటుంబ సభ్యలు, అర్థం చేసుకుని జీవిత స్వామి దొరకడం తన అదృష్టం అన్నారు. వాళ్లు గనుక మనకి తోడుగా నిలబడితే ఎంతటి కఠినమైన కష్టమైన సునాయాసంగా ఛేజించి విజయాలను అందుకోగలుగుతామని పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుపమ్. ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మీరు గొప్ప పెట్టుబడుదారు, ఎల్లప్పడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.(చదవండి: ప్రపంచాన్ని చుట్టిరానున్న ఇద్దరు నేవీ ఆఫీసర్లు..!) -
నన్ను పిచ్చివాడిగా భావించారు.. అంతా అదృశ్యమైంది: అనుపమ్ మిట్టల్
జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్‌గా ఎదిగాను. యుఎస్‌లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్‌ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.ఇదీ చదవండి: భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు.