భారతదేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలంటే.. యువత వారానికి 70 గంటలు పని చేయాలని, ఇన్ఫోసిస్ 'నారాయణ మూర్తి' గతంలో పేర్కొన్నారు. దీనిపైన పలువురు పారిశ్రామిక వేత్తలు మిశ్రమంగా స్పందించారు. కాగా ఇప్పుడు ఎంక్యూర్ ఫార్మాస్యూటికల్స్ సీఈఓ 'నిమితా థాపర్' వ్యాఖ్యానించారు. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
హ్యూమన్స్ ఆఫ్ బాంబేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో నిమితా థాపర్ మాట్లాడుతూ.. ఎక్కువ గంటలు పనిచేయడం వల్ల లాభం పొందేది యజమానులే.. కానీ ఉద్యోగులు కాదని వెల్లడించారు. ఎక్కువ డబ్బు సంపాదించాలనుకునే యజమానులు.. ఎక్కువ గంటలు పనిచేయండని వివరించారు. అయితే అభివృద్ధి పేరుతో ఉద్యోగులపైన పనిభారాన్ని మోపకూడని అన్నారు.
ఈ విషయం మీద షాదీ.కామ్ వ్యవస్థాపకుడు 'అనుపమ్ మిట్టల్' మీద స్పందిస్తూ.. నారాయణ మూర్తి మాటలతో ఏకీభవించారు. జీవితంలో ఏదైనా సాధించాలంటే.. తప్పకుండా కస్టపడి పనిచేయాలి. నేను అమెరికాలో ఉన్నప్పుడు రోజుకు 16 గంటల చొప్పున పని చేశానని పేర్కొన్నారు. మనిషి ఎదగాలంటే.. పనిగంటలతో సంబంధం లేకుండా అంకితభావంతో పనిచేయాలని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment