జీవితమంటే ఎన్నో కష్టాలు, నష్టాలు. అన్నింటిని దాటుకుంటూ వెళ్తేనే అందమైన ప్రపంచం. దీనికి నిదర్శనమే షాదీ.కామ్ ఫౌండర్ అండ్ సీఈఓ 'అనుపమ్ మిట్టల్'. ఈయన తన అద్భుతమైన ప్రయాణం గురించి ఇటీవల వెల్లడించారు. అతి తక్కువ వయసులోనే ధనవంతుడై.. ఆ తరువాత అన్నీ కోల్పోయానని అన్నారు. దీనికి సంబంధించిన విషయాలను ఈయన లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో వెల్లడించారు.
20 ఏళ్ళ వయసులోనే మల్టీ మిలియనీర్‌గా ఎదిగాను. యుఎస్‌లో జీవితం ఒక కలలా అనిపించింది. ఎంతగా అంటే నేను ఫెరారీని కూడా ఆర్డర్ చేసాను. కానీ అది వచ్చిన వెంటనే, అంతా అదృశ్యమైంది. డాట్ కామ్ బుడగ పగిలిపోయింది, దానితో డబ్బు మాయమైంది. ఉన్న డబ్బు పోవడమే కాకుండా అప్పులు చేయాల్సి వచ్చిందని అనుపమ్ మిట్టల్ పేర్కొన్నారు.
2003 నాటికి నేను గెలిచిన.. ఓడిపోయిన జ్ఞాపకం తప్పా మరేమీ మిగలలేదు. అన్నింటిని కోల్పోవడం వల్ల వచ్చే ధైర్యంతో నేను మరొక డాట్-కామ్ వెంచర్‌ను (షాదీ.కామ్) నిర్మించడానికి సన్నద్దమయ్యాను. డొమైన్ ధర 25,000 డాలర్లు. ఆ తరువాత మా వద్ద కేవలం 30,000 డాలర్లు మాత్రమే మిగిలింది. ప్రజలందరూ నన్ను పిచ్చివాడిగా భావించారు. అంతే కాకుండా నేను ప్రారంభించిన వ్యాపారం గురించి కూడా ప్రశ్నల వర్షం కురిపించారు.
ఎవరు ఏమనుకున్నా.. నేను మాత్రం ఇదే గేమ్ ఛేంజర్ అని భావించాను. ఇదే సరైనదని ముందుకు వెళ్ళాను. మళ్ళీ పూర్వ వైభవం పొందాను. నా ప్రయాణం కేవలం డబ్బు కోసం మాత్రమే కాదు, నేను ఓటమి చూసినా మళ్ళీ ఎదగగలనని నిరూపించానని అనుపమ్ మిట్టల్ అన్నారు.
ఇదీ చదవండి: భారత్‌లో హెడ్ ఆఫీస్ అమ్మేస్తున్న అమెరికన్ కంపెనీ
ఒక వ్యక్తి సామర్థ్యాన్ని కేవలం గెలుపు, ఓటములతో నిర్దారించలేము. విజయం అనేది జనాదరణ పొందిన అభిప్రాయంతో పాటు వెళ్లడం కాదు. మీపై మీరు విశ్వాసంతో ముందుకు నడవడమే. రిస్క్ తీసుకోవాలి, గెలిచే వరకు ఆటను ఆపొద్దని మిట్టల్ సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment