Brian Johnson: US Billionaire Struggles To Find Date Life Even After Spending 16 Crore Per Year - Sakshi
Sakshi News home page

Bryan Johnson: అతనో బిలియనీర్‌.. కానీ ఏం లాభం? పెళ్లికి నో చెబుతున్న అమ్మాయిలు

Published Wed, Aug 16 2023 4:08 PM | Last Updated on Wed, Aug 16 2023 6:35 PM

US Billionaire Struggles To Find Date Life Even After Spending 16 Crore Per Year - Sakshi

అతనో బిలియనీర్‌.. అమెరికాలోని సంపనుల్లో అతడొకడు. పేరు బ్రియాన్‌ జాన్సన్‌. కండలు తిరిగిన దేహంతో చూడటానికి కూడా చాలా అందంగానే ఉంటాడు. పైగా ఆల్కహాల్‌ కూడా ముట్టుకోడు పక్కా హెల్తీ డైట్‌ను ఫాలో అవుతాడు. అయినా అతనికి ఇప్పటివరకు పెళ్లి కాలేదు. జీవితంలో ఓ తోడు కోసం బ్రియాన్‌ ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడు.

కానీ ఏం చేస్తాం.. ఇప్పటికీ పెళ్లికాని కోటీశ్వరుడిగానే మిగిలిపోయాడు.ఇన్ని మంచి అలవాట్లు ఉన్న జాన్సన్‌ ఇంకా సింగిల్‌గానే ఉన్నాడు. చాలా సార్లు డేటింగ్‌కు పిలిచినా అమ్మాయిలు నో చెప్పి పారిపోతున్నారట. ఇంతకీ ఈ  బిలియనీర్‌ పెళ్లి కహానీ ఏంటన్నది ఇప్పుడు చూద్దాం.

బ్రియాన్‌ జాన్సన్‌.. అమెరికాలోని శ్రీమంతుల్లో ఒకడు. అందంగా ఉంటాడు, మద్యం కూడా తాగడు. కాలిఫోర్నియాకు చెందిన ఈ బిజినెస్‌మ్యాన్‌ వందల కోట్లకు అధిపతి. వయసు 45. పెళ్లీడు ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది కూడా. కానీ జాన్సన్‌కు ఇంకా పెళ్లి కాలేదు. భాగస్వామి కోసం అతను ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నాడట. వందల కోట్లున్నా తన జీవితంలో ఇంకా అమ్మాయి లేదని తెగ ఫీల్‌ అవుతున్నాడు. వయసు మీద పడుతున్నా యంగ్‌గా కనిపించేందుకు ‍బ్రియాన్‌ జాన్సన్‌ ప్రత్యేకంగా ట్రీట్‌మెంట్‌ తీసుకుంటున్నాడు కూడా. దీనికోసం ఏడాదికి ఏకంగా రూ.16కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అయినా నో యూజ్‌.. అమ్మాయిలు ఇతను చెప్పే కండిషన్స్‌ విని దూరంగా పారిపోతున్నారు.

ఇటీవల ఓ పాడ్‌కాస్ట్‌ ఇంటర్వ్యూలో జాన్సన్‌.. పెళ్లికోసం తను పడుతున్న ఇబ్బందులను వివరించాడు. కోట్లున్నా తనకింకా పెళ్లి కాలేదని, భాగస్వామి దొరకడం కష్టమైపోయిందని ఆవేదన చెందాడు. అతను ఏమన్నాడంటే.. ''నేను రాత్రి 8.30 గంటలకే నిద్రపోతాను. ఉదయం 6గంటల నుంచి 11గంటలలోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలనే తీసుకుంటాను. రోజుకు ఐదు గంటలు ఏకాగ్రత, మంచి లైఫ్‌స్టైల్‌ కోసమే కేటాయిస్తాను. పక్కా న్యూటిషియన్లు చెప్పిన డైట్‌నే ఫాలో అవుతాను. దీంతో పాటు ముడుచుకొని పడుకోవడం నాకు అలవాటు.

ఇదే విషయాల గురించి అమ్మాయిలతో ప్రస్తావిస్తే వాళ్లు షాకవుతున్నారు.మొదట డేట్‌కు వస్తామని చెప్పిన వాళ్లు నా కండిషన్స్‌ లిస్ట్‌ చూసి నో చెబుతున్నారు.అందుకే నన్ను పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంతకుముందు మద్యం తాగే అలవాటు కూడా ఉండేది. కానీ దానివల్ల అదనపు క్యాలరీలు వచ్చి బరువు పెరుగుతానని దీనికి కూడా దూరంగా ఉంటున్నా. అందం కోసం రోజుకు 111 ట్యాబ్లెట్స్‌ వేసుకుంటా. ఇన్ని చేస్తున్నా నాకింకా పెళ్లి కాలేదు'' అంటూ తన గోడు వెళ్లబోసుకున్నాడు జాన్సన్‌. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement