మైక్రొసాఫ్ట్ కో-ఫౌండర్.. ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో ఒకరైన 'బిల్ గేట్స్' గురించి అందరికి తెలుసు. అయితే తన కలలను సాకారం చేసుకోవడానికి చదువుకునే రోజుల్లోనే ఎలాంటి నిర్ణయం తీసుకున్నారనే విషయాలను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బిల్ గేట్స్ చదువుకునే రోజుల్లో.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించడానికి కాలేజీ విద్యను మధ్యలోనే ఆపేయాల్సి వచ్చిందని వెల్లడించారు. నిజానికి బిజినెస్ చేయాలనే ఉద్దేశ్యంతో కాలేజీ చదువును మధ్యలోనే ఆపేసిన వ్యక్తుల జాబితాలో బిల్ గేట్స్ మాత్రమే కాకుండా.. స్టీవ్ జాబ్స్, మార్క్ జుకర్‌బర్గ్, ఇలాన్ మస్క్ మొదలైనవారు ఉన్నారు.
ప్రతి ఇంట్లోని డెస్క్‌పైన కంప్యూటర్ కలిగి ఉండాలి అనేది బిల్ గేట్స్ కల. ఈ వైపుగానే అడుగులు వేశారు. నేడు ఆ కల నిజమైంది. ప్రారంభంలో తాను హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చినప్పుడు బిలియనీర్ అవుతానని ఊహించలేదని అన్నారు.
ఇదీ చదవండి: సైబర్ మోసాలకు ఇన్సూరెన్స్: రోజుకు మూడు రూపాయలే..
1970లలో బిల్ గేట్స్ అతని స్నేహితుడు పాల్ అలెన్ కంప్యూటర్‌లను అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు మొదలుపెట్టారు. పట్టు వదలకుండా దీనిపైనే శ్రమించారు. తన 20వ ఏట మొత్తం మైక్రోసాఫ్ట్ కోసం పనిచేసినట్లు గేట్స్ చెప్పారు. వారాంతాలు, సెలవులు వంటివన్నీ మరచిపోయే అనుకున్న లక్ష్యం దిశగానే అడుగులు వేశారు. అనుకున్నది సాధించారు. నేడు మైక్రోసాఫ్ట్ వాల్యూ సుమారు మూడు ట్రిలియన్ డాలర్లు.
Comments
Please login to add a commentAdd a comment