మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు 'బిల్ గేట్స్' (Bill Gates) ఇటీవల తన ట్విటర్ అకౌంట్ ద్వారా ఒక వీడియో షేర్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ బిల్ గేట్స్ ఈ వీడియో ఎందుకు షేర్ చేశారు? దీని వెనుక ఉన్న కారణం ఏమిటనే మరిన్ని విషయాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
ప్రస్తుతం మనం కంప్యూటర్ యుగంలో కొనసాగుతున్నామన్న విషయం అందరికి తెలుసు. అయితే కంప్యూటర్ అనగానే ముందుగా అందరికి విండోస్ గుర్తుకు వస్తాయి. ఆధునిక కాలంలో ఎన్ని ఓఎస్‌లు పుట్టుకొచ్చిన ఒకప్పటి విండోస్95 మాత్రం ఇప్పటికే ప్రత్యేకమే. దీనిని ప్రారంభించి ఇప్పటికి 28 సంవత్సరాలు పూర్తయినట్లు సమాచారం.
ఇదీ చదవండి: చంద్రయాన్-3 బడ్జెట్ కంటే ఖరీదైన కారు.. ఇలాంటి మోడల్ ఇప్పటి వరకు చూసుండరు..!
విండోస్95 విడుదలైన సుమారు మూడు దశాబ్దాలు కావొస్తున్న సందర్భంగా బిల్ గేట్స్ దానికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ... తన పాత జ్ఞాపకాలను షేర్ చేసుకున్నారు. ఇందులో బిల్ గేట్స్ డ్యాన్స్ వేయడం చూడవచ్చు. మైక్రోసాఫ్ట్ మొదటి సారి 1995 ఆగష్టు 24న విండోస్95ను 32 బిట్ సిస్టంతో విడుదల చేసింది. ఆ తరువాత కాలంలో ఇందులో చాలా మార్పులు వచ్చాయి.
Some memories stick with you forever. Others follow you around the internet for 28 years. Happy birthday, @Windows. pic.twitter.com/CUqLN2fqlW
— Bill Gates (@BillGates) August 24, 2023
Comments
Please login to add a commentAdd a comment