షాదీ డాట్ కామ్ సీఈవో అనుపమ్ మిట్టల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. 20 ఏళ్లలోనే కోటీశ్వరుడి అయ్యి అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఒక్కసారిగా ఊహించని నష్టాలతో వ్యాపారం దివాళ తీసే పరిస్థితుల్లోకి వెళ్లిపోయారు. సరిగ్గా ఆ సమయంలో తనకు సహయపడిన వాటి గురించి సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకున్నారు. అటువైపుకి వెళ్లి ఉండకపోతే మళ్లీ ఇలా నిలబడి మీ ముందుకు వచ్చేవాడిని కాదంటున్నాడు. ఇంతకీ అతడిని వ్యాపారంలో మళ్లీ నిలబడేలా చేసినవి ఏంటో తెలుసా..!
చిన్న వయసులోనే కోట్టు గడించారు. ఆయన మైక్రోస్ట్రాటజీలో ప్రొడక్ట్ మేనేజర్‌గా ఉన్న సమయంలోనే కంపెనీ విలువ రూ.300 కోట్లకు చేరుకుంది. అమెరికాలో విలాసవంతమైన జీవితం గడిపే స్థాయికి చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతున్న తరుణంలో 2008 ఆర్థిక మాంద్యం దెబ్బకు అతడి బిజినెస్ ఢమాల్ అని పడిపోయింది.మళ్లీ తిరిగా కోలుకోలేనంత నష్టాలు, అప్పులు చవిచూశాడు. చెప్పాలంటే అనుపమ్‌కి అది అత్యంత గడ్డుకాలం. క్షణమో యుగంలో భారంగా గడుస్తున్న సమయం. అయితే ఆ సమయంలో అతడిని మళ్లీ బిజినెస్‌లో తిరిగి నిలదొక్కుకునేలా చేసింది యోగా, ఆధ్యాత్మికత సాధన అని చెప్పారు.
తాను ఆ సమయంలో ఓటమి అంగీకరించడానికి సిద్ధంగా లేని స్థితిలో ఉన్ననని చెప్పారు. ఒక్కసారిగా తన కలంతా చెదరిపోయిన బాధ ఒక్క క్షణం నిలువనియడం లేదు. అయినా ఏదో తెలియని ధైర్యం ఏం చేసి దీన్ని మార్చేయాలి అనే ఆలోచనలే బుర్ర నిండా అంటూ నాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. ఆ టైంలో తాను శారీరకంగా, మానసికంగా చాలా క్రుంగిపోయానని అన్నారు. అప్పుడే తాను ధ్యానం, ఆధ్యాత్మికత వైపుకి మళ్లానని, అవే తనను మళ్లీ వ్యాపార సామ్రాజ్యంలో నిలదొక్కుకునేలా చేశాయి.
మళ్లీ ఇదివరకిటిలా విజయాలను అందుకునే స్థాయికి చేరుకోగలిగానని చెప్పుకొచ్చారు. అంతేగాదు అలాంటి క్లిష్టమైన సమయంలో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకునే ధైర్యం ఉండటమే అతిపెద్ద ఐశ్వర్యం అన్నారు. అది తనకు యోగా, ఆధ్యాత్మికత వల్లే సాధ్యమై తిరిగి పుంజుకోగలిగానని చెప్పుకొచ్చారు అనుపమ్. ఒక థెరపిస్ట్ సాయంతో ఆందోళన, ఒత్తిడిని దూరం చేసుకునే ప్రయత్నం చేసినట్లు వివరించారు.
తాను ఆ సమయంలో విజయాన్ని అందుకోలేనేమో అన్నంత ఉద్విగ్న స్థితలో ఉన్నాట్టు చెప్పారు. తనకి వైఫల్యం అంటేనే వెన్నులో వణుకు వచ్చేంత భయం కలిగిందని నాటి పరిస్థితిని వివరించారు. ఇక్కడ ఆధ్యాత్మికత మన గందరగోళ పరిస్థితిని చక్కబెట్టలేదు గానీ, అది మనం ప్రతిస్పందించే విధానంలో మార్పు తీసుకొస్తుంది. గెలుపే జీవితం అనే ఒత్తిడి నుంచి బయపటడి ఎలా తనను తాను శాంతపరుచుకోవాలనే దానిపై దృష్టి కేంద్రీకరించానని అన్నారు.
ఆ సమయంలో మనకు మద్దతుగా కుటుంబ సభ్యలు, అర్థం చేసుకుని జీవిత స్వామి దొరకడం తన అదృష్టం అన్నారు. వాళ్లు గనుక మనకి తోడుగా నిలబడితే ఎంతటి కఠినమైన కష్టమైన సునాయాసంగా ఛేజించి విజయాలను అందుకోగలుగుతామని పోస్ట్‌లో రాసుకొచ్చారు అనుపమ్. ఆ పోస్ట్ నెట్టింట తెగ వైరల్‌గా మారింది. అంతేగాదు నెటిజన్లు మీరు గొప్ప పెట్టుబడుదారు, ఎల్లప్పడూ స్ఫూర్తిదాయకంగా ఉంటారంటూ ప్రశంసిస్తూ పోస్టులు పెట్టారు.
(చదవండి: ప్రపంచాన్ని చుట్టిరానున్న ఇద్దరు నేవీ ఆఫీసర్లు..!)
Comments
Please login to add a commentAdd a comment