Shaadi.com
-
ఇదే నాకు మొదటి పెళ్లి... నాకు మందు, సిగరేట్లు కావాలి
పెద్దపల్లి: రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన పాన్‌షాప్ నిర్వాహకుడు వరంగల్ జిల్లాకు చెందిన ఓ యువతి మాయలో పడి మోసపోయాడు. అప్పటికే మూడు పెళ్లిల్లు చేసుకున్న మాయ లేడీ ఇక్కడి యువకున్ని మోసం చేసి డబ్బు, బంగారంతో పరారైంది. దీంతో బాధితుడు ఎన్టీపీసీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల వివరాలు.. ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన రేవంత్‌కు అప్పటికే పెళ్లి జరిగి విడాకులయ్యాయి. అయితే ఓ షాదీ డాట్ కామ్ ద్వారా యువతి పరిచయమైంది. ఆ పరిచయం సెల్ ఫోన్లలో ముచ్చట్లు.. తర్వాత పెళ్లి వరకు వచ్చింది. ఇదే మొదటి పెళ్లి అంటూ సదరు యువతి నమ్మించింది. దీంతో రెండు కుటుంబాలకు చెందిన పెద్దలు పెళ్లి కుదిర్చారు. వెంటనే ఎన్టీపీసీలోని చిలుకలయ్య ఆలయంలో సాదాసీదాగా వివాహం చేసుకుని కొత్త కాపురం ప్రారంభించారు. ఇక లేడీ తన కిలాడీల ప్రదర్శన ప్రారంభించింది. తనకు మందు, సిగరేట్లు కావాలంటూ యువకున్ని నిత్యం వేధింపులకు గురిచేసింది. ఇద్దరి మధ్య గొడవలు మొదలై రెండు నెలలు గడిచాయి. ఈక్రమంలో యువతి తన అక్క వద్దకు వెళ్తున్నానని ఇంట్లో ఉన్న రూ.70వేల నగదు, 4 తులాల బంగారు ఆభరణాలతో బిచానా ఎత్తేసింది. రోజులు గడుస్తున్నా తిరిగి రాకపోవడంతో యువకుడు ఆమె బంధువులు, మిత్రుల వద్ద ఆరా తీయడంతో అసలు విషయాలు బయటపడ్డాయి. అప్పటికే మూడు పెళ్లిలు అయ్యాయని, చాలా మందితో పరిచయాలు ఉన్నాయని తెలుసుకున్నాడు. చివరకు చిరునామా తెలుసుకుని వెళ్లడంతో సదరు యువతి తన మిత్రులతో విందు విలాసాలతో కనిపించింది. ఏకంగా వారందరూ పాన్‌షాప్ యువకుడిపై దాడి చేసి, వాటిని వీడియో తీశారు. ఈ వీడియోలు సదరు యువతి మిత్రులు సోషల్ మీడియాలో పెడతామంటూ బెదిరింపులకు గురిచేశారు. అంతేగాకుండా యువకుడి కుటుంబసభ్యులను సైతం డబ్బుల కోసం డిమాండ్ చేశారు. దీంతో యువకుడు ఎన్టీపీసీ పోలీసులను ఆశ్రయించి గోడు వెల్లబోసుకున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. యువతి కోసం గాలిస్తున్నాం పెండ్లి చేసుకుని నగదు, బంగారు ఆభరణాలతో వెళ్లి ఫోన్ స్విచాఫ్ చేసిందని బాధితుడు ఫిర్యాదు చేశాడు. ఆమె కోసం గాలిస్తున్నాం. చీటింగ్ కేసు నమోదు చేశాం. ఇటీవల హైదరాబాద్‌లో ఉందన్న సమాచారంతో వెళ్లినా ఆచూకీ దొరకలేదు. ఆమె పట్టుబడితే పూర్తి విషయాలు తెలిసే అవకాశాలున్నాయి. – బి.జీవన్, ఎస్సై, ఎన్టీపీసీ న్యాయం చేయండి.. పెండ్లి పేరుతో నన్ను ఆమె మోసం చేసింది. మా ఇంటి నుంచి నగదుతో పాటు బంగారం తీసుకెళ్లింది. ఆమెతో పాటు ఆమె స్నేహితుల నుంచి నాకు ప్రాణ భయం ఉంది. నాకు న్యాయం చేయాలి. – రేవంత్, ఎన్టీపీసీ రామగుండం -
కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు!
భారతీయ యువతులు పెళ్లి చేసుకునే ముందు తమకు కాబోయే భర్తకు కొన్ని షరతులు పెడుతున్నారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవడం తమకు ఇష్టం లేదని ఎక్కువ మంది అమ్మాయిలు తేల్చిచెప్పారు. మ్యారేజ్ వెబ్సైట్ షాదీ.కామ్ అన్లైన్ పోల్ ద్వారా చేసిన సర్వేలో మరిన్ని విషయాలను వెల్లడించింది. 25 - 34 ఏళ్ల మధ్య వయసున్న మహిళల నుంచి అన్లైన్ లోనే అభిప్రాయాలను సేకరించింది. భారతీయ మహిళలు గతంలో కంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారని, తమకు ఇష్టం వచ్చిన కెరీర్‌ను ఎంచుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తమ సర్వే వివరాలను వెల్లడించారు. పెళ్లికి ముందు భర్తకు కొన్ని షరతులు, నియమాలు లాంటివి పెడుతున్నారా అన్న ప్రశ్నకు 12,500 మంది స్పందించగా, 71.30 శాతం మహిళలు అవును అని సమాధానమిచ్చారు. ఈ విషయమై ఆలోచించాల్సి ఉందని 22.90 శాతం మంది, అటువంటిదేం లేదని 5.80 శాతం బదులిచ్చారట. ఎక్కువ శాతం వధువులు ఇంటిపేరు మార్పు గురించే పట్టుబడుతున్నారు. ఇంటి పేరు మార్చడానికి ఏమాత్రం ఇష్టపడనివాళ్లే ఎక్కువగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వాతంత్ర్యం తమకు ఇవ్వాలని, తమ తల్లిదండ్రులను కూడా వరుడి పేరేంట్స్ లాగానే ట్రీట్ చేయాలని మరికొంత మంది తమ షరతులు చెప్పారు. -
కట్నం అడిగితే పెళ్లి రద్దు!
హైదరాబాద్: కట్నం అడిగే యువకులను భారతీయ అమ్మాయిలు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడటంలేదు. షాదీ.కామ్ సర్వేలో ఈ విషయం స్పష్టమైంది. కట్నం అడిగే అబ్బాయిల పట్ల భారతీయ యువతులు విముఖ వ్యక్తం చేస్తున్నట్లు ఆ సర్వే వెల్లడిస్తోంది. కట్నం అడిగారన్న కారణంతో 51.4 శాతం మంది అమ్మాయిలు పెళ్లినే రద్దు చేసుకున్నారు. కట్నం ఇవ్వాల్సి వచ్చిందని 48.6 శాతం మంది యువతులు సిగ్గుగా ఫీలవుతున్నట్లు ఈ సర్వేలో వెల్లడైంది. -
మీ ఇష్టమే.. మా ఇష్టం...
మీరు చూసిన సంబంధమే చేసుకుంటాం. మీ ఇష్టమే మా ఇష్టం.... వివాహాల విషయంలో గతంలో ఎక్కువగా యువతీయువకుల నోటివెంట ఈ మాటలు తల్లిదండ్రుల వద్ద వినబడేవి. కాలం మారింది. జీవిత భాగస్వాముల ఎంపికలో యువత తమకు తామే స్వంతంగా నిర్ణయాలు తీసుకునే స్వేచ్ఛ వచ్చింది. తమకు నచ్చిన వారిని పెద్దలను ఎదరించైనా పెళ్లిచేసుకునే జంటలు పెరుగుతున్నాయి. మారిన కాలంతో పాటు పిల్లల ఇష్టానికే తల్లిదండ్రులు ఒప్పుకుంటున్నారు. కాలం ఎంతమారినప్పటికీ వివాహం విషయంలో తల్లిదండ్రుల మాటే తమ బాటగా భావిస్తున్నారు యువతలో ఎక్కువ మంది. తమ జీవిత భాగస్వామి ఎంపిక విషయం ఎక్కువ మంది తల్లిదండ్రులకే వదిలేస్తున్నారు. షాది డాట్‌కామ్ పోర్టల్ నిర్వహించిన సర్వేలో ఈ వియషం వెల్లైడైంది. భాగస్వామి ఎంపికలో ఉత్తమైన మార్గం ఏమిటని ప్రశ్నించగా అత్యధికంగా 50.1 శాతం మంది తల్లిదండ్రులు చూసిన సంబంధానికే ఓటు వేశారు. తమిష్ట ప్రకారం ఆన్లైన్ లో భాగస్వామిని వెతుక్కుంటామని 31 శాతం మందిపైగా పేర్కొన్నారు. కామన్ ఫ్రెండ్స్ ద్వారా సంబంధం కలుపుకుంటామని 12 శాతం మంది, పనిచేసే కార్యాలయాల్లోనే భాగస్వామిని వెతుక్కుంటామని 6 శాతం మంది వెల్లడించారు. జీవిత భాగస్వామి ఎంపికలో అభిప్రాయాలు, అభిరుచులకే ప్రాధాన్యం ఇస్తామని అధికంగా 37 శాతం మంది తెలిపారు. విద్యార్హతలకు ప్రాధాన్యం ఇస్తామని 30 శాతం మంది, జీవిత భాగస్వామి వృత్తికి ప్రాధాన్యం ఇస్తామని 21 శాతం మంది పేర్కొన్నారు. ఆకర్షణీయంగా ఉండాలని 11 శాతం మంది చెప్పారు. తరాలు మారినా, టెక్నాలజీ పెరిగినా భారత యువత పెద్దలను గౌరవిస్తోందని, అదే సమయంలో తమ అభిప్రాయాలను కాపాడుకుంటున్నారు. -
ఇష్టమైన తండ్రులు.. ఒబామా, షారూఖ్
షాదీ డాట్ కామ్ ఆన్లైన్ సర్వేలో వెల్లడి న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ఇష్టమైన తండ్రులుగా.. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, బాలీవుడ్ సూపర్‌స్టార్ షారూఖ్‌ఖాన్ నిలిచారు. ఫాదర్స్ డే నేపథ్యంలో షాదీ డాట్ కామ్ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వీరిద్దరూ అత్యధిక ఓట్లు దక్కించుకున్నారు. సుమారు 5,500 మంది ఈ ఆన్లైన్ సర్వేలో పాలుపంచుకున్నారు. దేశంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన తండ్రి ఎవరని భారత మహిళలను ప్రశ్నించగా.. ఎక్కువమంది షారూఖ్ పేరే చెప్పారు. ‘ఇండియాస్ మోస్ట్ పాపులర్ ఫాదర్’గా 42.5 శాతం మంది షారూఖ్‌కే ఓటేశారు. ఆ తర్వాతి స్థానంలో 36.9 శాతం ఓట్లతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ నిలిచాడు. బాలీవుడ్ మెగా స్టార్ అమితాబ్‌బచ్చన్ 20.6శాతం ఓట్లతో మూడో స్థానం దక్కించుకున్నా డు. ఇతర దేశస్తుల్లో అత్యంత ఇష్టమైన తండ్రులు ఎవరని ప్రశ్నించగా.. 40.3శాతం మంది ఒబామా పేరు చెప్పారు. ఆ తర్వాతి స్థానాల్లో హాలీవుడ్ నటు డు విల్ స్మిత్(31.4), మాజీ ఫుట్‌బాల్ క్రీడాకారుడు డేవిడ్ బెక్‌హమ్(15.2), ప్రముఖ టెన్నిస్ ప్లేయర్ రోజర్ ఫెదరర్ (13.1) శాతం ఓట్లు దక్కించుకున్నారు. భారతదేశంలో మెచ్చుకోదగిన తండ్రీ కూతుళ్లు ఎవరని ప్రశ్నిస్తే.. 43.2శాతం మంది షారూఖ్-సుహానా పేర్లే చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో మహేష్‌భట్-ఆలియాభట్, ప్రకాశ్ పదుకొనే-దీపికాపదుకొనే, అనిల్‌కపూర్-సోనమ్‌కపూర్ ఉన్నారు. మెచ్చుకోదగిన తండ్రీకొడుకులు ఎవరంటే 33.4 శాతం మంది బాలీవుడ్ నటులు రిషీకపూర్-రణబీర్ కపూర్ పేర్లు చెప్పారు. ఆ తర్వాతి స్థానంలో అమితాబ్-అభిషేక్, షారూఖ్-ఆర్యన్ ఉన్నారు. సెలబ్రిటీ హోదా ఉన్న ప్రముఖులు తమ కుటుంబ సభ్యులతో ఎంత సమయం గడుపుతారు.. కుటుంబానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారనే అంశాల ఆధారంగా ఈ సర్వే నిర్వహించినట్టు షాదీ డాట్ కామ్ సీవోవో గౌరవ్ రక్షిత్ స్పష్టం చేశారు.