కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు! | single Indian women have conditions before tying the knot reveals a survey | Sakshi
Sakshi News home page

కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు!

Published Thu, Oct 29 2015 10:52 AM | Last Updated on Sun, Sep 3 2017 11:41 AM

కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు!

కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు!

భారతీయ యువతులు పెళ్లి చేసుకునే ముందు తమకు కాబోయే భర్తకు కొన్ని షరతులు పెడుతున్నారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవడం తమకు ఇష్టం లేదని ఎక్కువ మంది అమ్మాయిలు తేల్చిచెప్పారు. మ్యారేజ్ వెబ్సైట్ షాదీ.కామ్ అన్లైన్ పోల్ ద్వారా చేసిన సర్వేలో మరిన్ని విషయాలను వెల్లడించింది. 25 - 34 ఏళ్ల మధ్య వయసున్న మహిళల నుంచి అన్లైన్ లోనే అభిప్రాయాలను సేకరించింది. భారతీయ మహిళలు గతంలో కంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారని, తమకు ఇష్టం వచ్చిన కెరీర్ను ఎంచుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తమ సర్వే వివరాలను వెల్లడించారు.

పెళ్లికి ముందు భర్తకు కొన్ని షరతులు, నియమాలు లాంటివి పెడుతున్నారా అన్న ప్రశ్నకు 12,500 మంది స్పందించగా, 71.30 శాతం మహిళలు అవును అని సమాధానమిచ్చారు. ఈ విషయమై ఆలోచించాల్సి ఉందని 22.90 శాతం మంది, అటువంటిదేం లేదని 5.80 శాతం బదులిచ్చారట. ఎక్కువ శాతం వధువులు ఇంటిపేరు మార్పు గురించే పట్టుబడుతున్నారు. ఇంటి పేరు మార్చడానికి ఏమాత్రం ఇష్టపడనివాళ్లే ఎక్కువగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వాతంత్ర్యం తమకు ఇవ్వాలని, తమ తల్లిదండ్రులను కూడా వరుడి పేరేంట్స్  లాగానే ట్రీట్ చేయాలని మరికొంత మంది తమ షరతులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement