online survey
-
IMA study: ఆత్మరక్షణకు ఆయుధాలు
దేశంలో మూడింట ఒక వంతు వైద్యులు రాత్రి షిఫ్టుల్లో అభద్రతతో పనిచేస్తున్నారు. వీరిలో ఎక్కువ మంది మహిళలే. దాంతో కొందరైతే ఆత్మరక్షణ కోసం ఆయుధాలను తీసుకెళ్లడం తప్పదన్న భావనకు కూడా వచ్చారట. ఐఎంఏ అధ్యయనం ఈ మేరకు వెల్లడించింది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ ప్రభుత్వ వైద్య కళాశాల, ఆస్పత్రిలో ట్రైనీ మహిళా వైద్యురాలిపై అత్యాచారం, హత్య దేశమంతటా ఆందోళనకు దారితీయడం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాత్రి షిఫ్టుల్లో వైద్యుల భద్రతను అంచనా వేయడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) ఆన్లైన్ సర్వే చేపట్టింది. 3,885 వైద్యుల వ్యక్తిగత ప్రతిస్పందనలతో నిర్వహించిన ఈ సర్వే దేశంలోనే అతి పెద్ద అధ్యయనమని ఐఎంఏ పేర్కొంది. సర్వేలో పాల్గొన్న వారిలో 85 శాతం మంది 35 ఏళ్లలోపు వారు. 61 శాతం ఇంటర్న్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ ట్రైనీలున్నారు. కేరళ స్టేట్ ఐఎంఏ రీసెర్చ్ సెల్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ జయదేవన్, ఆయన బృందం రూపొందించిన ఈ సర్వే ఫలితాలను ఐఎంఏ కేరళ మెడికల్ జర్నల్ అక్టోబర్ సంచికలో ప్రచురించనున్నారు. ఈ ఆన్లైన్ సర్వేను గూగుల్ ఫామ్ ద్వారా ప్రభుత్వ, ప్రైవేట్ వైద్యులకు పంపారు. 24 గంటల్లో 3,885 స్పందనలు వచ్చాయని డాక్టర్ జయదేవన్ తెలిపారు. ‘‘వీరిలో చాలామంది దేశవ్యాప్తంగా వైద్యులు, ముఖ్యంగా మహిళలు రాత్రి షిఫ్టుల్లో అరక్షితంగా ఉన్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో ఆరోగ్య సంరక్షణ కేంద్రాల్లో భద్రతా సిబ్బంది, పరికరాలను మెరుగుపరచాల్సిన అవసరముంది’’ అని అధ్యయనం పేర్కొంది.అధ్యయన నివేదిక...కొన్ని ఎంబీబీఎస్ కోర్సుల్లో లింగ నిష్పత్తికి అనుగుణంగా మహిళలు 63 శాతం ఉన్నారు. తమకు భద్రత లేదని భావించే వారి నిష్పత్తి మహిళల్లో ఎక్కువగా ఉన్నట్టు సర్వేలో తేలింది. 20–30 ఏళ్ల వయస్సున్న వైద్యులు అతి తక్కువ భద్రతా భావాన్ని కలిగి ఉన్నారు. వీరంతా ఎక్కువగా ఇంటర్న్లు, పోస్ట్ గ్రాడ్యుయేట్లు. నైట్ షిఫ్టుల్లో 45 శాతం మందికి డ్యూటీ రూమ్ కూడా అందుబాటులో లేదు. రద్దీ, ప్రైవసీ లేకపోవడం, డ్యూటీ గదులకు తాళాలు లేకపోవడమే గాక అవి సరిపోవడం లేదు. దాంతో వైద్యులు ప్రత్యామ్నాయ విశ్రాంతి ప్రాంతాలను వెదుక్కోవాల్సి వస్తోంది. అందుబాటులో ఉన్న డ్యూటీ గదుల్లో మూడింట ఒక వంతు అటాచ్డ్ బాత్రూములు లేవు. దాంతో ఆ అవసరాలకు వైద్యులు అర్ధరాత్రి వేళల్లో బయటికి వెళ్లాల్సి వస్తోంది. సగానికి పైగా (53 శాతం) ప్రాంతాల్లో డ్యూటీ రూము వార్డు/ క్యాజు వాలిటీకి దూరంగా ఉంది. ప్రధానంగా జూ నియర్ డాక్టర్లు ఇలాంటి హింసను అనుభ విస్తున్నారు. పాలన లేదా విధాన రూప కల్పనలో వీరికి ప్రమే యం ఉండటం లేదు.వైద్యుల సూచనలు...→ శిక్షణ పొందిన భద్రతా సిబ్బంది సంఖ్యను పెంచాలి.→ సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి.→ సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ (సీపీఏ) అమలు చేయాలి.→ అలారం వ్యవస్థలను ఏర్పాటు చేయాలి.→ తాళాలతో కూడిన సురక్షిత డ్యూటీ గదుల వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలి.→ సురక్షితమైన, పరిశుభ్రమైన డ్యూటీ రూములు ఏర్పాటు చేయాలి.– ఆహారం, తాగునీరు వంటి మౌలిక సదుపాయాల్లో మెరుగుదల అవసరం.→ ఆస్పత్రుల్లో తగినంత వైద్య సిబ్బందిని నియమించాలి.→ వార్డులు ఇతర ప్రాంతాల్లో రద్దీ లేకుండా ఏర్పాట్లు చేయాలి.అదనపు సూచనలుమద్యం సేవించిన లేదా మాదకద్రవ్యాల మత్తులో ఉన్న వ్యక్తుల నుంచి క్యాజువాలిటీలో పని చేస్తున్న వైద్యులు మౌఖిక, శారీరక బెదిరింపులను ఎదుర్కొంటున్నారు. అత్యవసర గదుల్లో మహిళా వైద్యులకు అనవసరంగా తాకడం, అనుచిత ప్రవర్తన వంటి సమస్యలు ఎదురవుతున్నాయి. పరిమిత సిబ్బంది, తక్కువ భద్రత ఉన్న చిన్న ఆసుపత్రుల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. భద్రతా సమస్యలు తలెత్తినప్పుడు నిర్వాహకుల నుంచి ఉదాసీనత వ్యక్తమవుతోందని చాలా మంది వైద్యులు తెలిపారు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
వైద్యులకు స్టైపెండ్ అందడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్‌లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10,178 మందితో ఆన్లైన్ సర్వే... ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించే సమస్యపై గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్ అందడం లేదని స్పష్టం చేశారు. 4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్‌తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్‌ను ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు... తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్ కాలేజీలు స్టైపెండ్లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు. గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఒక జూనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
భవిష్యత్తు కరెన్సీ క్రిప్టో.. డిజిటల్ ఆస్తిగా పరిగణన
న్యూఢిల్లీ: భారతీయుల్లో 37 శాతం మంది క్రిప్టో కరెన్సీలను భవిష్యత్తు కరెన్సీగా భావిస్తున్నారు. భవిష్యత్తు డిజిటల్ ఆస్తిగా 31 శాతం మంది పరిగణిస్తున్నారు. ఈ విషయాలు యూగోవ్ సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో వెల్లడైంది. వెబ్ఈ, క్రిప్టో ఎకోసిస్టమ్‌పై ప్రజల్లో అవగాహన తెలుసుకునేందుకు భారత్ సహా 15 దేశాల్లో ఈ సర్వే జరిగింది. ఈ ఏడాది ఏప్రిల్ 26 నుంచి మే 18 మధ్య దీన్ని నిర్వహించారు. మన దేశం నుంచి 1013 మంది అభిప్రాయాలు తీసుకున్నారు. అంతర్జాతీయ ఫైనాన్షియల్ ఎకోసిస్టమ్‌లో భాగం కావడంగా క్రిప్టోలను మన దేశీయులు పరిగణిస్తున్నారు. సర్వే ఫలితాలు క్రిప్టోపై విస్తృతమైన అవగాహనతో పాటు క్రిప్టో ఆధారిత భవిష్యత్తును తెలియజేస్తున్నట్టు ఈ సర్వే నివేదిక తెలిపింది. ♦ సర్వేలో పాల్గొన్న భారతీయుల్లో 92 శాతం మంది క్రిప్టో పట్ల అవగాహన ఉన్నట్టు చెప్పారు. ♦ 37 శాతం మంది భవిష్యత్తు డబ్బుగా క్రిప్టోని పేర్కొంటే, భవిష్యత్తు డిజిటల్ ఆస్తులుగా 31 శాతం మంది తెలిపారు. ♦ మరీ ముఖ్యంగా 17 శాతం మంది క్రిప్టోని స్పెక్యులేటివ్ సాధనంగా చెప్పగా, ఏకంగా 20 శాతం మంది అయితే స్కామ్‌లుగా చెప్పడం గమనార్హం. ♦ ఇక సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది ఇప్పటికే క్రిప్టో కరెన్సీని కలిగి ఉన్నారు. ♦ వచ్చే 12 నెలల్లో క్రిప్టోల్లో పెట్టుబడులు పెడతామని 57 శాతం మంది తెలిపారు. ♦ క్రిప్టోలను పర్యావరణ అనుకూల టెక్నాలజీగా 57% మంది పేర్కొన్నారు. ♦ ఉత్తరాది, మధ్య, తూర్పు భారత్, ఈశాన్య రా ష్ట్రాల్లో అత్యధికంగా 94% మంది క్రిప్టో కరెన్సీ ల పట్ల ఆసక్తితో ఉంటే, పశ్చిమభారత్లో 92%, దక్షిణాది రాష్ట్రాల్లో 89% ఆసక్తి వ్యక్తమైంది. ♦ డేటా గోప్యత ముఖ్యమని 62% మంది చెప్పగా, ఇంటర్నెట్లో తమ గుర్తింపుపై తమకు మరింత నియంత్రణ అవసరమని 53% మంది తెలిపారు. ♦ క్రిప్టో మార్కెట్లో ఉన్న తీవ్ర ఆటుపోట్లు, స్కాముల భయం ఈ పరిశ్రమలో ప్రవేశానికి పెద్ద అడ్డంకులుగా ఈ సర్వే పేర్కొంది. అలాగే, క్రిప్టో ఎకోసిస్టమ్ సంక్లిష్టంగా ఉండడాన్ని కూడా అవరోధంగా పేర్కొంది. ♦ 53% మంది మెటావర్స్, 41% మంది వెబ్3, 42% మంది ఎన్ఎఫ్టీ గురించి అవగాహన ఉన్నట్టు ఉన్నారు. క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి సంబంధం లేదు రతన్ టాటా స్పష్టీకరణ ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూపు మాజీ చైర్మన్ రతన్ టాటా తనకు క్రిప్టో కరెన్సీలతో ఎలాంటి అనుబంధం ఏ రూపంలోనూ లేదని స్పష్టం చేశారు. క్రిప్టో కరెన్సీల్లో రతన్ టాటాకు పెట్టుబడులు ఉన్నాయంటూ వచ్చిన వార్తలను బలంగా ఖండించారు. ‘‘నెటిజన్లూ ఇలాంటి ప్రచారానికి దూరంగా ఉండండి. క్రిప్టో కరెన్సీతో నాకు ఏ రూపంలోనూ అనుబంధం లేదు. క్రిప్టో కరెన్సీతో నాకు అనుబంధం ఉందంటూ ఏదయినా ప్రకటన కానీ లేదా ఆర్టికల్‌ను కానీ చూస్తే అది వాస్తవం కాదు. కేవలం నెటిజన్లను మోసపుచ్చేందుకే’’ అంటూ రతన్ టాటా ట్వీట్ చేశారు. 2021లో పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా సైతం ఇదే విధంగా క్రిప్టో కరెన్సీలతో తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేయడం గమనార్హం. -
వాట్సాప్ యూజర్లను తెగ విసిగిస్తున్న కాల్స్, మెసేజ్‌లు!
వాట్సాప్ యూజర్లను వ్యాపార సంబంధమైన కాల్స్, మెసేజ్‌లు తెగ విసిగిస్తున్నాయట. వాట్సాప్ బిజినెస్ ఖాతాలతో చేసిన సంభాషణలు, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కార్యాచరణ ఆధారంగా విసిగించే కాల్స్ లేదా ఎస్ఎంఎస్ ఎక్కువైనట్లు 76 శాతం మంది యూజర్లు పేర్కొన్నట్లు లోకల్ సర్కిల్స్ అనే ఆన్లైన్ సర్వే సంస్థ తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి 20 మధ్య నిర్వహించిన సర్వే ప్రకారం.. 95 శాతం వాట్సాప్ వినియోగదారులకు ప్రతిరోజూ ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇబ్బందికరమైన మెసేజ్‌లు వస్తున్నాయి. వీరిలో 41 శాతం మందికి రోజూ నాలుగు లేదా అంతకంటే ఎక్కువ ఇలాంటి మెసేజ్‌లు వస్తున్నాయి. వాట్సాప్ బిజినెస్ యూజర్లతో సంభాషణ, ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో కార్యాచరణ ఆధారంగానే వాట్సాప్‌లో ఇలాంటి విసిగించే మెసేజ్‌లు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు 12,215 మంది అదే కారణమని బదులిచ్చారు. దేశంలోని 351 జిల్లాల్లో 51 వేల మంది యూజర్లను ఈ సంస్థ సర్వే చేసింది. ఇటువంటి మెసేజ్‌లకు అడ్డుకట్ట వేయడానికి బ్లాకింగ్, ఆర్కైవింగ్ వంటి అందుబాటులో ఉన్న సాధనాలను ఉపయోగిస్తున్నా వాటి అవి ఆగడం లేదు. వాటిని పంపేవారు కూడా నంబర్లు మారుస్తుండటంతోనే ఇలా జరుగుతోందని తెలుస్తోంది. ఇలాంటి అయాచిత వాణిజ్య సందేశాలు రాకుండా మెరుగైన బ్లాకింగ్ ఆప్షన్ కోసం చూస్తున్నట్లు సర్వేలో పాల్గొన్నవారిలో 73 శాతం మంది పేర్కొన్నారు. వాట్సాప్ యాజమాన్య సంస్థ మెటా ప్రతినిధి దీనిపై స్పందిస్తూ.. రోజుకు నిర్దిష్ట సంఖ్యలో మాత్రమే మెసేజ్‌లు పంపించడానికి తాము వ్యాపార సంస్థలకు అనుమతిస్తామని, యూజర్లు ఇటువంటి మెసేజ్‌లు స్వీకరించడం లేదా మానేయడానికి చాట్‌లోనే సులభమైన ఆప్షన్‌ను జోడించినట్లు పేర్కొన్నారు. (ఇదీ చదవండి: Nandan Nilekani: ఎఎ నెట్‌వర్క్‌తో కోట్ల కొద్దీ ఉద్యోగాలకు ఊతం) -
టీకా వద్దనేవారు తగ్గిపోతున్నారు!
న్యూఢిల్లీ: భారత జనాభాలో కోవిడ్ టీకాలపై అపనమ్మకం వేగంగా తగ్గుతోందని ఆన్లైన్ సర్వే సంస్థ లోకల్ సర్కిల్స్ తెలిపింది. దేశ జనాభాలో టీకాలపై సందేహాలున్న వారి సంఖ్య కేవలం 7 శాతానికి చేరిందని, టీకాలివ్వడం ఆరంభమయ్యాక ఇదే కనిష్ఠ స్థాయని సర్వే తెలిపింది. 301 జిల్లాల్లో 12,810 మందిని వ్యాక్సినేషన్‌పై ప్రశ్నించారు. వీరిలో 67 శాతం మగవారు కాగా 33 శాతం మంది మహిళలు. వీరిలో ఇప్పటివరకు టీకా తీసుకోనివారిని ప్రశ్నించగా 46 శాతం మంది కనీసం తొలిడోసైనా త్వరలో తీసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పారు. కేవలం 27 శాతం మంది మాత్రం ఇంకా టీకాపై నమ్మకం కుదరడం లేదని, మరింత డేటా వచ్చాక టీకా తీసుకుంటామని చెప్పినట్లు సంస్థ అధిపతి సచిన్ తపారియా తెలిపారు. భారత్‌లో వయోజనుల జనాభా దాదాపు 94 కోట్లు కాగా వీరిలో 68 కోట్ల మంది కనీసం ఒక్కడోసైనా టీకా తీసుకున్నవారున్నారు. సర్వే ఫలితాలను దేశజనాభాతో పోల్చిచూస్తే 7 శాతం మంది అంటే సుమారు 26 కోట్లమంది ఇంకా ఒక్కడోసు కూడా తీసుకోలేదు. వీరిలో కొంతమంది త్వరలో టీకా తీసుకోవాలని భావిస్తున్నారు. ఇండియాలో వ్యాక్సినేషన్ ఆరంభమైనప్పుడు దేశ జనాభా(వయోజన)లో దాదాపు 60 శాతం మంది టీకాలకు దూరంగా ఉన్నారు. ముఖ్యంగా సెకండ్‌వేవ్ అనంతరం టీకాలు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీనికితోడు ప్రభుత్వం ఉచితంగా టీకాల పంపిణీ ఆరంభించడం కూడా ప్రజల్లో వ్యాక్సినేషన్‌కు ప్రాచుర్యం లభించేందుకు కారణమైంది. ఎందుకు వద్దంటే... టీకాలను వద్దనే సందేహరాయుళ్లు తమ వ్యతిరేకతకు పలు కారణాలు చెబుతున్నారు. కొత్తవేరియంట్ల నుంచి టీకా కల్పించే రక్షణపై సందేహాలను వెలుబుచ్చుతున్నారు. వీరి అనుమానాల్లో కొన్ని... ► సరైన పరీక్షలు పూర్తికాకముందే హడావుడిగా టీకాలకు అనుమతులిచ్చారు, కాబట్టి వాటితో లభించే రక్షణపై సందేహాలున్నాయి. ► టీకాలతో సైడ్‌ఎఫెక్టులుంటాయి, కొండనాలుక్కి మందేస్తే ఉన్న నాలుక ఊడిందన్నట్లు టీకాతో అనవసర సమస్యలు వస్తాయి. ► కొత్తగా వచ్చే వేరియంట్లను ప్రస్తుత టీకాలు ఎలాగూ రక్షించలేవు. అందువల్ల మరింత శక్తివంతమైన వ్యాక్సిన్లు వచ్చాక ఆలోచిద్దాం. ► మాకు బ్లడ్ క్లాటింగ్ సమస్యలున్నాయి అందుకే టీకాకు దూరంగా ఉంటున్నాము. ► మానవ పయ్రత్నం ఏమీ లేకుండా ఎలా వచ్చిందో అలాగే కోవిడ్ మాయం అవుతుంది, దానికోసం టీకాలు అవసరం లేదు. టీకాలపై మారుమూల ప్రాంతాల్లో వ్యాపించిన మూఢనమ్మకాలు, అభూత కల్పనలు కొందరిని టీకాకు దూరంగా ఉంచుతున్నాయి. వ్యాక్సినేషన్ తొలినాళ్లతో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి చాలావరకు మారింది. జనాభాలో వీలైనంత ఎక్కువమందికి టీకాలు అందితే హెర్డ్ ఇమ్యూనిటీ వస్తుందని సైంటిస్టులు చెబుతున్నారు. -
జీవితకాల పొదుపు మొత్తం కరోనా పట్టుకుపోయింది!
కరోనా రాక ముందు.. వచ్చిన తర్వాత.. ఇంటి బడ్జెట్, వ్యక్తిగత ఆర్థిక ప్రణాళికల విషయంలో ఎక్కువ మంది అంగీకరించే మాట ఇది. పొదుపు, పెట్టుబడులు, వ్యయాల (ఇంటి బడ్జెట్) విషయంలో లోపాలను ఈ మహమ్మారి గుర్తు చేయడమే కాదు, వ్యక్తుల నడవడికను మార్చుకోవాల్సిన అవసరాన్ని సైతం తెలియజేసింది. ఆర్థిక విషయాల్లో వ్యక్తుల ఆలోచనా ధోరణిని మార్చడమే కాకుండా, భవిష్యత్తుకు సంబంధించి ఎన్నో ఆర్థిక పాఠాలను నేర్పింది. ఒక ప్రముఖ సంస్థ ఇదే అంశంపై ఆన్లైన్లో ఒక సర్వే నిర్వహించింది. కరోనా కారణంగా ఎదురైన భిన్న అనుభవాలు, కష్ట సుఖాలు ఈ సర్వేలో పాలుపంచుకున్న 408 మంది వెల్లడించారు. ఆ వివరాలు ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’లో.. ఒకవైపు ఉద్యోగాల్లోంచి తొలగింపులు, వేతన కోతల కాలం.. మరోవైపు కుటుంబ సభ్యుల్లో ఎవరైనా కరోనా కారణంగా ఆస్పత్రిలో చేరాల్సిన పరిస్థితి ఏర్పడితే వారికి మెరుగైన వైద్యం కోసం ఖర్చు పెట్టడం ఇవన్నీ పెద్ద సవాళ్లే. ఈ సర్వేలో పాల్గొన్న ప్రతీ ఇద్దరిలో ఒకరు ఉద్యోగం కోల్పోయినట్టు లేదా వేతన కట్‌ను ఎదుర్కొన్నట్టు చెప్పడం గమనార్హం. స్వయం ఉపాధిలో ఉన్న వారు సైతం 71 మందిలో 37 మంది ఇదే విధంగా చెప్పారు. గడిచిన ఏడాది కాలంలో పావు వంతు మంది (సర్వేలో పాల్గొన్న వారిలో)తమ కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణ లేదా ఆస్పత్రిలో వైద్యం కోసం ఖర్చు చేయాల్సి వచ్చింది. కొంత మందిపై ఆర్థిక భారం గణనీయంగా పడింది. చెన్నైకు చెందిన మృదుల (సర్వేలో పాల్గొన్న వ్యక్తి) పరిస్థితినే చూస్తే.. ఆమె స్వయం ఉపాధిలో ఉన్న మధ్య వయసు మహిళ. గతేడాది లాక్‌డౌన్‌తో ఆమె ఆదాయానికి బ్రేక్ పడింది. అదే సమయంలో మృదుల తల్లి (78) కరోనా వైరస్ బారిన పడ్డారు. 65 రోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స అనంతరం ఆమె డిశ్చార్జ్ అయ్యారు. కానీ, చికిత్స కోసం రూ.34 లక్షలు వెచ్చించాల్సి వచ్చింది. ‘‘ఆరంభంలో రోజుకు రూ.40,000 బిల్లు వచ్చింది. వెంటిలేటర్ అవసరం ఏర్పడడంతో బిల్లు రూ.లక్షకు వెళ్లిపోయింది. వెంటిలేటర్ అవసరం తొలగిపోయిన తర్వాత అమ్మను ఇంటికి తీసుకొచ్చేశాము. ఎందుకంటే ఇక అంతకుమించి ఆస్పత్రి బిల్లు కట్టే పరిస్థితి లేదు’’ అని మృదుల తెలిపారు. మృదుల మాతృమూర్తి ఇప్పటికీ ఇంటి నుంచే చికిత్స తీసుకోవాల్సిన పరిస్థితుల్లో ఉన్నారు. ఆక్సిజన్ ఇతర ఔషధాలు, పరీక్షల కోసం నెలవారీగా రూ.1–1.5 లక్షలు ఖర్చువుతోంది. ఇతర చిక్కులు/పరిమితులు..? ఆస్పత్రిలో చేరితే ఎదురయ్యే వైద్య ఖర్చుల భారం ఏ మేరకు ఉంటుందో ముందుగానే అంచనా వేయలేము. హెల్త్ ఇన్సూరెన్స్ ఉందన్న భరోసాతో ధైర్యంగా ఉండలేని పరిస్థితులను కరోనా పరిచయం చేసింది. కరోనా బారిన పడిన వారికి నగదు రహిత వైద్య చికిత్సలు అందించేందుకు మొదట్లో చాలా ఆస్పత్రులు ముందుకు రాలేదు. ఆ తర్వాత కూడా కొన్ని ఆస్పత్రుల వైఖరి అలాగే ఉంది. క్లెయిమ్‌లలో జాప్యం, అత్యవసరాలను గట్టెక్కేందుకు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడంలో ఎన్నో ఇబ్బందులు పడ్డవారు కూడా ఉన్నారు. వినోదిని ఐటీ ఉద్యోగి. బెంగళూరులో పనిచేస్తున్నారు. ఆమెకు కంపెనీ తరఫున కార్పొరేట్ హెల్త్ కవరేజీ ఉంది. కరోనా పాజిటివ్‌గా తేలి ఇంట్లోనే క్వారంటైన్ అయ్యారు. ఫోన్లో డాక్టర్‌ను సంప్రదించారు. తెలిసిన వారి సాయంతో ఔషధాలు తెప్పించుకున్నారు. ‘‘మెడికల్ రీయింబర్స్మెంట్ కోసం వైద్యుల ప్రిస్క్రిప్షన్, బిల్లు, టెస్ట్‌ల రిపోర్ట్లు సమర్పించాల్సి రావడం అన్నది అసహనానికి గురి చేస్తుంది. ఎందుకంటే ఎవరైనా అనారోగ్యం పాలైనప్పుడు ఇటువంటి వాటి గురించి ఆలోచించలేరు. దీంతో కొన్ని వేల రూపాయలకు క్లెయిమ్‌ను నేను పొందలేకపోయాను’’ అని వినోదిని తెలిపారు. దీనికి బదులు టెస్టింగ్ రిపోర్ట్/స్కాన్ రిపోర్ట్ సమర్పించిన వెంటనే ఆటోమేటిక్‌గా నిర్ణీత మొత్తాన్ని రీయింబర్స్మెంట్ కింద అందించే విధంగా నిబంధనలను సడలించాలన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పైగా సీరియస్ పరిస్థితుల్లో రోగిని కుటుంబ సభ్యులు సమీపంలోని ఆస్పత్రికి తీసుకెళ్లడం సర్వసాధారణం. ఇలాంటి పరిస్థితులతోనూ చాలా మంది నగదు రహిత క్లెయిమ్ అవకాశాన్ని కోల్పోయారు. నెట్వర్క్ ఆస్పత్రుల్లోనే నగదు రహిత చికిత్సలకు అవకాశం ఉంటుందని తెలిసిందే. రీయింబర్స్మెంట్ చేసుకోవచ్చు.. కానీ, అదేమంత సులభమైన ప్రక్రియ కాదు. ఎమర్జెన్సీ సర్టిఫికెట్, డిశ్చార్జ్ సమ్మరీ, డిటెయిల్డ్ బిల్లు, అన్ని టెస్ట్ రిపోర్టులు, వైద్యుల ప్రిస్కిప్షన్ ఇలా అన్ని డాక్యుమెంట్లు, వాటిపై ఆస్పత్రుల సీల్, సంతకాలతో సేకరించి బీమా సంస్థకు దరఖాస్తు చేసుకోవాలి. వీటిల్లో కొన్ని లేకపోయినా మళ్లీ ఆస్పత్రి చుట్టూ తిరిగి వాటిని తీసుకుని సమర్పించాలి. ఇదంతా సమయం, శ్రమతో కూడుకున్న పనే. వైద్య బీమా కవరేజీ గణణీయంగానే ఉన్నప్పటికీ.. కొన్నింటికి ఉప పరిమితులు ఉంటాయి. దీంతో వాస్తవ బిల్లుతో పోలిస్తే తమకు అందిన మొత్తం తక్కువేనని సర్వేలో పాల్గొన్నవారిలో కొందరు చెప్పారు. మృదుల తల్లిదండ్రులు కాంట్రిబ్యూటరీ హెల్త్సర్వీస్ స్కీమ్‌లో ఉన్నారు. ఇది కేంద్ర ప్రభుత్వ బీమా పథకం. అయితే, మృదుల తల్లి నాన్ నెట్వర్క్ ఆస్పత్రిలో చేరడంతో.. వాస్తవంగా రూ.34 లక్షల బిల్లు వచ్చినప్పటికీ.. రీయింబర్స్మెంట్ రూపంలో కేవలం రూ.11లక్షలే అందుకున్నారు. ఇక పెట్టుబడుల విక్రయంలోనూ సమస్యలు ఎదుర్కొన్న వారూ ఉన్నారు. భాస్కర్ కుటుంబంలో ఒకరు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో ఈపీఎఫ్ నిధి నుంచి విత్‌డ్రాయల్‌కు దరఖాస్తు చేసుకోగా.. అందుకు 15 రోజులు పట్టింది. ఈపీఎఫ్ ఆన్లైన్లో క్లెయిమ్ సదుపాయం ఉన్నప్పటికీ.. యూఏఎన్ యాక్టివేట్ చేసుకోకపోవడం, ఆధార్ లింక్ చేసుకోకపోవడం అప్డేట్ చేసుకోకపోవడం ఇలా వివిధ కారణాలతో ఈపీఎఫ్ క్లెయిమ్ చెల్లింపులు ఆలస్యంగా అందుకున్న వారు చాలా మందే ఉన్నారు. గిరిధర్ పరిస్థితి మరింత భిన్నమైనది. ఆయనకు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గతేడాది మూసేసిన ఆరు డెట్ పథకాల్లో పెట్టుబడులు ఉన్నాయి. ఆస్పత్రిలో చేరాల్సిన అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పటికీ, ఆ పెట్టుబడులను సొమ్ము చేసుకోలేని అనుభవాన్ని చవిచూశారు. పొదుపు పట్ల మారుతున్న ధోరణి! కరోనా ‘పొదుపు’ పట్ల వ్యక్తుల ఆలోచన తీరునే మార్చేసింది. కొందరు జీవితకాలం పొదుపు చేసిన మొత్తాన్ని కరోనా మహమ్మారి పట్టుకుపోయిందని లబోదిబోమంటున్నారు. పొదుపు పట్ల తమ ఆలోచన మారిందని 65 శాతం మంది సర్వేలో చెప్పారు. కరోనాకు ముందుతో పోలిస్తే తాము మరింత మొత్తాన్ని పొదుపు చేస్తామని 30 శాతం మంది తెలిపారు. జీవిత, వైద్య బీమా కవరేజీని పెంచుకోవడంతోపాటు.. భవిష్యత్తు ఖర్చుల కోసం మరింతగా పెట్టుబడులు పెడతామని కొందరు చెప్పారు. ముఖ్యంగా అత్యవసర నిధి అవసరాన్ని చాలా మంది గుర్తించారు. కొందరు అయితే ఆరు నెలల అవసరాలకు కాకుండా.. కనీసం ఏడాది నుంచి రెండేళ్ల అవసరాలకు సరిపడా అత్యవసర నిధి అయితేనే సముచితమన్న అభిప్రాయానికి వచ్చారు. రిస్క్ తీసుకోని వారు బ్యాంకు ఖాతాల్లో ఈ నిధిని ఉంచేస్తామని.. లేదా ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో, స్వీప్ ఇన్ బ్యాంకు ఖాతా రూపంలో ఉంచుకుంటామని చెప్పారు. వయసులో చిన్న వారు అయితే రిస్క్ తీసుకుని అత్యవసర నిధిని స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ రూపంలో, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తామని తెలిపారు. కానీ, ఇలాంటి నిర్ణయాల విషయంలో తగినంత ముందస్తు అధ్యయనం, పర్యవేక్షణ అవసరం. కరోనా వేళ తమకు నిధుల అవసరం ఏర్పడినప్పుడు స్టాక్స్‌లో పెట్టుబడులను వెనక్కి తీసుకుందామనుకుంటే.. నష్టాలు దర్శనమిచ్చాయని సర్వేలో కొందరు చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ అవసరాన్ని స్వయం ఉపాధుల్లో ఉన్న వారు గుర్తించారు. రిటైర్మెంట్ తర్వాత రిస్క్ వద్దని చెబుతుంటారు. అయినా, పెట్టుబడుల విషయంలో రిస్క్ తీసుకున్న వారికి కరోనా కాలం తగిన అనుభవాన్నే నేర్పింది. అప్పు అసలే వద్దు.. ‘‘అస్సలు అప్పుల్లో ఉండకూడదని, ఉన్నా చాలా పరిమిత రుణ భారానికే కట్టుబడాలని కొందరి అనుభవం చెబుతోంది. ‘‘నేను నా పెట్టుబడులను వెనక్కి తీసుకుని రుణాన్ని ముందుగానే తీర్చేశాను. వెంటనే రుణ రహితంగా మారాల్సిన అవసరాన్ని గుర్తించాను. ఎందుకంటే ఒకవేళ నాకు ఏదైనా జరిగితే నా చిన్నారిపై అప్పులు తీర్చాల్సిన భారం పడకూడదు’’అని సర్వేలో పాల్గొన్న పలువురు పేర్కొన్నారు. ఎలా ఎదుర్కొన్నారు..? ఊహించని, అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు గట్టెక్కేందుకు అత్యవసర నిధి అంటూ ఒకటి కచ్చితంగా ప్రతీ ఇంటికి ఉండాలన్నది ఆర్థిక నిపుణుల సూచన. ఇంటి బడ్జెట్లో దీనికి పెద్ద ప్రాధాన్యతే ఉంది. కానీ, ఇప్పటికీ చాలా మంది దీన్ని ఆచరణలో పెట్టడం లేదని ఈ సర్వే ఫలితాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే కేవలం 36.5 శాతం వద్దే అత్యవసర నిధి ఉంది. పైగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో ఖర్చులను పెద్ద మొత్తంలో తగ్గించుకోవడం అన్నది అందరికీ సాధ్యపడని విషయం. అయినా, 75 శాతం మంది సాధ్యమైనంత వరకు ఖర్చులకు కోత విధించుకున్నట్టు చెప్పారు. సాధారణంగా ఆరు నెలల అవసరాలు, ఖర్చులు, పెట్టుబడులకు సరిపడా మొత్తాన్ని అత్యవసర నిధి కింద ఉంచుకోవాలన్నది ఆర్థిక సూత్రం. అయితే, కరోనా వంటి విపత్తుల్లో ఆరు నెలల అవసరాలకు సరిపడే అత్యవసర నిధి ఏ మేరకు సరిపోతుందన్న ప్రశ్న? ఇప్పుడు కొత్తగా ఉదయించింది. ఎందుకంటే చెన్నైకు చెందిన మృదుల చాలా పద్ధతిగా, ప్రణాళిక మేరకు నడుచుకునే వారే. ఆమె, ఆమె తండ్రి కలసి అత్యవసర నిధి కింద కొన్ని రూ. లక్షలు సిద్ధంగా ఉంచుకున్నవారే. కానీ, ఆమె తల్లి కరోనాతో సుదీర్ఘకాలం పాటు ఆస్పత్రిలో ఉండడం వల్ల పెద్ద ఎత్తున ఖర్చు వచ్చి పడింది. దీంతో మృదుల తన దీర్ఘకాల లక్ష్యాల కోసం చేస్తున్న డెట్ పెట్టుబడులను ఉపసంహరించుకుని ఆస్పత్రికి చెల్లించారు. ఆమె ఒక్కరే కాదు.. ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 20 శాతం మంది తమ అత్యవసర వ్యయాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, బాండ్లు, పోస్టాఫీసు పొదుపులు, స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌ను విక్రయించారు. ‘‘ఆస్పత్రి నుంచి ఇంత చెల్లించాలంటూ డిమాండ్ రావచ్చని ముందే ఊహించా ను. దాంతో కొన్ని రోజుల ముందే పెట్టుబడులను విక్రయించడం వల్ల అవి నా బ్యాంకు ఖాతాలో జమ అయ్యాయి. దాంతో చెల్లింపులు చేయగలిగాను’’ అని మృదుల వివరించారు. విజయ్‌ది భిన్నమైన అనుభవం. విశాఖపట్నంకు చెందిన ఆయన కాస్ట్ అకౌంటెంట్‌గా సేవలు అందిస్తున్నారు. అత్యవసర నిధి అంటూ ఆయనకు ఏదీ లేదు. దీంతో అత్యవసరాల్లో క్రెడిట్ కార్డును ఉపయోగించి చెల్లింపులు చేశారు. ‘‘మా నాన్న గారు ఆస్పత్రిలో చేరాల్సి రావడంతో రూ.2.5 లక్షలు చెల్లించాల్సి వచ్చింది. స్టాక్స్‌లో నాకు పెట్టుబడులు ఉన్నాయి. కానీ నాన్న శుక్రవారం సాయంత్రం ఆస్పత్రిలో చేరారు. దీంతో సోమవారం కానీ స్టాక్స్‌ను విక్రయించలేను. విక్రయించిన మేర సొమ్ము నా బ్యాంకు ఖాతాకు రావడానికి బుధవారం వరకు వేచి ఉండాల్సిందే. దీంతో క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించడం ఒక్కటే నాకు సౌకర్యవంతమైన మార్గంగా అనిపించింది. కార్డు ద్వారా చెల్లించి ఆ తర్వాత నిధులు సర్దుబాటు చేసుకుందామని నిర్ణయానికొచ్చేశాను’’ అని విజయ్ తెలిపారు. కష్టకాలంలో ఇలా క్రెడిట్ కార్డులను వినియోగించిన వారు చాలా మందే ఉన్నారు. కానీ, క్రెడిట్ కార్డుపై లిమిట్‌ను వాడుకోవచ్చు కానీ.. గడువులోపు ఇతర మార్గాల్లో నిధులను సర్దుబాటు చేసుకుని తీర్చేయడం వల్లే ఉపయోగం ఉంటుంది. లేదంటే క్రెడిట్ కార్డు బకాయిలపై 3–4 రూపాయిల వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుందని తెలిసిందే. ఇది మధ్యతరగతి ఇంటి బడ్జెట్‌ను మరింతగా తారుమారు చేసేయగలదు. కరోనా వల్ల ఎదురైన ఆర్థిక భారాన్ని ఎలా అధిగమించారు? వినియోగ సాధనం ఎంతమంది(%) అత్యవసర నిధి వినియోగం 36.5 క్రెడిట్ కార్డులతో చెల్లింపులు 18.6 అనధికారిక, వ్యక్తిగత, బంగారు, ఇతర రుణాలు 11.5 స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ విక్రయం 19.6 ఎఫ్డీలు, బాండ్ల ఉపసంహరణ 13.5 పోస్టాఫీసు పథకాల నుంచి ఉపసంహరణ 3.4 బీమా పాలసీల సరెండర్ 4.7 హెల్త్ ఇన్సూరెన్స్ కవర్ 6.1 ఖర్చులను తగ్గించేసుకున్నవారు 75.5 ఆరోగ్యం లేకుంటే డబ్బున్నా.. సున్నానే! ‘‘మీకు ఈ రోజు డబ్బులు ఉండొచ్చు. అయినా ఆరోగ్యాన్ని, ఆక్సిజన్‌ను కొనుక్కోలేని పరిస్థితి. భవిష్యత్తులో డబ్బు అన్నది ఏ మాత్రం హోదా కాబోదు. మంచి ఆరోగ్యం, చక్కని ఆహారంతోపాటు.. ఎన్ని చెట్లను నాటారు అన్నదే ముఖ్యమవుతుంది’’ సర్వేలో ఒక అభ్యర్థి చెప్పిన మాట ఇది. -
ఆన్లైన్ క్లాసులు.. ఓ కంట కనిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: కరోనా అందరి జీవితాలను మార్చేసింది. ముఖ్యంగా టీనేజీ, యువతలో మానసికంగా మునుపెన్నడూ చూడనంత మార్పు వచ్చింది. కరోనా పుణ్యమాని విద్యాసంస్థలేవీ ఇపుడు మునుపటిలా పనిచేసే అవకాశాల్లేవు. దీంతో వారంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఇకపై పాఠాలు, తరగతులన్నీ ఆన్లైన్లోనే. అయితే, చాలామంది టీనేజీ పిల్లలకు, యువ విద్యార్థులకు ఆన్లైన్లో ఉన్న ఆపదలు, మోసాలు, అపాయాలపై అవగాహన లేదు. అలాగే, విద్యార్థులు ఆన్లైన్లో ఎలా ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలాంటి ఆపదలు ఉంటాయన్న విషయంపై వారికీ తగినంత పరిజ్ఞానం లేదు. దీంతో విద్యార్థులు– తల్లిదండ్రుల మధ్య కొంత దూరం తలెత్తుతోంది. అందుకే, ఈ దూరాన్ని తగ్గించి విద్యార్థులు– తల్లిదండ్రులకు సురక్షిత ఆన్లైన్ సేవల వినియోగమే లక్ష్యంగా మహిళా భద్రతా విభాగం వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమ ప్రచారం పోస్టర్లను మహిళా భద్రతా విభాగం అదనపు డైరెక్టర్ జనరల్ (ఏడీజీ) స్వాతి లక్రా, డీఐజీ సుమతి ఆవిష్కరించారు. ఆన్లైన్ సర్వేకు శ్రీకారం! విద్యార్థులు తల్లిదండ్రులకు ఆన్లైన్ ఆపదలపై ఎంత పరిజ్ఞానం ఉందన్న అంశంపై ఆన్లైన్లోనే ఓ సర్వే చేపట్టింది. ఇందులో టీనేజీ, తల్లిదండ్రులకు వేర్వేరుగా ప్రశ్నావళి రూపొందించింది. ఉదాహరణకు మీకు రాన్సమ్ వేర్ అంటే తెలుసా? మీ మెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు హాక్ అయితే ఏం చేస్తారు? సైబర్ వేధింపులకు దిగితే ఎలా స్పందిస్తారు? తదితరాలు విద్యార్థులకు ఇచ్చారు. ఇక మీ పిల్లలు ఆన్లైన్లో ఏం చేస్తున్నారు? ఏయే కంటెంట్ చూస్తున్నారు? ఏం గేములు ఆడుతున్నారు? వేటి వల్ల ఎంత ముప్పు? వాటిని అధిగమించేందుకు వారిచ్చే సలహాలు తీసుకుంటున్నారు. ప్రశ్నావళిలో సమాధానాలు ఇవ్వలేకపోయిన అంశాలపై దృష్టి కేంద్రీకరించి వాటిపై భవిష్యత్తులో మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. మన రాష్ట్రంలో ఇంటర్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఆపైన 15 లక్షలకుపైగా విద్యార్థినులు ఉంటారు. ఈ సర్వే ప్రారంభించిన 24 గంటల్లోనే సుమారు 3000 మంది పాల్గొనడం విశేషం. ప్రతీరోజూ దాదాపు ఐదువేల మంది విద్యార్థులు, తల్లిదండ్రులు సర్వేలో భాగస్వామ్యం అయ్యేలా ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని సంకల్పించారు. రంగంలోకి విద్యా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆన్లైన్ సర్వే కార్యక్రమం ఇంటర్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో పాటుగా వారి తల్లిదండ్రులను కలుపుకుంటే దాదాపు 30 లక్షలమందిని లక్ష్యంగా చేసుకుని రూపొందించారు. వీరందరూ తమ అభిప్రాయాలను తెలిపితే రాష్ట్రంలోని విద్యార్థులు– తల్లిదండ్రులు ఆన్లైన్లో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారో ఒక స్పష్టత వస్తుంది. అందుకే, ఈ కార్యక్రమంలో విద్యా, స్త్రీ శిశు సంక్షేమశాఖల సాయం కోరారు. ఇప్పటికే రాష్ట్రంలో జిల్లా విద్యాధికారులు (డీఈఓ)లకు ఈ సర్వే లింక్ చేరింది. వారి ద్వారా ప్రభుత్వ పాఠశాలల ప్రిన్సిపాళ్లు, టీచర్లు, విద్యార్థులు, తల్లిదండ్రులకు చేరనుంది. అలాగే త్వరలోనే ప్రైవేటు పాఠశాలలు, ఇంటర్, డిగ్రీ, వర్సిటీలూ ఈ ఆన్లైన్ అవగాహన సర్వేలో పాల్గొనేలా చర్యలు చేపట్టనున్నారు. పోస్టర్లను విడుదల చేస్తున్న ఏడీజీ స్వాతి లక్రా, డీఐజీ సుమతి -
లాక్‌డౌన్‌తో ఉద్యోగాలకు ముప్పు
న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో దేశ ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటితో భారీగా ఆదాయాలు, డిమాండ్ పడిపోవడంతో పాటు గణనీయంగా ఉద్యోగాల కోతలు కూడా ఉంటాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల సంస్థలకు చెందిన సుమారు 200 మంది సీఈవోలు ఇందులో పాల్గొన్నారు. ‘గత త్రైమాసికంతో (జనవరి–మార్చి) పోలిస్తే ప్రస్తుత క్వార్టర్లో (ఏప్రిల్–జూన్) ఆదాయాలు 10 శాతం, లాభాలు 5 శాతం పైగా తగ్గిపోతాయని మెజారిటీ సంస్థలు భావిస్తున్నాయి. జీడీపీ వృద్ధిపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపబోతోందన్నది ఇది తెలియజేస్తోంది. సర్వేలో పాల్గొన్న 52 శాతం సంస్థలు.. తమ తమ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నాయి’ అని సీఐఐ వెల్లడించింది. -
హై రిస్క్ మహా నగరాలకే..!
సాక్షి, సిటీబ్యూరో: మహానగరాలకే కోవిడ్–19 ముప్పు అత్యధికంగా ఉందని ఆయా నగరాల ప్రజలు భావిస్తున్నట్లు తాజా అధ్యయనంలో తేలింది. మెట్రో నగరాల్లో నివసిస్తున్న వారికే కోవిడ్–19పై అవగాహన అత్యధికంగా ఉందని ఈ అధ్యయనం వెల్లడించింది. ఐఐటీ హైదరాబాద్, ఐఐటీ బాంబేలు సంయుక్తంగా నిర్వహించిన ఆన్లైన్ సర్వే ఈ అంశాలను తెలిపింది. సుమారు 1900 మంది నెటిజన్ల అభిప్రాయాలను స్వీకరించారు. ఆన్‌లైన్‌లోనేప్రశ్నావళి రూపొందించి ..వారి ప్రయాణం, విజిట్ తదితర అంశాలపై వారి అభిప్రాయాలను సేకరించారు. లాక్‌డౌన్‌కు ముందు, లాక్డౌన్ విధించిన తర్వాత పరిస్థితిపై వారి అభిప్రాయాలను సేకరించారు. అయితే తాము రూపొందించిన ప్రశ్నావళికి టైర్–1 నగరాలైన ఢిల్లీ, కోల్‌కతా, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే మెట్రో సిటీల నుంచి సుమారు 63.6 శాతం మంది స్పందించినట్లు అధ్యయనం పేర్కొంది. ఇక టైర్–2 నగరాలు అంటే విజయవాడ, విశాఖపట్నం సహా దేశంలోని ఇతర నగరాల నుంచి కేవలం 20.6 శాతం మంది స్పందించినట్లు తెలిపింది. ఇక టైర్–3 నగరాలు అంటే దేశంలోని పలు జిల్లాల హెడ్‌క్వార్టర్స్ నుంచి కేవలం 15.8 శాతం మంది ప్రతిస్పందించినట్లు పేర్కొంది. కోవిడ్–19 నేపథ్యంలో సోషల్ డిస్టెన్స్ పాటించడం, ప్రజారవాణాను వినియోగించకుండా వ్యక్తిగత వాహనాల్లో ప్రయాణించేందుకు మహానగరాల సిటీజన్లు ప్రాధాన్యతనిస్తున్నట్లు తమ అధ్యయనం ద్వారా తేటతెల్లమైందని తెలిపింది. ఇక కోవిడ్ కలకలం..లాక్డౌన్ ప్రకటించిన అనంతరం మెట్రో నగరాల(టైర్–1) సిటీజన్లలో 12 శాతం మంది బయటకు వెళ్లేందుకు తమ వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించినట్లు తెలిసింది. ఇక టైర్–2 నగరాల్లో వ్యక్తిగత వాహనాలను ఆశ్రయించిన వారు 9 శాతం మంది ఉన్నట్లు వెల్లడించింది. ఇక టైర్–3 నగరాల్లో ఈ శాతం 7 శాతానికే పరిమితమైందని తెలిపింది. ఇక మొత్తంగా అన్ని నగరాల్లో కలిపి 48 శాతం మంది లాక్ డౌన్ ప్రకటించిన మార్చి 3వ వారంలో ఇళ్లకే పరిమితమయ్యామని..అత్యవసరమైతే మినహా బయటకు వెళ్లలేదని తెలిపారు. మరో 28 శాతం మంది తమ పనుల నిమిత్తం బయటకు వెళ్లినట్లు తెలిపారట. మరో 18 శాతం మంది తమ స్వదేశీ,విదేశీ విమాన ప్రయాణాలను రద్దు చేసుకున్నట్లు తెలిపారని ఈ అధ్యయనం వెల్లడించింది. కాగా ఈ అధ్యయనాన్ని ఐఐటీ హైదరాబాద్ సివిల్ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్లు దిగ్విజయ్ ఎస్.పవార్, ప్రతిమా ఛటర్జీ, ముంబయి ఐఐటీ సివిల్ ఇంజినీరింగ్ విభాగం నుంచి ప్రొఫెసర్లు నాగేంద్ర వెలగ, అంకిత్ కుమార్ యాదవ్‌లు కలిసి నిర్వహించినట్లు తెలిపారు. -
రికవరీకి ఏడాది పడుతుంది..
హైదరాబాద్: కరోనా వైరస్ మహమ్మారి ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోంది. ఇది ఎప్పటికి వదులుతుందో తెలియక అందరిలోనూ భయాందోళనలు పెరిగిపోతున్నాయి. ఒకవేళ కోవిడ్ 19 అదుపులోకి వచ్చినా.. దీని ప్రతికూల ప్రభావాల నుంచి బైటపడేందుకు కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పట్టేస్తుందని దేశీయంగా ప్రజలు భావిస్తున్నారు. అంతే కాదు.. అత్యంత భయంకరమైన వ్యాధుల జాబితాలో క్యాన్సర్, ఎయిడ్స్‌ను కూడా దాటేసి కోవిడ్ 19 టాప్ ప్లేస్‌లో ఉంది. మార్కెట్ రీసెర్చ్, అనాలిసిస్ సంస్థ వెలాసిటీ ఎంఆర్ నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 19–20 మధ్య హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై తదితర ప్రధాన నగరాల్లో ఈ ఆన్లైన్ సర్వే నిర్వహించారు. ఇందులో 2,100 మంది పాల్గొనారు. చేతులు కడుక్కుంటున్నారు.. ఈ సర్వేలో ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. వృద్ధులు, అనారోగ్యంగా ఉన్న వారు ఎక్కువగా కరోనా వైరస్ బారిన పడే అవకాశం ఉందని 70 శాతం మందిలో అవగాహన ఉన్నట్లు వెల్లడైంది. సక్రమంగా పరిశుభ్రత పాటించి, తగు జాగ్రత్తలు తీసుకుంటే దీని వ్యాప్తిని అరికట్టవచ్చని 63 శాతం మంది అభిప్రాయపడ్డారు. 81 శాతం మంది గతంలో కన్నా మరింత తరచుగా చేతులు కడుక్కుంటున్నారు. 78 శాతం మంది జనసమ్మర్ధం ఉండే ప్రదేశాలకు వెళ్లడం తగ్గించుకున్నారు. భవిష్యత్‌లోనూ విదేశాలకు ప్రయాణించేటప్పుడు ఇదే తీరు పాటించాలని భావిస్తుండటంతో .. జీవనవిధానపరమైన ఈ మార్పులు ఇకపైనా కొనసాగే అవకాశాలే కనిపిస్తున్నాయని వెలాసిటీ ఎంఆర్ ఎండీ, సీఈవో జసల్ షా తెలిపారు. బైటతిరగడం మానుకోలేకపోతున్నారు.. లాక్డౌన్, ఆంక్షలు అమలవుతున్నప్పటికీ చాలా మంది.. ఎంత వద్దనుకున్నా తమ రోజువారీ అలవాట్లను మానుకోలేకపోతున్నారు. రద్దీ లేని వేళల్లోనే నిత్యావసరాల కొనుగోళ్లు జరపడం, ప్రజా రవాణా వ్యవస్థ పనిచేస్తున్న ప్రాంతాల్లో దాన్ని ఉపయోగించడం మానుకోలేకపోవడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక, ఉద్యోగ సంబంధ ప్రయాణాలు చేయడం తప్పటం లేదని 46 శాతం మంది తెలిపారు. 25 శాతం మంది తమకు వర్క్ ఫ్రం హోం వెసులుబాటు లభించలేదని పేర్కొన్నారు. సర్వేలో మరిన్ని విశేషాలు ► కోవిడ్–19 సంబంధ సమాచారం తెలుసుకునేందుకు ప్రజలు ఎక్కువగా టీవీ, సోషల్ మీడియా, ఆన్లైన్ వెబ్సైట్లు, దినపత్రికల (వరుస క్రమంలో)పై ఆధారపడుతున్నారు. ప్రధానంగా విశ్వసనీయ సమాచారం కోసం టీవీలు, దినపత్రికలపై ఆధారపడుతున్నారు. ► వైరస్ వ్యాప్తితో ప్రధానంగా వ్యక్తిగత శుభ్రత, భౌతిక దూరం పాటించడం పెరిగింది. ► దీని వ్యాప్తి నివారించడానికి కేంద్ర ప్రభుత్వం సరైన చర్యలే తీసుకుందని 87 శాతం మంది అభిప్రాయపడ్డారు. ► చాలా మంది ప్రయాణ ప్రణాళికలను రద్దు చేసుకోవడంతో ట్రావెల్, టూరిజం రంగాలు అత్యధికంగా దెబ్బతిన్నాయన్న అభిప్రాయం ఉంది. ఇతర త్రా వ్యాపారాలపైనా తీవ్ర ప్రతికూల ప్రభావమే పడిందని 92 శాతం మంది భావిస్తున్నారు. ► తెలిసినవారు ఎదురుపడినప్పుడు షేక్హ్యాండ్లు, కౌగిలించుకోవడాల్లాంటివి కొంత కాలం పాటు ఆగుతాయని 71 శాతం మంది తెలిపారు. అలాగే, విదేశాలకు వెళ్లేవారు కూడా మరింత జాగ్రత్తగా ఉంటారని అభిప్రాయపడ్డారు. ► వచ్చే ఆరు నెలల నుంచి ఏడాది వ్యవధిలో ప్రపంచం కోవిడ్ 19 ప్రభావాల నుంచి బైటపడగలదని 84% మంది ఆశాభావం వ్యక్తం చేశారు. -
మళ్లీ మోదీనే రావాలి
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి మరో అవకాశమిస్తే తమ భవిష్యత్తు బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయపడినట్లు ఓ సర్వేలో తేలింది. 63 శాతం పైగా మంది ఎన్డీయే ప్రభుత్వంపై విశ్వాసం వ్యక్తీకరించారు. వార్తా వెబ్సైట్ డైలీహంట్, డేటా అనలిటిక్స్ సంస్థ నీల్సన్ ఇండియాలు సంయుక్తంగా ఈ సర్వేను నిర్వహించాయి. దేశ విదేశాల్లో సుమారు 54 లక్షల మంది అభిప్రాయాల్ని ఆన్లైన్లో సేకరించి ఈ నిర్ధారణకు వచ్చాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా భావిస్తున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ముందు వెలువడిన ఈ సర్వే ఫలితాల్ని కాంగ్రెస్ కొట్టిపారేసింది. ఈ అంచనాలు వృథా, నకిలీవని పేర్కొంది. ‘ప్రజా విశ్వాసం కోల్పోయిన ఎన్డీయేకు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో పరాభవం తప్పదు. అన్ని దారులు మూసుకుపోయాక తన అర్థ బలంతో ఇలాంటి నకిలీ సర్వేలను తెరపైకి తెచ్చి, అవి నిజమని నిరూపించాలనుకుంటోంది. ప్రజలే తిరస్కరించాక ఇలాంటి వృథా సర్వేలతో వారికి ఎలాంటి ప్రయోజనం ఉండదు’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా అన్నారు. సర్వేలో ఏం తేలిందంటే.. ► మోదీ పనితీరు, నాయకత్వంపై సంతృప్తి వ్యక్తం చేసిన 63 శాతం మంది. 2014తో పోలిస్తే మోదీ ప్రభుత్వంపై వారికి ఏమాత్రం విశ్వాసం సడలలేదు. ► సంక్షోభ సమయంలో దేశాన్ని నడిపించేందుకు మోదీనే అందరి కన్నా ఎక్కువ అర్హుడని అభిప్రాయపడిన సుమారు 62 శాతం మంది. తరువాతి స్థానాల్లో రాహుల్ గాంధీ(17 శాతం), అరవింద్ కేజ్రీవాల్(8 శాతం), అఖిలేశ్ యాదవ్(3 శాతం), మాయావతి(2 శాతం) ఉన్నారు. ► మోదీకి రెండోసారి ప్రధాని అయితే తమ భవిష్యత్తు బాగుంటుందన్న 50 శాతం మంది. ► అవినీతి నిర్మూలనలో మోదీకి మద్దతుతెలిపిన సుమారు 60 శాతం మంది. ► ఈ విషయంలో కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కన్నా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఎక్కువ మద్దతు పలికారు. ► ఇతర వయో బృందాల కన్నా 35 ఏళ్లకు పైబడిన వారే మోదీకి అత్యధిక మద్దతు తెలిపారు. ► త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్ ప్రజలు మోదీపై విశ్వాసం ఉంచగా, తెలంగాణలో మాత్రం ఇందుకు విరుద్ధమైన ధోరణి కనిపించింది. -
మోదీ.. మరోసారి
న్యూఢిల్లీ : మోదీనే మరోసారి ప్రధానిగా ఉండాలని ఎక్కువ మంది జనాలు కోరుకుంటున్నట్లు ఆన్లైన్ సర్వేలు వెల్లడించాయి. సర్వేలో పాల్గొన్న వారిలో దాదాపు 63 శాతం మంది మోదీనే మరోసారి ప్రధాని కావాలని కోరుకుంటున్నట్లు సదరు సర్వే తెలిపింది. మోదీకి ఇంకో చాన్స్ ఇస్తే భవిష్యత్ బాగుంటుందని 50 శాతం మంది అభిప్రాయ పడినట్లు సదరు సర్వే వెల్లడించింది. ప్రముఖ న్యూస్ పోర్టల్ డైలీ హంట్, డేటా అనాలిటిక్స్ కంపెనీ నీల్సన్ ఇండియాలు ఉమ్మడిగా ఈ ఆన్లైన్ సర్వేను నిర్వహించాయి. ఈ సర్వేలో భాగంగా ఆన్లైన్లో దాదాపు 54 లక్షల మంది అభిప్రాయాలు సేకరించినట్లు తెలిసింది. మన దేశంతో పాటు విదేశాల్లో ఉంటున్న వారు కూడా ఇందులో పాల్గొన్నారని సర్వే నిర్వహకులు తెలిపారు. 2014 ఎన్నికల సమయంలో మోదీపై ఎంత నమ్మకం ఉందో ఇప్పుడు కూడా అంతే నమ్మకముందని 63 శాతం మంది అభిప్రాయపడినట్లు ఈ సర్వే వెల్లడించింది. మోదీ నాలుగేళ్ల పాలన తమకు సంతృప్తినిచ్చినట్లు సర్వేలో పాల్గొన్న వారు వెల్లడించారు. మరి కొద్ది రోజుల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నిలు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వేని నిర్వహించారు. కాగా ఈ ఐదు రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ప్రజలు మోదీపై నమ్మకముంచగా.. తెలంగాణలో మాత్రం మోదీ పట్ల వ్యతిరేకత ప్రదర్శించినట్లు తెలిసింది. సర్వే నిర్వాహకులు మిజోరం గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే ప్రతిపక్షాలు మాత్రం ఈ సర్వేను తప్పుడు సర్వేగా ఆరోపిస్తున్నాయి.మోదీ ప్రభుత్వం ప్రజల నమ్మకం కోల్పోయిందని, ఇలాంటి పనికిరాని సర్వేల వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాలా విమర్శించారు. -
భారతీయుల మూడు చింతలు!
నేతల, ఆర్థిక సంస్థల అవినీతి పెరిగిపోతోంది! చదువులెన్ని చదివినా ఉద్యోగాలు మాత్రం లేవు!! అన్ని చోట్లా.. నేరాలు, హింసాత్మక ఘటనలు!! ఈ మూడు అంశాల గురించి ఈ మధ్యకాలంలో ఎప్పుడైనా ఆలోచన చేశారా? చేసే ఉంటారు లెండి. ఎందుకంటే భారతీయులందరి మనసుల్ని పీడిస్తున్న మూడు ప్రధానమైన అంశాలివే. రాజకీయ, ఆర్థిక అవినీతి, నిరుద్యోగం, నేరాలు హింస అనే మూడు అంశాలు భారతీయులకు ఉన్న మూడు ముఖ్యమైన చింతలని ఇటీవల జరిగిన ఓ ఆన్లైన్ సర్వే కూడా నిర్ధారించింది. ‘‘వాట్ వర్రీస్ ద వరల్డ్’’ పేరుతో ఇప్సోస్ అనే సంస్థ దాదాపు 28 దేశాల్లో ఈ సర్వే నిర్వహించింది. దేశంలో సర్వే చేసిన వారిలో 47 శాతం మంది రాజకీయ, ఆర్థిక అవినీతి తమను ఎక్కువగా చింతకు గురి చేస్తోందని చెబితే నిరుద్యోగం, నేరాల విషయంలో ఇబ్బంది పడుతున్న వారి శాతం 29, 42లుగా ఉంది. ప్రపంచం మొత్తాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పుడు అత్యధికులు ఈ మూడు అంశాలతోపాటు పేదరికం, సామాజిక అసమానతలు (33 శాతం), ఆరోగ్య సేవలు (24 శాతం)లను ప్రధాన సమస్యలుగా పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని ఓ సమస్యగా చెప్పిన వారి శాతం 26 వరకూ ఉంది. అవినీతి అనేది అన్నిదేశాల్లోనూ సామాన్యమైన సమస్యకాగా.. భారత దేశానికి వచ్చేసరికి దీని తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు ఈ సర్వే చెబుతోంది. దీంతోపాటు దాడులు, మానభంగాలు, హత్యల వంటి నేరాలు సర్వసాధారణమైపోయాయని సర్వేచేసిన పదిమందిలో నలుగురు అంగీకరించారు. అయితే మనిషి ఆశాజీవి అన్నట్టు.. సర్వే చేసిన వారిలో దాదాపు 60 శాతం మందికి పరిస్థితులన్నీ సర్దుకుంటాయన్న ఆశాభావం ఉంది. ప్రపంచస్థాయిలో తమ దేశం సరైన దిశలోనే వెళుతోందని 92 శాతం మంది చైనీయులు నమ్ముతూండగా, తరువాతి స్థానాల్లో సౌదీ అరేబియా (76), దక్షిణ కొరియా (74) ఉన్నాయి. -
అమ్మకు వందనం..
సాక్షి, సిటీబ్యూరో: ప్రేమానురాగాలు పంచే ఆత్మీ య మాతృమూర్తితో మదర్స్‌డే రోజంతా గడిపేందుకు మెజార్టీ సిటీజన్లు ఆసక్తి చూపుతున్నారట. ఈ నెల 13న మదర్స్‌డే సందర్భంగా భారత్ మ్యాట్రిమోని సంస్థ 6,448 మంది స్త్రీ, పురుషుల అభిప్రాయాలను ఆన్లైన్లో సేకరించింది. ఇందులో 80 శాతం మంది మదర్స్‌డేను జరుపుకునేందుకు ఆసక్తి కనబరిచినట్లు ఈ సర్వే తెలిపింది. సర్వేలో పాల్గొన్న వారిలో 60 శాతం మంది మదర్స్‌డే రోజున తల్లితో రోజంతా గడిపేందుకు ఆసక్తి చూపినట్లు పేర్కొంది. అమ్మతో కలిసి లంచ్, డిన్నర్ చేయడం, షాపింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ సర్వేలో పాల్గొన్న 90 శాతం మంది యువతీ, యువకులు మదర్స్‌డే రోజున ఇంటిపని, వంట పనులతో సతమతÐమవుతున్న అమ్మకు విశ్రాంతినిస్తే ఆమె సంతోషంగా ఉంటుందని అభిప్రాయపడటం విశేషం. 40 శాతం మంది పురుషులు అమ్మకు అధిక తీరిక సమయం అవసరమని అభిప్రాయపడగా.. 30 శాతం మంది స్త్రీలు ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. పిల్లల సంతోషమే తల్లికి ఆనందం కలిగిస్తుందని సర్వేలో పాల్గొన్న పలువురు అభిప్రాయపడినట్లు ఈ సర్వే ఫలితాలు వెల్లడించిన భారత్ మ్యాట్రిమోని మార్కెటింగ్ జనరల్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ తెలిపారు. -
జమిలి ఎన్నికలపై సర్వేలో సానుకూలం
సాక్షి, న్యూఢిల్లీ : దేశంలో లోక్‌సభ, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించాలన్న ప్రతిపాదనకు లా కమిషన్ గ్రీన్‌సిగ్నల్ లభించిన నేపథ్యంలో జమిలి ఎన్నికలపై నిర్వహించిన సర్వేలో ప్రజల నుంచి సానుకూలత వ్యక్తమైంది. లోకల్‌సర్కిల్స్ అనే సంస్థ నిర్వహించిన ఆన్లైన్ సర్వేలో 84 శాతం మంది జమిలి ఎన్నికలకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జమిలి ఎన్నికలపై ఈ సందర్భంగా పలు సందేహాలను వారు వ్యక్తపరచడం గమనార్హం. జమిలి ఎన్నికలను సర్వేలో పాల్గొన్న వారిలో కేవలం 13 శాతం మంది వ్యతిరేకించారని లోకల్‌సర్కిల్స్ పేర్కొంది. జమిలి ఎన్నికలతో సమయం, ఖర్చు ఆదా అవడంతో పాటు అభివృద్ధి, పాలనపై ప్రభుత్వాలు దృష్టిసారించేందుకు వెసులుబాటు ఉంటుందని సర్వేలో పాల్గొన్నవారిలో 93 శాతం మంది అభిప్రాయపడ్డారని తెలిపింది. అయితే పటిష్ట ప్రచార నైపుణ్యాలు కలిగిన పార్టీ దేశవ్యాప్తంగా ఏకకాలంలో ఓటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఇది అధికార కేంద్రీకరణకు దారితీయడంతో పాటు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాల పదవీకాలాన్ని కుదించివేస్తుందని సర్వేలో పాల్గొన్నవారు అభిప్రాయపడ్డారు. కాగా, 2019 నుంచి రెండు దశల్లో జమిలి ఎన్నికలను నిర్వహించవచ్చని లా కమిషన్ సానుకూలత వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. లా కమిషన్ వెల్లడించిన కార్యనిర్వాహక పత్రం ప్రకారం మలివిడత జమిలి ఎన్నికలు 2024లో నిర్వహించవచ్చని పేర్కొంది. అయితే దీనికి అనుగుణంగా రాజ్యాంగంలో కనీసం రెండు నిబంధనలను సవరించాల్సి ఉంటుందని తెలిపింది. -
2018; మాకు అత్యంత సానుకూలం.. !
కొత్త సంవత్సరం ప్రారంభమైందంటే కేలండర్లో సంవత్సరం, తేదీలు, వారాలు మారటమే కాదు.. గత కాలపు చేదు స్మృతులు, అనుభవాలను తొలగిస్తుందనే ఓ కొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టే సందర్భం. ఏంటీ 2018లోకి ప్రవేశించి ఇప్పటికే సుమారు నెల కావస్తోంది. ఇందుకు సంబంధించి కొన్ని నిర్ణయాలు కూడా తీసేసుకున్నాం కదా.. మళ్లీ ఈ ప్రస్తావన ఎందుకని ఆలోచిస్తున్నారా.. అదేనండీ మీలాగే ప్రపంచవ్యాప్తంగా ఈ సంవత్సరం గురించి ఎంతమంది, ఎలాంటి అభిప్రాయాలు ఏర్పరచుకున్నారో తెలుసుకునేందుకు ఫ్రాన్స్‌కు చెందిన ప్రజాభిప్రాయ సేకరణ సంస్థ ఇప్సాసిస్ ఆన్లైన్ సర్వే నిర్వహించింది. ఆ సర్వే వివరాలేమిటో ఓ సారి చూద్దాం. ప్రపంచవ్యాప్తంగా 28 దేశాల్లో సర్వే నిర్వహించగా మొత్తంగా 76 శాతం మంది ప్రజలు 2017తో పోలిస్తే ఈ ఏడాది తమకు సానుకూలంగా ఉంటుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. వీరిలో ముఖ్యంగా యువత 2018ని అత్యంత ఆశావహ సంవత్సరంగా పేర్కొన్నారు. లాటిన్ అమెరికా దేశాలైన కొలంబియా, పెరూలో 93శాతం మంది సానుకూలంగా స్పందించారు. 88శాతం మంది చైనీయులు 2018కే ఓటు వేశారు. ఇక మన దేశంలో 87శాతం మంది 2018 పట్ల ఆశావహంగానే ఉన్నారు. అమెరికన్లకు గతేడాది అధ్యక్ష ఎన్నికలతో ఎంతో నాటకీయంగా గడిచిపోయింది. డొనాల్డ్ ట్రంప్ పట్ల చాలామంది బహిరంగంగానే విముఖత వ్యక్తం చేశారు. 80శాతం మంది అమెరికన్లు కనీసం ఈ ఏడాదైనా మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక యూరప్ దేశాల విషయానికొస్తే... జర్మనీలో 67శాతం, బ్రిటన్‌లో 67శాతం, ఫ్రాన్స్‌లో కేవలం 55శాతం మంది మాత్రమే సానుకూలంగా ఉన్నారు. ఈ సర్వేలో 44శాతం మందితో జపాన్ అట్టడుగు స్థానంలో నిలిచింది. -
నోట్ల రద్దుపై ఆ సర్వే తేల్చిందిదే..
సాక్షి,న్యూఢిల్లీ: సరిగ్గా ఏడాది కిందట ప్రధాని మోదీ ఇచ్చిన నోట్ల రద్దు షాక్‌కు సామాన్యులు విలవిలలాడారు. అవినీతి, నల్లధనం అంటూ చెలామణిలో ఉన్న నగదును చెప్పాపెట్టకుండా రద్దు చేసి బ్యాంకుల ముందు పడిగాపులు కాసేలా చేశారు. అయితే నోట్ల కష్టాలకు ఏడాది అవుతున్న సందర్భంగా ఓ సర్వే ఆసక్తికర ఫలితాలు వెల్లడించింది. నోట్ల రద్దును ప్రజలు ఇప్పటికీ స్వాగతిస్తున్నారని, మోదీ మ్యాజిక్కు వెన్నుదన్నుగా నిలిచారని ఈటీ ఆన్లైన్ సర్వే తేల్చింది. నోట్ల రద్దు విజయవంతమైందని ఈ సర్వేలో పాల్గొన్న వారిలో 38 శాతం మంది పేర్కొనగా, 32 శాతం మంది విఫలమైందని చెప్పారు. 30 శాతం మంది మిశ్రమంగా ప్రతిస్పందించారు. ఈటీ ఆన్లైన్ సర్వేలో పదివేల మందికి పైగా తమ స్పందన తెలియచేశారు. దీర్ఘకాలంలో నోట్ల రద్దు దేశ ప్రయోజనాలను దెబ్బతీస్తుందని 26 శాతం మంది అభిప్రాయపడగా, వ్యవస్థలో పారదర్శకతను తీసుకొస్తుందని 32 శాతం మంది చెప్పారు. 42 శాతం మంది ఆర్థిక వ్యవస్థలో పారదర్శకతకు ఉపకరిస్తుందని, అయితే కొంతమేర ఎకానమీకి విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడ్డారు. ఉపాధి రంగంపై మాత్రం నోట్ల రద్దు ప్రభావంపై కొంత ప్రతికూలత ఎదురైంది. ఉద్యోగాలపై ఎలాంటి ప్రభావం ఉండదని 32 శాతం మంది పేర్కొనగా, దీర్ఘకాలంలో ఉద్యోగాలపై నోట్ల రద్దు ప్రతికూల ప్రభావం చూపుతుందని 23 శాతం మంది అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దుతో పెద్దసంఖ్యలో ఉద్యోగాలు కోల్పోవలసివచ్చిందని 45 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఇక మోదీ రూ 2000 నోటును రద్దు చేస్తే నల్ల కుబేరులకు షాక్ ఇచ్చినట్టవుతుందని 56 శాతం మంది అభిప్రాయపడగా, ఆర్థిక వృద్ధికి విఘాతమవుతుందని 31 శాతం మంది పేర్కొన్నారు. ఈ నిర్ణయం నిజాయితీగా నడిచే వ్యాపారాలను దెబ్బతీస్తుందని 12 శాతం మంది చెప్పారు. -
శశికళ వర్సెస్ ఓపీఎస్: రాష్ట్రపతి పాలనకే ఓటు
తమిళనాడులో సీఎం పీఠం కోసం ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు, పార్టీ కేర్‌టేకర్ శశికళకు మధ్య రేగిన చిచ్చు ఆ రాష్ట్ర రాజకీయాల్లో క్షణక్షణం ఉత్కంఠ రేపుతోంది. తమిళనాడులో నెలకొన్న ఈ సంక్షోభంపై ఆన్లైన్లో నిర్వహించిన సర్వేలో నెటిజన్లు అనూహ్యమైన తీర్పునిచ్చారు. మెజార్టి సభ్యులు అంటే 54 శాతం మంది తమిళనాడులో రాష్ట్రపతి పాలనకు అనుకూలంగా ఓటు వేశారు. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి తాజాగా ఎన్నికలు నిర్వహించాలని అభిప్రాయపడ్డారు. తమిళనాడులో సంక్షోభం పరిష్కారానికి ఓ నిర్ణయం తీసుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఆ రాష్ట్ర ఇన్‌ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావు చెన్నైకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇరు వర్గాలను కలిసిన తర్వాత ఓ ప్రకటన ఆయన నిర్ణయం తీసుకోనున్నారు. పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రిగా రాజీనామా చేసిన అనంతరం మళ్లీ ఆ పీఠం కోసం పోరాటం సాగిస్తుండగా.. జయ నెచ్చెలి శశికళ ఎలాగైనా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించాలని చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సోషల్ ఎంగేజ్మెంట్ ప్లాట్‌ఫామ్ తమిళనాట నెలకొన్న తాజా పరిస్థితులపై ఈ సర్వే నిర్వహించింది. దీనిలో 54 శాతం మంది ప్రెసిడెంట్ రూల్‌కు అనుకూలంగా ఓటు వేస్తూ కొత్తగా ఎన్నికలు నిర్వహించాలని కోరారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో అసెంబ్లీ నిర్ణయిస్తుందని 34 శాతం మంది పేర్కొన్నారు. ఇంటర్నెల్‌గా అన్నాడీఎంకే నేతలు నిర్ణయిస్తారని 10 శాతం మంది అభిప్రాయపడ్డారు. మెజార్టి సభ్యులు కోరుతున్న ప్రెసిడెంట్ రూల్‌ను బీజేపీ ఫైర్ బ్రాండ్ నేత సుబ్రహ్మణ్య స్వామి కూడా మోదీ ప్రభుత్వానికి ప్రతిపాదించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న ఈ సంక్షోభాన్ని అనుకూలంగా తీసుకున్న ప్రతిపక్ష పార్టీ డీఎంకే కూడా తాజా ఎన్నికలకు పట్టుబడుతోంది. చదవండి : 'ఎమ్మెల్యేల సంతకాలన్నీ ఫోర్జరీ' -
కాబోయే భర్తలకు సవాలక్ష షరతులు!
భారతీయ యువతులు పెళ్లి చేసుకునే ముందు తమకు కాబోయే భర్తకు కొన్ని షరతులు పెడుతున్నారట. ఈ విషయం తాజాగా నిర్వహించిన ఓ సర్వేలో వెల్లడైంది. పెళ్లి తర్వాత ఇంటిపేరు మార్చుకోవడం తమకు ఇష్టం లేదని ఎక్కువ మంది అమ్మాయిలు తేల్చిచెప్పారు. మ్యారేజ్ వెబ్సైట్ షాదీ.కామ్ అన్లైన్ పోల్ ద్వారా చేసిన సర్వేలో మరిన్ని విషయాలను వెల్లడించింది. 25 - 34 ఏళ్ల మధ్య వయసున్న మహిళల నుంచి అన్లైన్ లోనే అభిప్రాయాలను సేకరించింది. భారతీయ మహిళలు గతంలో కంటే చాలా ఆత్మవిశ్వాసంతో ఉంటున్నారని, తమకు ఇష్టం వచ్చిన కెరీర్‌ను ఎంచుకుంటున్నారని షాదీ.కామ్ సీఈవో గౌరవ్ రక్షిత్ తమ సర్వే వివరాలను వెల్లడించారు. పెళ్లికి ముందు భర్తకు కొన్ని షరతులు, నియమాలు లాంటివి పెడుతున్నారా అన్న ప్రశ్నకు 12,500 మంది స్పందించగా, 71.30 శాతం మహిళలు అవును అని సమాధానమిచ్చారు. ఈ విషయమై ఆలోచించాల్సి ఉందని 22.90 శాతం మంది, అటువంటిదేం లేదని 5.80 శాతం బదులిచ్చారట. ఎక్కువ శాతం వధువులు ఇంటిపేరు మార్పు గురించే పట్టుబడుతున్నారు. ఇంటి పేరు మార్చడానికి ఏమాత్రం ఇష్టపడనివాళ్లే ఎక్కువగా ఉన్నారు. పెళ్లి తర్వాత కూడా పూర్తి స్వాతంత్ర్యం తమకు ఇవ్వాలని, తమ తల్లిదండ్రులను కూడా వరుడి పేరేంట్స్ లాగానే ట్రీట్ చేయాలని మరికొంత మంది తమ షరతులు చెప్పారు.