న్యూఢిల్లీ: కరోనావైరస్ వ్యాప్తి, లాక్‌డౌన్‌తో దేశ ఎకానమీపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడుతోంది. వీటితో భారీగా ఆదాయాలు, డిమాండ్ పడిపోవడంతో పాటు గణనీయంగా ఉద్యోగాల కోతలు కూడా ఉంటాయని కార్పొరేట్లు భావిస్తున్నారు. కంపెనీల సీఈవోలతో పరిశ్రమల సమాఖ్య సీఐఐ నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. వివిధ రంగాల సంస్థలకు చెందిన సుమారు 200 మంది సీఈవోలు ఇందులో పాల్గొన్నారు. ‘గత త్రైమాసికంతో (జనవరి–మార్చి) పోలిస్తే ప్రస్తుత క్వార్టర్‌లో (ఏప్రిల్–జూన్) ఆదాయాలు 10 శాతం, లాభాలు 5 శాతం పైగా తగ్గిపోతాయని మెజారిటీ సంస్థలు భావిస్తున్నాయి. జీడీపీ వృద్ధిపై కరోనా ఏ మేరకు ప్రభావం చూపబోతోందన్నది ఇది తెలియజేస్తోంది. సర్వేలో పాల్గొన్న 52 శాతం సంస్థలు.. తమ తమ రంగాల్లో గణనీయంగా ఉద్యోగాల్లో కోతలు ఉంటాయని అంచనా వేస్తున్నాయి’ అని సీఐఐ వెల్లడించింది.
Comments
Please login to add a commentAdd a comment