
రణ్‌దీప్ సూర్జేవాలా
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు కరోనాపై పోరు, లాక్‌డౌన్ అనంతర పరిస్థితులపై తగు ప్రణాళికతో ప్రధాని మోదీ ముందుకు రావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు ప్రధాని స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ..‘మరోసారి లాక్‌డౌన్ పెడతారా? ఈ లాక్ డౌన్ ఎంతకాలానికి ముగుస్తుంది? ఈ విషయాలపై ప్రధాని మోదీ 130 కోట్ల దేశ ప్రజలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు. వలస కార్మికులందరినీ రైళ్లలో ఆహారం అందించి ఉచితంగా సొంతూళ్లకు చేర్చాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment