Recovery plan
-
‘లాక్డౌన్ తర్వాతి ప్లాన్ రూపొందించాలి’
న్యూఢిల్లీ: దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతోపాటు కరోనాపై పోరు, లాక్డౌన్ అనంతర పరిస్థితులపై తగు ప్రణాళికతో ప్రధాని మోదీ ముందుకు రావాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దేశ ప్రజలకు ప్రధాని స్పష్టమైన అవగాహన కల్పించాలని కోరింది. కాంగ్రెస్ ప్రతినిధి రణ్‌దీప్ సూర్జేవాలా మాట్లాడుతూ..‘మరోసారి లాక్డౌన్ పెడతారా? ఈ లాక్ డౌన్ ఎంతకాలానికి ముగుస్తుంది? ఈ విషయాలపై ప్రధాని మోదీ 130 కోట్ల దేశ ప్రజలకు స్పష్టతనివ్వాలి’ అని కోరారు. వలస కార్మికులందరినీ రైళ్లలో ఆహారం అందించి ఉచితంగా సొంతూళ్లకు చేర్చాలని కోరారు. -
92 వేలకు పైగా వీఆర్ఎస్ దరఖాస్తులు
న్యూఢిల్లీ: స్వచ్ఛంద పదవీ విరమణ పథకాన్ని (వీఆర్ఎస్) ఎంచుకున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగుల సంఖ్య ఇప్పటికి 92,000 దాటిందని ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి. రెండు సంస్థల ఉద్యోగుల నుంచీ ఈ పథకం పట్ల విశేష స్పందన కనిపిస్తున్నట్లు ఆ వర్గాలు వెల్లడించాయి. బీఎస్ఎన్ఎల్కు సంబంధించి నవంబర్ 5 నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకం డిసెంబర్ 3 వరకూ అమల్లో ఉంటుంది. సంస్థలో ప్రస్తుతం దాదాపు 1.50 లక్షల మంది పనిచేస్తున్నారు. వీరిలో లక్ష మంది ఈ పథక ప్రయోజనం పొందడానికి అర్హులు. 70,000 నుంచి 80,000 మంది ఈ పథకాన్ని ఎంచుకుంటారని, దీనివల్ల దాదాపు రూ.7,000 కోట్ల వేతన బిల్లు భారం తగ్గుతుందని బీఎస్ఎన్ఎల్ భావిస్తోంది. కేంద్రం అందిస్తున్న పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకారం బీఎస్ఎన్ఎల్ తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ను గట్టెక్కించేందుకు కేంద్ర ప్రభుత్వం దాదాపు రూ. 69,000 కోట్ల మేర పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఎంటీఎన్ఎల్ బీఎస్ఎన్ఎల్కు కొద్ది రోజుల ముందే తమ ఉద్యోగులకు వీఆర్ఎస్ ప్రకటించింది. రెండు కంపెనీల రుణభారం రూ. 40,000 కోట్ల పైగా ఉంది. -
కేంద్రానికి స్పైస్‌జెట్ పునరుద్ధరణ ప్రణాళిక
న్యూఢిల్లీ: సంక్షోభంలో చిక్కుకున్న విమానయాన సంస్థ స్పైస్‌జెట్..ప్రతిపాదిత 200 మిలియన్ డాలర్ల పెట్టుబడి ఆధారంగా పునరుద్ధరణ ప్రణాళికను కేంద్రానికి సమర్పించింది. స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తున్న మాజీ ప్రమోటరు అజయ్ సింగ్‌తో కలసి కంపెనీ సీఓఓ సంజీవ్ కపూర్ శుక్రవారం పౌర విమానయాన శాఖ కార్యదర్శి వి.సోమసుందరన్కి ప్రణాళికను అందజేశారు. సోమసుందరన్తో భేటీ నిర్మాణాత్మకంగా సాగిందని సమావేశం అనంతరం కపూర్ తెలిపారు. ప్రస్తుతం ఏ చమురు మార్కెటింగ్ కంపెనీకి చెల్లించాల్సిన బకాయిలేమీ లేవని, మొత్తం 18 విమానాలతో రోజుకు 230 ఫ్లయిట్ సర్వీసులు నిర్వహిస్తున్నామని ఆయన వివరించారు. పునరుద్ధరణ ప్రణాళిక వార్తలతో బీఎస్ఈలో స్పైస్‌జెట్ షేరు 9 శాతం పెరిగి రూ. 19.25 వద్ద ముగిసింది. అజయ్ సింగ్‌తో పాటు అమెరికా ఆర్థిక సేవల సంస్థ జేపీ మోర్గాన్ చేజ్ సారథ్యంలోని ఫండ్ కూడా స్పైస్‌జెట్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది. కంపెనీని గట్టెక్కించే దిశగా నెల రోజుల్లోగా 200 మిలియన్ డాలర్ల పెట్టుబడితో.. ప్రస్తుత ప్రమోటరు కళానిధి మారన్ నుంచి ఇన్వెస్టర్లు కొంత వాటా కొనుగోలు చేయనున్నారు. ఇందులో భాగంగా కంపెనీకి ఇప్పటికే రూ. 17 కోట్లు అందినట్లు.. చమురు కంపెనీలు, ఉద్యోగులకు చెల్లించాల్సిన బకాయిలను వాటితోనే తీర్చినట్లు సమాచారం. నవంబర్ 24 నుంచి డిసెంబర్ 10 మధ్యలో దేశీ, విదేశీ విక్రేతలు, ఎయిర్పోర్ట్ ఆపరే టర్లు, చమురు కంపెనీలకు స్పైస్‌జెట్ చెల్లించాల్సిన బకాయిలు రూ. 990 కోట్ల నుంచి రూ.1,230 కోట్లకు పెరిగాయి. విదేశీ వెండార్లకు కంపెనీ చెల్లించాల్సిన బకాయిలు రూ. 624 కోట్ల నుంచి రూ. 742 కోట్లకు పెరిగాయి.