
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థి క వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లఘు సంస్థలు, వ్యవసాయం, ఆతిథ్యం, పౌర విమానయానం తదితర అన్ని రంగాలన్నీ .. కరోనా వైరస్ మహమ్మారిపరంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది.
కరోనా దెబ్బతో భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా స్థాయికి కూడా పడిపోయే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు నివేదికలు ఇస్తున్నాయి. దీంతో లాక్‌డౌన్ ముగిశాక ఎకానమీని సాధ్యమైనంత త్వరగా పట్టాలమీదికి ఎక్కించేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అతనూ చక్రవర్తితో అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. వివిధ రంగాలకు ఉద్దీపనలతో పాటు బడుగు వర్గాల సంక్షేమానికి చర్యల గురించి కూడా ఈ కమిటీ సిఫార్సు చేయనుంది.
Comments
Please login to add a commentAdd a comment