economic situation
-
జాతీయ, అంతర్జాతీయ ఎకానమీపై ఆర్బీఐ చర్చ
హైదరాబాద్: జాతీయ, అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులపై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సమీక్షించింది. సవాళ్లను అధిగమించడానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించింది. ఆర్బీఐ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 601వ సమావేశం హైదరాబాద్‌లో జరిగింది. గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో సెంట్రల్ బోర్డు డైరెక్టర్లు సతీష్ కే మరాఠే, సచిన్ చతుర్వేది, పంకజ్ రామన్‌భాయ్ పటేల్, రవీంద్ర హెచ్ ధోలాకియా పాల్గొన్నారు. డిప్యూటీ గవర్నర్లు మహేష్ కుమార్ జైన్, మైఖేల్ దేబబ్రత పాత్ర, ఎం రాజేశ్వర్ రావు, టీ రబీ శంకర్లు కూడా హాజరయ్యారు. ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్ సేథ్, ఆర్థిక సేవల కార్యదర్శి వివేక్ జోషిలూ సమావేశంలో పాల్గొన్న వారిలో ఉన్నారు. 2022–23 ఆర్థిక సంవత్సరం ఆర్బీఐ చర్యలపై సమీక్ష జరపడంతోపాటు, 2023–24 అకౌంటింగ్ ఇయర్ బడ్జెట్‌ను ఆమోదించింది. అంతర్జాతీయంగా బ్యాంకింగ్ సంక్షోభం, అయినప్పటి కీ అమెరికా, ఈయూ, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌సహా పలు దేశాలు కీలక రేట్ల పెంపు బాటలోనే ఉన్న నేపథ్యంలో తాజా సమావేశం జరిగింది. కాగా, భారత్ బ్యాంకింగ్ పటిష్టతపై విధాన నిర్ణేతలు, నిపుణులు ధీమా వ్యక్తం చేస్తుండడం గమనార్హం. -
ఆర్థిక పరిస్థితులపై ఆర్బీఐ సమీక్ష
ముంబై: ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులు, భౌగోళికరాజకీయ పరిణామాలతో తలెత్తుతున్న సవాళ్లను రిజర్వ్ బ్యాంక్ సెంట్రల్ బోర్డు శుక్రవారం సమీక్షించింది. అలాగే, నిర్దిష్ట సెంట్రల్ ఆఫీస్ డిపార్ట్మెంట్ల కార్యకలాపాలు, 2021–22లో భారత్‌లో బ్యాంకింగ్ పురోగతి నివేదికపై కూడా చర్చించింది. 599వ సెంట్రల్ బోర్డు సమావేశంలో సతీష్ కె మరాఠే, రేవతి అయ్యర్, సచిన్ చతుర్వేది, వేణు శ్రీనివాసన్ తదితర డైరెక్టర్లు పాల్గొన్నట్లు ఆర్బీఐ తెలిపింది. చదవండి: గ్రామీణ ప్రాంతాల్లో ఆ కారుకు ఉన్న క్రేజ్ వేరబ్బా.. మూడు నెలల్లో రికార్డు సేల్స్! -
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయండి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ‘రాష్ట్రం తీవ్ర ఆర్థిక సంక్షోభంలో ఉంది. సంక్షేమ కార్యక్రమాల అమలు, ఇతర ఖర్చులకు డబ్బులు లేని పరిస్థితి నెలకొంది. పెద్ద ఎత్తున తీసుకున్న రుణాలకు గాను భారీ మొత్తంలో వడ్డీలు చెల్లించాల్సి వస్తోంది’అని ఆ పార్టీ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో విమర్శించారు. ఈ ఆర్థిక కష్టాలు బయటపడకుండా ఉండేందుకుగాను రాజకీయ ప్రకటనలతో కాలం వెళ్లదీసేందుకు సీఎం కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఆర్థిక ఆంక్షలు విధిస్తూ తెలంగాణను అణగదొక్కేందుకు బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. దేశంలోనే తెలంగాణ ధనిక రాష్ట్రమని చూపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిజాలను మరుగున పెడుతోందన్నారు. ఇతరులను నిందించడం, రాజకీయ ప్రకటనల ద్వారా కాలక్షేపం చేయడంతో ఆర్థిక కష్టాలు తీరవని, అసెంబ్లీ సమావేశాలకు ముందే ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
భారత్‌ను శ్రీలంకతో పోల్చడం హాస్యాస్పదం!!
న్యూఢిల్లీ: తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకతో భారత ఆర్థిక పరిస్థితులను పోల్చి చూడటం హాస్యాస్పదమేనని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ అరవింద్ పనగారియా వ్యాఖ్యానించారు. అయితే, శ్రీలంక సంక్షోభం నుంచి నేర్చుతగిన పాఠాలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. 1991లో దేశీయంగా చెల్లింపుల సంక్షోభం తలెత్తినప్పట్నుంచి అధికారంలోకి వచ్చిన ప్రభుత్వాలన్నీ స్థూల ఆర్థిక పరిస్థితులు కట్టుతప్పకుండా, దేశాన్ని సంరక్షిస్తున్నాయని పనగారియా చెప్పారు. మరోవైపు, భారత్ ప్రధాన సమస్య నిరుద్యోగం కాదని .. ఉత్పాదకత, జీతాల స్థాయి తక్కువగా ఉండటమేనని ఆయన పేర్కొన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలకు మెరుగైన జీతాలు లభించే ఉద్యోగాలను సృష్టించే దిశగా కృషి చేయల్సిన అవసరం ఉందన్నారు. 2017–18లో 6.1 శాతంగా ఉన్న నిరుద్యోగిత రేటు .. కోవిడ్‌పరంగా కష్టకాలం అయినప్పటికీ 2020–21లో 4.2 శాతానికి దిగి వచ్చిందని పనగారియా చెప్పారు. 2017–18లో నిరుద్యోగిత రేటుపై ఆందోళనలు చేసిన వారంతా తాజా గణాంకాల తర్వాత మౌనం వహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. వివిధ విషయాలపై భారత అధికారిక డేటాపై కొందరు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తుండటంపై స్పందిస్తూ .. దేశ జీడీపీ, కీలక గణాంకాల సేకరణ అంతా కూడా అంతర్జాతీయ ప్రమాణాలతోనే జరుగుతోందని పనగరియా స్పష్టం చేశారు. సహేతుకమైన కొన్ని విమర్శలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉన్నప్పటికీ, ఉద్దేశ్యపూర్వకంగా చేసే విమర్శలను తప్పక ఖండించాలని ఆయన స్పష్టం చేశారు. -
రాజకీయ పిచ్‌పై రాణించని క్రికెటర్
క్రికెటర్‌గా 21 ఏళ్ల పాటు అనమానమైన ఆల్‌రౌండ్ ప్రతిభ చూపడమే గాక పాకిస్థాన్‌కు ప్రపంచ కప్ కూడా అందించిన ఇమ్రాన్ అహ్మద్ ఖాన్ నియాజీ కీలకమైన రాజకీయ పిచ్‌పై మాత్రం చేతులెత్తేశారు. రెండు దశాబ్దాలకు పైగా సుదీర్ఘంగా ప్రయత్నించి ప్రధాని పీఠమెక్కినా ఏ మాత్రం మెరుపులు మెరిపించలేకపోయారు. దేశ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడంలో ఘోరంగా విఫలమై అపకీర్తి మూటగట్టుకున్నారు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ పాకిస్థాన్‌లోని మియావలీలో పష్తూన్ తెగకు చెందిన ఇక్రాముల్లా ఖాన్ నియాజీ, షౌకత్ ఖానుమ్ దంపతులకు 1952లో ఇమ్రాన్ జన్మించారు. లాహోర్‌తో పాటు ఇంగ్లడ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్నత చదువులు చదివారు. 21 ఏళ్లు క్రికెటర్‌గా ఓ వెలుగు వెలిగారు. 1992లో తన సారథ్యంలో పాక్‌కు ఏకైక వన్డే ప్రపంచ కప్ సాధించి పెట్టారు. 43 ఏళ్లొచ్చేదాకా అవివాహితునిగానే ఉండి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా పాక్ ప్రజల మనసు దోచుకున్నారు. 1996లో పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్ పార్టీని స్థాపించారు. 20 ఏళ్లకు గానీ నవాజ్ షరీఫ్ కుటుంబానికి చెందిన పాకిస్థాన్ ముస్లిం లీగ్ (నవాజ్), భుట్టోలకు చెందిన పాకిస్థాన్ పీపుల్స్ పార్టీల హవాను అధిగమించలేకపోయారు. 2002లో జాతీయ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2013లో పీటీఐని రెండో అతి పెద్ద పార్టీగా నిలిపారు. అవినీతిపై ఉక్కుపాదం మోపుతానని, పేదరికాన్ని నిర్మూలించి పాక్‌ను ఇస్లామిక్ సంక్షేమ రాజ్యంగా రూపుదిద్దుతాననే హామీలతో 2018 సాధారణ ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపారు. సొంతంగా మెజారిటీ రాకున్నా సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ప్రధాని కల నెరవేర్చుకున్నారు. కానీ ఎన్నికల హామీల అమలులో పూర్తిగా విఫలమవుతూ వచ్చారు. ముఖ్యంగా ద్రవ్యోల్బణం, నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి దేశాన్ని దివాలా అంచుకు నెట్టేశాయి. విదేశాంగ విధానంలో కూడా ఇమ్రాన్ తేలిపోయారు. భారత్‌తో కయ్యం కొనసాగించడమే గాక రష్యాకు దగ్గరయ్యే క్రమంలో అర్థం లేని దూకుడు ప్రదర్శించి చిరకాల మిత్రుడు అమెరికాకూ దూరమయ్యారు. ఆర్మీ చీఫ్ బజ్వా పదవీకాలం పొడిగింపును అడ్డుకునేందుకు విఫలయత్నం చేసి కీలకమైన సైన్యం ఆశీస్సులు కోల్పోయారు. వ్యక్తిగతంగానూ ఒడిదుడుకులే ఇమ్రాన్ వ్యక్తిగత జీవితమూ ఒడిదుడుకులమయమే. ఆయన మొత్తం మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. 1995లో ఇంగ్లండ్‌కు చెందిన బిలియనీర్ కూతురు జెమీమా గోల్డ్‌స్మిత్‌ను పెళ్లాడారు. ఇద్దరు కొడుకులు పుట్టాక విడాకులు తీసుకున్నారు. 2015లో టీవీ యాంకర్ రెహాం ఖాన్‌ను పెళ్లాడి 10 నెలలకే విడిపోయా రు. 2018లో తన ఆధ్యాత్మిక గురువు బుష్రా మనేకాను ముచ్చటగా మూడోసారి పెళ్లి చేసుకున్నారు. -
మరో ఉద్దీపనపై కేంద్రం కసరత్తు
న్యూఢిల్లీ: కరోనా వైరస్ దెబ్బతో కుదేలవుతున్న ఆర్థి క వ్యవస్థ స్థితిగతులను సమీక్షించేందుకు కేంద్ర ఆర్థి క మంత్రి నిర్మలా సీతారామన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం సమావేశమయ్యారు. ఎకానమీ పరిస్థితులను సమీక్షించడంతో పాటు దెబ్బతిన్న రంగాలకు మరో ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చే అంశాన్ని ఇందులో చర్చించినట్లు తెలుస్తోంది. అలాగే, భవిష్యత్‌లో సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన వనరుల సమీకరణ అంశం కూడా చర్చకు వచ్చినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. లఘు సంస్థలు, వ్యవసాయం, ఆతిథ్యం, పౌర విమానయానం తదితర అన్ని రంగాలన్నీ .. కరోనా వైరస్ మహమ్మారిపరంగా తీవ్ర ప్రతికూల ప్రభావాలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. కరోనా దెబ్బతో భారత స్థూలదేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సున్నా స్థాయికి కూడా పడిపోయే అవకాశం ఉందంటూ పలు అంతర్జాతీయ ఏజెన్సీలు నివేదికలు ఇస్తున్నాయి. దీంతో లాక్డౌన్ ముగిశాక ఎకానమీని సాధ్యమైనంత త్వరగా పట్టాలమీదికి ఎక్కించేందుకు తీసుకోతగిన చర్యలు సిఫార్సు చేసేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి అతనూ చక్రవర్తితో అత్యున్నత స్థాయి కమిటీ వేసింది. వివిధ రంగాలకు ఉద్దీపనలతో పాటు బడుగు వర్గాల సంక్షేమానికి చర్యల గురించి కూడా ఈ కమిటీ సిఫార్సు చేయనుంది. -
మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత ఫైర్
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా మరోసారి విమర్శల వర్షం కురిపించారు. ఇటీవల బీజేపీ ప్రభుత్వం దళితుల పట్ల వ్యవహరిస్తున్న తీరును గట్టిగా వ్యతిరేకించిన యశ్వంత్ మరోసారి తన వ్యాఖ్యలతో అధికార పార్టీని ఇరుకున పెట్టారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులపై ఓ బహిరంగ లేఖను విడుదల చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ, మహిళల రక్షణ, విదేశాంగ విధానం, అంతర్గత ప్రజాస్వామ్యం తదితర అంశాలను ఆయన లేఖలో ప్రస్తావించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థ భారత్ అని బీజేపీ ప్రభుత్వం చెపుతున్న వ్యాఖ్యలను యశ్వంత్ సిన్హా తిప్పికొట్టారు. ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం కాగా.. దేశంలో రోజురోజుకు మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం లైంగిక హత్యలకు ఆరికట్టకపోగా, కొందర బీజేపీ నేతలు హత్యల్లో నిందితులుగా ఉన్నారని విమర్శించారు. దేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రస్తావిస్తూ... గత నాలుగేళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఘోరంగా దెబ్బతిన్నదని.. దేశంలో రైతులు, నిరుద్యోగులు, పేద ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. బ్యాంకింగ్ వ్యవస్థ పూర్తిగా అవినీతిమయంగా మారిందని, పేదల సొమ్ముతో విదేశాలకు పారిపొయిన వారిని పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. మహిళలపై జరుగుతున్న ఆకృత్యాలపై స్పందిస్తూ.. దేశంలో గతంతో పోలిస్తే మహిళలపై అఘాయిత్యాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వీటిలో బీజేపీ నేతల ప్రమేయం ఉన్నా వారిని శిక్షంచడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు. విదేశాంగ విధానం పూర్తిగా అసంబద్దంగా ఉందని, పాకిస్తాన్, చైనాతో అనుసరిస్తున్న విధానం దేశ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉందని పేర్కొన్నారు. వివిధ దేశాలు తిరుగుతూ ఆ దేశ నేతలను కౌగిలించుకోవడం తప్ప మోదీ విదేశీ పర్యటనలతో దేశానికి ఎలాంటి లాభం లేదన్నారు. పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పూర్తిగా నాశనమైందని, ఎంపీలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా తెలిపే అవకాశం కూడా మోదీ కల్పించలేకపోయారని దుయ్యబట్టారు. ఎలాంటి చర్చ జరగకుండానే పార్లమెంట్ సమావేశాలు తుడిచిపొట్టుకుపొవడాన్ని ప్రస్తావిస్తూ... దేశంలో ప్రజాస్వామ్యం ముప్పులో ఉందని సిన్హా హెచ్చరించారు. గత ఎన్నికల్లో బీజేపీ 31 శాతం ఓట్లు మాత్రమే సాధించిందని, 69 శాతం మంది ప్రజలు బీజేపీకి వ్యతిరేకంగా ఓటు వేశారన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. -
సొంతగూడు కల.. చెదురుతోందిలా..
శివారు ప్రాంతాల్లో స్థల విక్రయాల్లో వెలుగు చూస్తున్న మోసాల పరంపర ఆస్కారమిస్తున్న నిబంధనల లొసుగులు భూబకాసురులకు వంతపాడుతున్న అధికారులు పెరుగుతున్న బాధితుల చిట్టా స్థలం కొనే ముందు అవగాహన అవసరం గోపాలరావు అనే చిరుద్యోగి ఆనందపురం మండలంలోని ఒక గ్రామంలో లే అవుట్లో ఇంటి స్థలం కొనుగోలు చేశాడు. పలుచోట్ల అప్పులు చేసి రిజిేస్ట్రేషన్ కూడా చేయించుకున్నాడు. ఐదేళ్లు తర్వాత విక్రయించి కుమార్తె వివాహం చేద్దామనుకున్నాడు. మధ్యలో ఒక సారి తన స్థలాన్ని చూడడానికి వెళ్లగా ప్రభుత్వ స్థలమని బోర్డు దర్శనమిచ్చింది. గోపాలరావు ఆరా తీయగా, గతంలో అది ఎస్సీలకు కేటాయించిన సీలింగ్ భూమి అని తేలింది. ఆనందపురం జంక్షన్లో తోపుడు బండి వ్యాపారి, రామారావు ఇక్కడకు సమీపంలో 60 గజాలు స్థలాన్ని కొనుగోలు చేశాడు. అప్పు చేసి ఆరేళ్ల క్రితం చిన్న ఇల్లు నిర్మించాడు. ఆర్ధిక పరిస్థితి బాగోలేక, విక్రయించేశాడు. తీరా రిజిేస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్లగా ఆ సర్వే నెంబరు నిషేధిత జాబితాలో ఉందని అధికారులు తెలపడంతో నిశ్చేష్టుడయ్యాడు. అక్కయ్యపాలెంకు చెందిన వెంటకరావు పోర్టులో పనిచేసి రిటైరయ్యారు. ఉన్నదంతా కూడబెట్టి 100 గజాల స్థలం కొంటే పక్కనున్న వ్యక్తి ఇది తాను ఇదివరకే కొనుక్కున్నానంటూ కాగితాలు చూపిస్తున్నాడు. వెంకటరావుకు ఏం చేయాలో పాలుపోలేదు. మోసపోయానని అర్థమైంది. ఈ ముగ్గురే చాలామందికి నగర శివారులో ఎదురవుతున్న సమస్య ఇది.. శివారు ప్రాంతాలలో నివాస స్థలాలకు విపరీతమైన గిరాకీ ఏర్పడి,ధరలు ఆకాశన్నంటుతున్నాయి. ఇదే అదునుగా కొంత మంది ‘రియల్’ మోసాలకు పాల్పడుతున్నారు. కొంత మంది చిన్న, మధ్య తరగతి కుటుంభాలను టార్గెట్‌గా చేసుకొని చౌకగా స్థలాలు అంటూ విక్రయించిన స్థలాలనే మరలా విక్రయించడం, తప్పుడు రికార్డులను సృష్టించడం, ప్రభుత్వ భూములను లే అవుట్లుగా అభివృద్ధి పరిచి విక్రయిండంతో తెలియని కొంత మంది వాటిని కొనుగోలు చేసి మోసపోతున్నారు. రియల్ మోసాలు వలన పెద్దల మాట ఎలా ఉన్నా మధ్య తరగతి వారి సొంత ఇంటి ఆశలు పేక మేడల్లా కూలి పోతున్నాయి. వ్యాపారులతో పాటు, బడాబాబులు కూడా ఇలాంటి మోసాలకు పాల్పడుతుండడంతో మధ్య తరగతి కుటుంబీకులు వారితో వేగ లేక కోర్టులు చుట్టూ తిరగలేక మిన్నకుండి పోతున్నారు. నగరంతో పాటు భీమిలి, ఆనందపురం, పెందుర్తి మండలాల్లో ఇలాంటి సంఘటనలు ఎన్నో వెలుగు చూసినా అధికారులు మాత్రం తీసుకున్న చర్యలు కానరావడంలేదు. పోలీసు, రెవిన్యూ, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది సమన్వయంతో పని చేయకపోవడం వలన, మోసగాళ్లు పని మరింత సులభమవుతోంది. నగరం నడిబొడ్డున ఇటీవల ఎంపీ కంభంపాటి రామ్మోహనరావు స్థలాన్ని తప్పుడు రికార్డులతో స్వాధీనం చేసుకోవడానికి కొంత మంది యత్నించగా, పలుకుబడితో అడ్డుకోగలిగారు. ఒక ఎంపీ పరిస్థితే అలా ఉంటే సామాన్యుడు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గతంలో మధురవాడలో ఇళ్ల స్థలాలు కొనుగోలు వ్యవహారంలో సినీ నటి అనుష్క, నాగార్జున వంటి వారినే బురిడి కొట్టించారు. తప్పుడు డాక్యుమెంట్లుతో వారికి స్థలాలు విక్రయించడంతో వారు కోర్డు కేసులను ఎదుర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు కొకొల్లలు. మోసపోయిన వారు పోలీసులను ఆశ్రయిస్తే సివిల్ కేసులని కొట్టిపారేయడం, రెవెన్యూ అధికారులు సరైన సమాచారం అందించక పోవడంతో బాధితుల పరిస్థితి అయోమయంగా మారుతోంది. రియల్ మోసాలు రోజు రోజుకు పెరుగు పోతుండడంతో అందరినీ విస్మయపరుస్తోంది. రెవెన్యూ అధికారులు రికార్డులను సక్రమంగా నిర్వహించకపోవడంతో, వీరితో పాటు, రిజిస్ట్రార్ కార్యాలయాల సిబ్బంది కూడా రియల్ ఇస్టేట్ వ్యాపారులకు అనుకూలంగా వ్యవహరిస్తుండడంతో మోసాలకు ఆస్కారం ఏర్పడుతోంది. - ఆనందపురం మోసాలకు ఆస్కారం ఇలా... వ్యవసాయ భూములకు సంబంధించి రెవెన్యూ రికార్డులలోను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లోను సమాచారం లభిస్తుంది. అదే నివాస ప్రాంతాలుగా మార్పు చేస్తే ఆ సమాచారం లభ్యం కాదు. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలువురికి రిజిస్ట్రేషన్లు చేయగలుగుతున్నారు. వ్యవసాయ భూముల విక్రయాలు విషయంలో పట్టాదారు పాసుపుస్తకాలలో రిజిస్ట్రార్లు విక్రయ సమాచారం పొందుపరుస్తారు. స్థలాలు విక్రయాల విషయంలో హక్కు పత్రాలపై ఎలాంటి నమోదులు ఉండవు. మీ సేవ కేంద్రాలలో ఈసీ (ఎన్కంబెర్స్మెంట్ సర్టిఫికేట్)లు 1985 నుంచి జరిగే లావాదేవీలకు మాత్రమే ఆన్లైన్లో లభ్యమవుతున్నాయి. అంతకు ముందు జరిగే లావాదేవీల కోసం, సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాల్లో పరిశీలన కోసం ధరఖాస్తు చేసుకుంటే పరిశీలించి అందిస్తున్నారు. దీన్ని కొంత మంది మేనేజ్ చేయడం వలన ఒక్కో సారి నిల్ అని వస్తోంది. దీంతో ఒకే డాక్యుమెంట్‌తో పలుమార్లు రిజిస్టేషన్లు జరిగిపోతున్నాయి. పలు మీ సేవా కేంద్రాలలో కొందరికి అనుకూలంగా ఆస్థిలకు సంబందించిన వాస్తవ సమాచారాన్ని తొక్కిపెట్టి జారీ చేస్తున్నారు. దీని వలన క్రయవిక్రయాలు బయటపడక రెండో సారి విక్రయాలకు ఆస్కారం ఏర్పడుతోంది. సీలింగ్ భూములు ప్రభుత్వ స్వాధీనంలో ఉన్న అసలు హక్కుదారులు పేర్లే ఇంకా రికార్డులలో కొనసాగుతుండడంతో 1బి రికార్డు కాపీ ఆధారంగా అక్రమంగా రిజిస్ట్రేషన్లు చేయడానికి ఆస్కారం ఏర్పడుతోంది. పాత డాక్యుమెంట్లపై ఫోటోలు ఉండవు. దీన్నీ ఆసరాగా చేసుకొని అమ్మేసిన ఆస్థులనే మరలా నకిలీ వ్యక్తులతో వారిని వారసులుగా చూపించి నేరుగా విక్రయాలు జరుపుతున్నారు. 1బిలో పొరపాటున భూ హక్కుదారుల కాకుండా, వేరే పేర్లు నమోదైతే రియాల్టర్లు దాన్నే ఆసరాగా చేసుకొని, విక్రయం చేసి సొమ్ము చేసుకుంటున్నారు. పట్టా భూములను కొనుగోలు చేస్తున్న వ్యాపారులు దాన్ని ఆనుకొని ఉన్న బంజరు భూములను కొనుగోలు చేసి వాటితో కలిపి లే అవుట్లును వేసి విక్రయిస్తున్నారు. పూర్తిస్థాయి సర్వే జరిపితే గానీ పట్టా ఏదో బంజరు భూమి ఏదో తెలియదు. ఈ లోగా కొనుగోలుదారులు మోసపోతున్నారు. మధురవాడ, ఆనందపురం, భీమిలి, పెందుర్తి ప్రాంతాలలో స్థలాలు కొనుగోలు చేసిన వారు విదేశాలలో స్థిరపడి ఉన్నారు. అలాంటి వారి వివరాలు సేకరించి, నకిలీ డాక్యుమెంట్లులను సృష్టించి విక్రయాలు జరుపుతున్నారు. తీసుకోవలసిన జాగ్రత్తలు కొనుగోలు చేయబోయే స్థిరాస్తికి సంబంధించి తొలుత ఈసీ (ఎన్‌కంబర్స్‌మెంట్ సర్టిఫికేట్)ని తీసుకొని డాక్యుమెంట్‌తో సరిపోల్చుకోవాలి. వారసత్వ ఆస్థి అయితే ఎస్.ఎఫ్.ఎ (సెటిల్మెంట్ ఫెయిర్ అడంగల్) రికార్డుని పరిశీలించిఅసలు హక్కు దారులను రూఢీ చేసుకోవాలి. కొనుగోలు ఆస్తిఅయితే లింకు డాక్యుమెంట్లు తప్పనిసరి. అవి కూడా ఎస్.ఎఫ్.ఎ రికార్డులో ఉన్న హక్కుదారుడు నుంచి సంక్రమించినట్టు వరుస డాక్యుమెంట్లు ఉన్నాయో లేదో పరిశీలన చేసుకోవాలి. అసలు హక్కుదారు మరణిస్తే వారి కుటుంబ వారసత్వ ధ్రువపత్రాన్ని తప్పకుండా పరిశీలించి అధికారులచే నిర్థారించుకోవాలి. అమ్మకదారు పట్టాదారు పాసుపుస్తకాలు కలిగి ఉంటే వారి పేరు 1బి రికార్డులలో నమోదయింది లేనిదీ సరిచూసుకోవాలి. లేదంటే బ్యాంకులు రుణాలు అందించడానికి అంగీకరించవు. కొనుగోలు చేసిన స్థలాలు తప్పకుండా సర్వే చేయించుకొని కొనుగోలు చేస్తున్న స్థలం డాక్యుమెంట్లో ఉన్న సర్వే నెంబర్లలో ఉన్నదీ లేనిదీ నిర్ధారించుకోవాలి. లేదంటే పట్టా భూముల సర్వే నెంబర్లతో ప్రభుత్వ భూములను విక్రయించే అవకాశం ఉంది. కొనుగోలు చేస్తున్న ఆస్థి యొక్క సర్వే నెంబర్లు ప్రభుత్వ భూములు, సీలింగ్ భూములు, కోర్టు వివాదాలు, ప్రభుత్వం వివిధ అవసరాలకు సేకరించిన జాబితాలో ఉందో లేదో రెవిన్యూ అధికారులు సంప్రదించి నిర్ధారించుకోవాలి. ఎనీవేర్ రిజిస్టేషన్లతోనూ ఇబ్బందులు... కక్షిదారుల సౌకర్యార్థం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎనీవేర్ రిజిష్ట్రేషన్ వలన కూడా పలు ఇబ్బందులు ఉన్నాయి. ఆస్తులను తమ పరిధిలోని సబ్ రిజిస్ట్టార్ కార్యాలయాల్లోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవడమే ఉత్తమం. వేరే ప్రాంతలో చేస్తే పెండింగ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అలాగే రిజిస్ట్రేషన్ ఒక చోట ఆస్తి వెరిఫికేషన్ మరో చోట జరగడం వలన పొరపాటు జరిగే అవకాశం ఉంది. మాతృ కార్యాలయంలోనే పరిశీలన చేసుకోవడానికి అన్ని రికార్డులు అందుబాటులో ఉంటాయి. ఇలా చేస్తే మంచిది. రెవిన్యూ శాఖాధికారులు ఎస్.ఎఫ్.ఎ, నిషేధిత ఆస్తుల జాబితా (22ఎ) సీలింగ్ భూములు, ప్రభుత్వ ఆస్థుల జాబితా, ప్రభుత్వ అవసరాల కోసం సేకరించిన భూములు జాబితాలను ప్రజలకు అందుబాటులో ఉంచాలి. సబ్ రిజిస్టార్ కార్యాలయంలో ఆస్థుల వివరాలను కక్షిదారులు నేరుగా పరిశీలించుకోవడానికి అవకాశం కల్పించాలి. -
ఆర్థిక చిక్కుల్లో రాష్ట్రం
వేస్ అండ్ మీన్స్ను ఆశ్రయించిన ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: చరిత్ర పునరావృతమైంది. రాష్ట్రం మళ్లీ ఆర్థికంగా ఇబ్బందుల్లో చిక్కుకుంది. గతంలో చంద్రబాబు పాలనలో తరచూ వేస్ అండ్ మీన్స్ను రాష్ట్ర ప్రభుత్వం ఆశ్రయించింది.బాబు తొలిసారి సీఎంగా పగ్గాలు చేపట్టిన 1995 నుంచి తిరిగి గద్దె దిగేవరకు రాష్ట్రానిది ఓవర్ డ్రాఫ్టుల పరిస్థితే. మళ్లీ అదే గడ్డు పరిస్థితిని ఇప్పుడు ఆయన హయాంలోనే రాష్ట్రం ఎదుర్కొంటోంది. ఇటీవల సీఎం ఢిల్లీ పర్యటన సందర్భంగా రాష్ట్రం ఆర్థిక పరిస్థితి గురించి కేంద్రంతో మొరపెట్టుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇవ్వడానికి కూడా డబ్బుల్లేవని తెలిపారు. ఆయన ఢిల్లీ నుంచి వచ్చిన వెంటనే ప్రభుత్వం వేజ్ అండ్ మీన్స్ను ఆశ్రయించింది. సోమవారం రూ.470 కోట్ల మేర వేస్ అండ్ మీన్స్కు రాష్ట్ర ప్రభుత్వం వెళ్లింది. వేస్ అండ్ మీన్స్కు వె ళ్లడం అంటే రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొనడమే. ఈ విధానంలో రూ.1,500 కోట్లవరకు వెళ్లవచ్చని రాష్ట్ర బడ్జెట్లో పేర్కొన్నారు. ఆపై అవకాశం లేదు. ఈ నిధులు అయిపోతే ఇక ఓవర్‌డ్రాఫ్ట్ ఒక్కటే దిక్కు. రాష్ట్ర ప్రభుత్వం చూపిస్తున్న లెక్కల ప్రకారం చూస్తే ఓవర్‌డ్రాఫ్టుకు త్వరలో వెళ్లవచ్చని తెలుస్తోంది. ఆ దిశకూ వెళ్లే అవకాశముందని ఆర్థికశాఖ వర్గాలు తెలిపాయి. ఇక బడ్జెట్లో పేర్కొన్న మేరకు రాష్ట్రం తన సెక్యూరిటీల విక్రయం ద్వారా జనవరి నుంచి మార్చి వరకు రూ.3 వేల కోట్లు అప్పు చేసే వీలుంది. రాష్ట్ర ప్రభుత్వ విన్నపం మేరకు ఇదివరకే కేంద్రం ఇందుకు అనుమతించింది. ఈ అప్పు చేసుకునే అవకాశమున్నప్పటికీ దాన్ని వినియోగించుకోకుండా రాష్ట్ర ప్రభుత్వం వేస్ అండ్ మీన్స్కు వెళ్లడం గమనార్హం. -
మధురమైన కెరీర్‌కు.. వైన్ ఎక్స్పర్ట్!
సురాపానం.. మనదేశంలో దీని ప్రసక్తి పురాణాల కాలం నుంచే ఉంది. ఆధునిక కాలంలో లిక్కర్ ప్రాముఖ్యత ఎనలేనిది. ఇది ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. పరిశ్రమలో మద్యం తయారీ నుంచి అది వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశల్లో సేవలందించేవారే.. వైన్ ఎక్స్పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా రూ.లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో లిక్కర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వైన్ నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఇందులో భారీ వేతనాలు అందుతుండడం విశేషం. యువత దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు బంగారుమయమవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు. దేశంలో నిపుణుల కొరత వైన్ ఎక్స్‌పర్ట్స్‌కు మద్యం తయారీ కంపెనీలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలు, మద్యం ఎగుమతి దిగుమతి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తగిన అసక్తి, వనరులు ఉంటే సొంతంగా వైన్ కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. వైనరీలు, బార్లు, రెస్టారెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. మద్యం వ్యాపారంలోకి కూడా ప్రవేశించొచ్చు. ప్రస్తుతం భారత్‌లో వైన్ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా నిపుణులు లేరని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ హోటళ్లలో అతిథుల అభిరుచికి, సందర్భానికి, వడ్డిస్తున్న ఆహారానికి తగిన మధువును అందించడం వైన్ నిపుణుల విధి. వైన్ జాబితాను రూపొందించాలి. మద్యం కంపెనీల్లో ముడి సరకు నాణ్యతను పరిశీలించి, లిక్కర్ తయారీని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తయారైన మద్యాన్ని రుచి చూసి, సంతృప్తి చెందిన తర్వాతే విపణిలోకి విడుదల చేయాలి. కావాల్సిన నైపుణ్యాలు మద్యం నిపుణులు తరచుగా వైన్యార్డ్ యజమానాలు, చెఫ్‌లు, డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. కాబట్టి మెరుగైన ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. వివిధ రకాల మద్యంపై పరిజ్ఞానం పెంచు కోవాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కనీసం ఒక విదేశీ భాషపై అవగాహన ఉండడం మంచిది. ఫ్రాన్స్, ఇటలీలో వైన్ ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. ఫ్రెంచీ లేదా ఇటాలియన్లో పట్టు సాధిస్తే కెరీర్ పరంగా త్వరగా ఎదగడానికి వీలుంటుంది. వైన్ కన్సల్టెంట్‌గా పనిచేసేవారికి నాయకత్వ లక్షణాలు ఉండాలి. అర్హతలు మనదేశంలో హోటల్ మేనేజ్మెంట్ కోర్సుల్లో భాగంగా వైన్ సర్వీస్, వైన్ టేస్టింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. కొన్ని లిక్కర్ సంస్థలు కూడా దీనిపై ట్రైనింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత హోటల్ మేనేజ్మెంట్ కోర్సులో చేరొచ్చు. విదేశాల్లో అయితే ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి. వేతనాలు వైన్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. జూనియర్ వైన్ ఎక్స్పర్ట్ కెరీర్ ప్రారంభంలోనే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు అందుకోవచ్చు. సీనియర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం ఇంకా పెరుగుతుంది. వైన్ కన్సల్టెంట్‌గా సొంతంగా పనిచేసుకుంటే డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షలాది రూపాయలు ఆర్జించే కన్సల్టెంట్లు ఎందరో ఉన్నారు. కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు ఇండియన్ వైన్ అకాడమీ వెబ్సైట్: www.indianwineacademy.com వైన్ అకాడమీ ఆఫ్ ఇండియా వెబ్సైట్:www.wineacademyofindia.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైన్ అండ్ బేవరేజ్ స్టడీస్ వెబ్సైట్: http://iwbs.in/ వైన్ అండ్ స్పిరిట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ వెబ్సైట్: www.wsetglobal.com/ వైన్ స్పెక్టేటర్ స్కూల్ వెబ్సైట్: www.winespectator.com ఇంటర్నేషనల్ వైన్ గిల్డ్-యూఎస్ఏ వెబ్సైట్:www.internationalwineguild.com ఇన్స్టిట్యూట్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ వైన్ వెబ్సైట్: www.mastersofwine.org జాబ్స్, అడ్మిషన్సఅలర్ట్స హిందూస్థాన్ షిప్‌యార్డ్ హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. కేర్‌టేకర్ షిప్ బిల్డింగ్ సబ్‌మెరైన్ రిపెయిర్స సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్ హెచ్ఆర్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ వర్క్స్ అర్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం వెబ్సైట్ చూడొచ్చు. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15 వెబ్సైట్: http://www.hsl.gov.in ఓఎన్జీసీ ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సదరన్ సెక్టార్ రాజమండ్రి, కాకినాడ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. పోస్టులు: టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ) అసిస్టెంట్ టెక్నీషియన్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) జూనియర్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్) జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (బాయిలర్) జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్ (హెచ్వీ) జూనియర్ అసిస్టెంట్ జూనియర్ సెక్యూరిటీ సూపర్వైజర్ జూనియర్ ఫైర్ సూపర్వైజర్ జూనియర్ ఫైర్‌మ్యాన్ అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం వెబ్సైట్ చూడవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 27 రాతపరీక్ష తేది: నవంబరు 16 వెబ్సైట్: www.ongcindia.com ఓయూలో ఈవినింగ్ ఎంబీఏ ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)... ఎంబీఏ(ఈవినింగ్) కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది. ఎంబీఏ(ఈవినింగ్)/ఎంబీఏ-ఈవినింగ్(పార్ట్‌టైమ్) అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మేనేజీరియల్/ఎగ్జిక్యూటివ్/అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐసెట్-2014లో అర్హత సాధించాలి. దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 27 వెబ్సైట్: www.osmania.ac.in ఐఐటీ-గాంధీనగర్‌లో పీహెచ్డీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) -గాంధీనగర్.. వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది. పీహెచ్డీ అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఏ/ఎమ్మెస్సీ/బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణత. దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 5 వెబ్సైట్: www.iitgn.ac.in కాంపిటీటివ్ కౌన్సెలింగ్: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు? -కె.రవికాంత్. అంబర్‌పేట రీజనింగ్ విభాగంలో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఇందులో వెర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, తార్కిక వెన్ చిత్రాలు, సిల్లాయిజమ్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాన్ వెర్బల్ విభాగం నుంచి సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, మిర్రర్/వాటర్ ఇమేజెస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇందులో మంచి స్కోర్ సాధించవచ్చు. గతంలో వచ్చిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే.. 1. బ్రెడ్, గోధుమకు సంబంధించింది. అదేవిధంగా ఇటుకకు ఏ పదార్థంతో సంబంధం ఉంటుంది? 1) మట్టి 2) బిల్డింగ్ 3) దీర్ఘఘనం 4) మరలు సమాధానం: 1 విశ్లేషణ: బ్రెడ్.. గోధుమ నుంచి తయారవుతుంది. అదేవిధంగా ఇటుక.. మట్టి నుంచి రూపొందుతుంది. ఈ విభాగంలోని ఒక ప్రశ్న సాధనకు కేవలం 54 సెకన్ల సమయం మాత్రమే లభిస్తుంది. అంటే నిమిషం కంటే తక్కువ సమయంలోనే వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించాలి. ఇందుకు ఏకైక మార్గం ప్రాక్టీస్. తద్వారా సమస్య సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాల్లోని సమస్యలను సాధించి, ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. ఇన్పుట్స్: బండ రవిపాల్ రెడ్డి, సీనియర్ ఫ్యాకల్టీ -
దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోంది: ప్రధాని
ప్రస్తుత ఆర్థిక పరిస్థితితో దేశం క్లిష్ట పరిస్థితులు ఎదుర్కొంటోందని ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఆర్థిక మందగమనానికి దేశీయ పరిస్థితులు కొంతవరకు కారణమని ఆయన పేర్కొన్నారు. దీన్ని పూర్తిగా కొట్టిపారేయలేమని రాజ్యసభలో అన్నారు. దేశ ఆర్థిక పరిస్థితిపై రాజ్యసభలో రేపు ప్రకటన చేస్తామని ప్రధాని చెప్పారు. మరోవైపు డాలర్‌తో రూపాయి మారకం విలువ పతనంపై లోక్‌సభ దద్దరిల్లింది. రూపాయి పతనంపై ప్రధాని ప్రకటన చేయాలని విపక్షాలు పట్టుబట్టడంతో సభా కార్యకలాపాలు స్తంభించాయి. దీంతో సభను స్పీకర్ మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. గత కొద్ది రోజులుగా రూపాయి భారీగా పతనమవుతూ వస్తోంది. నిన్న ఆల్‌టైమ్ కనిష్టం... 68.80కి కుదేలయింది.