మధురమైన కెరీర్‌కు.. వైన్ ఎక్స్‌పర్ట్!
సురాపానం.. మనదేశంలో దీని ప్రసక్తి పురాణాల కాలం నుంచే ఉంది. ఆధునిక కాలంలో లిక్కర్ ప్రాముఖ్యత ఎనలేనిది. ఇది ప్రభుత్వాల ఆర్థిక పరిస్థితులనే ప్రభావితం చేసే స్థాయికి ఎదిగింది. పరిశ్రమలో మద్యం తయారీ నుంచి అది వినియోగదారుడికి చేరేవరకు వివిధ దశల్లో సేవలందించేవారే.. వైన్ ఎక్స్‌పర్ట్స్. ప్రపంచవ్యాప్తంగా రూ.లక్షల కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలతో లిక్కర్ రంగం వేగంగా విస్తరిస్తోంది. దీంతో వైన్ నిపుణులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయి. మిగిలిన రంగాలతో పోలిస్తే ఇందులో భారీ వేతనాలు అందుతుండడం విశేషం. యువత దీన్ని కెరీర్‌గా ఎంచుకుంటే భవిష్యత్తు బంగారుమయమవుతుందని నిస్సందేహంగా చెప్పొచ్చు.
దేశంలో నిపుణుల కొరత
వైన్ ఎక్స్‌పర్ట్స్‌కు మద్యం తయారీ కంపెనీలతోపాటు హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ అండ్ బేవరేజ్ సంస్థలు, మద్యం ఎగుమతి దిగుమతి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. తగిన అసక్తి, వనరులు ఉంటే సొంతంగా వైన్ కన్సల్టెంట్‌గా కెరీర్‌ను ప్రారంభించొచ్చు. వైనరీలు, బార్లు, రెస్టారెంట్లకు సలహాలు, సూచనలు ఇవ్వొచ్చు. మద్యం వ్యాపారంలోకి కూడా ప్రవేశించొచ్చు. ప్రస్తుతం భారత్‌లో వైన్ నిపుణుల కొరత తీవ్రంగా ఉంది. డిమాండ్‌కు సరిపడా నిపుణులు లేరని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. ప్రముఖ హోటళ్లలో అతిథుల అభిరుచికి, సందర్భానికి, వడ్డిస్తున్న ఆహారానికి తగిన మధువును అందించడం వైన్ నిపుణుల విధి. వైన్ జాబితాను రూపొందించాలి. మద్యం కంపెనీల్లో ముడి సరకు నాణ్యతను పరిశీలించి, లిక్కర్ తయారీని పర్యవేక్షించాల్సి ఉంటుంది. అంతేకాకుండా తయారైన మద్యాన్ని రుచి చూసి, సంతృప్తి చెందిన తర్వాతే విపణిలోకి విడుదల చేయాలి.
కావాల్సిన నైపుణ్యాలు
మద్యం నిపుణులు తరచుగా వైన్‌యార్డ్ యజమానాలు, చెఫ్‌లు, డిస్ట్రిబ్యూటర్లు, కస్టమర్లతో సంప్రదింపులు జరపాల్సి ఉంటుంది. కాబట్టి మెరుగైన ఇంటర్‌పర్సనల్, కమ్యూనికేషన్ స్కిల్స్ తప్పనిసరిగా ఉండాలి. వివిధ రకాల మద్యంపై పరిజ్ఞానం పెంచు కోవాలి. ఈ రంగంలో వస్తున్న మార్పులను ఎప్పటికప్పుడు తెలుసుకోవాలి. కనీసం ఒక విదేశీ భాషపై అవగాహన ఉండడం మంచిది. ఫ్రాన్స్, ఇటలీలో వైన్ ఉత్పత్తి అధికంగా జరుగుతుంది. ఫ్రెంచీ లేదా ఇటాలియన్‌లో పట్టు సాధిస్తే కెరీర్ పరంగా త్వరగా ఎదగడానికి వీలుంటుంది. వైన్ కన్సల్టెంట్‌గా పనిచేసేవారికి నాయకత్వ లక్షణాలు ఉండాలి.
అర్హతలు
మనదేశంలో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో భాగంగా వైన్ సర్వీస్, వైన్ టేస్టింగ్‌పై శిక్షణ ఇస్తున్నారు. కొన్ని లిక్కర్ సంస్థలు కూడా దీనిపై ట్రైనింగ్‌ను ఆఫర్ చేస్తున్నాయి. ఇంటర్మీడియెట్ పూర్తయిన తర్వాత హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సులో చేరొచ్చు. విదేశాల్లో అయితే ఈ రంగానికి సంబంధించి ప్రత్యేకంగా సర్టిఫికేషన్ కోర్సులు ఉన్నాయి.
వేతనాలు
వైన్ నిపుణులకు అధిక వేతనాలుంటాయి. జూనియర్ వైన్ ఎక్స్‌పర్ట్ కెరీర్ ప్రారంభంలోనే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేలు అందుకోవచ్చు. సీనియర్‌కు నెలకు రూ.40 వేల నుంచి రూ.60 వేల వేతనం లభిస్తుంది. అనుభవాన్ని బట్టి వేతనం ఇంకా పెరుగుతుంది. వైన్ కన్సల్టెంట్‌గా సొంతంగా పనిచేసుకుంటే డిమాండ్‌ను బట్టి ఎంతైనా సంపాదించుకోవచ్చు. లక్షలాది రూపాయలు ఆర్జించే కన్సల్టెంట్లు ఎందరో ఉన్నారు.
కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఇండియన్ వైన్ అకాడమీ
వెబ్‌సైట్: www.indianwineacademy.com
వైన్ అకాడమీ ఆఫ్ ఇండియా
వెబ్‌సైట్:www.wineacademyofindia.com
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైన్ అండ్ బేవరేజ్ స్టడీస్
వెబ్‌సైట్: http://iwbs.in/
వైన్ అండ్ స్పిరిట్ ఎడ్యుకేషన్ ట్రస్ట్
వెబ్‌సైట్: www.wsetglobal.com/
వైన్ స్పెక్టేటర్ స్కూల్
వెబ్‌సైట్: www.winespectator.com
ఇంటర్నేషనల్ వైన్ గిల్డ్-యూఎస్‌ఏ
వెబ్‌సైట్:www.internationalwineguild.com
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మాస్టర్స్ ఆఫ్ వైన్
వెబ్‌సైట్: www.mastersofwine.org
జాబ్స్, అడ్మిషన్‌సఅలర్‌ట్స
హిందూస్థాన్ షిప్‌యార్డ్
హిందూస్థాన్ షిప్‌యార్డ్ వివిధ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
కేర్‌టేకర్ షిప్ బిల్డింగ్
సబ్‌మెరైన్ రిపెయిర్‌స
సెక్యూరిటీ అండ్ ఫైర్ సర్వీస్
హెచ్‌ఆర్ అడ్మినిస్ట్రేషన్ సివిల్ వర్క్స్
అర్హతలు, వయోపరిమితి తదితర వివరాల కోసం వెబ్‌సైట్ చూడొచ్చు.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబర్ 15
వెబ్‌సైట్: http://www.hsl.gov.in
ఓఎన్‌జీసీ
ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ లిమిటెడ్ సదరన్ సెక్టార్ రాజమండ్రి, కాకినాడ విభాగాల్లో వివిధ ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు:
టెక్నికల్ అసిస్టెంట్ గ్రేడ్-3 (కెమిస్ట్రీ)
అసిస్టెంట్ టెక్నీషియన్
అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్)
జూనియర్ అసిస్టెంట్ రిగ్‌మ్యాన్ (డ్రిల్లింగ్)
జూనియర్ అసిస్టెంట్ టెక్నీషియన్ (బాయిలర్)
జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ)
జూనియర్ మోటార్ వెహికల్ డ్రైవర్ (హెచ్‌వీ)
జూనియర్ అసిస్టెంట్
జూనియర్ సెక్యూరిటీ సూపర్‌వైజర్
జూనియర్ ఫైర్ సూపర్‌వైజర్
జూనియర్ ఫైర్‌మ్యాన్
అర్హతలు, వయోపరిమితి తదితర పూర్తి వివరాల కోసం వెబ్‌సైట్ చూడవచ్చు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరి తేది: సెప్టెంబర్ 27
రాతపరీక్ష తేది: నవంబరు 16
వెబ్‌సైట్: www.ongcindia.com
ఓయూలో ఈవినింగ్ ఎంబీఏ
ఉస్మానియా యూనివర్సిటీ(ఓయూ)... ఎంబీఏ(ఈవినింగ్) కోర్సుకు దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ(ఈవినింగ్)/ఎంబీఏ-ఈవినింగ్(పార్ట్‌టైమ్)
అర్హతలు: కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి. మేనేజీరియల్/ఎగ్జిక్యూటివ్/అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కనీసం రెండేళ్ల అనుభవం ఉండాలి. ఐసెట్-2014లో అర్హత సాధించాలి.
దరఖాస్తులకు చివరి తేది: సెప్టెంబరు 27
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఐఐటీ-గాంధీనగర్‌లో పీహెచ్‌డీ
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఐఐటీ) -గాంధీనగర్.. వివిధ విభాగాల్లో పీహెచ్‌డీలో ప్రవేశానికి దరఖాస్తులను కోరుతోంది.
పీహెచ్‌డీ
అర్హతలు: సంబంధిత విభాగంలో 55 శాతం మార్కులతో ఎంఏ/ఎమ్మెస్సీ/బీటెక్/ఎంటెక్ ఉత్తీర్ణత.
దరఖాస్తులకు చివరి తేది: అక్టోబర్ 5
వెబ్‌సైట్: www.iitgn.ac.in
కాంపిటీటివ్ కౌన్సెలింగ్: పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలో రీజనింగ్ నుంచి ఎలాంటి ప్రశ్నలు ఇస్తారు?
-కె.రవికాంత్. అంబర్‌పేట
రీజనింగ్ విభాగంలో వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్ అనే రెండు అంశాలు ఉంటాయి. ఇందులో వెర్బల్ రీజనింగ్ నుంచి ఎక్కువ శాతం ప్రశ్నలు వస్తాయి. వెర్బల్ రీజనింగ్‌లో సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్, కోడింగ్ అండ్ డీ కోడింగ్, రక్త సంబంధాలు, దిక్కులు, తార్కిక వెన్ చిత్రాలు, సిల్లాయిజమ్ సంబంధిత అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. నాన్ వెర్బల్ విభాగం నుంచి సిరీస్, అనాలజీ, క్లాసిఫికేషన్స్, మిర్రర్/వాటర్ ఇమేజెస్ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. మాదిరి ప్రశ్నపత్రాలను ఎక్కువగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఇందులో మంచి స్కోర్ సాధించవచ్చు.
గతంలో వచ్చిన ఒక ప్రశ్నను పరిశీలిస్తే..
1. బ్రెడ్, గోధుమకు సంబంధించింది. అదేవిధంగా ఇటుకకు ఏ పదార్థంతో సంబంధం ఉంటుంది?
1) మట్టి 2) బిల్డింగ్
3) దీర్ఘఘనం 4) మరలు
సమాధానం: 1
విశ్లేషణ: బ్రెడ్.. గోధుమ నుంచి తయారవుతుంది. అదేవిధంగా ఇటుక.. మట్టి నుంచి రూపొందుతుంది.
ఈ విభాగంలోని ఒక ప్రశ్న సాధనకు కేవలం 54 సెకన్ల సమయం మాత్రమే లభిస్తుంది. అంటే నిమిషం కంటే తక్కువ సమయంలోనే వేగంగా, కచ్చితత్వంతో సమాధానాన్ని గుర్తించాలి. ఇందుకు ఏకైక మార్గం ప్రాక్టీస్. తద్వారా సమస్య సాధనలో వేగం, కచ్చితత్వం పెరుగుతుంది. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నల క్లిష్టత పదో తరగతి స్థాయిలో ఉంటుంది. కాబట్టి 6 నుంచి 10వ తరగతి వరకు ఉన్న గణిత పుస్తకాల్లోని సమస్యలను సాధించి, ఆ తర్వాత గత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి.
ఇన్‌పుట్స్: బండ రవిపాల్ రెడ్డి,
సీనియర్ ఫ్యాకల్టీ