ఎమర్జెన్సీ వీసా పొందాలంటే... | In order to get an emergency visa | Sakshi
Sakshi News home page

ఎమర్జెన్సీ వీసా పొందాలంటే...

Published Fri, Feb 20 2015 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:35 PM

ఎమర్జెన్సీ వీసా పొందాలంటే...

ఎమర్జెన్సీ వీసా పొందాలంటే...

నా మేనల్లుడు అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. అనుకోకుండా అనారోగ్యం పాలయ్యి, ప్రస్తుతం వెంటిలేటర్ మీద ఉన్నాడు. తోడుగా తన భార్య మాత్రమే ఉంది. ఒక్కతే కష్టపడుతూ ఉండటం వల్ల సహాయం కోసం మా చెల్లెలిని, బావగారిని (అబ్బాయి తల్లిదండ్రులు), వాళ్ల రెండో అబ్బాయిని అమెరికా పంపించాలని అనుకుంటున్నాను. ఇప్పటికే వీసా ఫీజు చెల్లించేశాను. అయితే సమయం పడుతుందంటున్నారు. వీసా ఇంటర్వ్యూ కోసం ఎమర్జెన్సీ స్లాట్ సంపాదించాలంటే ఏం చేయాలి?
 - ఎం.రవీంద్రనాథ్

రవీంద్రగారూ... మీరు వెంటనే కాన్సులేట్ ఆఫీసుకు ఒక మెయిల్ పంపండి. మీ సమస్యను తెలియజేస్తూ మెయిల్ పెడితే... వారు తక్షణం స్పందిస్తారు. మీకు సమాధానం ఇవ్వడమో, మిమ్మల్ని కాంటాక్ట్ చేయడమో చేస్తారు. ఒక్కసారి మీరు బ్యాంకులో డబ్బు కట్టేశాక... అది మీరు క్రియేట్ చేసుకున్న ప్రొఫైల్‌లో అప్‌డేట్ అయిపోతుంది. మీరు ఈ160 ఫారంను అపాయింట్‌మెంట్ సెక్షన్‌లో సబ్‌మిట్ చేసి, ఎమర్జెన్సీ అపాయింట్‌మెంట్ కోసం రిక్వెస్ట్ చేయండి.

నా భర్త ఆరేళ్లుగా అమెరికాలో ఉంటున్నారు. మూడో నెల గర్భవతిగా ఉన్నప్పుడు నన్ను ఇండియాలో వదిలి వెళ్లిపోయారు. ఇంతవరకూ తిరిగి రాలేదు. ఇప్పుడు మా పాపకు ఐదేళ్లు. నేను నా భర్త కోసం, నా కూతురు తన తండ్రి కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం. నేను తనని కాంటాక్ట్ చేయడానికి ప్రయత్నించినా వీలు కాలేదు. ఎందుకంటే నాకు తన పాస్‌పోర్ట్ నంబర్ తప్ప ఇతర వివరాలేమీ తెలియదు. ఎక్కడ పని చేస్తున్నాడో, ఎక్కడ నివసిస్తున్నాడో కూడా తెలీదు. తను ఎక్కడున్నాడో తెలుసుకోవడానికి నేను ఏం చేయాలి?
 - ఓ బాధితురాలు, తిరుపతి నుంచి

మీ పరిస్థితి నిజంగా బాధాకరమే. మీరే కాదు... చాలామంది అమ్మా యిలు ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎన్నారై సంబంధాలు చేసుకుని మోసపోతున్నారు. భర్త కనీసం ఎక్కడున్నాడో కూడా తెలియక, అతడిని ఎలా చేరుకోవాలో అర్థం కాక విలవిల్లాడిపోతున్నారు. రెండు దేశాలకు సంబంధించిన వ్యవహారం కావడంతో ఈ కేసుల్ని డీల్ చేయడం పోలీసులకు కూడా కాస్త కష్టంగానే ఉంటోంది. ఒక పని చేయండి. మీరు వెంటనే ఒక లాయర్‌ను కానీ ఎవరైనా సామాజిక కార్యకర్తను కానీ సంప్ర దించండి. వారి సహాయంతో మీ పెళ్లి ఎక్కడైతే జరిగిందో, ఆ ఊరి పోలీస్ స్టేషన్లో ఓ కంప్ల యింట్ ఇవ్వండి. ఇండియాలో ఉన్న మీ భర్త బంధువుల ద్వారా అతడి ఆచూకీని తెలుసుకోవ డానికి ప్రయత్నించండి. వీలు కాకపోతే ఇండియాలో ఉన్న యూఎస్ ఎంబసీని సంప్రదించి, సమస్యను వివరించండి. తద్వారా చట్టబద్ధంగా అతని వివరాలు సంపాదించి, నోటీసులు పంపేందుకు వీలవుతుంది. కావాలంటే మరొకటి కూడా చేయవచ్చు. అతనితో మీ పెళ్లి జరిగిందని నిరూపించే ఫొటోలు, వీడియోలు... పాప అతని కూతురే అని నిరూపించే ఆధారాలతో యూఎస్ ఎంబసీని సంప్రదిస్తే... అమెరికా వచ్చేందుకు విజిటింగ్ వీసాని పొందవచ్చు. అమెరికా వచ్చి అతడిని వెతికే ప్రయత్నం చేయవచ్చు.
 
 లక్ష్మీ దేవినేని, చైర్‌పర్సన్,
 ‘తానా’ ఇమిగ్రేషన్ కమిటీ
 
 మీ సందేహాలు, సమస్యలను తెలియజేయాల్సిన చిరునామా...
 గైడ్, సాక్షి దినపత్రిక, సాక్షి టవర్స్, రోడ్ నం. 1,
 బంజారాహిల్స్, హైదరాబాద్ - 34
 ఈ మెయిల్: guide.sakshi@gmail.com
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement