![Partner Swapping Racket Busted In Kerala - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/hands.jpg.webp?itok=W7wyvyOv)
ప్రతీకాత్మక చిత్రం
తిరువనంతపురం(కేరళ): మన సమాజంలో వివాహానికి ఎంతో ఉన్నత స్థానం ఉంది. అయితే, ఈ మధ్య చోటుచేసుకుంటున్న కొన్ని ఘటనలు సభ్యసమాజం తలదించుకునేలా ఉంటున్నాయి. కొన్నిచోట్ల భార్య, భర్తలు వేరే వాళ్లతో వివాహేతర సంబంధాలు పెట్టుకుట్టుంటే.. మరి కొన్నిచోట్ల కొందరు బరితెగించి తమ కన్నవారిపైనే అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. కొన్నిచోట్ల స్నేహం ముసుగులో యువతి, యువకులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి ఘటనలు తరచుగా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా, ఇటువంటి ఘటనే కేరళలో వెలుగుచూసింది.
వివరాలు.. కేరళలోని కరుచాకల్‌కు చెందిన ఒక వ్యక్తి తన భార్యను లైంగికంగా వేధించేవాడు. ఆమెకు ఇష్టం లేకున్నా బలవంతం చేసేవాడు. ఈ రీతిలో ప్రతిరోజు భార్య ఇష్టానికి వ్యతిరేకంగా అతను వ్యవహరించేవాడు. కొంత కాలానికి ఆ వ్యక్తి ఆగడాలు మరీ ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో అతను మరికొందరు కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడ్డారు. ఈ గ్యాంగ్‌లో ఏడుగురు సభ్యులున్నారు.
ఈ ఏడుగురితో కూడా సంబంధం పెట్టుకోవాలని తన భార్యను ఆ వ్యక్తి బలవంతం చేశాడు. ఆ గ్యాంగ్‌లోని అందరూ తమ భార్యలపట్ల ఇలాంటి అభ్యంతరకర పద్ధతినే కొనిసాగించేవారు. ఈ క్రమంలో సదరు మహిళ.. భర్త చేష్టలతో విసిగిపోయి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు.. పోలీసులు ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి విచారణ చేపట్టారు.
వీరి విచారణలో అనేక సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ ముఠా టెలిగ్రామ్, మెసెంజర్‌లతో సంప్రదించుకునేవారని పోలీసులు గుర్తించారు. వీరికి సంబంధించిన చాటింగ్ గ్రూపులో వేలాది మంది యువతి,యువకులున్నట్లు గుర్తించారు. ఈ క్రమంలో బృందాలుగా విడిపోయిన పోలీసులు గత ఆదివారం నిందితులను కొట్టాయం, అలప్పుజ, ఎర్నాకులం జిల్లాల నుంచి అరెస్టు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment