వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య | Woman Committed Suicide With Personal Reasons | Sakshi
Sakshi News home page

వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య

May 30 2018 1:37 PM | Updated on May 30 2018 1:41 PM

Woman Committed Suicide With Personal Reasons - Sakshi

సాక్షి, విజయనగరం : జిల్లాలోని కురుపాం గ్రామానికి చెందిన పత్తిక మణిమాల(30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ఈమె భర్త  శంకర్‌ రావు వృత్తి రీత్యా టీచర్.  ఇతను గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబా గ్రామంలో మండలపరిషత్ స్కూల్‌ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. శంకర్‌ రావే తన భార్యను చంపి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement