women sucide
-
ఐదు నెలల క్రితమే పెళ్లి.. ఇంతలోనే నవ్యశ్రీ..
శివమొగ్గ: వివాహమైన ఐదు నెలలకే నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నాటకలో చోటుచేసుకుంది. శివమొగ్గ నగరం అశ్వత నగరలోని 5 క్రాస్‌లో ఈ ఘటన జరిగింది. మృతురాలిని నవ్యశ్రీ (23)గా గుర్తించారు. నవ్యశ్రీకి ఐదు నెలల క్రితమే ఆకాశ్ అనే యువకుడితో పెళ్లయింది. శనివారం సాయంత్రం ఇంటి వద్ద తులసి పూజ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేసింది. అయితే, ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో కారు షెడ్లో ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. కాగా, ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు. కుటుంబ సమస్యల కారణంగానే నవ్యశ్రీ ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని నవ్యశ్రీ కుటుంబీకులు అనుమానిస్తున్నారు. దీంతో, కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వినోబా నగర పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
డెంటిస్ట్ ఆత్మహత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి
సాక్షి, బెంగళూరు: బనశంకరిలో చిన్నారి కూతురితో కలిసి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న దంత వైద్యురాలు శైమా ఉదంతం వెనుక కుటుంబ కలహాలు ఉన్నట్లు తేలింది. ఆమెను పుట్టింటివారు రానివ్వకపోవడమే కారణమని బయట పడింది. కొడగు జిల్లా విరాజపేటకు చెందిన శైమా బీడీఎస్ చదువుతూ, సహచరుడు నారాయణ్‌ను ప్రేమ పెళ్లి చేసుకుంది. ఆ తరువాత ఆమె పుట్టింటికి వెళ్లలేదు. దీంతో కొన్నాళ్లకు శైమా తల్లి దిగులుచెంది విరాజపేటలో ఆత్మహత్య చేసుకుంది. ఈ పరిణామాలతో పుట్టింటివారు శైమాను తమ ఇళ్లకు రానివ్వలేదు. ఆమె నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లినప్పటికీ ఎవరూ సరిగా మాట్లాడలేదు. ఈ పరిణామాలతో విరక్తి చెంది కూతురికి ఉరివేసి, తానూ ప్రాణాలు తీసుకుందని పోలీసులు పేర్కొన్నారు. చదవండి: (కాలేజ్ డేస్‌లో లవ్ ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా ఎందుకు?) -
కాలేజ్ డేస్‌లో లవ్.. ఆ తర్వాత పెళ్లి.. ఇంతలోనే ఇలా..?
బనశంకరి: బెంగళూరులో సుష్మా అనే దంతవైద్యురాలు తన కూతురికి మానసిక వైకల్యమని పాపను నాలుగో అంతస్తు నుంచి విసిరివేసి, తాను దూకేందుకు యత్నించడం తెలిసిందే. ఈ ఘటనలో పాప మరణించింది. అంతలోనే మరో దంతవైద్యురాలు, ఆమె కూతురు విగతజీవులుగా కనిపించారు. బనశంకరి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం వెలుగుచూసింది. బనశంకరి పోలీసులు చేరుకుని పరిశీలించారు. దంత వైద్యురాలు శైమా (39), కుమార్తె ఆరాధన (10) ఇంట్లో చనిపోయి ఉన్నారు. వివరాలు.. వీరు కావేరినగరలో నివాసం ఉంటున్నారు. ఆరాధన నాలుగో తరగతి చదువుతోంది. రెండురోజుల క్రితమే ప్రాణాలు పోయి ఉండవచ్చని భావిస్తున్నారు. తల్లీకూతురు ఉరికి వేలాడుతున్నట్లు గుర్తించారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఆమెది కొడగు, ఆయనది కోలారు కొడగు విరాజపేటేకు చెందిన శైమా పదేళ్ల క్రితం దంతవైద్య కోర్సు చదివేటప్పుడు కోలారు ప్రాంతానికి చెందిన నారాయణ్ అనే వ్యక్తిని ప్రేమించింది. ఇరుకుటుంబాలను ఒప్పించి వివాహం చేసుకున్నారు. భర్త సైతం డాక్టరు కాగా ఇంటి సమీపంలో క్లినిక్ నిర్వహిస్తున్నాడు. వారి మరణాలకు కచ్చితమైన కారణం తెలియరాలేదు. మృతురాలి సోదరుడు ఆ్రస్టేలియాలో ఉండగా సోమవారం నగరానికి చేరుకుని బనశంకరి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వీరు మరణించి రెండురోజులైనా భర్త ఆ విషయాన్ని గుర్తించకపోవడం అనుమానాలకు తావిస్తోంది. -
Hyderabad: కూకట్‌పల్లిలో విషాదం..
సాక్షి, హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం కావడంలేదని మనస్థాపంతో ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేక్ నగర్లో విజయ లక్ష్మి(26) అనే యువతి కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తోంది. అయితే, తనకు పెళ్లి సంబంధాలు ఎన్ని వచ్చినా.. వివాహం మాత్రం కావడంలేదని జీవితంపై విరక్తితో బుధవారం రాత్రి ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. కాగా, ఆసుపత్రిలో చికిత్స పొందతూ విజయ లక్ష్మి గురువారం మృతి చెందింది. ఇది కూడా చదవండి: ప్రియుడితో భార్య రాసలీలలు.. భర్త ఏం చేశాడంటే..? -
కాపురంలో మద్యం పెట్టిన చిచ్చు! చక్కగా ముస్తాబై భర్తకోసం ఎదురు చూస్తుంటే..
చిట్టినగర్(విజయవాడ పశ్చిమ): కొత్త సంవత్సరానికి ఉత్సాహంగా స్వాగతం పలకాలనీ అన్ని ఏర్పాట్లు చేసుకుంది.. పిల్లలతో కలసి ఇంట్లో అంతా సిద్ధం చేసుకుని, ముస్తాబై తన భర్త కోసం ఎదురుచూస్తోంది. తీరా తన భర్త పూటూగా మద్యం సేవించి.. కనీసం నిలబడలేని స్థితిలో ఇంటికి రావడాన్ని చూసి తీవ్ర మనస్తాపానికి గురైంది. క్షణికావేశంలో తనతో పాటు పిల్లలకు ఎలుకల మందు తినిపించి ఆత్మహత్యకు యత్నించింది. అపస్మారక స్థితికి వెళ్లిన తల్లి, పిల్లలను ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి కొంత మెరుగు పడటంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన కొత్తపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకోగా, ఘటనపై పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆశ అడియాస.. కొత్తపేట పోతిన అప్పలస్వామి వీధికి చెందిన డెక్కటి దుర్గ(38)కు ఇరవై ఏళ్ల కిందట నరసింహ అనే వ్యక్తితో వివాహం అయ్యింది. నరసింహ గోనె సంచులు కుట్టే పనులు చేస్తుండగా.. దుర్గ ఇళ్లలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కాగా.. పెద్ద కుమార్తె శకుంతల లయోలా కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతోంది. ఇక చిన్న కుమార్తె గజలక్ష్మి ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో 31వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో నరసింహ మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. కుటుంబం మొత్తం కొత్త సంవత్సరం వేడుకలు చేసుకోవాలని ఎంతో ఆతృతతో ఎదురు చూస్తుండగా, నరసింహ మద్యం సేవించి ఇంటికి రావడంతో మనస్తాపానికి గురయ్యారు. భార్య, భర్తల్దిదరికి చిన్న పాటి వివాదం జరిగింది. అనంతరం నరసింహ నిద్రకు ఉపక్రమించాడు. పక్కింటి వ్యక్తి సమాచారంతో.. నరసింహ ఇంటి పక్కనే నివాసం ఉండే రెడ్డి అనే వ్యక్తి ఆ ఇంట్లో అప్పటి వరకూ గొడవ జరగడాన్ని గమనించాడు. కొంతసేపటి తర్వాత ఇంటి తలుపులు బార్లా తెరచి ఉండటాన్ని చూసి.. ఇంట్లోకి వెళ్లాడు. దుర్గ, ఇద్దరు పిల్లలు అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించి.. భవానీపురంలో ఉండే దుర్గ అన్నయ్య నాగరాజుకు ఫోన్ చేశాడు. మీ చెల్లెలు, ఇద్దరు మేనకోడళ్లు అపస్మారకంగా పడి ఉన్నారని చెప్పాడు. దీంతో వెంటనే చెల్లెలు వద్దకు వచ్చిన నాగరాజు వెంటనే ముగ్గురిని ప్రభుత్వాస్పత్రికి తరలించాడు. అరటి పండులో ఎలుకల మందు.. ఆస్పత్రికి వెళ్లిన తర్వాత జరిగిన విషయాన్ని దుర్గ తన అన్నయ్యకు చెప్పింది. ఇంట్లో ఉన్న ఎలుకల మందును తాను, ఇద్దరు పిల్లలు కలిసి అరటి పండులో పెట్టుకుని తిన్నామని వివరించింది. అనంతరం చికిత్స పొందుతూ దుర్గ శనివారం రాత్రి మృతి చెందింది. ఘటనపై ఆస్పత్రి నుంచి సమాచారం అందుకున్న కొత్తపేట పోలీసులు దుర్గ ఇంటికి వెళ్లి విచారణ చేశారు. మృతురాలి అన్న ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: మృతదేహాన్ని చూసి జీర్ణించుకోలేక గుండెపోటుతో అక్కడికక్కడే.. -
వేధింపులు: భర్తకు చెప్పినా ఫలితం లేకపోవటంతో
తిరువళ్లూరు: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన వినోద్. ఇతను కువైట్‌లో పిజియోథెరపిస్టు డాక్టర్‌గా పని చేస్తున్నారు. రాణిపేట జిల్లా కారై గ్రామానికి చెందిన మంజుల(32)తో 2014లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు వున్నాడు. ఈ క్రమంలో అత్తారింటి నుంచి తరచూ వేధింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత వారం కువైట్ నుంచి వినోద్ రాగా, కట్నంపై తరచూ జరుగుతున్న వేధింపులను భర్త దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మరింత వేధింపులు ఎక్కువైనట్టు తెలిసింది. దీంతో మనస్తాపం చెందిన మంజులా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. అయితే కుమార్తె మృతికి వరకట్న వేధింపులే కారణమని మంజుల తండ్రి మునస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెవ్వాపేట పోలీసులు వినోద్‌ను బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. తలపై బండరాయి వేసి భార్యను హత్య టీ.నగర్: భార్యను హతమార్చిన భర్త పోలీసు స్టేషన్లో లొంగిపోయిన ఘటన మంగళవారం రాత్రి నెర్కుండ్రంలో జరిగింది. కోయంబేడు సమీపంలోని నెర్కుండ్రం పెరుమాళ్ ఆలయం వీధికి చెందిన ఆలన్ (51) వాటర్ క్యాన్ సప్లయర్. భార్య లక్ష్మి (45). ముగ్గురు పిల్లలకు వివాహమై విడివిడిగా ఉంటున్నారు. మంగళవారం ఆలన్, లక్ష్మి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఇరువురూ విడివిడిగా నిద్రించారు. ఈ క్రమంలో అర్ధరాత్రి భార్య లక్ష్మి తలపై బండరాయి వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత ఆలన్ ఇంటికి తాళం వేసి రక్తపు మరకల దుస్తులతో నేరుగా వెళ్లి కోయంబేడు పోలీసు స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. చదవండి: కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు -
భర్త, అత్తతో గొడవ: కూతురితో సహా తల్లి ఆత్మహత్య
సాక్షి, సోన్(నిర్మల్): అత్తగారింటి వేధింపులకు ఓ యువతి తన కూతురుతో సహా ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై ఆసీఫ్, గ్రామస్తుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట మండలకేంద్రానికి చెందిన పావనిని నిర్మల్ జిల్లా సోన్ మండలం లెఫ్ట్ పోచంపాడ్ గ్రామానికి చెందిన సిద్ది రాములుకిచ్చి 2014లో పెళ్లి చేశారు. వీరికి కుమారుడు హర్షిత్ (4), అన్వేషిక (3) ఉన్నారు. సోమవారం రాత్రి ఇంట్లో అత్త, భర్తతో గొడవలు జరిగాయి. తన భర్తకు అత్త వత్తాసు పలుకుతూ.. తనపై గొడవకు ఉసిగొల్పుతోందని పేర్కొంటూ మంగళవారం ఉదయం కూతురిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లి పోయింది. పుట్టింటికి వెళ్లి ఉంటుందని భావించిన భర్త ఉదయం అక్కడికి వెళ్లాడు. ఇక్కడకూ రాలేదని వారు తెలపడంతో బంధువుల ఇళ్లలో వెతికారు. బుధవారం ఉదయం శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో తల్లీకూతురు మృతదేహాలు కనిపించాయి. చేపల వేటకు వెళ్లిన జాలరులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న సీఐ జీవన్‌రెడ్డి, ఎస్సై ఆసీఫ్ సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాలను వెలికితీయించారు. పావని తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు. చదవండి: ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి -
భర్త వదిలేశాడు.. తండ్రి,కుమారుల మృతి ఆవేదనతో
వేలూరు: రైలు కిందపడి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కాట్పాడి సమీపంలోని లత్తేరి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి(60) బస్టాండ్‌లో బాణసంచా దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి కుమార్తెలు విద్య(33), దివ్య ఉన్నారు. విద్యకు పదేళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి తేజశ్వరన్(8), ధూనూజ్ మోహన్ (6) పిల్లలున్నారు. మనస్పర్థల వల్ల విద్య భర్తను వదిలి ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి మోహన్‌రెడ్దితో ఉంటోంది. ఈ నెల 18న మోహన్‌రెడ్డి, మనమల్లు తేజేశ్వరన్, ధనూజ్‌మోహన్ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందారు. భర్త వదిలి వెళ్లడం, తండ్రి, కుమారులు మృతిచెందడంతో జీవితంపై విరక్తి చెందిన విద్య బుధవారం తెల్లవారుజామున లత్తేరి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి మృతిచెందింది. జోలార్‌పేట రైల్వేపోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చదవండి: ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి -
వివాహిత ఆత్మహత్య.. భర్తపై ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్ : భవనంపై నుంచి దూకి ఓ వివాహిత శ్రీవిద్య (27) ఆత్మహత్యకు పాల్పడటం నగరంలోని చందానగర్‌లో కలకలం రేపింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆరు నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరిష్ అనే యువకుడితో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగింది. భర్త శబరిష్ ఉద్యోగరిత్యా బెంగళూర్‌కు వెళ్లడంతో ఆమె చందానగర్‌లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం భర్త శబరిష్‌తో ఫోన్లో మాట్లాడుతూ ఏదో విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే ఏమైందో ఏమోగానీ ఐదో అంతస్తు భవనం నుంచి దూకారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు గాయాల పాలైన శ్రీవిద్యను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు. ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే భర్త శబరిష్ వేధింపులే కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. -
ఆమెది ఆత్మహత్యే!
శంషాబాద్ రూరల్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని సిద్దులగుట్ట దారిలో ఉన్న మైసమ్మ దేవాలయం వద్ద శుక్రవారం వెలుగుచూసిన గుర్తు తెలియని మహిళ మృతి కేసు మిస్టరీ వీడింది. మహిళను హత్య చేసినట్లు ముందుగా భావించినా..మతిస్థిమితంలేని ఓ మహిళ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు నిర్ధారించారు. మృతురాలు హైదరాబాద్‌లోని ధూల్‌పేట ప్రాంతం బాబా భోలక్‌దాస్ నగర్‌కు చెందిన కవితాబాయి(32)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. కవితాబాయికి కొంతకాలంగా మతిస్థిమితం లేదు. ఈక్రమంలో గతనెల 29న ఇంటి నుంచి ఒంటి గంట సమయంలో బయటకు వెళ్లింది. సాయంత్రం 5 గంటలకు చేతిలో బ్యాగు, బాటిల్‌తో నడుచుకుంటూ సిద్దులగుట్ట వైపు వచ్చింది. ఈ దారిలో ఉన్న మైసమ్మ ఆలయం వద్ద కూర్చొని ఏడుస్తుండగా..అక్కడున్న అయ్యప్పమాల దీక్షదారులు గమనించి ఏమైందని అడిగారు. తాను కుటుంబీకుల కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పడంతో కాసేపటికి వారు పూజకు వెళ్లారు. రాత్రి 8 గంటలకు ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అక్కడ నుంచి వెళ్తున్న కొందరు ఆ మంటల్ని గమనించి దగ్గరకు వెళ్లి మంటలు ఆర్పే ప్రయత్నం చేయగా.. అప్పటికే మహిళ పూర్తిగా కాలిపోయి మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. సీసీ పుటేజీ, ఆలయం వద్ద ప్రత్యక్షసాక్షుల వివరాల ఆధారంగా ఆమె ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్ధారించారు. ఈమేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం అనంతరం కవితాబాయి మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు. ఎన్నో అనుమానాలు సిద్దులగుట్ట ఘటనపై పోలీసులు చెబుతున్న వివరాలకు..ఘటనా స్థలంలో ఆనవాళ్లకు పొంతన కుదరడం లేదని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎవరో దుండగులు ఆమెను హత్య చేసి ఉంటారని వారు భావిస్తున్నారు. మతిస్థిమితంలేని మహిళ అంతదూరం నుంచి వచ్చి కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకోవడం, అక్కడ మృతదేహం పడి ఉన్న తీరు, వివరాలు పలు అనుమానాలున్నాయని స్థానికులు చెబుతున్నారు. మహిళ చనిపోయేందుకు ఒంటికి నిప్పంటించుకున్నా మంటల బాధ కు తాళలేక కేకలు వేసే అవకాశం ఉంటుందని, పైగా కాలిపోతూ ఒకేచోట ఎలా ఉంటుం దని వారు ప్రశి్నస్తున్నారు. మూడ్రోజుల క్రితం తొండుపల్లిలో జరిగిన హత్యోదంతం నేపథ్యంలో వరుస ఘటనతో పోలీసులు తీరుపై వస్తున్న విమర్శలను కప్పిపుచ్చడానికి కేసును పక్కదారి పట్టిస్తున్నారనే అనుమానాలు స్థానికుల్లో నెలకొంది. -
నల్లగా ఉన్నావంటూ భర్త వేధించడంతో..
రాజస్ధాన్ : నల్లగా ఉన్నావని తరచూ భర్త వేధిస్తుండటంతో పెళ్లయిన ఆరునెలలకే భార్య బలవన్మరణానికి పాల్పడింది. బాధిత మహిళను బన్సోయరా గ్రామానికి చెందిన 21 ఏళ్ల మంగీబాయ్‌గా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో తన కుమార్తె మంగీబాయ్‌కు వివాహమైందని, పెళ్లయిననాటి నుంచి ఆమెను నల్లగా ఉన్నావని భర్త తరచూ వేధించేవాడని బాధితురాలి తండ్రి దేవ్‌లాల్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. పోస్ట్‌మార్టం అనంతరం మంగీబాయ్ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అందించామని, భర్త దినేష్ లోథాపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. -
అవమానంతో ఆత్మహత్య
సాక్షి, చినగంజాం(ప్రకాశం) : బంధువులు తనపై దాడి చేశారని మనస్తాపానికి గురైన వివాహిత ఇంటిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం చినగంజాం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు అందించిన సమాచారం మేరకు మండలంలోని మోటుపల్లి పంచాయతీ రుద్రమాంబపురం గ్రామానికి చెందిన బసంగారి పద్మ (31) తన ఇంటిలోని ఫ్యానుకు ఉరివేసుకొని మృతి చెందింది. వివరాల్లోకి వెళితే రుద్రమాంబపురం గ్రామంలో బసంగారి కనకయ్య, శ్రీను, భద్రయ్య, ఆంజనేయులు, నాగేశ్వరరావు, బ్రహ్మయ్యలు మొత్తం ఆరుగురు అన్నదమ్ములు కాగా వీరిలో పెద్దవాడు కనకయ్య వేరే గ్రామంలో ఉంటున్నాడు. అయితే శ్రీను, భద్రయ్య, నాగేశ్వరరావు కుటుంబాలకు మిగిలిన ఇరువురు కుటుంబాలకు గత ఐదేళ్లుగా కుటుంబ కలహాలు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో బంధువుల మధ్య తలెత్తిన చిన్నపాటి మనస్పర్థలు తోడి కోడళ్ల మధ్య గొడవకు కారణమయ్యాయి. గతంలో మృతురాలి భార్యభర్తలు ద్విచక్రవాహనం మీద వెళుతున్నప్పుడు తమకు తగిలిందని వారిలో ఒక తోడి కోడలు మంగళవారం ఉదయం గొడవ పెట్టుకొని, ఆమెతో పాటు బావలు, మరుదులు, వీరి మద్దతుదారులు మృతురాలు పద్మపై చేతులతో, కాళ్లతో దాడి చేశారు. శరీరంపై దుస్తులు చెదిరిపోయేలా దాడి చేయడంతో ఆమె అవమానానికి గురైంది. ఆ సమయంలో ఆమె భర్త బ్రహ్మయ్య అడ్డుపడి వారిని వారించి పద్మను ఇంటిలోకి పంపి బయట తలుపు వేశాడు. దాంతో వారు బ్రహ్మయ్యపై కూడా చేయి చేసుకున్నారు. అరగంట అనంతరం తోడికోడళ్లు దాడి చేశారని అవమానభారంతో ఇంటిలోకి వెళ్లిన పద్మ లోపల గడియ వేసుకోవడంతో పాటు కిటికీలను సైతం మూసి వేసి ఫ్యానుకు చీర తగిలించి ఉరి వేసుకుంది. భర్త అనుమానంతో తలుపు తీసేందుకు ప్రయత్నించి రాక పోవడంతో వాటిని పగలగొట్టి లోపలికి వెళ్లి చూడటంతో ఆమె ఫ్యానుకు వేలాడుతూ కన్పించింది. వెంటనే ఆమె వదిన, బావలు ఉరి వేసుకున్న చీరను కూరగాయల కత్తితో కోసి ప్రాణాలతో ఉన్న ఆమెను కిందకు దించారు. స్థానికంగా ఉన్న ఆర్ఎంపీ వైద్యుడు రాజారావును పిలిచి చూపించగా అతను మెరుగైన వైద్యశాలకు తీసుకెళ్లాల్సిందిగా సూచించాడు. ఈ లోగా సమాచారం అందుకున్న 108 వాహన సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతి చెందినట్లుగా నిర్ధారించారు. గ్రామంలో ఘర్షణ జరుగుతుందని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి ఆమె మృతి చెందడంతో సమాచారాన్ని తమ ఉన్నతాధికారులకు తెలియజేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న ఇన్చార్జ్ ఎస్ఐ కే అజయ్ బాబు కేసు నమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు. సంఘటనా స్థలాన్ని సందర్శించిన డీఎస్పీ సంఘటనా స్థలాన్ని చీరాల డీఎస్పీ నాగరాజు, ఇంకొల్లు సీఐ రాంబాబులు సందర్శించి పరిశీలించారు. బాధితుడు బ్రహ్మయ్యను జరిగిన సంఘటనపై విచారించారు. ఎటువంటి అల్లర్లు జరగకుండా స్పెషల్ పార్టీ పోలీసు బృందం గ్రామంలోకి తెప్పించారు. జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకొని గ్రామంలో గట్టిబందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు, ఒక ఎస్ఐను కూడా గ్రామంలో ఉంచి ఎటువంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పికెటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. దాడికి పాల్పడిన వారిలో ప్రస్తుతం 10 మంది మహిళలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు చెప్పారు. మిగిలిన వారిని కూడా తీసుకొచ్చి విచారణ జరపనున్నట్లు ఆయన తెలిపారు. -
ఆ ఫోటోలు డిలీట్ చేయకుండా ఫోన్ అమ్మడంతో..
లక్నో : మాజీ గర్ల్‌ఫ్రెండ్‌తో అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా ఓ వ్యక్తి మరొకరికి ఫోన్ అమ్మడం దారుణ ఘటనలకు దారితీసిన ఉదంతం వెలుగుచూసింది. ఈ పరిణామాలు 35 ఏళ్ల మహిళ తన ఐదేళ్ల కుమారుడితో కలిసి ముజఫర్‌నగర్‌లోని గంగ్నహర్ కాల్వలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడే వరకూ వెళ్లాయి. మీరట్‌లో స్ధిరపడిన ఈ మహిళ మరణించగా, ఆమె కుమారుడిని ప్రాణాలతో కాపాడారు. మాజీ బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన ఫోటోలు సోషల్‌మీడియాలో వైరల్ కావడంతో మహిళ తీవ్ర నిర్ణయం తీసుకుందని పోలీసులు చెప్పారు. బాధితురాలి మాజీ బాయ్‌ఫ్రెండ్ మీరట్‌కు చెందిన శుభమ్ కుమార్ ఆమెతో కలిసి అభ్యంతరకరంగా ఉన్న ఫోటోలను డిలీట్ చేయకుండా అదే పట్టణానికి చెందిన మరొకరికి తన మొబైల్ ఫోన్‌ను విక్రయించాడు. ఈ ఫోటోలను ఫోన్ కొనుగోలు చేసిన వ్యక్తి ప్రజాపతి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి వైరల్‌గా మారాయి. దీంతో తీవ్రంగా కలతచెందిన బాధితురాలు ముజఫర్‌నగర్‌లోని ఖతౌలి బ్రిడ్జిపై నుంచి ఐదేళ్ల కుమారుడితో సహా కిందకి దూకారు. ఆత్మహత్య చేసుకునే ముందు మహిళ తన భర్తతో చివరిసారిగా ఫోన్లో మాట్లాడినట్టు పోలీసులు గుర్తించారు. కాగా, శుభమ్ అతని స్నేహితులు కలిసి ఫోటోలను షేర్ చేసిన ప్రజాపతిని మే 23న హత్య చేసినట్టు పోలీసులు వెల్లడించారు. సీసీటీవీ ఫుటేజ్ ద్వారా ప్రజాపతి హత్య కేసులో నిందితులను పోలీసులు గుర్తించారు. సహరన్పూర్ పోలీసులు శనివారం జరిపిన ఎన్కౌంటర్లో నిందితులను అరెస్ట్ చేసి వారిని మీరట్ పోలీసులకు అప్పగించారు. కాగా, హత్య కేసు విచారణలో తన పేరు కూడా బయటకు వస్తుందన్న భయంతో మహిళ ఆత్మహత్యకు పాల్పడిందని పోలీస్ అధికారులు అనుమానిస్తున్నారు. -
ఒయో లాడ్జిలో మహిళ ఆత్మహత్య..!
సాక్షి, హైదరాబాద్: నగరంలోని వనస్థలిపురంలో ఓ మహిళా అనుమానాస్పదంగా మృతి చెందింది. అభ్యుదయనగర్‌లోని ఒయో లాడ్జిలో బుధవారం ఓ మహిళ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకున్న విచారణ ప్రారంభించారు. విచారణలో పలు విషయాలు వెల్లడయ్యాయి. మృతిచెందిన మహిళను బెంగాల్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంగీతగా గుర్తించారు. మూడేళ్ల క్రితం ఫేస్బుక్ ద్వారా పరిచయమయిన లోకేష్ అనే యువకుడి కోసం సంగీత హైదరాబాద్ వచ్చినట్లు తెలుస్తోంది. గత మూడు రోజులుగా లోకేష్, సంగీత కలిసి ఒయో లాడ్జిలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిన్న రాత్రి వారిద్దరి మధ్య గొడవ జరగిందని లాడ్జి సిబ్బంది తెలిపారు. దీంతో సంగీత మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంగీతకు 48ఏళ్లు కాగా, లోకేష్‌కు 28 ఏళ్లు ఉండొచ్చని విచారణలో వెల్లడైంది. కాగా లోకేష్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు, ఘటనపై మరింత లోతుగా విచారిస్తున్నట్లు తెలిపారు. -
ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య
-
ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని...
సాక్షి, హైదరాబాద్: మాదాపూర్‌లో విషాదం చోటుచేసుకుంది. శ్రీవిద్య (25) అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఊపిరి ఆడకుండా ముఖానికి ప్లాస్టిక్ కవర్ చుట్టుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అరుణోదయ కాలనీలో శనివారం ఈ ఘటన జరిగింది. ప్రైవేటు కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఉద్యోగం చేస్తున్న శ్రీవిద్య.. హాస్టల్ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది. రాత్రి నుంచి తలుపులు తియ్యకపోవడంతో అనుమానం వచ్చిన హాస్టల్ సిబ్బంది బలవంతంగా తలుపులు తెరవడంతో అప్పటికే మృతిచెందింది. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ అసుపత్రికి తరలించారు. వ్యక్తిగత కారణాలతోనే ఆత్మహత్యకు పాల్పడట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసి వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. మృతురాలికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బీఎస్ఎఫ్ జవాన్ రేప్.. యువతి ఆత్మహత్య
ముజఫర్‌నగర్: వివాహం చేసుకుంటానని నమ్మించి బీఎస్ఎఫ్ జవాను రేప్చేయడంతో ఓ యువతి(26) విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన యూపీలో జరిగింది. ఆత్మహత్య ఘటనపై కొత్వాలి ఎస్‌హెచ్‌వో అనిల్ కపేర్వాన్ మాట్లాడారు. బాధితురాలు జూలై 6న విషం తాగగా, చికిత్స పొందుతూ శుక్రవారం చనిపోయిందని చెప్పారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించిన బీఎస్ఎఫ్ జవాను తన కుమార్తెపై అత్యాచారానికి పాల్పడినట్లు బాధితురాలి తండ్రి ఫిర్యాదు చేశాడు. బాధితురాలిపై లైంగికదాడిని వీడియో తీసిన నిందితుడు పెళ్లి ప్రస్తావన తెస్తే ఈ వీడియోను ఇంటర్నెట్లో పోస్ట్ చేస్తానని ఆమెను బెదిరించేవాడని తండ్రి ఫిర్యాదుచేశాడు. జవాను వేధింపుల్ని తట్టుకోలేక సదరు యువతి ప్రాణాలు తీసుకుందన్నారు. -
వ్యక్తిగత కారణాలతో మహిళ ఆత్మహత్య
సాక్షి, విజయనగరం : జిల్లాలోని కురుపాం గ్రామానికి చెందిన పత్తిక మణిమాల(30) పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ కోలుకోలేక బుధవారం మృతి చెందింది. ఈమె భర్త శంకర్ రావు వృత్తి రీత్యా టీచర్. ఇతను గుమ్మలక్ష్మీపురం మండలం అచ్చబా గ్రామంలో మండలపరిషత్ స్కూల్ టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా భార్య, భర్తల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరుగుతున్నాయి. శంకర్ రావే తన భార్యను చంపి, దాన్ని ఆత్మహత్యగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడని మృతురాలి బంధువులు ఆరోపించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. -
ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య
గుడుపల్లె : మండలంలోని అగరం గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. భర్తే చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ భాస్కర్ కథనం మేరకు.. మండలంలోని అగరం గ్రామానికి చెందిన నాగభూషణంకు అదే మండలం మల్దేపల్లెకు చెందిన సోమప్ప కుమారై అశ్విని(23)ని ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం చేశారు. వీరి కాపురం సజావుగా సాగుతోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నాగభూషణం పొలం పనులకు వెళ్లాడు. అనంతరం ఏమి జరిగిందో కాని అశ్విని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని మృతి చెందింది. స్థానికులు గమనించి భర్తకు, మృతురాలి బంధువులకు సమాచారం అందించారు. బంధువులు అక్కడికి చేరుకుని తమ కూతురిని భర్తే చంపేశాడని ఆరోపిస్తూ ఇంటిని ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ భాస్కర్ అక్కడికి చేరుకుని వారిని అడ్డుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుప్పం ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత హత్యగా తేలితే చర్యలు తీసుకుంటామని మృతురాలి బంధువులకు హామీ ఇచ్చారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పెళ్లయి రెండేళ్లకే కూతురు ఆత్మహత్య చేసుకోవడంతో బంధువులు బోరును విలపించారు. -
అన్యాయంగా చంపేశారు..
భోగాపురం: భర్త, అత్త,మామల వేధింపుల వల్లే మండల కేంద్రానికి చెందిన అడపా శ్రావణి ఆత్మహత్య చేసుకుందని, వెంటనే నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని మహిళా సంఘాలు డిమాండ్ చేశాయి. శనివారం సాయంత్రం శ్రావణి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డీఎస్పీ ఏవీ రమణ, సీఐ రఘువీర్ విష్ణు ఆదివారం గ్రామానికి చేరుకుని విచారణ చేపడుతుండగా, మహిళా సంఘ సభ్యులు ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, శ్రావణి ఏడు మాసాల గర్భవతిగా ఉన్నప్పటినుంచి భర్త, అత్తమామలు అదనపు కట్నం కోసం వేధించేవారన్నారు. దీనిపై రెండు సార్లు తాము కౌన్సెలింగ్ కూడా ఇచ్చామని డీఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. వివాహ సమయంలో శ్రావణికి ఇస్తానన్న 1.50 ఎకరాల భూమిని తన పేరుమీద రాయాలని భర్త వేధించేవాడని, ఇందుకు సంబంధించిన ఆడియో, వీడియో క్లిప్పుంగులు తమ వద్ద ఉన్నాయని తెలిపారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎస్పీని కలిసిన వారిలో ఎస్సీ,ఎస్టీ మైనారిటీ ఐక్యవేదిక విశాఖ జిల్లా మహిళా కన్వీనర్ కె. జియారాణి, విశాఖ మహిళా వేదిక జాయింట్ సెక్రటరీ చిన్ని, మృతురాలి తల్లి రామలక్ష్మి, తదితరులున్నారు. -
యువతి ఆత్మహత్య
రామగుండం: అంతర్గాం మండల పరిధి లోని గోలివాడ గ్రామానికి చెందిన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అంతర్గాం ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్ని కిషన్ కూతురు మమత(20)కు ఇష్టం లేని పెళ్లి సంబంధం కుదిర్చారని బుధవారం మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
చికిత్స పొందుతూ మహిళ మృతి
చీటూరు(లింగాలఘణపురం) : మండలంలోని చీటూరులో పురుగుల మందు తాగిన ఓ మహిళ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం మృతిచెందింది. చీటూరుకు చెందిన కేమిడి లక్ష్మి(55) భర్త గట్టయ్యకు పక్కపొలానికి చెందిన వాసర్ల ఐలయ్యతో గెట్టు విషయంలో జూలై 29న పంచాయితీ జరిగింది. ఈ క్రమంలోనే వాసర్ల ఐలయ్య అతడి కుటుంబ సభ్యులు లక్ష్మి, రాంచంద్రు, అండమ్మ, అనిల్, బీరయ్య, రేణుక, శ్రీకాంత్ 30న వచ్చి ఇంట్లో ఉన్న లక్ష్మిని తీవ్ర పదజాలంతో దూషించడంతో ఆమె మనస్తాపానికి గురై పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ మంగళవారం మృతి చెందినట్లు ఏఎస్సై పురుషోత్తంరెడ్డి తెలిపారు. లక్ష్మి ఆత్మహత్యకు కారణమైన అదే గ్రామానికి చెందిన ఎనిమిది మందిపై 304 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
పోలీసుల సాక్షిగా..
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం పీసీపల్లి : డబ్బులు తీసుకుని తన ప్రత్యర్థులకు అండగా ఉంటున్నారంటూ ఓ మహిళ పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే వారి సాక్షిగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, బంధువులు ఆమెను హుటాహుటిన కనిగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానిక పోలీసుస్టేçÙ¯Œæలో సోమవారం జరిగింది. వివరాలు.. మండలంలోని కొత్తపల్లికి చెందిన కల్లూరి అంకమ్మకు కంచర్ల మాలకొండయ్యకు నాలుగేళ్లుగా భూ వివాదం ఉంది. ప్రస్తుతం కోర్డులో కేసు నడుస్తోంది. మాలకొండయ్య వర్గీయులు వీరపనేని చెన్నకేశవులు, వీరపనేని చెన్నయ్య, రాయి వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి నేరుగా భూమిలోకి వెళ్లి వ్యవసాయ పనులు ప్రారంభించారు. భూమి వ్యవహారం కోర్టులో ఉండగా రాత్రికి రాత్రి సాగు చేయడం ఏమిటని అంకమ్మ ఎస్సై శ్రీహరికి ఫిర్యాదు చే సింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పోలీసుస్టేçÙన్కు వెళ్లింది. ప్రత్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారంటూ వెంట తీసుకెళ్లిన పురుగుమందు తాగి అక్కడే బల్లపై పడిపోయింది. గమనించిన పోలీసులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు అంకమ్మను తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లామని బాధితురాలి కుమారుడు సూర్యనారాయణ తెలిపారు. అనంతరం సీఐ సుధాకర్‌రావు వచ్చి సమస్య తెలుసుకొని విచారించి న్యాయం చేస్తామన్నారు. అయినా ఆగ్రహించిన బాధితురాలి తరఫు బంధువులు పోలీసుస్టేçÙన్ ముందు ధర్నా చేశారు. అవినీతి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆందోళనకారులు చెన్నారావు, చెన్నయ్య, కల్లూరి నాగయ్య, చిన చెన్నయ్య, వీరపనేని రమణమ్మ, అరుణ, సావిత్రి, గోగడ లక్ష్మీ, రవి, ప్రసాద్ పాల్గొన్నారు.