
మమత మృతదేహం
రామగుండం: అంతర్గాం మండల పరిధి లోని గోలివాడ గ్రామానికి చెందిన యువతి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకుంది. అంతర్గాం ఎస్సై శీలం ప్రమోద్‌రెడ్డి వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ధర్ని కిషన్ కూతురు మమత(20)కు ఇష్టం లేని పెళ్లి సంబంధం కుదిర్చారని బుధవారం మనస్తాపంతో ఇంట్లో పురుగుల మందు తాగింది. స్థానికులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.