పోలీసుల సాక్షిగా..
-
పురుగుమందు తాగి మహిళ ఆత్మహత్యాయత్నం
పీసీపల్లి : డబ్బులు తీసుకుని తన ప్రత్యర్థులకు అండగా ఉంటున్నారంటూ ఓ మహిళ పోలీసుల తీరుకు నిరసనగా పోలీస్‌స్టేషన్‌లోనే వారి సాక్షిగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పోలీసులు, బంధువులు ఆమెను హుటాహుటిన కనిగిరి ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన స్థానిక పోలీసుస్టేçÙ¯Œæలో సోమవారం జరిగింది. వివరాలు.. మండలంలోని కొత్తపల్లికి చెందిన కల్లూరి అంకమ్మకు కంచర్ల మాలకొండయ్యకు నాలుగేళ్లుగా భూ వివాదం ఉంది. ప్రస్తుతం కోర్డులో కేసు నడుస్తోంది. మాలకొండయ్య వర్గీయులు వీరపనేని చెన్నకేశవులు, వీరపనేని చెన్నయ్య, రాయి వెంకటేశ్వర్లు ఆదివారం రాత్రి నేరుగా భూమిలోకి వెళ్లి వ్యవసాయ పనులు ప్రారంభించారు. భూమి వ్యవహారం కోర్టులో ఉండగా రాత్రికి రాత్రి సాగు చేయడం ఏమిటని అంకమ్మ ఎస్సై శ్రీహరికి ఫిర్యాదు చే సింది. పోలీసులు పట్టించుకోకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురై పోలీసుస్టేçÙన్‌కు వెళ్లింది. ప్రత్యర్థుల వద్ద డబ్బులు తీసుకొని తమకు అన్యాయం చేస్తున్నారంటూ వెంట తీసుకెళ్లిన పురుగుమందు తాగి అక్కడే బల్లపై పడిపోయింది. గమనించిన పోలీసులు వెంటనే 108 సిబ్బందికి సమాచారం అందించారు. వారు కనిగిరి ప్రభుత్వ వైద్యశాలకు అంకమ్మను తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తీసుకెళ్లామని బాధితురాలి కుమారుడు సూర్యనారాయణ తెలిపారు. అనంతరం సీఐ సుధాకర్‌రావు వచ్చి సమస్య తెలుసుకొని విచారించి న్యాయం చేస్తామన్నారు. అయినా ఆగ్రహించిన బాధితురాలి తరఫు బంధువులు పోలీసుస్టేçÙన్ ముందు ధర్నా చేశారు. అవినీతి ఎస్సైపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. కార్యక్రమంలో ఆందోళనకారులు చెన్నారావు, చెన్నయ్య, కల్లూరి నాగయ్య, చిన చెన్నయ్య, వీరపనేని రమణమ్మ, అరుణ, సావిత్రి, గోగడ లక్ష్మీ, రవి, ప్రసాద్ పాల్గొన్నారు.