
వినోద్, మంజుల దంపతులు (ఫైల్)
తిరువళ్లూరు: అత్తింటి వేధింపులు తాళలేక ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తిరువళ్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. తిరువళ్లూరు జిల్లా వేపంబట్టు ప్రాంతానికి చెందిన వినోద్. ఇతను కువైట్‌లో పిజియోథెరపిస్టు డాక్టర్‌గా పని చేస్తున్నారు. రాణిపేట జిల్లా కారై గ్రామానికి చెందిన మంజుల(32)తో 2014లో వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడు వున్నాడు. ఈ క్రమంలో అత్తారింటి నుంచి తరచూ వేధింపులు వచ్చాయి. ఈ నేపథ్యంలో గత వారం కువైట్ నుంచి వినోద్ రాగా, కట్నంపై తరచూ జరుగుతున్న వేధింపులను భర్త దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో మరింత వేధింపులు ఎక్కువైనట్టు తెలిసింది.
దీంతో మనస్తాపం చెందిన మంజులా ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వైద్యశాలకు తరలించారు. అయితే కుమార్తె మృతికి వరకట్న వేధింపులే కారణమని మంజుల తండ్రి మునస్వామి ఇచ్చిన ఫిర్యాదు మేరకు సెవ్వాపేట పోలీసులు వినోద్‌ను బుధవారం మధ్యాహ్నం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
తలపై బండరాయి వేసి భార్యను హత్య
టీ.నగర్: భార్యను హతమార్చిన భర్త పోలీసు స్టేషన్‌లో లొంగిపోయిన ఘటన మంగళవారం రాత్రి నెర్కుండ్రంలో జరిగింది. కోయంబేడు సమీపంలోని నెర్కుండ్రం పెరుమాళ్ ఆలయం వీధికి చెందిన ఆలన్ (51) వాటర్ క్యాన్ సప్లయర్. భార్య లక్ష్మి (45). ముగ్గురు పిల్లలకు వివాహమై విడివిడిగా ఉంటున్నారు. మంగళవారం ఆలన్, లక్ష్మి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత ఇరువురూ విడివిడిగా నిద్రించారు.
ఈ క్రమంలో అర్ధరాత్రి భార్య లక్ష్మి తలపై బండరాయి వేశాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. ఆ తర్వాత ఆలన్ ఇంటికి తాళం వేసి రక్తపు మరకల దుస్తులతో నేరుగా వెళ్లి కోయంబేడు పోలీసు స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.
చదవండి: కస్టడీ వ్యక్తి మృతి: ముగ్గురు పోలీసులకు పదేళ్ల జైలు
Comments
Please login to add a commentAdd a comment