
వేలూరు: రైలు కిందపడి ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన వేలూరు జిల్లాలో చోటుచేసుకుంది. కాట్పాడి సమీపంలోని లత్తేరి గ్రామానికి చెందిన మోహన్‌రెడ్డి(60) బస్టాండ్‌లో బాణసంచా దుకాణం నడుపుతున్నాడు. ఇతనికి కుమార్తెలు విద్య(33), దివ్య ఉన్నారు. విద్యకు పదేళ్ల క్రితం నరేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. వీరికి తేజశ్వరన్(8), ధూనూజ్ మోహన్ (6) పిల్లలున్నారు.
మనస్పర్థల వల్ల విద్య భర్తను వదిలి ఇద్దరు కుమారులతో కలిసి తండ్రి మోహన్‌రెడ్దితో ఉంటోంది. ఈ నెల 18న మోహన్‌రెడ్డి, మనమల్లు తేజేశ్వరన్, ధనూజ్‌మోహన్ బాణసంచా దుకాణంలో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందారు. భర్త వదిలి వెళ్లడం, తండ్రి, కుమారులు మృతిచెందడంతో జీవితంపై విరక్తి చెందిన విద్య బుధవారం తెల్లవారుజామున లత్తేరి రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కిందపడి మృతిచెందింది. జోలార్‌పేట రైల్వేపోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
చదవండి: ఆడపడుచుతో గొడవ: పిల్లలతో బావిలో దూకిన తల్లి
Comments
Please login to add a commentAdd a comment