
సాక్షి, హైదరాబాద్ : భవనంపై నుంచి దూకి ఓ వివాహిత శ్రీవిద్య (27) ఆత్మహత్యకు పాల్పడటం నగరంలోని చందానగర్‌లో కలకలం రేపింది. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..ఆరు నెలల క్రితం వరంగల్‌కు చెందిన శబరిష్ అనే యువకుడితో కరీంనగర్‌కు చెందిన శ్రీవిద్యకు వివాహం జరిగింది. భర్త శబరిష్ ఉద్యోగరిత్యా బెంగళూర్‌కు వెళ్లడంతో ఆమె చందానగర్‌లోని వారి కుటుంబ సభ్యుల ఇంటికి వెళ్లారు. శనివారం మధ్యాహ్నం భర్త శబరిష్‌తో ఫోన్‌లో మాట్లాడుతూ ఏదో విషయంపై ఇద్దరూ ఘర్షణ పడ్డారు. ఈ క్రమంలోనే ఏమైందో ఏమోగానీ ఐదో అంతస్తు భవనం నుంచి దూకారు. విషయం గమనించిన కుటుంబ సభ్యులు గాయాల పాలైన శ్రీవిద్యను హుటాహుటిన సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.
ఈ క్రమంలోనే చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందారు. శ్రీవిద్య మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం పోలీసులు ఉస్మానియా హాస్పిటల్ కు తరలించారు. అయితే భర్త శబరిష్ వేధింపులే కారణంగానే శ్రీవిద్య ఆత్మహత్యకు పాల్పడినట్లు ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న చందానగర్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment