విషమిచ్చి.. ఆపై కత్తెరతో పొడిచి..  | Man Kills Wife 2 Children Dies By Suicide In Hyderabad | Sakshi
Sakshi News home page

విషమిచ్చి.. ఆపై కత్తెరతో పొడిచి.. 

Published Tue, Oct 18 2022 12:57 AM | Last Updated on Tue, Oct 18 2022 12:57 AM

Man Kills Wife 2 Children Dies By Suicide In Hyderabad - Sakshi

సుజాత, రమ్య శ్రీ, సిద్ధార్థ్‌

చందానగర్‌: భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. కుటుంబ కలహాలతో భార్య, ఇద్దరు పిల్లలను అత్యంత పాశవికంగా చంపిన భర్త ఆపై ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చందానగర్‌ సీఐ క్యాస్ట్రో కథనం ప్రకారం సంగారెడ్డి జిల్లా కోహీర్‌కు చెందిన రామలింగస్వామి, శకుంతలమ్మ దంపతుల చిన్న కుమారుడు మడపతి నాగరాజు (42)కు మెదక్‌ జిల్లా పోల్కంపల్లికి చెందిన సుజాత (36)తో 12 ఏళ్ల క్రితం వివాహమైంది.

వారికి సిద్ధార్థ్‌ (10), రమ్యశ్రీ (8) పిల్లలు ఉన్నా రు. నాగరాజు కుటుంబం కొంతకాలం కిందట నగరానికి వలస వచ్చి శేరిలింగంపల్లిలోని పాపిరెడ్డి కాలనీలో ఉన్న రా జీవ్‌ గృహకల్పలో నివాసం ఉంటోంది. నాగరాజు  కిరాణా షాపులకు మాసాలాలు, ఇతర గృహావసర వస్తువులను సరఫరా చేస్తుండేవాడు. సుజాత ఇంటి దగ్గర టైలరింగ్‌ చేస్తూ వడ్డీకి డబ్బులు ఇచ్చేది. గత కొన్నాళ్లుగా సుజాతపై అనుమానం పెంచుకున్న నాగరాజు.. ఆమెతో గొడవపడేవాడు.

అతను కొన్ని రోజులుగా పనికి వెళ్లకుండా ఇంటి వద్దనే ఉంటున్నాడు. దీంతో శుక్రవారం రాత్రి భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో భార్యా, పిల్లలను చంపాలనుకున్న నాగరాజు ముందుగా వారికి విషమిచ్చి ఉంటాడని.. అయినా వారు బతికి ఉండొచ్చన్న అనుమానంతో ఇంట్లో ఉన్న టైలరింగ్‌ కత్తెరతో భార్యను తల, మెడపై పొడవగా కుమారుడు సిద్ధార్థ్‌ను కడుపులో, కూతురు రమ్యశ్రీని వీపు వెనుక భాగంలో పొడిచాడని పోలీసులు భావిస్తున్నారు.

అనంత రం ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. సోమవారం ఉదయం ఇంట్లో నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు కిటికీలోంచి చూడగా ఇద్దరు పిల్లలు రక్తపుమడుగులో నిర్జీ వంగా కనిపించారు. దీంతో వారు వెంటనే చందానగర్‌ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సుజాత తండ్రి అంజయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

నాగరాజు సైకోగా మారి హత్యలు చేశాడా లేక మరేవైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఘటనాస్థలిని మాదాపూర్‌ డీసీపీ శిల్పవల్లి, మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్, సీఐ క్యాస్ట్రో పరిశీలించారు.  

తరచూ గొడవ పడేవారు: స్థానికులు
నాగరాజు ఇరుగుపొరుగు వారితో మాట్లాడేవాడు కాదని... కానీ పిల్లలను మంచిగా చూసుకొనే వాడని స్థానికులు తెలిపారు. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవని చెప్పారు. నాగరాజు భార్య సుజాతతో శుక్రవారం మధ్యాహ్నం మాట్లాడినట్లు పొరుగింట్లో ఉండే లక్ష్మి, సుజాత స్నేహితురాలు మంజుల వివరించారు.

శనివారం తాను ఉద్యోగానికి వెళ్లే క్రమంలో సుజాత ఇంటికి వెళ్లగా తలుపులు మూసి ఉన్నాయని మంజుల పేర్కొంది. తాను సుజాతకు ఫోన్‌ చేయగా స్విచ్ఛాఫ్‌ రావడంతో ఊరికి వెళ్లి ఉంటారని భావించి తిరిగి వెళ్లిపోయినట్లు చెప్పింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement