Rangareddy Crime: Shadnagar Man Kills Wife Over Liquor - Sakshi
Sakshi News home page

రంగారెడ్డి: షాద్‌నగర్‌లో తాగుబోతు దారుణం, భార్యకు కరెంట్‌ షాక్‌ పెట్టి కిరాతకంగా..

Published Wed, May 17 2023 5:34 PM | Last Updated on Wed, May 17 2023 7:49 PM

Rangareddy Crime: Shadnagar Man Kills Wife Over Liquor  - Sakshi

క్రైమ్‌: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. 

రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్‌ షాక్‌ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. 

అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి కరెంట్‌ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు.

ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement