rangareddy distirict
-
ఫ్యూచర్‌సిటీ చుట్టుపక్కల గ్రామాల్లో వ్యవసాయ భూములపై దృష్టి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఫ్యూచర్‌సిటీ చుట్టూ ఉన్న గ్రామాల్లోని వ్యవసాయ భూములపై పలువురు ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్, ఇతర ఉన్నతాధికారులు దృష్టి సారించారు. తమ సన్నిహితుల ద్వారా ఆయా గ్రామాల్లోని వ్యవసాయ పట్టా భూముల ధరలపై ఆరా తీస్తున్నట్టు సమాచారం. వ్యవసాయానికి అనుకూలంగా, భూగర్భజలాలు పుష్కలంగా, ఎర్రటి నేలలున్న భూములను కొనుగోలు చేసి పెట్టాలని కోరుతున్నారు. రేవంత్‌రెడ్డి సర్కార్ యాచారం–కందుకూరు మండలాల సరిహద్దులో ఫ్యూచర్‌సిటీని నెలకొల్పడానికి సంకల్పించడం తెలిసిందే. కొంగరకలాన్ ఓఆర్ఆర్ నుంచి నిర్మించబోయే ఫ్యూచర్‌సిటీకి 300 అడుగుల రోడ్డు, మెట్రోరైలు మార్గానికి పచ్చజెండా ఊపింది. దీంతో భవిష్యత్తులో ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందనే భావనతో వ్యవసాయ భూములు కొనుగోలు చేసి పెట్టుకోవాలని చూస్తున్నారు. కొద్ది రోజులుగా ఆయా గ్రామాల్లో తమ సన్నిహితులతో కలిసి వ్యవసాయ భూములను పరిశీలిస్తున్నారు. ఆ గ్రామాలపై ఫోకస్.. కందుకూరు మండల పరిధిలోని మీరాఖాన్‌పేట, ఆకులామైలారం, బెగరికంచె, ముచ్చర్ల, సాయిరెడ్డిగూడ, దాసర్లపల్లి, లేముర్, గూడూర్, యాచారం మండల పరిధిలోని నస్దిక్‌సింగారం, నందివనపర్తి, యాచారం, చౌదర్పల్లి, చింతుల్ల, కుర్మిద్ద, నానక్‌నగర్, తాడిపర్తి, నక్కర్తమేడిపల్లి గ్రామాల్లోని వ్యవసాయ భూములపై ప్రధానంగా దృష్టి సారించారు. ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని ఆదిబట్ల, కొంగరకలాన్, మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల, తుక్కగూడ తదితర గ్రామాల్లో వ్యవసాయ భూములకు ఎకరాకు రూ.5 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పైగా డిమాండ్ పెరిగింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్‌సిటీకి సమీపంలోని యాచారం, కందుకూరు గ్రామాల పరిధిలోని గ్రామాల్లో ప్రస్తుతం రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు ధర పలుకుతోంది. చదవండి: మళ్లీ ‘రియల్’ డౌన్.. తెలంగాణ వ్యాప్తంగా తగ్గిన రిజిస్ట్రేషన్లు, రాబడులు ఫాంహౌస్లపై ఆసక్తి యాచారం, కందుకూరు మండలాల పరిధిలోని గ్రామాల్లో సారవంతమైన వ్యవసాయ భూములున్నాయి. భూగర్భ జలాలకు ఢోకా లేదు. అందుకే ఆయా గ్రామాల్లోని వ్యవసాయ భూములను కొనుగోలు చేసి ఫాంహౌస్‌లు నిర్మించుకుంటే భవిష్యత్తులో మంచి డిమాండ్ ఉంటుందనే నమ్మకం కొనుగోలుదారుల్లో ఉంది. అత్యధికంగా 5 నుంచి 10 ఎకరాల్లోపే కొనుగోలు చేసేలా దృష్టి సారించారు. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో.. ఫ్యూచర్‌సిటీపై భరోసాతో సమీపంలోని గ్రామాల్లో వ్యవసాయ భూముల కొనుగోలుకు కొంత మంది పెద్దలు ఆసక్తి చూపిస్తున్నారు. కొందరైతే నేరుగా రైతులతోనే మాట్లాడుకుని వ్యవసాయ భూములను కొనుగోలు చేస్తున్నారు. – ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, రియల్ వ్యాపారి, హైదరాబాద్ -
రంగారెడ్డి: తుపాకీతో కాల్చుకుని ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య
సాక్షి, రంగారెడ్డి జిల్లా: కొంగరకలాన్‌లో విషాదం చోటుచేసుకుంది. కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రౌండ్‌ఫ్లోర్‌లో విధులు నిర్వహిస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తెల్లవారు జామున 3 గంటల సమయంలో తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.మృతుడి స్వగ్రామం రంగారెడ్డి జిల్లా మంచాల కాగా, 2018 బ్యాచ్‌కి చెందిన కానిస్టేబుల్‌గా గుర్తించారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఇబ్రహీంపట్నంలో పరువు హత్య!
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రేమ వ్యవహారం పరువు హత్యకు దారితీసినట్లు తెలుస్తోంది. నవ మాసాలు మోసి కన్న తన కూతురునే ఓ తల్లి కడతేర్చింది. దీంతో, ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. వివరాల ప్రకారం.. ఇబ్రహీంపట్నం దండుమైలారంలో పరువు హత్య జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. డిగ్రీ మొదటి సంవత్సం చదువుతున్న భార్గవి, శశి అనే యువకుడు కొద్ది రోజలుగా ప్రేమించుకుంటున్నారు. ఇక, వీరి ప్రేమ విషయమై గత కొద్ది రోజులుగా కుటుంబ సభ్యుల మధ్య గొడవ జరుగుతోంది. శశితో మాట్లాడటం, కలవడం మానేయాలని తన తల్లి జంగమ్మ వార్నింగ్ ఇచ్చినట్టు సమాచారం. ఇదిలా ఉండగా.. భార్గవి ఇంట్లో ఉన్న ఉండగా శశి ఇటీవలే ఆమె ఇంటికి వచ్చాడు. ఈ విషయం భార్గవి తల్లికి తెలియడంతో వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. ఈ సందర్బంగా శశినే పెళ్లిచేసుకుంటానని భార్గవి చెప్పడంతో జంగమ్మ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈలోపు.. సోమవారం భార్గవి తన ఇంట్లో విగతజీవిగా కనిపించింది. భార్గవిని ఎవరో చీరతో ఉరి వేసి చంపినట్టు ఆనవాళ్లను ఆమె సోదరుడు గుర్తించాడు. తన తల్లే భార్గవిని చంపినట్టు అనుమానిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో, అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు తల్లి జంగమ్మను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇక, శశి మృతిపై ఆయన తండ్రి మాట్లాడుతూ.. కన్న తల్లి ఎక్కడైనా కూతురును చంపుకుంటుందా?. భార్గవిని నా మేనల్లుడికి ఇచ్చి పెళ్లి చేద్దామనుకున్నాను. భార్గవి మాత్రం శశిని పెళ్లిచేసుకుంటానని చెప్పింది. నిన్న శశి మా ఇంటికి వచ్చాడు. నా భార్యను చూసిన వెంటనే ఇంట్లో నుంచి పారిపోయాడు. ఆ తర్వాతే ఇలా జరిగింది అని చెప్పారు. -
పెద్దమంగళారం 'పంచాయతీ టు అసెంబ్లీ'
సాక్షి, వికారాబాద్: మండల పరిధిలోని పెద్దమంగళారం రాజకీయ కీర్తిని ఘడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలను అందించి రాజకీయ చరిత్రకెక్కింది. 1952, 1957లో షాబాద్ ఎమ్మెల్యేగా, 1959లో రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి పెద్దమంగళారం వాసి. 1978–82 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న చిరాగ్ ప్రతాప్‌లింగంగౌడ్, 1983–85 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్న కొండా లక్ష్మారెడ్డి పెద్దమంగళారం పంచాయతీకి చెందినవారే. విలీనానికి వ్యతిరేకం కేవీఆర్.. 1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కుటుంబంలో జన్మించిన కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లకు, జాగీర్దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆ సమయంలో జైలు జీవితం సైతం అనుభవించారు. 1952–57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. 1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దమనుషుల ఒప్పందంలో ఆయన కీలక భూమిక పోషించారు. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం చేశారు. 1970 జూలై 24న ఆయన తుదిశ్వాస విడిచారు. ఇవి చదవండి: సీఎంను అందించిన భాగ్యనగరం! -
'చనిపోతున్నానంటూ తల్లికి వాట్సాప్ కాల్..' విషాద ఘటన..
హైదరాబాద్: ఆర్థిక ఇబ్బందులతో పాటు కుటుంబ సమస్యలు తాళలేక తాను చనిపోతున్నానని తల్లికి వాట్సాప్ కాల్ చేసి ఓ వ్యక్తి అదృశ్యమైన సంఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. అనంతపురం జిల్లా, కొత్తపల్లి గ్రామానికి చెందిన జి.సతీష్‌కుమార్(42) ఫిలింనగర్ రోడ్ నెం.9లో కుటుంబంతో సహా నివాసం ఉంటున్నాడు. ఈ నెల 17న తన తల్లి అనసూయకు వాట్సాప్ కాల్ చేసిన అతను ఇంట్లో వేధింపులు ఎక్కువయ్యాయని ఆర్థిక ఇబ్బందులు కూడా దీనికి తోడయ్యాయని తాను చనిపోతున్నానని చెప్పాడు. తన కుమారుడు లిఖిత్తో పాటు అన్న కొడుకు వీరేంద్ర చౌదరి బాధ్యతలు తీసుకోవాలని తల్లికి కోరాడు. దీంతో ఆందోళనకు గురైన అనసూయ ఈ నెల 20న నగరానికి వచ్చి ఫిలింనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చేపట్టారు. -
ఆన్లైన్ గేమ్‌లకు అలవాటు పడి.. చివరకు ఇలా..!
రంగారెడ్డి: ఆన్లైన్ గేమ్‌లు, దురలవాట్లకు బానిసై సులువుగా డబ్బులు సంపాదించేందుకు చోరీల బాటపట్టిన నలుగురు అంతర్రాష్ట్ర ముఠా సభ్యులను కీసర పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండి ఆభరణాలు, ల్యాప్‌టాప్, కెమెరాను స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం ఎల్బీనగర్ సీపీ క్యాంప్ కార్యాలయంలో రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ విలేకరులకు తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు రాష్ట్రం, తిరునల్వేలి జిల్లా, నంగునేరికి చెందిన రామకృష్ణన్(35) పాత నేరస్తుడు. కొంత కాలం క్రితం హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌కు వలస వచ్చి చిరుధాన్యాల వ్యాపారం ప్రారంభించాడు. అదే ప్రాంతంలోని దేవేంద్రనగర్ కాలనీ చెందిన కాగ్ గోవింద్(36) స్థానికంగా బఠాణీలు, మరమరాలు వంటివి విక్రయించే షాపు నిర్వహిస్తున్నాడు. ► రామకృష్ణన్ తరుచూ గోవింద్ షాపు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడి ఆన్లైన్ గేమ్‌లు ఆడేవారు. ఇద్దరూ పలు దురలవాట్లకు బానిసయ్యారు. అవసరమైన డబ్బులను సులువుగా సంపాదించేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నారు. ► రామకృష్ణన్ తాను చోరీలు చేస్తానని, చోరీ సొత్తును ఇతర ప్రాంతాల్లో విక్రయించాలని గోవింద్‌కు పురమాయించాడు. రామకృష్ణకు కీసర, కుషాయిగూడ, జవహర్‌నగర్ పరిధిలోని ప్రాంతాలపై అవగాహన ఉండటంతో అక్కడ చోరీలు మొదలెట్టాడు. ► వీరికి అదే ప్రాంతానికి చెందిన బైక్ మెకానిక్ మహేందర్ పవార్(36), బాలాజీనగర్‌లో జ్యువెలరీ వర్క్ షాపు నిర్వహిస్తున్న బచ్చు సంతోష్(40) జత కలిశారు. రామకృష్ణన్ చోరీ చేసిన బంగారాన్ని గోవింద్‌కు ఇస్తే.. దానిని అతను మహేందర్ పవార్, సంతోష్‌లకు ఇచ్చి ఇతర ప్రాంతాల్లో అమ్మించేవాడు. వచ్చిన డబ్బును నలుగురూ పంచుకొనేవారు. ► రామకృష్ణన్ మంకీ క్యాప్, మాస్కు ధరించి తెల్లవారు జామున 3 నుంచి 4 గంటల సమయంలో బైక్‌పై కాలనీలో తిరుగుతూ తాళం వేసి ఉన్న ఇంటిని గుర్తించి దొంగతనం చేసేవాడు. బంధువుల ఇంట్లోనే దొంగతనం.. మహేందర్ పవార్ తన బంధువుల ఫంక్షన్‌కు వెళ్లాడు. ఈ విషయంపై రామకృష్ణన్‌కు సమాచారం ఇచ్చిన అతను బంధువుల ఇంట్లో ఎవ్వరూ లేరని, తాళం వేసి ఉందని చోరీ చేయమని చెప్పాడు. దీంతో రామకృష్ణన్ ఆ ఇంటి తాళం పగులగొట్టి లాకర్లో ఉన్న బంగారం, వెండి అభరణాలను చోరీ చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కీసర పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను సోమవారం తెల్లవారుజామున అరెస్టుచేశారు. వారి వద్ద నుంచి రూ. 50 లక్షల విలువైన బంగారం, వెండితో పాటు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. రామకృష్ణన్‌పై 22 చోరీ కేసులు నమోదై ఉన్నాయని పోలీసులు తెలిపారు. సమావేశంలో మల్కాజిగిరి ఎస్ఓటీ డీసీపీ గిరిధర్, కుషాయిగూడ ఏసీపీడీసీపీ వెంకట్‌రెడ్డి, కీసర సీఐ వెంకటయ్య ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
ఫార్మాసిటీ భూసేకరణ రద్దు
సాక్షి, హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఫార్మా సిటీకి సంబంధించిన భూసేకరణ కేసులో ప్రకటన, అవార్డులు, పరిహారం డిపాజిట్ సహా తదుపరి అన్ని చర్యలను నిలిపివేస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది. మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులైన 180 మంది పిటిషనర్ల నుంచి మళ్లీ అభ్యంతరాలను తీసుకొని, భూ సేకరణ ప్రారంభించాలని ఆదేశించింది. భూసేకరణలో చేపట్టాల్సిన కనీస విధానాన్ని కూడా పాటించకుండా అధికారులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడంపై అసహనం వ్యక్తం చేసింది. ఏదైనా భూమిని సేకరించేటప్పుడు అనుసరించాల్సిన విధానంపై 2017లో ప్రధాన కార్యదర్శి మెమోను జారీ చేసినా, దాన్ని అర్థం చేసుకోవడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని పేర్కొంది. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గుర్తించలేదని, తమ చర్యలను సమర్ధించుకునే ప్రయత్నం చేశా రని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలో మూడేళ్లు గడిచినా ప్రతిష్టాత్మకమైన ఫార్మా సిటీ నిర్మాణం కూడా ముందుకుసాగలేదని పేర్కొంది. ఈ క్రమంలో ప్రభుత్వం 2020, జూలై 23న జారీ చేసిన భూసేకరణ ప్రకటనను కొట్టివేస్తున్నామని వెల్లడించింది. భూసేకరణ, పునరావాసం చట్టంలోని సెక్షన్ 15 కింద అభ్యంతరాలను 3 నెలల వ్యవధిలోగా తీసుకుని, మళ్లీ భూసేకరణ ప్రక్రియ ప్రారంభించాలని అధికారులను ఆదేశించింది. తీర్పు తేదీ ప్రామాణికంగా మార్కెట్ విలువ పేర్కొనాలి భూసేకరణ, పునరావాస చట్టప్రకారం తమకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వడం లేదని, ఇతర చర్యలు చేపట్టడం లేదని మేడిపల్లి, కురిమిద్ద గ్రామవాసులు హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్ ఎం.సుధీర్‌కుమార్ విచారణ చేపట్టి.. తీర్పు వెలువరించారు. పిటిషనర్ తరఫున రవికుమార్, ప్రభుత్వం తరఫున స్పెషల్ జీపీ హరీందర్ పరిషద్ వాదనలు అందకుముందు వినిపించారు. ‘రెండు వారాల్లో పిటిషనర్లు అభ్యంతరాలను తెలియజేయాలి. అధికారులకు సహకరించాలి. ఈ తీర్పు తేదీని ప్రామాణికంగా తీసుకుని అధికారులు మార్కెట్ విలువ నిర్ణయించాలి. ఇరుపక్షాలు చర్చలతో ప్రయోజనాలను పొందాలి. 2015లోనే ప్రభుత్వం గ్రీన్ ఫార్మా సిటీ ప్రాజెక్టును చేపట్టేందుకు నిర్ణయించింది. చట్టపరమైన అడ్డంకులు, హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల కారణంగా ప్రభుత్వ ఆలోచన కార్యరూపం దాల్చలేదు. చట్టాలు ఏం చెబుతున్నాయో కూడా ఐఏఎస్ అధికారులు అర్థం చేసుకోకపోవడం, భూసేకరణ చట్టాన్ని ఎలా అమలు చేయాలన్నది కూడా తెలియకపోవడం ఆక్షేపణీయం. దీని కారణంగానే రెవెన్యూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి 2017, అక్టోబర్ 23న మోమో జారీ చేయాల్సి వచ్చింది. అందులో 2013 భూ సేకరణ చట్ట ప్రకారం.. సేకరణ సమయంలో అనుసరించాల్సిన విధానం ఏంటీ అన్నది చెబుతూ పలు మార్గదర్శకాలు వెల్లడించారు. పిటిషన్ వేసిన తర్వాత కూడా అధికారులు తమ తప్పును గ్రహించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గుడ్డిగా తమ నిర్ణయాన్ని సమర్థిస్తూ వచ్చారు. దీని కారణంగా ఎంతో విలువైన కోర్టు సమయం మూడేళ్లుగా వృథా అవుతూ వచ్చింది’అని తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేసింది. -
కండక్టర్ బలవన్మరణం!
రంగారెడ్డి: అనారోగ్య సమస్యలు భరించ లేక ఓ ఆర్టీసీ కండక్టర్ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఆలూరులో సోమవారం చోటు చేసుకుంది. బాధిత కుటుంబీకులు, పోలీసులు తెలిపిన ప్రకారం.. గ్రామానికి చెందిన కుమ్మరి ప్రభాకర్(39) ఆర్టీసీ కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కొన్ని రోజులుగా కడుపునొప్పి తదితర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. ఉద్యోగానికి కూడా వెళ్లడం లేదు. ఆయన భార్య నవనీత తన పిల్లలతో సహా పుట్టింట్లోనే ఉంటోంది. ఈ నెల 23న ప్రభాకర్ భార్యాపిల్లలను చూసి మధ్యాహ్నం స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం ఉదయం పురుగు మందు సేవించి వచ్చి ఇంటి ఎదుట పడిపోవడంతో స్థానికులు గమనించి చేవెళ్ల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న ఆయన పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రంగారెడ్డి: భార్యకు కరెంట్ షాక్ పెట్టిన తాగుబోతు
క్రైమ్: ప్రేమించి ఆమెను పెండ్లి చేసుకున్నాడు. పదేళ్లు కాపురం కూడా చేసి పిల్లల్ని కన్నాడు. కానీ, మద్యం మత్తులో కుటుంబాన్ని ఆగం చేస్తూ వచ్చాడు. అయితే భర్త, బిడ్డలూ బాగుండాలని మద్యం తాగొద్దని బతిమాలిందామె. ఈ క్రమంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. చివరకు కోపంతో ఆమెను కిరాతకంగా హతమార్చాడు భర్త. రంగారెడ్డి షాద్‌నగర్‌లో దారుణం జరిగింది. మద్యం తాగొద్దని అన్నందుకు కోపంతో నిద్రలో ఉన్న భార్యకు కరెంట్ షాక్ పెట్టాడు ఓ తాగుబోతు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. పదేళ్ల కిందట.. కవిత, యాదయ్యలు ప్రేమవివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు. అయితే.. యాదయ్య పోనుపోను మద్యానికి బానిస అయ్యాడు. ఈ క్రమంలో ఆ అలవాటు మానుకోవాలని ఆమె కోరింది. పంచాయితీలు జరగ్గా.. పెద్దలు ఆమెకు సర్దిచెప్పి పంపించారు. ఈ క్రమంలో ఆమెపై కోపం పెంచుకుని కిరాతకంగా చంపాడు. అనంతరం మత్తు దిగడంతో.. భయంతో పోలీస్ స్టేషన్‌కు వెళ్లి కరెంట్ షాక్‌తో చనిపోయిందని అబద్ధపు ఫిర్యాదు చేశాడు. అయితే పోలీసులు అనుమానంతో తమదైన శైలిలో ప్రశ్నించగా.. నిజం ఒప్పుకున్నాడు. ఈ ఘటనపై కొండుర్గు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. తమ బిడ్డను అన్యాయంగా బలిగొన్నాడంటూ కవిత కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఇదీ చదవండి: తాగనికి పైసల్లేవని ఆ తాత ఏం చేశాడంటే.. -
అమిత్‌షా చేవెళ్ల సభపై రాజకీయ వేడి
-
‘నాన్న.. అమ్మను కొట్టకు బాగా చూసుకో.. నేనింక బ్రతకను..’
తన భవిష్యత్తు కలలను విధి చిదిమేసింది. తన జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న చిన్నారిని ఛాతినొప్పి రూపంలో మృత్యువు వెంటాడింది. దీంతో, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అకాల మరణం పొందింది. ఈ విషాద ఘటన రంగారెడ్డి జిల్లాలో చోటుచేసుకుంది. అయితే, చివరి నిమిషాల్లో ఆమె మాటలు అందరినీ కన్నీరుపెట్టిస్తున్నాయి. వివరాల ప్రకారం.. జిల్లేడుగూడెం మండలం గుర్రంపల్లి గ్రామానికి చెందిన గడ్డ మీది కృష్ణయ్య, నీలమ్మ దంపతుల కుమార్తె నవనీత(13). ఆమె ప్రస్తుతం ఎనిమదో తరగతి చదువుతోంది. నవనీత పేరెంట్స్ మేస్త్రి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే, స్కూల్‌కు వెళ్లిన నవనీత.. ఒక్కసారిగా అస్వస్థతకు గురైంది. క్లాస్‌లో ఉన్న సమయంలోనే ఛాతిలో నొప్పి వస్తోందంటూ ఇంటికి తిరిగి వచ్చేసింది. ఈ విషయంలో తల్లిదండ్రులకు చెప్పడంతో.. ఆమెను వెంటనే షాద్‌నగర్‌లోని ఓ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలోని డాక్టర్లు నవనీతకు ప్రాథమిక వైద్యం అందించారు. చికిత్స సందర్భంగా చిన్నారి గుండెకు సంబంధించిన సమస్య ఉందని.. వెంటనే ఆమెను హైదరాబాద్‌లోని మరో ఆసుపత్రికి తీసుకువెళ్లాలని సూచించారు. వైద్యుల సూచనల మేరకు తమ కుమార్తెను నిలోఫర్ ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ నవనీత శనివారం రాత్రి చనిపోయింది. దీంతో, ఆమె పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. తమ బిడ్డను కాపాడుకోలేకపోయామని ఆవేదనకు గురయ్యారు. ఇదిలా ఉండగా.. నీలోఫర్‌లో నవనీత చికిత్స పొందుతున్న సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు అందరినీ ఆవేదనకు గురిచేశాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో నవనీత మాట్లాడుతూ..‘నాన్న అమ్మని బాగా చూసుకో.. అమ్మను కొట్టకు.. తిట్టకు. నేనింక బ్రతకను.. చనిపోతున్నాను. నా గురించి మర్చిపోండి’ అని కన్నీరుపెట్టుకుంది. ఆమె మాటలకు తండ్రి ధైర్యం చెబుతూ.. నీకేం కాదమ్మా.. అలా అనొద్దు అని చెబుతూనే కన్నీరు పెట్టుకున్నారు. ఇది చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా కన్నీటిపర్యంతమయ్యారు. -
కేసీఆర్ సర్కార్ కాసుల వేట.. అసైన్డ్ భూములపై స్పెషల్ ఫోకస్!
సాక్షి, సిటీబ్యూరో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన రాష్ట్ర సర్కారు కాసుల వేట సాగిస్తోంది. ఖజానా నింపుకునేందుకు అసైన్డ్ భూములను అన్వేషిస్తోంది. వ్యవసాయేతర అవసరాలకు మళ్లిస్తున్న భూములను సేకరించి.. లేఅవుట్లుగా అభివృద్ధి చేసే దిశగా కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తోంది. ధరలు ఆకాశాన్నంటడంతో.. - రాజధానికి చేరువలో ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూముల ధరలు ఆకాశాన్నంటాయి. పారిశ్రామికాభివృద్ధి, ఐటీ కంపెనీల తాకిడితో ఈ రెండు జిల్లాల్లో నగరీకరణ శరవేగంగా జరుగుతోంది. దీంతో స్థిరాస్తి రంగం మూడు పూలు ఆరు కాయలుగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే అసైన్డ్ భూములు సైతం పరాదీనమవుతున్నాయి. భూమిలేని నిరుపేదలకు జీవనోపాధి నిమిత్తం వివిధ దశల్లో రాష్ట్ర ప్రభుత్వం భూములను పంపిణీ (అసైన్మెంట్) చేసింది. - ఈ భూములను వ్యవసాయ సాగుకు మాత్రమే వినియోగించుకోవాలని నిర్దేశించింది. ఒకవేళ ఇతర అవసరాలకు మళ్లించినా.. క్రయ విక్రయాలు జరిపినా చట్టరీత్యా నేరం. ఇవేమీ పట్టని కొందరు ఈ భూములను యథేచ్ఛగా విక్రయించారు. బహిరంగ మార్కెట్‌తో పోలిస్తే కారుచౌకగా ఈ భూములు అందుబాటులో ఉండడంతో బడాబాబులు, ప్రజాప్రతినిధులు ఇబ్బడిముబ్బడిగా కొనుగోలు చేశారు. - ఇలా అసైన్మెంట్ చట్టాన్ని ఉల్లంఘించినా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో ఈ భూములక్రయ విక్రయాలకు అడూ అదుపూ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే అన్యాక్రాంతమవుతున్న అసైన్డ్ భూములను గుర్తించిన ప్రభుత్వం.. వీటిని ప్లాట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా నిధుల సమీకరించుకోవాలనే ఆలోచన చేసింది. నగరానికి సమీపంలో ఉన్న ఈ తరహా భూములను గుర్తించి.. వాటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేసి వేలం వేయాలని నిర్ణయించింది. ఈ అభివృద్ధి చేసిన భూమిలో ఎకరాకు 600 చదరపు గజాలను అసైన్డ్‌దారులకు ఇచ్చే విధంగా ప్రణాళికను రూపొందించింది. గజం రూ.40 వేల చొప్పున.. - ఉప్పల్ భగాయత్‌లో పట్టాదారుల భాగస్వామ్యంతో సేకరించిన హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) లేఅవుట్లుగా అభివృద్ధి చేసింది. దీంట్లో డెవలప్ చేసి ఎకరాకు వేయి గజాల చొప్పున పట్టాదార్లకు కేటాయించింది. ఇదే పద్ధతిని అసైన్డ్ భూములకు కూడా వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగా మార్గదర్శకాలను ఖరారు చేసి భూములను గుర్తించాలని కలెక్టర్లకు లేఖ రాసింది. ఈ మేరకు చర్లపటేల్ గూడ, కుర్మల్‌గూడ, తొర్రూర్, కవాడిపల్లి, చందానగర్, మునగనూరు, కొల్లూరు, పసుమాముల, తుర్కయంజాల్, లేమూరు, కొల్లూరులలో దాదాపు 3వేల ఎకరాలను ప్రాథమికంగా ఎంపిక చేసింది. - సేకరిస్తున్న అసైన్డ్ భూములకు ఆయా ప్రాంతాల్లో ఉన్న విలువ ఆధారంగా ఎకరాకు 600 గజాల నుంచి 800 వరకు ఇవాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. ప్రైవేటు భూములతో పోలిస్తే అసైన్డ్ భూములకు ధర తక్కువ. వీటి క్రయవిక్రయాలపై నిషేధం ఉన్నందున.. ఇవి ఎకరాకు రూ.25 లక్షలు కూడా లభిస్తున్నాయి. - ఈ అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న సర్కారు వీటిని లేఅవుట్లుగా అభివృద్ధి చేయడం ద్వారా గజాన్ని సగటున రూ.40వేల చొప్పున విక్రయించవచ్చని అంచనా వేస్తోంది. దీంతో అటు అసైన్డ్‌దారులు.. ఇటు ప్రభుత్వానికి ఉభయతారకంగా లబ్ధి చేకూరుతుందని భావిస్తోంది. ఎన్నికల సంవత్సరం కావడం.. సంక్షేమ పథకాలకు నిధులు భారీగా అవసరం ఉండడంతో సాధ్యమైనంత త్వరగా అసైన్డ్ భూములను సేకరించి వెంచర్లుగా అభివృద్ధి చేసి నిధులను సమకూర్చుకోవాలనుకుంటోంది. దీంతో ఈ ప్రక్రియను వడివడిగా పూర్తి చేయాలని కలెక్టర్లకు మౌఖిక ఆదేశాలు జారీ చేసింది. -
అండలేని తాండా - బతుకు చిత్రం
-
పేదల సంక్షేమమే లక్ష్యం
మంచాల: పేదల సంక్షేమమే తన లక్ష్యమని వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. ప్రజాప్రస్థానంలో భాగంగా ఆమె చేపట్టిన పాదయాత్ర శనివారం రంగారెడ్డి జిల్లా మంచాల మండల పరిధిలోని జాపాల, రంగాపూర్, చీదేడ్, దాద్‌పల్లి గ్రామాల మీదుగా సాగింది. జాపాలలో మహిళలు ఆమెకు తిలకం దిద్ది స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షర్మిల కుండలు తయారు చేస్తున్న కుమ్మరులను కలసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రంగాపూర్‌లో పొలం వద్ద రైతులతో ముచ్చటించారు. దాద్‌పల్లిలో గిరిజన మహిళలు బహూకరించిన లంబాడీ దుస్తులు ధరించి వారితో కలసి ఆడిపాడారు. చీదేడ్‌లో మాటాముచ్చట కార్యక్రమంలో ప్రజా సమస్యలు తెలుసుకున్నారు. ఆయా వర్గాలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ.. కేసీఆర్ నియంత పాలన పోవాలంటే.. రాజన్న రాజ్యం రావాలంటే అంతా వైఎస్సార్ తెలంగాణ పార్టీకి అండగా ఉండి ఆశీర్వదించాలని అన్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, రుణమాఫీ, ఇందిరమ్మ ఇళ్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు అందించిన ఘనత వైఎస్సార్‌దేనన్నారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో ఎనిమిది వేల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. పేదలకు పింఛన్లు, డబుల్ బెడ్రూం ఇళ్లు, రేషన్ కార్డులు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చిన దాఖలాలు లేవన్నారు. ఎన్నికల ముందు హామీలు ఇచ్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని మండిపడ్డారు. కరోనా సమయంలోనూ సామాన్య, పేద ప్రజలను ఆదుకోలేని దుస్థితిలో తెలంగాణ ప్రభుత్వం ఉందన్నారు. మహిళలకు ఏమాత్రం రక్షణ లేకుండా పోయిందన్నారు. ఆత్మహత్యలు లేని తెలంగాణ, సామాజిక న్యాయం కావాలంటే వైఎస్సార్ టీపీ రావాలన్నారు. సేవ చేసేందుకే మీ ముందుకు వచ్చానని.. అందరి కోసం పోరాడతానని పేర్కొన్నారు. అందరికీ ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అందే వరకు ఉద్యమిస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పిట్టా రాంరెడ్డి, ఏçపూరి సోమన్న, వేణుగోపాల్‌రెడ్డి, అమృతసాగర్, మాదగోని జంగయ్య గౌడ్, నేనావత్ శ్రీనివాస్, నియోజకవర్గ నాయకులు జయరాజ్, భాస్కర్, మహేశ్, నందకుమార్, జంగయ్య గౌడ్, వేణు ప్రసాద్, మహేందర్, శ్రీకాంత్, నగేశ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. -
చినజీయర్ ఆశ్రమానికి కేసీఆర్
శంషాబాద్ రూరల్: ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సతీసమేతంగా సోమవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ శ్రీరామనగరంలోని జీవా ప్రాంగణంలో ఉన్న ఆశ్రమంలో శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్ స్వామిని కలిశారు. ఈ సందర్భంగా వేద పండితులు సీఎంకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. సీఎం దంపతులను జీయర్‌స్వామి శాలువాతో సత్కరించి ఆశీర్వచనం అందించారు. అనంతరం ఆశ్రమంలోని నిత్యాన్నదాన సత్రంలో సీఎం కేసీఆర్ సహపంక్తి భోజనం చేశారు. ఆ తర్వాత యాద్రాది ప్రారంభోత్సవంపై జీయర్ స్వామితో సీఎం కేసీఆర్ చర్చించారు. శ్రీ రామానుజ సహస్రాబ్ది ఉత్సవాల నేపథ్యంలో గ్రీన్ ఇండియా చాలెంజ్‌లో భాగంగా ఎంపీ జోగినిపల్లి సంతోశ్‌కుమార్ పిలుపు మేరకు ఆశ్రమ ఆవరణలో జీయర్‌స్వామితో కలసి సీఎం కేసీఆర్ ఐదు జమ్మి మొక్కలను నాటారు. ‘ఊరు ఊరుకు జమ్మి–గుడి గుడికి జమ్మి’పేరిట ఎంపీ సంతోశ్ చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని చినజీయర్ స్వామి కొనియాడారు. హైందవ సంప్రదాయంలో ఎంతో ప్రాధాన్యత ఉన్న జమ్మి చెట్టును జాతీయ స్థాయిలో ఉద్యమంగా ముందుకు తీసుకెళ్తున్న ఆయనకు శ్రీమన్నారాయణ ఆశీస్సులు ఉండాలని జీయర్‌స్వామి ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మైహోం గ్రూప్ అధినేత, టీటీడీ బోర్డు సభ్యుడు జూపల్లి రామేశ్వర్రావు, కావేరి సీడ్స్ అధిపతి భాస్కర్‌రావు, కలెక్టర్ అమెయ్ కుమార్, సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, ఆర్డీఓ చంద్రకళ తదితరులు పాల్గొన్నారు. యాద్రాది పర్యటన రద్దు.. ముచ్చింతల్ నుంచి చినజీయర్ స్వామితో కలసి సీఎం కేసీఆర్ యాద్రాది వెళ్లాలని నిర్ణయించుకోగా.. జీయర్‌స్వామి చాతుర్మాస దీక్షలో ఉన్నందును సాధ్యపడలేదు. నవంబర్ 19 నాటికి స్వామి దీక్ష పూర్తికానుంది. ఆ తర్వాతనే జీయర్ స్వామి యాద్రాదిని సందర్శించే అవకాశాలున్నాయి. కార్యక్రమం వాయిదా పడటంతో సీఎం తిరిగి గజ్వేల్‌లోని ఫాంహౌస్‌కు వెళ్లిపోయారు. జమ్మి మొక్క నాటుతున్న చినజీయర్‌స్వామి, సీఎం కేసీఆర్. చిత్రంలో ఎంపీ సంతోష్‌కుమార్ -
వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపొందాలి
శంషాబాద్ రూరల్: కరోనాపై పోరాడేందుకు వ్యాక్సినేషన్ ఒక్కటే ప్రత్యామ్నాయమని, వ్యాక్సినేషన్ ప్రజా ఉద్యమంలా రూపుదాల్చాలని ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. స్వర్ణ భారత్ ట్రస్టు ఆధ్వర్యంలో తెలంగాణ, ఏపీల్లో మూడు కేంద్రాల్లో ఏర్పాటు చేసిన కోవాగ్జిన్ ఉచిత టీకా పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలంలోని ముచ్చింతల్ సమీపంలో ఉన్న ట్రస్టు ఆవరణలో వెంకయ్యనాయుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం ప్రపంచంలోనే అతి పెద్ద టీకా పంపిణీ కార్యక్రమం చేపట్టిందని, ఈ కార్యక్రమాన్ని అందరూ విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. టీకాకు సంబంధించి ప్రజల్లో నెలకొన్న అపోహలు వీడాలని కోరారు. దేశీయంగా తయారీతో తగ్గిన ఖర్చు: దేశీయంగా టీకాలను ఉత్పత్తి చేయడం ద్వారా ఖర్చు తగ్గడమే కాకుండా అన్ని ప్రాంతాలకు టీకాలు అందించే వీలుంటుందని భారత్ బయోటెక్ ఎండీ సుచిత్ర ఎల్లా అన్నారు. హైదరాబాద్‌తో పాటు మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని కేంద్రాల నుంచి కోవాగ్జిన్ టీకాను ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపరాష్ట్రపతి సతీమణి ఉష పాల్గొన్నారు. -
బతికున్న మహిళ పేరిట రైతు బీమా : కో ఆర్డినేటర్ లీలలు
-
వేలానికి వేళాయె.. త్వరలో అసైన్డ్ భూముల వేలం!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర బడ్జెట్లో పన్నేతర ఆదాయం కింద భారీగా 30 వేల కోట్ల రూపాయలను ప్రతిపాదించిన ప్రభుత్వం... ఆ నిధుల సమీకరణకు ఉద్యుక్తమవుతోంది. అందులో భాగంగా రాజధాని శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకం వ్యవహారంపై దృష్టి సారించింది. రంగారెడ్డి జిల్లా కందుకూరు, మహేశ్వరం, శంషాబాద్, గండిపేట మండలాల్లో క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి అమ్మకానికి అనువుగా ఉన్నాయని గుర్తించిన 1,636 ఎకరాల భూమిని ప్రభుత్వం త్వరలోనే వేలానికి పెట్టనున్నట్లు సమాచారం. ఈ భూముల అమ్మకాల ద్వారా రూ.4 వేల కోట్ల దాకా వస్తాయని తొలుత అంచనా వేశారు. కానీ ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల ప్రకారం రూ.5 వేల కోట్ల వరకు రావొచ్చని రెవెన్యూ అధికారులు లెక్కలు గడుతున్నారు. వీటికి తోడు గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో ఖాళీగా ఉన్న మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని విక్రయిస్తే రూ.3,500 కోట్ల వరకు సమకూరే అవకాశాలున్నాయి. ఈ లెక్కన అసైన్డ్ భూముల అమ్మకాల ద్వారా తొలివిడతలో రూ.8,500 కోట్ల వరకు రాబట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. లబ్ధిదారులకు నష్టం లేకుండా వాస్తవానికి నగర శివార్లలో ప్రభుత్వం వేలాది ఎకరాలను పలు దశల్లో పేదలకు అసైన్ చేసింది. ఎలాంటి ఆసరాలేని సదరు పేదలు ఈ భూముల్లో వ్యవసాయం చేసుకుని ఉపాధి పొందాలన్నది ప్రభుత్వ ఉద్దేశం. అయితే ఈ భూములు కొన్ని వ్యవసాయానికి అనుకూలంగా లేకపోవడం, పేదలు తమ అవసరాలకు భూములను ఇతరులకు విక్రయించడంతో... ఇప్పుడు ఎక్కువ భూములు అటు ప్రభుత్వం దగ్గర, ఇటు అసైన్డ్‌దారుల దగ్గర కాకుండా థర్డ్‌పార్టీ చేతిలో ఉన్నాయి. ఇలాంటి భూములెన్ని ఉన్నాయన్న లెక్క భూరికార్డుల ప్రక్షాళనలో భాగంగా ఇదివరకే ఓ కొలిక్కి వచ్చింది. హైదరాబాద్ శివార్లలో ఉన్న రంగారెడ్డి జిల్లా పరిధిలోని కొంగరఖుర్దు, మాదాపూర్, రావిర్యాల, తుమ్మలూరు, రాయన్నగూడ గ్రామాల్లో ప్రభుత్వం ప్రత్యేకంగా సర్వే చేయించింది. ఈ గ్రామాల్లో అసైన్ చేసిన భూముల్లో అన్యాక్రాంతమైనవి, నిరుపయోగంగా ఉన్నవి కలిపి మొత్తం 1,636 ఎకరాలు అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చింది. గత ఏడాది కేవలం సర్వేకు మాత్రమే పరిమితమైన ప్రభుత్వం ఇప్పుడు ఈ భూములను వేలం వేయడం లేదా బహుళ జాతి సంస్థలకు విక్రయించే ప్రతిపాదనను సీరియస్‌గా పరిశీలిస్తోందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలను మరోమారు తెప్పించుకున్న ఉన్నతాధికారులు దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని రెవెన్యూవర్గాలు చెపుతున్నాయి. అయితే అసైన్డ్ చేసిన పేదలకు నష్టం కలగకుండా ఈ భూములను స్వాధీనం చేసుకోవాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. అసైనీల చేతిలో ఉన్నప్పటికీ వారు వ్యవసాయం చేయకుండా ఉన్న భూములు, అసైనీలు ఇతరులకు అమ్ముకున్న భూములను తీసుకోవాలని, ఈ క్రమంలో అసైనీలకు లేదంటే థర్డ్‌పార్టీకి మార్కెట్ విలువ ప్రకారం పరిహారం చెల్లించాలని యోచిస్తోంది. ఇందుకు గాను రూ.1,200 కోట్ల వరకు ఖర్చవుతుందని కూడా రెవెన్యూ శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. పద్దు పూడాలంటే... అమ్మాల్సిందే! రాష్ట్ర ప్రభుత్వం 2021–22 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ ఏడాది మార్చి 18న అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో పన్నేతర ఆదాయం పద్దు కింద రూ.30,557 కోట్లను చూపెట్టింది. కానీ గత మూడేళ్ల లెక్కలను పరిశీలిస్తే ఎప్పుడూ పన్నేతర ఆదాయం రూ.10 వేల కోట్లను దాటలేదు. 2018–19లో రూ. 10,007 కోట్లు, 2019–20లో రూ.7,360 కోట్లు, 2020–21లో అయితే రూ.5వేల కోట్లు దాటలేదు. గత ఆర్థిక సంవత్సరంలో కూడా పన్నేతర ఆదాయం కింద రూ. 30,600 కోట్లు పద్దు చూపెట్టినా అందులో ఆరో వంతు మాత్రమే వచ్చింది. గత ఏడాదిలోనూ ప్రభుత్వ భూముల అమ్మకం ప్రతిపాదనలున్నప్పటికీ అమల్లోకి రాకపోవడంతో పన్నేతర ఆదాయం పెరగలేదు. ఈ నేపథ్యంలో 2021–22 ఆర్థిక సంవత్సరంలో కూడా రూ. 30,557 కోట్లను పన్నేతర పద్దు కింద ప్రభుత్వం చూపెట్టడంతో ఈసారి భూముల అమ్మకాలు అమల్లోకి వస్తాయని ఆర్థిక శాఖ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లోనే నగర శివార్లలోని అసైన్డ్ భూముల అమ్మకాల ప్రతిపాదన ఫైలును మరోమారు ప్రభుత్వం తెరుస్తోంది. భూములు అమ్మకాల తొలిదశలో భాగంగా ఈ అసైన్డ్ భూములతో పాటు మరో 188 ఎకరాల ప్రభుత్వ భూమిని వేలం వేయడం లేదంటే బహుళ జాతి సంస్థలకు నిర్దేశిత ధరకు విక్రయించడం చేయాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. అమ్మకానికి అనువుగా ఉన్నాయని తేల్చిన అసైన్డ్ భూముల లెక్క ఇది గ్రామం ఎకరాలు ఆదాయం అంచనా (రూ.కోట్లలో) మాదాపూర్ 243.35 243 రావిర్యాల 281.19 843 తుమ్మలూరు 418.01 1254 రాయన్నగూడ 69.09 48.30 కొంగరఖుర్దు 435.18 1,196 (ఇవి గాక గండిపేట మండలం పుప్పాలగూడ గ్రామంలో 188 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమిని అమ్మితే రూ.3,500 కోట్లు వస్తాయని రెవెన్యూ అధికారులు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.) చదవండి: సీరియస్‌గా ఉంటేనే అడ్మిషన్ -
గుంతలో మొసలి.. జడుసుకున్న కూలీలు!
మర్పల్లి: వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం బిల్కల్ గ్రామంలోని ఓ ఫాంహౌస్‌లో షెడ్డు నిర్మాణం కోసం తీసిన పిల్లర్ గుంతలోకి మొసలి వచ్చింది. సోమవారం ఉదయం ఈ ఘటన వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి.. బిల్కల్లో హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తికి ఫాంహౌస్ ఉంది. అందులో షెడ్డు నిర్మాణం కోసం కూలీలు పిల్లర్ గుంతలు తీస్తున్నారు. ఈ క్రమంలో సుమారు 200 కిలోల బరువున్న మొసలి ఉదయం ఓ పిల్లర్ గుంతలో కనిపించడంతో కూలీలు భయాందోళనకు గురయ్యారు. సర్పంచ్ శ్రీనివాస్ ఫారెస్టు అధికారులకు దీనిపై సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న అటవీశాఖ అధికారులు పిల్లర్ గుంతలో ఉన్న మొసలిని పైకి తీసి తాళ్లతో బంధించారు. బంట్వారం ఫారెస్టు సెక్షన్ అధికారి ఫరీద్ ఆధ్వర్యంలో మొసలిని సంగారెడ్డి జిల్లాలోని మంజీరా ప్రాజెక్టుకు తరలించి అందులో వదిలేశారు. బిల్కల్ గ్రామ సమీపంలోని మిలిగిరిపేట్ చెరువులోంచి మొసళ్లు వస్తున్నాయని సర్పంచ్ శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మూడుసార్లు ఫారెస్టు అధికారులు మొసళ్లను బంధించి ప్రాజెక్టులో వదిలేశారని పేర్కొన్నారు. మొసళ్లు గ్రామాల్లోకి రాకుండా మిలిగిరిపేట్ చెరువు చుట్టూ కంచె ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చదవండి: ఆ పక్షులు మంటలో దూకి ప్రాణాలు విడుస్తాయి -
నష్టాలు వచ్చాయని.. రియల్టర్ ఆత్మహత్య
సాక్షి, చేవెళ్ల: ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో ఓ రియల్టర్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పోలీస్‌స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. చేవెళ్ల మండలంలోని కందవాడ గ్రామానికి చెందిన వడ్ల అంజన్‌చారి (35) కొన్నేళ్లుగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలతో అతడు చేవెళ్లలోని టీచర్స్ కాలనీలో నివాసముంటున్నాడు. అయితే కరోనా కారణంగా వ్యాపారం పూర్తిగా దెబ్బతినటంతో అంజన్‌చారికి ఆర్థిక ఇబ్బందులు మొదలయ్యాయి. అతని వద్ద పెట్టుబడులు పెట్టిన వారంతా తిరిగి డబ్బులు అడుగుతుండటంతో కొన్నిరోజులుగా ఆందోళనలో ఉన్నాడు. ఆగస్టు 31న ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన అంజన్‌చారి తిరిగి రాలేదు. ఫోన్ కూడా పనిచేయకపోవడంతో అదే రోజు రాత్రి భార్య మమత దీనిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఐదు రోజుల తర్వాత శనివారం చేవెళ్ల మండల కేంద్రం నుంచి కందవాడ గ్రామానికి వెళ్లే దారి వైపున్న వెంచర్ వద్ద ఓ వ్యక్తి పురుగుల మందు తాగి మృతి చెందినట్లుగా గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో అక్కడికి వెళ్లి పరిశీలించిన పోలీసులు.. అంజన్‌చారిదే ఆ మృతదేహమని గుర్తించారు. మృతదేహం కుళ్లి ఉండటంతో అంజన్‌చారి ఇంట్లో నుంచి వెళ్లిన రోజునే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని చేవెళ్ల ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
అబ్దుల్లాపూర్‌మెట్ వద్ద లారీ బీభత్సం
సాక్షి, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ వద్ద మంగళవారం లారీ బీభత్సం సృష్టించింది. బైక్‌ను ఢీకొట్టిన లారీ, ఆ తర్వాత ట్రాన్స్ ఫార్మర్ను ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ట్రాన్స్ ఫార్మర్ ను ఢీకొట్టడంతో లారీ డ్రైవర్ క్యాబిన్ లో చిక్కుకున్నాడు. డ్రైవర్ ను బయటకు తీసేందుకు స్థానికులు శ్రమిస్తున్నారు. -
లాక్డౌన్: 1,270 వాహనాలు సీజ్
సాక్షి, రంగారెడ్డి: కరోనా వ్యాప్తి నివారణకు ప్రభుత్వం అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తున్న వారిసంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని, ఇళ్లకే పరిమితం కావాలనే ఆదేశాలను బేఖాతరు చేస్తున్న తీరు తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఆకతాయిలు అవసరం లేకున్నా రోడ్డెక్కుతూ సరదాగా తిరుగుతూ పోలీసులకు చిక్కుతున్నారు. ఇలా లాక్డౌన్ అమలవుతున్న గతనెల 23 నుంచి ఈనెల 11వరకు జిల్లాలోని గ్రామీణ ప్రాంతం పరిధిలో పోలీసులు కొరడా ఝళిపిస్తూ కేసులు నమోదు చేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 18 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. విజయవాడ, బెంగళూరు, నాగార్జునసాగర్, శ్రీశైలం, బీజాపూర్ రహదారుల్లో పెద్దఎత్తున తనిఖీలు చేస్తున్నారు. రాజేంద్రనగర్, షాద్‌నగర్, శంషాబాద్, మణికొండలో రెండు చొప్పున, చేవెళ్ల, మొయినాబాద్, శంకర్పల్లి, ఆమనగల్లు, కడ్తాల్, ఇబ్రహీంపట్నం, కందుకూరు, బొంగుళూరు, మహేశ్వరం, మాల్లో ఒకటి చొప్పున చెక్‌పోస్టులు ఉన్నాయి. అంతటా నిత్యం తనిఖీలు చేస్తూ.. అనవసరంగా రోడ్డెక్కిన వాహనాలను సీజ్ చేస్తూ వాహనదారులపై కేసులు నమోదు చేస్తున్నారు. 1,270 వాహనాలు సీజ్.. గ్రామీణ ప్రాంతం పరిధిలో దాదాపు 23 ఠాణాలు ఉండగా.. దాదాపు 1,270 వాహనాలు సీజ్ అయ్యాయి. ఇందులో 70 శాతం మేర ద్విచక్ర వాహనాలే ఉన్నట్లు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. 13 శాతం త్రిచక్ర వాహనాలు, 17 శాతం నాలుగు చక్రాల వాహనాలు ఉన్నట్లు పేర్కొంటున్నాయి. ఈ వాహనాలను పోలీసులు లాక్డౌన్ పూర్తయ్యాక కోర్టులకు అప్పగించనున్నారు. కోర్టులు విధించే జరిమానా చెల్లించి యజమానులు తిరిగి తీసుకోవాల్సి ఉంటుంది. 185 మందిపై కేసులు లాక్‌డౌన్‌ను పోలీసులు పకడ్బందీగా నిర్వహిస్తున్నా.. కొందరు నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. పరిమిత సమయానికి మించి విక్రయాలు జరపడం, మరికొందరు లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘించి వ్యాపారం నిర్వహించారు. అలాగే కూరగాయల మార్కెట్లు, ఇతర షాపులు, సూపర్ మార్కెట్ల వద్ద భౌతికదూరం పాటించడం లేదు. ఈమేరకు 185 మందిపై ఎపిడిమిక్ డిసీజెస్ యాక్ట్–1987, ఐపీసీ 188, జాతీయ విపత్తుల నియంత్రణ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. వీరిపై నేరం రుజువైతే రెండేళ్ల వరకు జైలు శిక్ష తప్పదు. కొన్ని సందర్భాల్లో కోర్టులు జరిమానా కూడా విధించవచ్చు. ఉమ్మినా.. మాస్క్ లేకున్నా.. మహమ్మారి కోవిడ్ రోజురోజుకూ విస్తరిస్తున్న తరుణంలో నివారణ కోసం రెవెన్యూ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ అధికారులు పకడ్బందీగా వ్యవహరిస్తున్నారు. మాస్క్‌లు లేకుండా ఎవరూ బయట తిరగొద్దని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయద్దు. ఈ అంశాలపై ప్రజల్లో పెద్దగా అవగాహన లేదు. ఇప్పుడిప్పుడే ఆయా విభాగాలు వీటిపై చైతన్యం కలి్పస్తున్నాయి. మరోరెండు మూడు రోజులపాటు దీన్ని కొనసాగించనున్నారు. ఆ తర్వాత మాస్క్ లేకుండా బయట తిరిగినా, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేసినా కేసులు నమోదు చేయకతప్పదని పోలీసులు స్పష్టం చేస్తున్నారు. ఇంట్లో ఉంటేనే క్షేమం లాక్డౌన్ నిబంధనలను ప్రతిఒక్కరూ కచి్చతంగా పాటించాలి. అత్యవసరమైతే తప్ప గడప దాటొద్దు. రోడ్డెక్కొద్దు. ఈ నిబంధనలను కచి్చతంగా పాటిస్తేనే వారి కుటుంబాలు క్షేమంగా ఉంటాయి. తద్వారా సమాజం కూడా బాగుంటుంది. ప్రభుత్వం ఏం చేసినా.. ప్రజల మేలు కోసమే. దీనిని ప్రతి వ్యక్తి గుర్తించి సహకరించాలి. స్వీయ రక్షణ.. భౌతికదూరంతోనే కరోనా వైరస్ వ్యాప్తిని నివారించగలం. మాస్‌్కలు ధరించకుండా బయట తిరిగితే, బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మినా కేసులు తప్పవు. మాస్క్‌లు పంపిణీ చేయడానికి కొన్ని ఎన్జీఓలను గుర్తిస్తున్నాం. ఆయా సంస్థల ద్వారా మాస్‌్కలు అందజేస్తాం. – ప్రకాశ్ రెడ్డి, శంషాబాద్ డీసీపీ -
మైసమ్మ సన్నిధిలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి
కడ్తాల్: రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలంలో వెలసిన మైసిగండి మైసమ్మ తల్లిని శనివారం సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ ఆర్.సుభాష్‌రెడ్డి, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి కుటుంబీకులతో కలిసి దర్శించుకున్నారు. వారికి ఆలయ అధి కారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు పూలమాలలు, శాలువాలతో సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈవో స్నేహలత, ట్రస్టీ చైర్మన్ శిరోలీ తదితరులు పాల్గొన్నారు. -
విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సర్పంచ్‌లకు షోకాజ్ జారీ
సాక్షి, రంగారెడ్డి: విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన, అనధికార లేఅవుట్లను అరికట్టడంలో విఫలమైన ఏడుగురు సర్పంచ్‌లు, ఇద్దరు ఉప సర్పంచ్‌లకు జిల్లా పంచాయతీ అధికారి పద్మజారాణి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. షోకాజ్ నోటీసులు జారీచేయడానికి దారితీసిన అంశాలను ఆమె వివరించారు. 111 జీఓ పరిధిలో ఉన్న మొయినాబాద్ మండలం చిలుకూరులో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో స్థానిక సర్పంచ్ గునుగుర్తి స్వరూప విఫలమయ్యారు. అలాగే అదే మండలంలోని తోలుకట్టలో అక్రమ లేఅవుట్లకు, ఇంటి నిర్మాణాలకు సర్పంచ్ కనకమామిడి శ్రీనివాస్ అనుమతులు ఇచ్చారు. కనకమామిడి గ్రామంలో సర్పంచ్ పట్లోళ్ల జనార్దన్‌రెడ్డి.. 111 జీఓ ఉల్లంఘనలు జరిగినా పట్టించుకోలేదు. ఆయా సర్వే నంబర్ల పరిధిలో 32 ఎకరాల విస్తీర్ణంలో అనధికార లేఅవుట్లను నిరోధించడంలో విఫలమయ్యారు. సురంగల్ సర్పంచ్ గడ్డం లావణ్య కూడా ఇదే తరహాలో విఫలమయ్యారు. కందుకూరు మండలం పులిమామిడి సర్పంచ్ వత్తుల అనిత.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా చేసిన పనులకు ఎలాంటి తీర్మాణాలూ, ఎంబీ రికార్డులు, ఓచర్లు, బిల్లులు లేకుండా.. పంచాయతీ కార్యదర్శికి తెలియకుండా చెక్కులు ఇచ్చారు. మహేశ్వరం మండలం సిరిగిరిపురం సర్పంచ్ కాసుల సురేష్.. గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.20.22 లక్షలు నిల్వ ఉన్నప్పటికీ నిధుల్లేవని వార్తా పత్రికల ద్వారా తప్పుడు ప్రచారం చేశారు. యాచారం మండలం మొండిగౌరెళ్లి సర్పంచ్ బండమీది కృష్ణ ఎంపీడీఓను ఉద్దేశించి సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకరమైన పోస్టులు పెట్టి అధికారులను భయబ్రాంతులకు గురిచేశారు. గ్రామ పంచాయతీ పాలనలో పంచాయతీ సెక్రటరీ సహకరించకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటమే కాకుండా అవమానకర రీతిలో ప్రవర్తించారు. శంకర్పల్లి మండలం ఇర్రికుంటతండా ఉప సర్పంచ్ పి.లక్ష్మణ్.. 30 రోజుల ప్రణాళికలో భాగంగా పనులు చేస్తుండగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి పంచాయతీ సెక్రటరీ విధులకు ఆటంకం కలిగించారు. జీపీ పరిధిలో గతంలో చేసిన అభివృద్ధి పనులకు, సిబ్బంది వేతనాలకు సంబంధించిన చెక్కులపై ఇదే మండలానికి చెందిన మాసానిగూడ ఉప సర్పంచ్ పి.వెంకటేశ్వర్‌రెడ్డి సంతకాలు చేయలేదు. వీటన్నింటిపై విచారణ జరిపిన డీపీఓ.. కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు మంగళవారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. -
పాత టికెట్లు ఇచ్చి పైసలు వసూలు చేసిన కండక్టర్
షాద్‌నగర్‌రూరల్ : ప్రయాణికులకు పాత టికెట్లు ఇచ్చి డబ్బులు వసూలు చేసిన తాత్కాలిక కండక్టర్ ఉదంతం ఒకటి శనివారం వెలుగు చూసింది. షాద్‌నగర్ ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో శనివారం ఫరూఖ్‌నగర్ మండలం నేరేళ్ళచెరువు గ్రామానికి చెందిన ప్రైవేట్ కండక్టర్ కె.శివకుమార్, డ్రైవర్ ఎండీ గౌస్ విధులు నిర్వహిస్తున్నారు. అయితే, బస్సును గద్వాల డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి షాద్‌నగర్‌లో తనికీ చేశారు. టికెట్ల అమ్మకం ప్రకారం కండక్టర్ కె.శివకుమార్ క్యాష్ బ్యాగ్‌లో రూ.3143 ఉండాలి. కానీ, రూ.4470 ఉన్నట్లు గుర్తించారు. అదనంగా ఉన్న డబ్బుల గురించి కండక్టర్‌ను ప్రశ్నించగా సరైన సమాధానం చెప్పడం లేదని డీఎం వివరించారు. ప్రయాణికులకు టికెట్లు అమ్మిన తర్వాత వాటిని తిరిగి కండక్టర్ ప్రయాణికుల నుంచి తీసుకొని బ్యాగులో ఉంచుకున్నట్లు తెలిపారు. కండక్టర్ కె.శివకుమార్ పాత టికెట్లను ప్రయాణికులకు ఇచ్చి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తాము గుర్తించామని డీఎం తెలిపారు. ఈ మేరకు శివకుమార్‌పై చర్యలు తీసుకోవాలని షాద్‌నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు డిపో మేనేజర్ మురళీధర్‌రెడ్డి తెలిపారు. శివకుమార్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పట్టణ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపారు. -
నేడు లాజిస్టిక్ హబ్‌ను ప్రారంభించనున్న కేటీఆర్
సాక్షి, రంగారెడ్డి: ఇబ్రహీంపట్నం మండలం మంగళ్పల్లిలో లాజిస్టిక్ హబ్ (వస్తు నిల్వ కేంద్రం) సిద్ధమైంది. ఇప్పటివరకు 60 శాతం పనులు పూర్తికావడంతో కమర్షియల్ ఆపరేషన్ ప్రారంభించేందుకు ముహూర్తం ఖరారు చేశారు. మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శుక్రవారం దీనిని ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. నగరంలో వాహనాల రద్దీని నియంత్రించడం, వాయు కాలుష్యం తగ్గించడం కోసం హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్ఎండీఏ) ఆధ్వర్యంలో దీనిని ఏర్పాటు చేశారు. 22 ఎకరాల విస్తీర్ణంలో రూ.20 కోట్ల వ్యయంతో పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో దీన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. -
కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు
సాక్షి, మొయినాబాద్: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు. మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్ ఆండ్రూ, టీఆర్ఎస్ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్ చైర్మన్ దారెడ్డి వెంకట్‌రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్ సుకన్య, నాయకులు హరిశంకర్ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు. -
అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా 'ఆ' సబ్‌రిజిస్ట్రార్ ఆఫీస్
సాక్షి, షాద్‌నగర్: రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టి, పారదర్శకంగా సేవలందించేందుకుగాను ప్రభుత్వం సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. అయితే ఆ నిఘా కెమెరాల కన్నుకప్పి షాద్‌నగర్, ఫరూఖ్‌నగర్ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో దగా జరుగుతోంది. డబ్బులు ఇస్తేగాని దస్తావేజులు రిజిస్ట్రేషన్ కావడం లేదు. ప్లాట్లు, భూముల కొనుగోలుకు వేర్వేరుగా డబ్బులు వసూలు చేస్తున్నారని, ప్రతి దస్తావేజుకు విధిగా డబ్బులు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ప్లాటు రిజిస్ట్రేషన్‌కు ఐదు వందల రూపాయల వరకు, భూముల రిజిస్ట్రేషన్‌కు ఎకరాకు రెండువేల చొప్పున వసూలు చేస్తున్నారు. ఇక సమస్యలున్న భూములు, ప్లాట్ల రిజిస్ట్రేషన్ అయితే అధికారులు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సిందేనని ఆరోపణలు ఉన్నాయి. మధ్యవర్తుల సహాయంతో డబ్బులు వసూలు చేయడంతో పాటు, సబ్రిజిస్ట్రార్లు ప్రత్యేకంగా డబ్బులు వసూలు చేసేందుకు సిబ్బందిని కూడా నియమించుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వారికి డబ్బులు ముట్టినట్లు సమాచారం అందిన తర్వాతనే కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరుగుతోందని బాహాటంగా చెప్పుకుంటున్నారు. నామమాత్రంగానే సీసీ కెమెరాలు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో పారదర్శకత కోసం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ వ్యవహారాలను కెమెరాల్లో చిత్రీకరించేందుకు ప్రభుత్వం సీసీ కెమెరాల విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. అయితే ఈ సీసీ కెమెరాలు కేవలం కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని రికార్డింగ్ చేసేందుకే ఉపయోగిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందని ప్రజలు కోరుతున్నారు. ‘చటాన్‌పల్లి’పై కొనసాగుతున్న దర్యాప్తు ఇటీవల చటాన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 717లో ప్లాట్ నెంబర్ 147, 148లో 236 గజాల విస్తీర్ణం గల స్థలానికి సంబంధించి ఫోర్జరీ డాక్యుమెంట్లతో ప్లాటు రిజిస్ట్రేషన్ జరిగిన వ్యవహారంలో షాద్‌నగర్ పోలీసులు దర్యాప్తు వేగవంతంగా చేశారు. ప్లాటు అసలు యజమాని గడగమ్మ రాఘవరావు ఫిర్యాదుతో పోలీసులు ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రార్, ప్లాటు కొనుగోలుదారులు జి.శ్రీనివాసులుపై కేసు నమోదు చేశారు. ఈ ఫోర్జరీ వ్యవహారంలో అసలు సూత్రదారులు, పాత్రదారులు ఎవరు అన్న విషయాన్ని పూర్తి స్థాయిలో పోలీసులు దర్యాప్తు చేపడుతున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని పోలీసులు విచారించినట్లు సమాచారం. చటాన్‌పల్లికి చెందిన ఓవ్యక్తితో పాటు, కేశంపేట రోడ్డుకు చెందిన మరో వ్యక్తి కీలకంగా వ్యవహరించినట్లు సమాచారం. వీరిని కూడా పోలీసులు విచారించినట్లు తెలిసింది. ఫోర్జరీ కేసు నమోదైనప్పటి నుంచి సబ్‌రిజిస్ట్రార్ తన కార్యాలయానికి రాకపోవడంతో అన్ని వ్యవహారాలు కింది స్థాయి సిబ్బందే చూసుకుంటున్నారు. ఆన్‌లైన్‌తో సమస్యలు కల్పితమా..? ఫోర్జరీ డాక్యుమెంట్ వ్యవహారం బయటికొచ్చిన రోజు నుంచి ఫరూఖ్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఆన్లైన్ సమస్యలు ఏర్పడుతున్నాయి. అయితే ఆన్లైన్ సమస్యలపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కావాలనే ఆన్‌లైన్‌ను బంద్ చేస్తున్నారని, కార్యాలయానికి క్రమం తప్పకుండా వచ్చే వ్యాపారులు, మధ్యవర్తుల పనులను మాత్రమే అధికారులు చేస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఏది ఏమైనా ఆన్లైన్ సమస్యతో గత నాలుగు రోజులుగా భూముల కొనుగోలు, అమ్మకందార్లు ఇబ్బందులు పడుతున్నారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ కోసం కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఏసీబీ దృష్టి సారిస్తే... అవినీతి రాజ్యమేలుతున్న షాద్‌నగర్ సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయాలపై ఏసీబీ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అయితే గత రెండు నెలల క్రితం షాద్‌నగర్ మున్సిపాలిటీ కార్యాలయంలో పని చేస్తున్న జూనియర్ అసిస్టెంట్ శేఖర్‌రెడ్డి, అదేవిధంగా కేశంపేట తహసీల్దార్ లావణ్య, వీఆర్ఓ అనంతయ్యలు పెద్ద ఎత్తున లంచం డబ్బులు తీసుకుంటూ ఏబీసీ అధికారులకు పట్టుపడ్డారు. ఏడాది క్రితం షాద్‌నగర్ ఎంవీఐ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నా రిజిస్ట్రేషన్ శాఖలో అధికారులు ఆరోపణలు ఉన్న అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఏసీబీ అధికారులు స్పందించి సబ్‌రిజిస్ట్రేషన్ కార్యాలయంపై నిఘా వేస్తే అవినీతి చేపలు దొరకే అవకాశాలు ఉన్నాయి. -
కొంగరకలాన్‌లో దర్జాగా కబ్జా!
సాక్షి, ఇబ్రహీంపట్నం: కాదేదీ కబ్జాకనర్హం.. అనేలా సాగుతోంది అక్రమార్కుల వ్యవహారం. కాలువ, కుంట, చెరువు దేన్నీ వదలడం లేదు. కాసుల కోసం సహజ వనరులను ధ్వంసం చేస్తున్నారు. చెరువులు, కుంటలను చెరబడుతున్నారు. వీరి దెబ్బతో జలాశయాలు, కాలువలు ఉనికిని కోల్పోతున్నాయి. ఇదంతా అధికారుల కనుసన్నల్లోనే జరుగుతోందనే ఆరోపణలున్నాయి. అందుకే ఫిర్యాదులను సైతం పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. రెవెన్యూ, ఇరిగేషన్ శాఖల మధ్య సమన్వయ లోపంతో కబ్జారాయుళ్లు రెచ్చిపోతున్నారు. ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ప్రభుత్వ స్థలాలు కనిపిస్తే చాలు గద్దల్లా వాలిపోతున్నారు. ధనార్జనే ధ్యేయంగా ఎంతకైనా తెగిస్తున్నారు. ఈ ప్రాంతంలో బహుళ జాతి సంస్థలు, ఔటర్ రింగ్‌రోడ్డు, రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ భవన సముదాయం రావడంతో ప్రస్తుతం ఇక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. ఇదే అదునుగా కబ్జారాయుళ్లు బరితెగిస్తున్నారు. అధికారులే అండ.. రియల్ ఎస్టేట్ అక్రమార్కులకు అధికారుల అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చెరువులు, కుంటలు, వాగులు, కాలువలు కబ్జాకు గురైనట్లు తెలిసినా కనీసం స్పందించడం లేదని ప్రజలు మండిపడుతున్నారు. ఇరిగేషన్ అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇరిగేషన్ అధికారులను అడిగితే తాము రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశామని తప్పించుకుంటున్నారని చెబుతున్నారు. ఎట్టకేలకు అన్నింటి మీద అధికారులకు ఫిర్యాదు చేస్తే కంటి తుడుపు చర్యగా మంగళ్‌పల్లి సమీపంలోని ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును ధ్వంసం చేశారు. పైపులను తొలగించారు.. కానీ బఫర్ జోన్లో నిర్మించిన ప్రహరీని మాత్రం కూల్చకుండా రియల్టర్లకు వత్తాసు పలుకుతున్నారు. దీంతో చెరువులు, కుంటలకు నీరొచ్చే దారులు మూసుకుపోయి వాటి ఉనికి ప్రశ్నార్థకమవుతోందని స్థానికులు, చెరువు ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. కబ్జాలివి.. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని కొంగరకలాన్ గ్రామంలో పెద్దబంధం వాగు నుంచి దాతర్ చెర్వులోకి నీరొచ్చే కాలువలను రియల్టర్లు పూర్తిగా కబ్జా చేశారు. ఏకంగా వాగుకు అడ్డంగా గోడను నిర్మించి దాతర్చెర్వులోకి నీరు రాకుండా అడ్డుకట్ట వేశారు. ప్రక్కనే ఉన్న ప్రభుత్వ స్థలాన్ని కూడా రియల్టర్లు కబ్జా చేశారు. ఇక కొత్త చెర్వు, సింగరాయకట్టను పూర్తిగా తవ్వి కబ్జా చేశారు. వడ్లవాని కుంటలోకి వచ్చే వాగు, కన్నారపోని కుంటను పూర్తిగా కబ్జాకు గురి చేసి ప్లాట్లుగా మార్చారు. ప్రస్తుతం కలెక్టరేట్ నిర్మిస్తున్న భవన సముదాయానికి వెళ్లే దారిలోనే వడ్లవాని కుంటలోకి నీరొచ్చే కాలువను, వడ్లవాని కుంటను కబ్జా చేసి ప్లాట్లుగా మార్చారు. కొంగరకలాన్ నుంచి శేరిగూడ వరకు వచ్చే ఫిరంగి నాళాను కబ్జా చేశారు. మంగళ్‌పల్లి సమీపంలో ఫిరంగి నాలాపై ఏకంగా రోడ్డు వేసుకున్నారు. ఫిరంగి నాలా కట్టను ధ్వంసం చేసి దర్జాగా రహదారి నిర్మించారు. కాలువ పక్కనే బఫర్ జోన్‌ను విడిచిపెట్టకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టారు. వర్షకాలంలో వాగులో నుంచి పెద్దగా నీరు వచ్చిందంటే గోడలు కూలిపోతాయి. నాలాకు ఇరువైపులా 9 మీటర్లు స్థలం బఫర్‌జోన్ కోసం వదిలేయాలి. కానీ ఎక్కడా ఇలా చేయడం లేదు. హెచ్ఎండీఏ అధికారులకు చూపించే ప్లాన్ ఒకటైతే స్థానికంగా చేసే పని వేరేలాగా ఉంటుంది. మంగళ్‌పల్లి సమీపంలో ఓ వెంచర్‌కు ఏకంగా కాలువ మీదంగానే రోడ్డు వేసుకొని వ్యాపారం చేసుకుంటున్నారు. కుమ్మరికుంట, కొమటికుంట కట్టలను పూర్తిగా ధ్వంసం చేశారు. ఫిరంగి నాలా మీదుగానే పది కిలో మీటర్ల మేర అక్రమ కట్టడాలతో పాటు ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. చర్యలు తీసుకుంటాం అన్ని ప్రాంతాల్లో మా దృష్టికి వచ్చిన కబ్జాలపై స్పందిస్తున్నాం. ఇప్పటికే ఫిరంగి నాలాపై వేసిన రోడ్డును మంగళ్పల్లిలో రెండు చోట్ల తొలగించాం. మరెక్కడైనా చెరువులు, కుంటలు కబ్జాకు గురైతే మాకు ఫిర్యాదు చేయొచ్చు. తప్పకుండా చర్యలు తీసుకుంటాం. ఇందులో ఎవరినీ ఉపేక్షించే ప్రసక్తే లేదు. – పరమేశ్వర్, డీఈఈ, ఇరిగేషన్ శాఖ కేసులు నమోదు చేస్తాం వాగులు, వంకలు, కాలువలు, చెరువులు, కుంటలు కబ్జాలకు గురయితే ఇరిగేషన్ అధికారులు మాకు ఫిర్యాదు చేస్తే తప్పకుండా స్పందిస్తున్నాం. రికార్డులు పరిశీలించి పరిరక్షణ చర్యలు చేపడుతాం. నోటీసులు ఇచ్చినా మార్పు రాకుంటే క్రిమినల్ కేసులు నమోదు చేయిస్తాం. – వెంకటేశ్వర్లు, తహసీల్దార్, ఇబ్రహీంపట్నం -
చింతపల్లిగూడ గేట వద్ద గర్భిణీ మృతదేహం
-
తొందరొద్దు.. సరిదిద్దుకుందాం!
నేరేడ్మెట్: వివాహ సంబంధాల్లో తలెత్తే వివాదాలు, పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాల పరిష్కారానికి రాచకొండ కమిషనరేట్‌లో ప్రత్యేక ఫ్యామిటీ కౌన్సిలింగ్ కేంద్రం అందుటులోకి వచ్చింది. ఈ కేంద్రానికి భూమిక విమెన్ సెల్ (ఎన్జీఓ) నోడల్ ఏజెన్సీగా వ్యవహారిస్తుంది. గురువారం నేరేడ్మెట్లోని డీసీపీ కార్యాలయం వెనుక ఏర్పాటు చేసిన ‘స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సెలింగ్ సెంటర్’ను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ లాంఛనంగా ప్రారంభించారు. గృహహింస నుంచి స్త్రీలకు రక్షణ కల్పించడంతో పాటు బాధిత మహిళలు, చిన్నారులకు అవసరమైన సహాయం అందిస్తూ అండగా నిలుస్తుందీ సెంటర్. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, షీ–టీమ్ అడిషనల్ డీసీపీ సలీమ, అడ్మిన్ డీసీపీ శిల్పవల్లి, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్ ముఖ్య నిర్వాహకురాలు కొండవీటి సత్యవతి, ఇన్ఫోసిస్ ప్రతినిధి విష్ణుప్రియ, రజిని, సీసీఎండీ శాస్త్రవేత్త లత, ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ కేంద్రం కౌన్సిలర్లు, పలువురు మహిళలు పాల్గొన్నారు. బాధిత మహిళలకు తోడ్పాటు ఇలా.. ఇప్పటికే రాచకొండ కమిషనరేట్ పరిధిలో భువనగిరి, సరూర్‌నగర్ మహిళా ఠాణాల్లో, కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో మొత్తం మూడు కౌన్సిలింగ్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. నేరేడ్మెట్లోని ప్రత్యేక ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో కమిషనరేట్ పరిధిలోని అన్ని ఠాణాల్లో నమోదయ్యే పెళ్లి వివాదాలు, గృహహింస కేసులు, బాధితులకు న్యాయ సహాయం, చిన్నారుల సంరక్షణ, ప్రతివాది నుంచి రక్షణ కల్పించడం, వైద్య సహాయం, ఆర్థిక సహకారం వంటివి కల్పిస్తారు. గృహహింస చట్టం ప్రకారం వారిలో మానసిక స్థైర్యాన్ని నింపి భరోసానివ్వడంలో ఈ కేంద్రం కీలక పాత్ర పోషిస్తుంది. ఎన్ఆర్ఐ కేసులపై ప్రత్యేక దృష్టి.. ఎన్ఆర్ఐ, ఇతర రాష్ట్రాల, పోలీస్ కమిషనరేట్ల, జిల్లాలకు చెందిన గృహహింస కేసుల పరిష్కారం కోసమే స్పెషల్ సెల్ ఫర్ విమెన్ అండ్ చిల్డ్రన్స్ ఫ్యామిలీ సపోర్ట్ కౌన్సిలింగ్ సెంటర్‌ను భూమిక ఎన్జీఓ సంస్థ ద్వారా సీపీ మహేష్ భగవత్ అందుబాటులోకి తెచ్చారు. పెళ్లయిన నెల రోజులకే విడాకుల కోసం బాధిత మహిళలు రాచకొండ సీపీ కార్యాలయానికి వస్తున్నారు. వీటిలో అధికంగా ఎన్ఆర్ఐ కేసులే ఉంటున్నాయి. ప్రత్యేక ఫ్యామిలీ కేంద్రం ద్వారా మొదట వారికి కౌన్సిలింగ్ ఇస్తారు. విడాకుల వరకు వెళ్లకుండా నచ్చజెబుతారు. బాధిత మహిళలకు రక్షణ, ఆర్థిక సాయం, చిన్నారులకు విద్య, సంరక్షణకు తోడ్పాటునందిస్తారు. -
పెట్టుబడి సొమ్ము.. బ్యాంకర్లకే!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులకు వ్యవసాయం భారం కాకూడదన్న ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు పథకాన్ని గతేడాది ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. ఈ ఖరీఫ్ సీజన్ నుంచి ఎకరాకు రూ.5 వేల చొప్పున పెట్టుబడి సాయాన్ని అందజేస్తోంది. రైతులు శ్రమకోర్చి అప్పులు తెచ్చి మరీ వ్యవసాయం చేస్తున్నారు. ఏటా అతివృష్టి లేదా అనావృష్టి పరిస్థితులు ఎదురవుతున్నాయి. దీనికి తోడు పంటఉత్పత్తులకు ఆశించిన స్థాయిలో ధరలు పలకడం లేదు. ఫలితంగా పెట్టుబడులు కూడా రాని దయనీయ పరిస్థితిని రైతులు ఎదుర్కొంటున్నారు. ఇటువంటి దుర్భర స్థితిలో పెట్టుబడి సాయం వారికి ఆయువుగా మారింది. ప్రభుత్వం అంజేస్తున్న ఈ పెట్టుబడి సొమ్ము రైతు ఖాతాల్లో జమ అయ్యిందే పాపం.. ఆ సొమ్మును గత పంట రుణం లేదంటే దాని వడ్డీ కింద బ్యాంకర్లు తీసుకుంటున్నారు. కొండంత ఆశతో బ్యాంకుకు వెళ్లిన రైతులు ఉట్టి చేతులతో తిరుగుముఖం పడుతున్న దృశ్యాలు చాలాచోట్ల కనిపిస్తున్నాయి. ఫలితంగా ప్రభుత్వం అందజేస్తున్న సాయం.. రైతు దరికి చేరడం లేదు. ఫలితంగా సర్కారు లక్ష్యంగా నీరుగారుతోంది. బ్యాంకుల కోత.. రైతుబంధు డబ్బులు ఇప్పుడిప్పుడే రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. జిల్లాలో బ్యాంకు ఖాతా వివరాలు అందజేసిన 2.47 మంది రైతులకు రైతుబంధు సాయం అందాల్సి ఉంది. ఇప్పటిరకు సుమారు 1.50 లక్షల మంది ఖాతాల్లో పెట్టుబడి సొమ్ము జమైంది. వాస్తవంగా రైతుబంధు డబ్బుల కోసం పథకం ఆరంభంలో కొందరు రైతులు ప్రత్యేకంగా ఖాతాలు తెరిచారు. వీటిని లోన్ ఖాతాలుగా పరిగణిస్తున్నారు. మరికొందరు రైతులు తమకు అప్పటికే ఉన్న పొదుపు ఖాతాల వివరాలను సమర్పించారు. లోన్ ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సొమ్మను బ్యాంకర్లు నిర్దాక్షిణ్యంగా కోత పెడుతున్నారు. గతంలో తీసుకున్న పంట రుణం, వడ్డీ చెల్లింపు పేరిట ఈ సొమ్మును ఉంచుకుంటున్నారు. సేవింగ్ ఖాతాల్లో పడిన సాయంలో కోత పడటం లేదని అధికారులు పేర్కొంటున్నారు. వాస్తవంగా ఎటువంటి భేదం లేకుండా పెట్టుబడి సొమ్ము కచ్చితంగా రైతులకు అందాల్సిందే. ఈ విషయంలో ఇటు అధికారులు, బ్యాంకర్లు తీవ్రంగా విఫలమయ్యారన్న ఆరోపణలు వస్తున్నాయి. రుణ మాఫీ చేసిఉంటే.. 2014లో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగు విడతలుగా పంట రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో రుణం మాఫీ అవుతుందన్న ఉద్దేశంతో రైతులు పంట రుణాలు, వడ్డీ చెల్లించడం లేదు. ఇటీవల తీసుకున్న పంట రుణాలను కూడా రెండోసారి అధికారిలోకి వచ్చిన ఆ పార్టీ... వెంటనే మాఫీ చేస్తుందని రైతులు కొండంత ఆశతో ఉన్నారు. ఇటువంటి వారంతా రుణ మాఫీ కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తుండగా.. ఇంకా కార్యరూపం దాల్చలేదు. ఈ క్రమంలో గతేడాది తీసుకున్న రుణాల గడువు ముగియడంతో చెల్లించాలని బ్యాంకర్లు రైతులపై ఒత్తిడి తెస్తున్నారు. ఒకవేళ కష్టానికోర్చి చెల్లిస్తే తమకు మాఫీ వర్తించదేమోన్న బెంగ రైతులను వెంటాడుతోంది. ఈ క్రమంలో ఖాతాల్లో జమ అయిన పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు రైతులకు ఇవ్వడం లేదు. ఒకవేళ రుణమాఫీ అయి ఉంటే తమకు ఈ పరిస్థితి ఉండేది కాదని రైతులు అభిప్రాయపడుతున్నారు. పెట్టుబడి సాయాన్ని బ్యాంకర్లు తీసుకోవద్దని గతంలో కలెక్టర్ లోకేష్ కుమార్ బ్యాంకర్లకు సూచించారు. అయినా, కలెక్టర్ ఆదేశాలు బ్యాంకర్లు బేఖాతరు చేస్తున్నారు. ఈ విషయమై జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. అటువంటిదేమీ లేదన్నారు. ఒకవేళ బ్యాంకర్లు పెట్టుబడి సొమ్ము ఇవ్వకుంటే.. సదరు రైతు ఖాతాను పరిశీలించాలని, అప్పుడే ఏ పద్దు కింద జమ కట్టుకున్నారో తెలుస్తుందని సమాధానమిచ్చారు. -
రాజన్న చిరునామా.. చేవెళ్ల
సాక్షి, చేవెళ్ల: ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా.. అధికారంలో ఉన్నా రంగారెడ్డి జిల్లా అంటే డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డికి ఎంతో అభిమానం. ఈ ప్రాంతం ఆయనతో ఓ బంధం పెనవేసుకుంది. చేవెళ్ల నుంచి పాదయాత్రకు శ్రీకారం చుట్టి అధికారంలోకి వచ్చారు. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేష కృషి చేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఔఆర్ఆర్ నిర్మాణం, అంతర్జాతీయ సంస్థలు, పరిశ్రమల ఏర్పాటుకు సహకారంతో పాటు ఉమ్మడి రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు ఈ జిల్లాలోనే అధికంగా అమలయ్యాయి. రంగారెడ్డి జిల్లాపై రాజన్న ముద్ర చెరపలేనిది. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రత్యేక కథనం.. పేదల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే వైఎస్సార్‌కు చేవెళ్ల ప్రాంతమంటే అమితాభిమానం. చేవెళ్ల నియోజకవర్గంతో ఆయనకు పెనవేసుకున్న బంధం ఏర్పడింది. పేదలు, రైతుల శ్రేయస్సే తమ ప్రభుత్వ లక్ష్యమంటూ ఘంటాపథంగా ప్రకటిస్తూ వారి జీవితాల్లో వెలుగులు నింపారు. 2004 ఎన్నికల్లో సీఎం పదవిని అధిష్టించిన అనంతరం వైఎస్సార్ వెనుతిరిగి చూడకుండా పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేశారు. ప్రతి కుటుంబానికి మేలు జరిగేలా పథకాలను ప్రవేశపెట్టారు. దాంతో వారు ఊహించిన దానికంటే ఎక్కువగా మేలు జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డికి సెంటిమెంట్‌గా చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు ఎంతో అనుబంధం ఉంది. ప్రతిపక్ష నేతగా, ముఖ్యమంత్రిగా ఏ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించినా చేవెళ్ల నుంచే ప్రారంభించే సెంటిమెంట్ వైఎస్సార్‌కు ఉంది. 2001లో మండల పరిషత్, జెడ్పీటీసీ ఎన్నికల ప్రచార సభకు ప్రతిపక్ష నేతగా చేవెళ్లకు వచ్చిన ఆయన ఆ తర్వాత ఎన్నడూ చేవెళ్లను మరువలేదు. చేవెళ్ల ప్రాంతం తన సెంటిమెంట్ అంటూ బహిరంగంగానే ఆయన పలుసార్లు ప్రకటించారు. 2003లో చేవెళ్ల నుంచి మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర ప్రారంభించారు. అనంతరం 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారు. తెలంగాణ ప్రాంతంలోని ఏడు జిల్లాలను సస్యశ్యామలం చేసేందుకు చేవెళ్ల–ప్రాణహిత ప్రాజెక్టు (నేటి కాళేశ్వరం ప్రాజెక్టు)కు నవంబర్ 19, 2008లో శంకుస్థాపన చేశారు. 2009 ఏప్రిల్లోఎన్నికల ప్రచారాన్ని చేవెళ్ల నుంచే ప్రారంభించి రెండోసారి విజయధుందుబి మోగించారు. పాదయాత్రలో వెన్నంటే.. 2004లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న రాజశేఖరరెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ యాత్రలో పూర్తిస్థాయిలో ప్రసన్నకుమార్ పాల్గొని మనన్నలు పొందారు. 2005లో రాజీవ్ పల్లె బాట కార్యక్రమంలో భాగంగా మంచాలకు వైఎస్సార్ వచ్చారు. ఈ కార్యక్రమంలో వేలాది మంది కార్యకర్తల మధ్య వీరిని రాజశేఖరరెడ్డి పేరు పెట్టి పిలవడం విశేషం. మంచాల మండలానికి వైఎస్సార్ ప్రత్యేకంగా 500 ఇళ్లు మంజూరు చేశారు. ఇళ్లతో పాటు అర్హులైన వారందరికీ పింఛన్లు కూడా అందజేశారు. ప్రత్యేకంగా నిధులు ఇచ్చి ఎంతోమందికి గుండె శస్త్ర చికిత్సలు కూడా చేయించారు. 2005 జనవరి 13వ తేదీన ఇబ్రహీంపట్నంలో పర్యటించిన వైఎస్ రాజశేఖరరెడ్డి ఫ్లోరైడ్ పీడిత గ్రామాలకు కృష్ణ నుంచి తాగునీరు అందించేందుకు రూ.20 కోట్లు మంజూరు చేశారు. 2008లో రెండో విడుతగా మరో రూ.12 కోట్లు కేటాయించారు. రావిర్యాలకు రాజన్నయోగం మహేశ్వరం: ఓవైపు అంతర్జాతీయ విమానాశ్రయం.. చుట్టూ ఔటర్ రింగురోడ్డు.. పరిసర ప్రాంతాల్లో అనేక అంతర్జాయతీస్థాయి కంపెనీలు.. వీటన్నింటి మధ్య ఉన్న రావిర్యాల గ్రామం అభివృద్ధి పథంలో శరవేగంగా దూసుకుపోతున్నది. ఇటు అభివృద్ధికి, అటు రియల్ బూమ్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన రావిర్యాల ఒకప్పుడు కుగ్రామం. అభివృద్ధికి ఆమడదూరంలో ఉండేది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో పడిన అభివృద్ధి బీజాలు, ఆయన చూపిన ప్రత్యేక చొరవతో రావి ర్యాల గ్రామం ప్రస్తుతం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటోంది. అప్పట్లో వైఎస్సార్ చేసిన కృషిని ఆ గ్రామం స్మరించుకుంటోంది. రావిర్యాల శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చుట్టూ ఔటర్ రింగురోడ్డు, పక్కనే శ్రీశైలం జాతీయ రహదారి ఉండడం, అనేక అంతర్జాతీయ కంపెనీలు, పరిశ్రమలు వెలుస్తుండడం, రియల్ బూమ్ భారీస్థాయిలో ఉండడంతో రావిర్యాల గ్రామానికి వరంగా మారింది. ఒకప్పుడు మారుమూల కుగ్రామంగా ఉన్న రావిర్యాల ఇప్పుడు వెలుగుతోంది. 2004లో ఈ గ్రామానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకావడంతో క్రమంగా రావిర్యాల అభివృద్ధి పథంలోకి వచ్చింది. ఎయిర్‌పోర్టు రావడం, గ్రామానికి అనుకొని ఔటర్ రింగురోడ్డు వెళ్లడంతో ఈ గ్రామానికి మహర్దశ పట్టింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రావిర్యాల గ్రామంలోనూ, పరిసర ప్రాంతాల్లో అనేక ప్రముఖ కంపెనీలు ఏర్పాటయ్యాయి. సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రావిర్యాల రెవెన్యూ పరిధిలో శ్రీశైలం ప్రధాన రహదారి పక్కన హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్ సిటీ, టీసీఎస్, రాజీవ్ జేమ్స్ పార్కు (డైమండ్ పార్కు), ఆగాఖాన్ అంతర్జాతీయ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలు ఏర్పాటుచేశారు. దీనికితోడు గ్రామాన్ని చుట్టుకొని ఔటర్ రింగురోడ్డు రావడంతో రావిర్యాలకు రియల్ బూమ్ వరంగా మారింది. ఒక్కసారిగా భూములకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడు రావిర్యాల గ్రామం అంటే తెలియని వారు ఉండరు. ప్రస్తుతం ఇక్కడ భూమి ఎకరానికి రూ.3 కోట్ల నుంచి 6 కోట్ల వరకు పలుకుతోంది. గ్రామం చుట్టు భారీ పరిశ్రమలు, కంపెనీలు వచ్చాయి. వైఎస్సార్ పాలనలో కొత్త వెలుగులు 2004లో వైఎస్సార్ అధికారం చేపట్టిన తర్వాత నగర శివారులోని రావిర్యాలతోపాటు చుట్టుపక్కల గ్రామాలకు కొత్త వెలుగులు వచ్చాయి. సమీపంలోని శంషాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటు, ఆ వెంటనే 2005–06 సమయంలో రావిర్యాల రెవెన్యూ పరిధిలో హార్డ్‌వేర్ పార్కు, ఫ్యాబ్‌సిటీ, ఇంటర్నేషనల్ ఆగాఖాన్ అకాడమీ, రాజీవ్ జేమ్స్ పార్కు వంటి ప్రతిష్టాత్మక సంస్థలు వెలువడం, హైదరాబాద్ నగరానికి మణిహారమైన ఔటర్ రింగురోడ్డు గ్రామానికి ఆనుకొని రావడంతో గ్రామం అభివృద్ధి వేగం పూంజుకుంది. కొత్త ఉపాధి అవకాశాలు లభించాయి. గ్రామం నుంచి ఉన్నత చదువులు చదివేవారి సంఖ్య పెరిగింది. రాజశేఖర్‌రెడ్డి హయాంలో భారీ స్థాయిలో కానిస్టేబుల్,ఉపాధ్యాయుల ఉద్యోగాలు పెద్దసంఖ్యలో గ్రామస్తులకు లభించాయి. రియల్ బూమ్ ఆసరాతో పలువురు గ్రామ విద్యార్ధులు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లారు. నాటి బీజాలే.. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి అధికారంలో ఉన్నప్పుడు శివారు ప్రాంతంలో అభివృద్ధికి చూపిన చొరవ వల్లే ఇక్కడ ప్రస్తుతం పెద్దఎత్తున అభివృద్ధి జరుగడానికి మూలకారణమని ఆయన అభిమానులు గుర్తుచేసుకుంటున్నారు. వైఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు వల్లే ఇప్పుడు గ్రామంలో ప్రగతి వెలుగులు పరుచుకున్నాయని, రావిర్యాల గ్రామం ప్రపంచపటంలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకునేస్థాయిలో ఎదిగిందని వారు వైఎస్ కృషిని స్మరించుకుంటున్నారు. రాజశేఖర్‌రెడ్డి హాయంలో గ్రామానికి భారీ ప్రాజెక్టులు తీసుకురావడం, కంపెనీలు స్థాపించడం, ప్రధానంగా ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణం చేయడం మూలంగానే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందిందని ఆయన జయంతి సందర్భంగా వైఎస్సార్ అభిమానులు స్మరించుకుంటు నివాళులు అర్పిస్తున్నారు. -
రెవెన్యూ ప్రక్షాళన!
భూ రికార్డుల ప్రక్షాళన నుంచి రెవెన్యూ సేవలు పూర్తిగా నత్తనడకన సాగుతున్నాయి. పట్టా మార్పిడిలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, అక్రమంగా ఇతరులకు పట్టాలు చేయడం, కబ్జాదారులకు సిబ్బంది పరోక్షంగా సహకరిస్తుండడం, తప్పుడు సర్వే నంబర్లు నమోదు తదితర ఆరోపణలు కోకొల్లలు. పైగా తమ సమస్యల పరిష్కారం కోసం రైతులు, సాధారణ ప్రజలు నిత్యం పనులు మానుకొని తహసీల్దార్ కార్యాలయాలకు చెప్పులరిగేలా తిరుగుతున్నా ఫలితం లేకుండా పోతోంది. పాస్‌పుస్తకాల కోసం తిప్పించుకోవడం, రికార్డుల్లో తప్పులు సరిదిద్దడంలో ఎనలేని నిర్లక్ష్యాన్ని రెవెన్యూ సిబ్బంది ప్రదర్శిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో రైతులు, అధికారులు ఆమ్యామ్యాలు సమర్పించుకున్నా పనుల్లో పురోగతి లేదు. ఓపిక నశించిన కొందరు రైతులు ఆత్మహత్యాయత్నం చేసిన ఘటనలూ జిల్లాలో చోటుచేసుకున్నాయి. అంతేకాకుండా చాలా మంది అధికారులపై డీఆర్ఓ, జాయింట్ కలెక్టర్, కలెక్టర్‌కు ఫిర్యాదులు అందాయి. వీటిని పరిగణించిన యంత్రాంగం ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఒకే ప్రాంతంలో ఎక్కువ కాలం పనిచేసిన వారిని బదిలీ చేస్తోంది. ఈ చర్యలపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఎట్టకేలకు జిల్లా రెవెన్యూశాఖలో ప్రక్షాళన మొదలైంది. అవినీతి ఆరోపణలు, సేవల్లో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారనే విమర్శల నేపథ్యంలో అధికారులపై బదిలీ వేటు పడుతోంది. కేడర్ వారీగా ఉద్యోగులకు స్థాన చలనం కల్పిస్తున్నారు. మూడురోజుల కిందట గ్రామ రెవెన్యూ అధికారుల (వీఆర్ఓ)ను మూకుమ్మడిగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చిన యంత్రాంగం.. తాజాగా డిప్యూటీ తహసీల్దార్లను మార్చింది. 13 మందిని బదిలీ చేసి ఆయా ప్రాంతాల్లో పోస్టింగ్‌లు ఇచ్చింది. భూ వ్యవహారాల్లో కిందిస్థాయి నుంచి ఉన్నతస్థాయి అధికారుల వరకు అందిన కాడికి వెనకేసుకుంటున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనికితోడు ఒకే స్థానంలో ఏళ్ల తరబడి పాతుకుపోయి స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తులు, రాజకీయ నాయకులతో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. అర్హులకు పదోన్నతులు.. ఒక పక్క బదిలీలు చేస్తున్న యంత్రాంగం.. మరోపక్క అర్హులకు పదోన్నతులు కల్పిస్తోంది. సీనియారిటీ ప్రాతిపదికన 32 మంది వీఆర్ఓలకు నాయబ్ తహసీల్దార్ కేడరైన సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించింది. అలాగే మరో 14 మంది సీనియర్ అసిస్టెంట్లను రెవెన్యూ ఇన్స్పెక్టర్లుగా, రెవెన్యూ ఇన్స్పెక్టర్లను సీనియర్ అసిస్టెంట్లుగా బదిలీ చేసి పోస్టింగ్‌లు ఇచ్చారు. రెవెన్యూశాఖలో సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పోస్టులను నాయబ్ తహసీల్దార్ కేడర్‌గా పరిగణిస్తారు. అయితే, ఒక్కో అధికారి సీనియర్ అసిస్టెంట్, రెవెన్యూ ఇన్స్పెక్టర్గా రెండేళ్ల చొప్పున పనిచేయాల్సి ఉంటుంది. అంటే నాయబ్ తహసీల్దార్ కేడర్‌లో నాలుగేళ్ల పాటు పనిచేసిన వారికి డిప్యూటీ తహసీల్దార్లుగా పదోన్నతులు కల్పిస్తారు. త్వరలో తహసీల్దార్ల బదిలీలు! వీఆర్ఓ నుంచి డిప్యూటీ తహసీల్దార్ల వరకు అధికారుల బదిలీలు జరిగాయి. ఇక మిగిలింది తహసీల్దార్లు, ఆపై స్థాయి అధికారులే. వీరికి కూడా త్వరలో స్థాన చలనం తప్పదని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు 12 మంది తహసీల్దార్లు ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లారు. ఎన్నికల విధుల్లో ప్రత్యక్షంగా పాల్గొనే అధికారులను బదిలీ చేయాలన్న కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) ఆదేశాల మేరకు వీరికి స్థానచలనం కలిగింది. హైదరాబాద్‌కు ఎనిమిది మంది, సంగారెడ్డి జిల్లాకు ముగ్గురు, నల్లగొండకు ఒకరు బదిలీ అయ్యారు. ఒకే ప్రాంతంల్లో మూడేళ్ల పాటు పనిచేయడంతోపాటు మాతృ జిల్లాలకు చెందిన తహసీల్దార్లకు బదిలీ వర్తించింది. ఎన్నికలు ముగియడంతో వారు తిరిగి మన జిల్లాకు బదిలీపై వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎంపీడీఓలు కూడా శాసనసభ ఎన్నికల సమయంలో ఎంపీడీఓలు బదిలీపై వెళ్లారు. మూడేళ్లపాటు ఒకే ప్రాంతంలో పనిచేసిన 19 మందికి స్థాన చలనం కలిగింది. వీరు కూడా త్వరలో జిల్లాకు రానున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ విషయం ప్రభుత్వం పరిశీలనలో ఉందని పేర్కొంటున్నాయి. -
అప్పటి నుంచి ఎమ్మెల్యే కావాలని కోరిక..
‘చిన్నప్పటి నుంచి నాకు పైలెట్ కావాలని కోరిక ఉండేది. ఆ కోరికను నెరవేర్చుకున్నా. కానీ, ఎక్కువ కాలం పైలెట్‌గా పనిచేయలేదు. ఆ ఉద్యోగం వీడినా నా ఇంటిపేరు ‘పైలెట్’గానే నిలిచిపోయింది’ అని తాండూరు ఎమ్మెల్యే పంజుగుల రోహిత్‌రెడ్డి చెప్పారు. తన నాన్న, బాబాయ్‌లను చూసి రాజకీయాల్లోకి వచ్చానని, ప్రజల మధ్య ఉండడం ఇష్టమని ఆయన వెల్లడించారు. ఆయన శనివారం ‘సాక్షి’తో మాట్లాడుతూ తన కుంటుంబ విశేషాలను వివరించారు. తాండూరు: మాది బషీరాబాద్ మండలం ఇందర్‌చెడ్ గ్రామం. నాన్న విఠల్‌రెడ్డి, అమ్మ ప్రమోదినిదేవి. అమ్మ చిల్కూరు గురుకుల విద్యాలయంలో ఫిజికల్ డైరక్టర్‌గా పనిచేసి రిటైర్మెంట్ అయింది. నాన్న రాజకీయాల్లో ఉన్నారు. గ్రామంలో మా తాత పంజుగుల లింగారెడ్డిది ఉమ్మడి కుటుంబం. ఇప్పటికీ కుటుంబమంతా ఒకే మాటపై కట్టుబడి ఉంటాం. ఎలాంటి నిర్ణయమైనా కుటుంబ సభ్యులతో కలిసి తీసుకుంటాం. నేను ప్రాథమిక విద్య, ఇంటర్ హైదరాబాద్‌లో పూర్తిచేశాను. స్వీడన్‌లోని బీటీహెచ్ యూనివర్సిటీలో మాస్టర్ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ చేశాను. ఇతర దేశాల నుంచి చదువుకునేందుకు స్వీడన్‌కు వచ్చిన విద్యార్థులకు నేను కోఆర్డినేటర్‌గా కొనసాగాను. పైలెట్ కావాలని కోరికతో.. పైలెట్ కావాలని చిన్నప్పటి నుంచి కోరిక. అందుకోసం అమెరికాకు వెళ్లి కాలిఫోర్నియాలో పైలెట్ కోర్సులో చేరాను. ఏడు నెలల పాటు పైలెట్ శిక్షణ పొందాను. శిక్షణ పూర్తికాగానే ఆరు నెలల పాటు అక్కడే పైలెట్‌గా పనిచేశాను. తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి బిజినెస్‌పై ఆసక్తి చూపించాను. అయితే, నేను పైలెట్ వృత్తి మానేసినా నా ఇంటిపేరు మాత్రం ‘పైలెట్’గానే నిలిచిపోయింది. పెద్దలు కుదిర్చిన వివాహం మా మామ స్వస్థలం విశాఖపట్నం. వారి కుటుంబం కొన్నేళ్లుగా చెన్నైలో ఉంటోంది. నా పెళ్లిచూపులు చెన్నైలోనే జరిగాయి. మా పెళ్లి నిడారంబరంగా తిరుపతి శ్రీ వేంకటేశ్వరుడి సన్నిధిలో జరిగింది. నా భార్య ఆర్తి కుటుంబానికి చాలా ప్రాధాన్యం ఇస్తుంది. కూతురు నక్షత్ర, కుమారుడు జయదేవ్రెడ్డిలు పుట్టగానే మాకు కలిసొచ్చింది. నా కొడుకు పుట్టిన రోజే తాండూరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేశాను. నేను ఎప్పటికీ మరిచిపోని రోజు. రజనీకాంత్‌తో పరిచయం ఇలా.. సూపర్‌స్టార్ రజనీకాంత్, మా మామ విక్టర్ ప్రసాద్ ప్రాణ స్నేహితులు. నా భార్య ఆర్తితో కలిసి ఎప్పుడు చెన్నైకి వెళ్లినా రజనీకాంత్‌ను కలుస్తాను. నిరాడంబరంగా జీవిస్తున్న వారిలో రజినీకాంత్ ఒక్కరినే చూశాను. రాజకీయాలపై ఆసక్తి ఇలా.. కుటుంబంలో నాన్న విఠల్‌రెడ్డి, బాబాయ్ శ్రీశైల్రెడ్డిలు రాజకీయాలలో ఉన్నారు. వారిని చూసి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాను. అప్పటి నుంచి తాండూరు ఎమ్మెల్యే కావాలని కోరిక పుట్టింది. అందుకోసం పదేళ్ల పాటు రాజకీయాలలో కొనసాగాను. ఇటీవల జరిగిన ఎన్నికలలో తాండూరు ఎమ్మెల్యేగా విజయం సాధించాను. నాకు ఇష్టమైనవి ఇవీ.. క్రికెట్ ఆడటమంటే ఎంతో ఇష్టం. విద్యార్థి దశలో ఉన్నప్పుడు క్రికెట్ ఆడాను. రంజీ సెలక్షన్ వరకు వెళ్లి తర్వాత మధ్యలో వదిలేశాను. వీలు చిక్కినప్పుడల్లా క్రికెట్ చూస్తాను. నాకు ఇష్టమైన టూరిస్ట్ స్పాట్ కాలిఫోర్నియా, కశ్మిర్. కుటుంబంతో కలిసి టూర్‌కు వెళ్తాను. సినిమా హీరోలలో చిరంజీవిని ఇష్టపడతాను. ఇటీవల కాలంలో నేను జెర్సీ సినిమాను చూశాను. రోహిత్‌కు భార్య కావడం నా అదృష్టం రోహిత్‌రెడ్డి నా జీవితంలోకి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నా. ఆయన బిజినెస్, రాజకీయాలలో బిజీగా ఉన్నా కుటుంబానికి సమయం కేటాయిస్తారు. ఆయనకు నాన్‌వెజ్ చేసి పెట్టడమంటే నాకేంతో ఇష్టం. రోహిత్ మనసు తెలుసుకొని మసలుకుంటాను. – ఆర్తిరెడ్డి, రోహిత్‌రెడ్డి భార్య -
ఒకసారి ఓడిపోతే.. బతికే ధైర్యం వస్తుంది
సాక్షి, దోమ : నా పేరు కె.రాఘవేందర్. మాది దోమ మండలం ఊటపల్లి గ్రామం. నా పాఠశాల విద్య అంతా ప్రభుత్వ పాఠశాల్లోనే సాగింది. బాగా చదివే వాడిని. మా నాన్న చిన్నప్పుడు చనిపోవడంతో మా అమ్మ కష్టాలు చూసి ఆమెకు పనుల్లో సహాయపడేవాడిని. ఇంటర్ ఫస్ట్ ఇయర్ వరకు బాగానే చదివాను. ఫస్ట్ ఇయర్ ఫస్ట్‌క్లాస్ మార్కులతో పాసయ్యాను. కానీ, సెకండ్ ఇయర్లో ఫెయిలయ్యాను. పరీక్షలు బాగానే రాశాను. పాసవుతాననే ధీమాతో మహబూబ్‌నగర్‌లో డీఈడీ కోచింగ్‌కు కూడా వెళ్లాను. ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వచ్చిన రోజున నా తోటి విద్యార్థులు భయపడుతూ ఫలితాలు చూస్తున్నారు. నేను మాత్రం చాలా నమ్మకంతో.. పాసవుతాననే ధీమాతో ఫలితాలు చూసుకున్నాను. అయితే, ‘ఫెయిల్’ అని ఉంది. ఆ ఫలితాలు చూసేసరికి నాకు ఏమీ అర్థం కాలేదు. కొన్ని నిమిషాలు షాక్‌కు గురయ్యాను. తరువాత మొత్తం రిజల్ట్ చూస్తే.. అన్ని సబ్జెక్టుల్లో 80శాతం పైన మార్కులు వచ్చి.. ఒక కెమిస్ట్రీలో ఫెయిల్ అని ఉంది. ఆ రోజు మా ఊరి వాళ్లు, నా ఫ్రెండ్స్ కూడా నన్ను చూసి నవ్వారు. మానసికంగా చాలా బాధ పెట్టారు. ఇంటి చుట్టూ ఉన్న వాళ్లు మా అమ్మని కూడా అడిగి బాధించారు. నేను మొదటిసారి ఫెయిల్ అవడం అదే. అయితే, అందరూ అన్న మాటలు నాలో దాచుకుని మా అమ్మకు మాట ఇచ్చాను. ఇప్పుడు ఎవరైతే నన్ను చూసి నవ్వుతున్నారో.. రేపు వారే నన్ను పొగిడేలా చేస్తా అని చెప్పాను. వెంటనే మళ్లీ పరీక్ష రాసి పాసయ్యాను. ఇంతలో కానిస్టేబుల్ ఉద్యోగాల నోటిఫికేషన్ వచ్చింది. ఇదే సరైన అవకాశం అని భావించి కష్టపడి చదివాను. శారీరక పరీక్షలకు ప్రాక్టీస్ చేశాను. చివరకు 116 మార్కులతో సివిల్ కానిస్టేబుల్‌కు ఎంపికయ్యాను. జిల్లాలోనే అత్యధిక మార్కులు సాధించాను. అప్పుడు పేపర్లో నా ఫొటో చూసి అందరూ వచ్చి మా అమ్మతో ‘మీ అబ్బాయికి జాబ్ వచ్చింది కదా’ అని అడిగారు. అప్పుడు మా అమ్మ కళ్లలో ఆనందం చేసిన నాకు ఇంటర్లో ఫెయిలైన బాధ పూర్తిగా పోయింది. ఇంటర్ విద్యార్థులకు నేను చెప్పేది ఒకటే.. ఒకసారి ఓడిపోతే ప్రపంచం అంటే ఏమిటో అర్థమవుతుంది. ఒకసారి ఓడిపోతే జీవిత కాలం ఏ కష్టం వచ్చినా బతికే ధైర్యం వస్తుంది. ఇంటర్ ఫెయిల్ అయితే ఏదో నా జీవితం అయిపోయింది అని అనుకోకుండా.. అప్పుడే నా జీవితం మొదలైంది అని గుర్తించాలి. -
మూడేళ్లలో... పాలమూరు పూర్తి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: పాలమూరు – రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని మూడేళ్లలో పూర్తిచేసి పశ్చిమ రంగారెడ్డి జిల్లాను సస్యశ్యామలం చేస్తామని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారకరామారావు చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల్లో 16 ఎంపీ సీట్లను గెలిపిస్తే ఈ ప్రాజెక్టుకు జాతీయ హోదా సాధిస్తామని అన్నారు. స్థానిక ప్రాంత అభివృద్ధికి ఆటంకంగా మారిన 111 జీఓపై అధ్యయనం చేయడానికి కమిటీని వేశామని, భవిష్యత్‌లో ఎవరూ అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా సవ్యమైన పద్ధతిలో ప్రణాళికాబద్ధంగా ఈ సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయంలో ఆందోళన అవసరం లేదని, ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ తప్పబోడని భరోసా ఇచ్చారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ సన్నాహక సమావేశాన్ని శనివారం నిర్వహించారు. స్థానిక ఫరా కళాశాల మైదానంలో జరిగిన ఈ సమావేశానికి ఏడు అసెంబ్లీ నియోజకర్గాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. సమావేశంలో కేటీఆర్ ప్రసంగిస్తూ పాలమూరు ప్రాజెక్టు నిర్మాణానికి రూ.40 వేల కోట్లు ఖర్చు అవుతుందని అంచనాలు ఉన్నా.. అంతకుమించి కూడా ఖర్చు చేసి ప్రాజెక్టును పూర్తిచేస్తామని, ఇక్కడి ప్రజల ఆకాంక్షని నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. వికారాబాద్‌ను చార్మినార్ జోన్లో కలిపేందుకు కృషిచేస్తానని కూడా ఆయన హామీ ఇచ్చారు. రాజేద్రనగర్ బుద్వేల్ ప్రాంతంలో ఐటీ పరిశ్రమ రాబోతుందని కేటీఆర్ వెల్లడించారు. అధిక భాగం స్థానికులకే ఉద్యోగాలు లభించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అవసరమైతే ప్రభుత్వ ఖర్చుతో స్థానికులకు ఉపాధి లభించేలా ప్రత్యేక నైపుణ్య శిక్షణ ఇస్తామన్నారు. పరిశ్రమలు రావాలంటే భూములపై పంచాయతీలు చేయొద్దని, అలాగైతేనే అధిక సంఖ్యలో పరిశ్రమల స్థాపన జరుగుతుందని వివరించారు. రైతులకు నష్టం వాటిల్లకుండా పరిశ్రమలు వచ్చేలా చూస్తానని చెప్పారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ దెబ్బకు.. కాంగ్రెస్‌కు దడ పుట్టిందని, పార్లమెంట్ ఎన్నికల్లోనూ ఇదే స్థాయిలో పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ నేతలకు చురకలు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కేటీర్ పార్టీ శ్రేణులకు ఒక వైపు మార్గ నిర్దేశనం చేస్తూనే.. మరో వైపు ఆగ్రహం వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాల వల్ల అన్ని చోట్ల అభ్యర్థులు గెలువగా.. కొన్ని ప్రాంతాల్లో ఎందుకు ఓటమి ఎదురైందని నేతలను సూటిగా ప్రశ్నించారు. తాండూరు, మహేశ్వరం నియోజకవర్గాల్లో ఎందుకు వెనకబడ్డామో ఆత్మవిమర్శ చేసుకోవాలని మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డికి చురకలు అంటించారు. వికారాబాద్‌లో స్వల్ప మెజారిటీతోనే ఎలా గెలిచామని ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్‌ను అడిగారు. నాయకులు ఎప్పటికప్పుడు తమలోని పొరపాట్లను సవరించుకోకపోతే పురోగతి ఉండదన్నారు. నేల విడిచి సాము చేయొద్దని నాయకులకు సూచించారు. జెడ్పీటీసీ, ఎంపీపీ అని, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అని గర్వంతో దేశమంతా తిరుగుతా అంటే కుదరదని, తొలుత బూత్‌స్థాయి, ఆ తర్వాత గ్రామస్థాయిలో మెజారిటీ రాకుంటే పరువుపోతుందని హితవు పలికారు. ఎమ్మెల్యే అయినా, కార్పొరేషన్ చైర్మన్ అయినా బూత్ స్థాయిలో 70 శాతం ఓట్లు తీసుకొని రావాలన్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లో నాయకులు.. ప్రతి కార్యకర్తను కలుసుకోవాలని సూచించారు. బూత్, గ్రామాల వారీగా తిరిగేందుకు కార్యాచరణ రూపొందించి ముందుకు సాగాలన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో అందరినీ కలుపుకొని పోవాలన్నారు. గెలిచినా, ఓడినా అందరూ మనవారేనని, పాత పంచాయతీలను పక్కనబెట్టాలన్నారు. రాష్ట్రంలో ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు తమవైపే చూస్తున్నారని.. ఇటువంటి వారిని పార్టీలోకి పెద్ద మనసుతో సాదరంగా ఆహ్వానించాలని చెప్పారు. వ్యక్తిగత ద్వేషాలకు స్వస్తి పలికి కేసీఆర్ కోసం అందరికీ దగ్గర కావాలని వినయంగా విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో మంత్రి సీహెచ్.మల్లారెడ్డి, మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ప్రకాశ్‌గౌడ్, అరికెపూడి గాంధీ, మహేశ్వర్‌రెడ్డి, మెతుకు ఆనంద్, బాల్క సుమన్, పట్నం నరేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చేవెళ్ల ఎంటీ టికెట్ దాదాపు ఖరారైన పారిశ్రామికవేత్త జి.రంజిత్‌రెడ్డి కూడా వేదికపై ఉన్నారు. -
చేవెళ్ల గడ్డ కోసం ఎవరితోనైనా కొట్లాటకు సిద్ధం
సాక్షి, శంషాబాద్: చేవెళ్ల గడ్డ కోసం ఎవరితోనైనా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నానని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి అన్నారు. తన తాత, ముత్తాల గడ్డ అయిన ఈ ప్రాంతానికి ఎల్లవేళలా రుణపడి ఉంటానన్నారు. శంషాబాద్ పట్టణంలో క్లాసిక్ త్రీ కన్వెన్షన్ మైదానంలో శనివారం రాత్రి నిర్వహించిన ‘కనీస ఆదాయ వాగ్దాన’ సభలో ఆయన మాట్లాడారు. రాబోయే ఎన్నికల్లో చేవెళ్లలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికలు రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినవి కావన్నారు. ప్రధాని నరేంద్రమోదీ, కాంగ్రెస్‌కు మధ్య జరుగుతున్న ఎన్నికలుగా గుర్తించాలన్నారు. నరేంద్రమోదీ ప్రధాని కావడంతో అచ్చేదిన్ ఎవరికి వచ్చాయన్నారు. మోదీ తెస్తానన్న కాలాధన్ ఎవరి జేబులోకి పోయిందని ప్రశ్నించారు. ఐదేళ్ల మోదీ పాలనలో రైతుల ఆత్మస్థైర్యం పూర్తిగా దెబ్బతిందని ఆవేదన వ్యక్తం చేశారు. యువత ఆశాకిరణమైన రాహుల్‌గాంధీని ప్రధానిని చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దేశ సమగ్రత, సమైక్యత కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆంగ్ల సామెతను ఉటంకించారు. మొదటిసారి మోసపోతే ఎదుటి వారికి సిగ్గులేనట్లు.. రెండోసారి కూడా మోసపోతే మనకు తెలిసి లేనట్లని.. మరోసారి నరేంద్రమోదీకి ఓటేసి మోసపోకూడదని చెప్పారు. కాంగ్రెస్‌ను గెలిపించి తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీకి కానుక ఇవ్వాలన్నారు. కాంగ్రెస్ పాలనలోనే పేదల సంక్షేమం: ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి కాంగ్రెస్ పాలనలోనే ప్రజలందరికీ సంక్షేమ పథకా లు అందాయని మహేశ్వరం ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. పేద ప్రజల కోసం ఉపాధి హామీ అం దించిన ఘనత కాంగ్రెస్‌దేనన్నారు. ఏకకాలంలో రుణమాఫీ చేసిన చరిత్ర కూడా కాంగ్రెస్‌కే ఉందన్నారు. పెద్దనోట్ల రద్దుతో పేద ప్రజలను మోదీ ఇబ్బందుల్లో నెట్టారన్నారు. దేశంలో రాహుల్‌గాంధీని ప్రధానిని చేసుకుని తెలంగాణ ఇచ్చిన సోని యాగాంధీ రుణం తీర్చుకోవాలన్నారు. రాహుల్‌గాంధీకి సభావేదికకు చేరుకోకముందు చేవెళ్ల మా జీ ఎమ్మెల్యే రత్నం, పరిగి మాజీ ఎమ్మెల్యే రాంమోహన్‌రెడ్డి టీఆర్ఎస్ ప్రభుత్వంపై వి మర్శలు గుప్పించారు. ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగం జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు చల్లా ధర్మారెడ్డి అనంతరం ధన్యవాదాల తీర్మానాన్ని తెలిపారు. సభావేదికపై కార్యక్రమాల తీరును పీసీసీ అధికార ప్రతినిధి రాచమల్ల సిద్దేశ్వర్, సభ్యుడు వే ణుగౌడ్ ప్రారంభం నుంచి చివరికి వరకు పర్యవేక్షించారు. -
నువ్వా.. నేనా?
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామ పంచాయతీ తొలి దశ ఎన్నికల ప్రచారానికి శనివారం తెర పడింది. అభ్యర్థులు చివరి రోజు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు. ఆయా పార్టీల పెద్దలు రంగంలోకి దిగి తమ అనుచరుల తరఫున విస్తృతంగా ప్రచారం చేశారు. ర్యాలీలతో హోరెత్తించారు. తొలి విడతగా సోమవారం షాద్‌నగర్, రాజేంద్రనగర్ డివిజన్లలో ఎన్నికలు జరగనున్నాయి. వీటి పరిధిలోని ఏడు మండలాల్లో 179 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఇందులో 20 జీపీలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 159 జీపీల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. పోల్ మేనేజ్మెంట్పై దృష్టి దాదాపు పది రోజులపాటు విస్తృతంగా సాగిన ప్రచారానికి శనివారం తెర పడడంతో అభ్యర్థులు పోల్ మేనేజ్మెంట్పై దృష్టిసారిస్తున్నారు. ఏ అభ్యర్థి వెళ్లినా ‘మీకే నా ఓటు’ అంటున్న ఓటర్లు చేజారకుండా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం, డబ్బులు, చీరలు ఇతర తాయిలాలు ఎరవేస్తూ తమవైపు ఉండేలా పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా నోటు, మద్యందే పైచేయి ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్ర పోటీ ఉన్న పల్లెల్లో ఓటుకు రూ.1000 రూ.1,500 పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. ఇతర గ్రామాల్లో కనిష్టంగా రూ.500 పంపిణీ చేస్తున్నారని తెలుస్తోంది. ఏర్పాట్లు పూర్తి ఎన్నికలు సజావుగా, ప్రశాంతంగా జరిగేలా యంత్రాంగం పకడ్బందీగా చర్యలు చేపట్టింది. కలెక్టర్ డీఎస్ లోకేశ్‌కుమార్ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ఇప్పటికే విధులు కేటాయించిన ఉద్యోగులు, సిబ్బందికి పోలింగ్ సామగ్రిని ఆదివారం నిర్దేశిత పంపిణీ కేంద్రాల వద్ద అందజేయనున్నారు. మొత్తం 4వేల మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మొత్తం 1,341 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. సమస్యాత్మక కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తు పెంచారు. ప్రతి పోలింగ్ కేంద్రానికి ఒక మైక్రో అబ్జర్వర్‌ను నియమించారు. పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు వీలుగా వెబ్‌కాస్టింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరుగుతుంది. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఇది పూర్తికాగానే వెంటనే ఫలితాలను వెల్లడిస్తారు. తొలి దశ ఎన్నికల్లో మొత్తం 1.90 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. -
డిసెంబర్ 11న దిమ్మతిరిగే ఫలితాలు
చేవెళ్ల, శంకర్పల్లి: డిసెంబర్ 11 ఫలితాల తరువాత కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ వీణ వాయిస్తూ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఫిడేల్ వాయించుకుంటూ కూర్చోవాల్సిన సమ యం ఆసన్నమైందని మంత్రి కె.తారకరామరావు ఎద్దేవా చేశారు. ఆయన బుధవారం రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా పలు సభల్లో మాట్లాడుతూ.. పాము ముంగిసలాంటి కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఏకమైయ్యాయని, కేసీఆర్‌ను ఓడించాలని చూస్తున్నాయన్నారు. చంద్రబాబు ఢిల్లీకిపోయి రాహుల్‌గాంధీకి వీణ ఇస్తే, చంద్రబాబుకు ఆయన ఫిడేల్ ఇచ్చారన్నారు. రేపు ఎన్నికల్లో కేసీఆర్ గెలిచి ముఖ్యమంత్రిగా ప్రమాణాస్వీకారం చేస్తుంటే వీరిద్దరు ఒకరు వీణ మరోకరు ఫిడేల్వాయించు కోవాల్సిందేనన్నారు. పనిచేసే ప్రభుత్వా న్ని, ముఖ్యమంత్రిని ఏ ప్రజలూ వదులుకోరన్నా రు. ప్రధానమంత్రి తెలంగాణకు వచ్చి.. తెలం గాణలో కరెంట్ వస్తలేదని పచ్చి అబద్ధాలు చెప్పాడన్నారు. దమ్ముంటే బీజేపీ నాయకులు విద్యుత్ తీగలు పట్టుకుంటే 24గంటల విద్యుత్ ఉన్నది తెలుస్తుందని ఛాలెంజ్ చేశారు. తాము బంగారు తెలంగాణ కోసం పాటుపడుతున్నామని, ఎక్కడా అవినీతి పాల్పడలేదన్నారు. కుటుంబ పాలన గురించి మాట్లాడుతున్న సోనియాగాంధీ 60 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహిస్తున్నది ఎవరి కుటుంబం అని ప్రశ్నించారు. ఉద్యమంలో పాల్గొని తాము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలకు సేవ చేస్తున్నామని గుర్తుకు చేశారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని అభివృద్ధి తెలంగాణలో ఉందని కేటీఆర్ చెప్పారు. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గడ్డాలు పెంచుకొని సన్యాసంలో కలిసిపోయో రోజు వచ్చిందని, గడ్డాలు పెంచినోళ్లు అందరూ గబ్బర్ సింగ్‌లు కాలేరని ఏద్దెవా చేశారు. సినిమా డైలాగ్‌లతో ఉత్తేజం చేవెళ్ల ఎమ్మెల్యే అభ్యర్థి కాలె యాదయ్య గురించి కేటీఆర్ మాట్లాడుతూ.. పేదల కష్టాలు తెలిసిన సౌమ్యుడు, వజ్రంలాంటి మనిషి యాదయ్యను గెలిపించుకోవాలన్నారు. ఒక సినిమాలో వచ్చిన పాట మాదిరిగా.. చేవెళ్ల ప్రాంతంలో ఉన్న యాదన్నలు, వెంకన్నలు, నాగన్నలు, అందరూ ఏగట్టున ఉంటారో తెలుసుకోవాల్సిన సమయం వచ్చింన్నా రు. కరెంట్ అడిగితే కాల్చి చంపిన కాంగ్రెస్, టీడీపీ ల దిక్కు ఉందామా.. అడగకముందే 24 గంటల కరెంటు ఇచ్చిన టీఆర్ఎస్ వైపు ఉందామా, నీల్లు అడిగితే కన్నీళ్లు ఇచ్చిన కాంగ్రెస్ వైపు ఉందామా.. ఇంటింటికి నల్లా నీళ్లు ఇచ్చిన కేసీఆర్ దిక్కు ఉం దామా ఆలోచించాలని కేటీఆర్ ప్రజలను కోరారు. స్కామ్‌ల వైపు ఉందామా.. స్కీమ్‌ల వైపు ఉం దామా, సంక్షోంభం దిక్కు ఉందామా.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయన్నారు. ఈ కుటమి పొరపాటునో గ్రహపాటునో అధికారంలోకి వస్తే ముఖ్యమంత్రిని రాహుల్‌గాంధీ కాదు చంద్రబాబు డిసైడ్ చేస్తాన్నారు. మన వనరులు, మన నీళ్లుపై ఆధిపత్యం కోసం చంద్రబాబు ఎంతకైనా తెగిస్తారన్నారు. డిల్లీ గులామ్‌లు, అమరావతి కీలుబొమ్మలు వీళ్లు కావాలా.. తెలంగాణలోని గులాబీలు కావాలో ఆలోచించుకోవాల్సిన అవసరం వచ్చిందని కేటీఆర్ అన్నారు. చేవెళ్ల రోడ్‌షోలో ఎంపీపీ ఎం.బాల్‌రాజ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పోలీస్ వెంకట్‌రెడ్డి, నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షుడు పాండుయాదవ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బి.నర్సింలు, మాజీ వైస్ చైర్మన్ మాసన్నగారి మానిక్యరెడ్డి, జిల్లా యువజన విభాగం నాయకులు వనం లక్ష్మీకాంత్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు బర్కాల రాంరెడ్డి, మండల మహిళా కమిటీ అధ్యక్షురాలు మిట్ట లతావెంకటరంగారెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ కమి టీ డైరెక్టర్ ఎం.యాదగిరి, నియోజకవర్గం యూత్ అధ్యక్షుడు రాఘవేందర్‌రెడ్డి, టీఆర్ఎస్వీ నాయకుడు నరేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. 111 జీవోను సడలించేందుకు చర్యలు మొయినాబాద్(చేవెళ్ల): మొయినాబాద్ మండలం హైదరాబాద్ నగరానికి అత్యంత చేరువలో ఉంది. ఇప్పటికే గచ్చిబౌలిలో ఐటీ కంపెనీలు నిండిపోయాయి. బుద్వేల్‌లో ఐటీ కంపెనీలు ఏర్పాటవుతున్నాయి. తరువాత మొయినాబాద్ మండలంలోనే ఏర్పాటవుతాయి. అందుకోసం పర్యావరణానికి నష్టం లేకుండా 111 జీవోను సడలించేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం రాత్రి మొయినాబాద్‌లో రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలోని 84 గ్రామాలకు ఇబ్బందిగా మారిన 111 జీవోపై ఇప్పటికే ప్రభుత్వం ఓ కమిటీని వేసిందని.. కమిటీ తుదినివేధిక కూడా అందజేసిందన్నారు. గ్రామాల అభివృద్ధికోసం 111 జీవోను సడలించేందుకు కృషిచేస్తామన్నారు. ఆ నాడు తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పోతుందని కొంత మంది నాయకులు అన్నారు. కానీ నాలుగున్నరేళ్లలో తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో 17 శాతం వృద్ధిరేటుతో దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా నిలిచిందన్నారు. తెలంగాణ వచ్చిన ఆరు నెలల్లోనే 24 గంటల కరెంటు ఇచ్చామన్నారు. ఢిల్లీలో ప్రాణత్యాగం చేసిన యాదిరెడ్డి... తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో వందల మంది విద్యార్థులు ప్రాణత్యాగాలు చేశారన్నారని కేటీఆర్ అన్నారు. మొయినాబాద్ మండలం పెద్దమంగళారం గ్రామానికి చెందిన యువకుడు యాదిరెడ్డి ఢిల్లీలో పార్లమెంటు ముందు ఉరివేసుకుని ప్రాణత్యాగం చేసుకున్నాడని.. అలాంటి అమరుల త్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని గుర్తుచేశారు. నాలుగున్నరేళ్లలో అనేక అభివృద్ధి పనులు చేపట్టామని, రుణమాఫీ, 24 గంటల కరెంటు, ఆసరా పింఛన్లు, రైతు బందు, రైతుబీమా, కల్యాణలక్ష్మీ, షాదిముబారక్ వంటి అనేక పథకాలతో ఎంతో మందికి లబ్ధి చేకూరిందన్నారు. ఈ ఎన్నికల్లో మళ్లీ గెలిపిస్తే పింఛన్లు రెట్టింపు చేస్తామన్నారు. ఎక్కడ స్థలం ఉంటే అక్కడే డబుల్బెడ్రూం ఇళ్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షలు ఇస్తామన్నారు. ఈ పథకాలన్నీ అమలు కావాలంటే మళ్లీ కారు గుర్తుకు ఓటు వేసి కాలె యాదయ్యను గెలిపించాలని.. కేసీఆర్‌ను మళ్లీ సీఎం చేయాలన్నా రు. చేవెళ్ల అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే కాలె యాద య్య, హైదరాబాద్ మేయర్ బొంతు రామ్మోహన్, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు అనంతరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల అధ్యక్షుడు శ్రీహరియాదవ్, పీఏసీఎస్ చైర్మన్ జగన్మోహన్రెడ్డి, ఏఎంసీ వైఎస్ చైర్మన్ వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ పెంటయ్య, రవుఫ్, బాల్‌రాజ్ తదితరులు పాల్గొన్నారు. -
ఢిల్లీకి చేరినా రాజకీయం..
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: కాంగ్రెస్ కథ క్లైమాక్స్‌కు చేరింది. సీను హస్తినకు మారింది. ఒకేసారి పూర్తి జాబితా విడుదలకు ఏఐసీసీ ముహూర్తం ఖరారు చేయడంతో ఆశావహులంతా ఢిల్లీ బాట పట్టారు. శుక్రవారం రోజున జాబితా వెల్లడిస్తామని ప్రకటించడంతో ఉత్కంఠ నెలకొంది. వాస్తవానికి అభ్యర్థుల జాబితాను సాధ్యమైనంత త్వరగా ప్రకటించాలని ఏఐసీసీ నిర్ణయించినా.. టీడీపీ, టీజేఎస్, సీపీఐతో జతకట్టిన కాంగ్రెస్‌కు సీట్ల తకరారు తలనొప్పి కలిగించింది. మిత్రపక్షాలతో ఎడతెగని చర్చలు జరిపినా పోటీచేసే స్థానాలపై కూడా సీపీఐ, టీడీపీతో అవగాహన కుదరకపోవడం చికాకు తెప్పిస్తోంది. పార్టీ ప్రయోజనాల దృష్ట్యా సీట్ల కేటాయింపుల్లో పట్టువిడుపులు ప్రదర్శించాలని ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీ స్పష్టం చేయడంతో రాష్ట్ర నాయకత్వం మెత్తబడింది. ఈ క్రమంలోనే టీడీపీ, టీజేఎస్‌లతో సీట్ల సంఖ్యపై దాదాపుగా ఏకాభిప్రాయం కుదిరింది. సీపీఐతో రేపో మాపో సయోధ్య కుదురుతుందని అంచనా వేస్తున్న కాంగ్రెస్ హైకమాండ్ ఈ నెల 9న అభ్యర్థుల జాబితాను ప్రకటిస్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టికెట్లపై గంపెడాశలు పెట్టుకున్న ఆశావహులు మిత్రపక్షాలతో సీట్ల సర్దుబాటు.. తమ అభ్యర్థిత్వం ఖరారు వ్యవహారాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారు. మాకంటే మాకు.. టీడీపీ–కాంగ్రెస్‌ల పొత్తు ఇరుపార్టీలపై ప్రభావం చూపుతోంది. ఓటు బ్యాంకు కలిసివస్తున్నా.. సీనియర్లు, ద్వితీయశ్రేణి నేతలను డైలమాలో పడేస్తోంది. టీడీపీ ప్రతిపాదిస్తున్న సీట్లతో కాంగ్రెస్.. కాంగ్రెస్ పట్టుబడుతున్న స్థానాలతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. 2014 ఎన్నికల్లో గెలిచిన రాజేంద్రనగర్, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, ఉప్పల్ నియోజకవర్గాలను టీడీపీ అడుగుతోంది. ఇందులో శేరిలింగంపల్లి, ఉప్పల్, కూకట్పల్లి సెగ్మెంట్లను వదులుకోవడానికి కాంగ్రెస్ సిద్ధమైంది. అనివార్యమైతే రాజేంద్రనగర్‌ను కూడా త్యాగం చేయడానికి వెనుకాడడం లేదు. అయితే ఈ సెగ్మెంట్ల ఆశావహులకు తాజా సమీకరణలు మింగుడుపడడం లేదు. నాలుగేళ్లుగా పార్టీకోసం కష్టించిన తమకు గాకుండా పొత్తు పేరిట టీడీపీ ఎగురేసుకుపోయే ఎత్తుగడ వేయడం తట్టుకోలేకపోతున్నారు. ఎవరికి వి‘పొత్తు’ మహాకూటమితో ఎవరి సీట్లు గల్లంతవుతాయోనని అటు కాంగ్రెస్.. ఇటు టీడీపీ నేతల్లో కలవరం మొదలైంది. ఈ పొత్తు ప్రభావం ఎక్కువగా మన జిల్లాలో ఉండడంతో ఎవరి స్థానాలకు గండి కొడుతుందోననే ఆందోళన వ్యక్తమవుతోంది. గ్రేటర్ శివార్లలో ఇరుపార్టీలు సంస్థాగతంగా బలంగా ఉన్నాయి. గత ఎన్నికల్లో రెండు పార్టీలు హోరాహోరీగా పోరాడినా బీజేపీతో పొత్తు టీడీపీకి లాభించింది. ఆ పార్టీ శివారు సెగ్మెంట్లను క్లీన్‌స్వీప్ చేసింది. మల్కాజిగిరి, మేడ్చల్ మినహా మిగతా స్థానాలన్నింటినీ గెలుచుకుంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో టీడీపీ ఎమ్మెల్యేల్లో ఆర్.కృష్ణయ్య తప్ప మిగతా ఎమ్మెల్యేలు గులాబీ గూటికి చేరారు. లీడర్లు పార్టీని వీడినా కేడర్ చెక్కుచెదరలేదు. సీమాంధ్ర ఓటర్లపై ఆశ శివారు ఓటర్లలో అత్యధికం సీమాంధ్రులున్నారు. గతంలో బీజేపీ–దేశం కూటమికి పట్టంకట్టిన ఓటర్లు ఈసారి కాంగ్రెస్–టీడీపీకి అండగా నిలుస్తారని మహాకూటమి అంచనా వేస్తోంది. ఏపీకి ప్రత్యేక హోదా ఈ ఎన్నికల్లో కీలక భూమిక పోషించనుందని, ఇది బీజేపీపై వ్యతిరేకత పెంచనుందని భావిస్తోంది. ఈ అంశం టీడీపీ–కాంగ్రెస్‌కు ఉభయతారకంగా పనిచేస్తుందని భావించిన టీడీపీ–కాంగ్రెస్‌లు పాత వైరాన్ని మరిచి మిత్రపక్షంగా మారిపోయాయి. టీడీపీలోనూ ముసలం.. టీడీపీలో కూడా పొత్తు సంకటస్థితిని సృష్టిస్తోంది. టికెట్ తమకే ఖాయమని భావించి కొన్నాళ్లుగా గ్రౌండ్వర్క్చేస్తున్న కొందరి సీట్లకు కాంగ్రెస్ పొత్తుతో ముప్పు ఏర్పడింది. ఎల్బీనగర్, ఇబ్రహీంపట్నం, మల్కాజిగిరి, మహేశ్వరం, కుత్బుల్లాపూర్ ఔత్సాహికులకు నిరాశ కలిగిస్తోంది. ఒంటరిగా బరిలో దిగుతామని భావించి ఆర్థికంగా నష్టపోయిన తర్వాత సీట్లను త్యజించాల్సిరావడం వారిని అసంతృప్తికి గురిచేస్తోంది. అలాగే మల్కాజిగిరిని ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తారనే ప్రచారం అటు టీడీపీ.. ఇటు కాంగ్రెస్‌లో కలకలం సృష్టిస్తోంది. ఏమాత్రం బలంలేని టీజేఎస్‌కు ఈ సీటు ఇవ్వాలనుకోవడంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. గత ఎన్నికల్లో బీజేపీ.. ఈసారి టీజేఎస్‌కు అప్పగిస్తుండడంతో అసంతృప్తికి లోనైన టీడీపీ శ్రేణులు పక్కపార్టీలవైపు చూస్తున్నాయి. -
హ్యాట్రిక్ వీరులు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా : ఆ నేతలు ఒక్కసారి కాదు..రెండుసార్లు కాదు.. ఏకంగా ఐదు, నాలుగు, మూడుసార్లు ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ బరిలో ఒక్కసారి నెగ్గడమే కొందరికి మహాకష్టం. అటువంటిది ఈ నేతలు వరుసగా మూడుసార్లు శాసనసభలో అడుగుపెట్టి తమ సత్తా చాటారు. మరికొందరు ఐదు, నాలుగుసార్లు కూడా నెగ్గి ప్రజాసేవలో తరించారు. జిల్లా పరిధిలో హ్యాట్రిక్ ఘనత ఏడుగురు నేతలకు దక్కింది. ఈ జాబితాలో వికారాబాద్‌కు చెందిన ఎ.చంద్రశేఖర్ అందరి కంటే ముందు ఉన్నారు. ఏకంగా వరుసగా ఐదుసార్లు విజయదుందుభి మోగించి రికార్డులకెక్కారు. మేడ్చల్‌లో దేవేంద్రుడు టీడీపీ సీనియర్ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్ మూడు వరుస విజయాలు నమోదు చేశారు. మేడ్చల్ సెగ్మెంట్ నుంచి 1994, 1999, 2004 ఎన్నికల్లో విజయదుందుభి మోగించారు. ఈ స్థానం నుంచి మూడుసార్లు బరిలో నిలిచిన ఆయన.. ఒక్కసారి కూడా ఓటమి ఎరుగలేదు. 1962 మినహా 1952 నుంచి 1983 వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలిచారు. 1985లో టీడీపీ ఖాతా తెరిచింది. కాంగ్రెస్ అభ్యర్థి జి.సంజీవరెడ్డిపై కె.సురేంద్రరెడ్డి విజయం సాధించారు. ఈ తదుపరి నుంచి మూ డుసార్లు దేవేందర్‌గౌడ్ నెగ్గారు. ఆయన 2008లో టీడీపీని వీడారు. ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేసి నవ తెలంగాణ పార్టీ (ఎన్టీపీ)ని స్థాపించారు. అనతి కాలంలోనే ఎన్టీపీని.. చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో విలీనం చేశారు. ఈ పార్టీ గుర్తుపై ఒకేసారి మ ల్కాజిగిరి పార్లమెంట్, ఇబ్రహీంపట్నం అసెంబ్లీ స్థానానికి పోటీచేసి రెండు చోట్లా పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. లక్ష్మీనరసయ్యది తొలి హ్యాట్రిక్ ఇబ్రహీంపట్నం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నేత ఎంఎన్ లక్ష్మీనరసయ్య హ్యాట్రిక్ సాధించారు. 1957 నుంచి 1967 ఎన్నిక వరకు ఆయనకు తిరుగులేదు. వరుసగా మూడుసార్లు భారీమెజార్టీతో విజయం సాధించారు. 1957లో పీడీఎఫ్ అభ్యర్థిపై నె గ్గారు. ఆ తర్వాత 1962, 1967 లో స్వతంత్ర అభ్యర్థులు కేపీ.రెడ్డి, డి.మోహన్‌రెడ్డిపై గెలిచా రు. ఉమ్మడి జిల్లా పరిధిలో తొలిసారిగాహ్యాట్రిక్ విజయం నమోదు చేసింది ఈయనే. విజ‘ఇంద్రుడు’ చేవేళ్ల నియోజవర్గం నుంచి పట్లోళ్ల ఇంద్రారెడ్డి సరికొత్త రికార్డును సృష్టించారు. పార్టీ మారినా వరుసగా నాలుగుసార్లు విజయకేతనం ఎగురవేశారు. 1985 నుంచి 1999 వరకు విజయ పరంపర కొనసాగింది. 1983లో ఆయన తొలిసారిగా లోక్‌దళ్ పార్టీ నుంచి అసెంబ్లీకి పోటీచేసి ఇందిరా కాంగ్రెస్ అభ్యర్థి కె.లక్ష్మారెడ్డి చేతిలో ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరిన ఆయన 1985 నుంచి 1994 వరకు కాంగ్రెస్ అభ్యర్థులను చిత్తు చేసి వరుస విజయాలు సాధించారు. ఈ సమయంలో హోంశాఖతో పాటు పలు మంత్రి పదవులు నిర్వహించారు. ఆ తర్వాత టీడీపీలో సంక్షోభం నెలకొనడంతో ఆ పార్టీని వీడిన ఇంద్రారెడ్డి 1999 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. ఎదురులేని హరీశ్వర్‌రెడ్డి.. కె.హరీశ్వర్‌రెడ్డి పరిగి నియోజకవర్గంలో వరుసగా నాలుగుసార్లు విజయఢంకా మోగించారు. ఆ సెగ్మెంట్లో తొలిసారిగా కాంగ్రెసేతర పార్టీ అభ్యర్థి గెలుపొందడం హరీశ్వర్ రెడ్డితోనే మొదలైంది. 1994 నుంచి 2009 వరకు వరుస విజయాలు నమోదు చేశారు. రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఒకసారి స్వతంత్ర అభ్యర్థిగా పోటీచేసిన కమతం రామిరెడ్డిపైనే నెగ్గారు. చివరిసారిగా 2009లో ఇండిపెండెంట్ అభ్యర్థి టి.రాంమోహన్రెడ్డిపై ఘన విజయం పొందారు. అంతకుముందు 1985 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి షరీఫ్‌పై గెలిచారు. పరిగి నియోజకవర్గానికి మొత్తం 14 సార్లు ఎన్నికలు జరగగా.. ఐదుసార్లు హరీశ్వర్‌రెడ్డి విజయం సాధించడం విశేషం. మాణిక్ విజయ పరంపర.. తొలితరం తెలంగాణ ఉద్యమకారుడు, కాంగ్రెస్ సీనియర్ నేత ఎం.మాణిక్‌రావు కూడా విజయ పరంపర సాగించారు. వరుసగా నాలుగుసార్లు అసెంబ్లీలో అడుగుపెట్టిన ఘనత ఈయ న సొంతం. 1969లో జరిగిన ఉప ఎన్నిక మొదలు.. 1983 ఎన్నికల వరకు ఈయనదే విజయం. 1983లో రాష్ట్రమంతటా ఎన్టీఆర్ గాలి వీచినా ఇక్కడ మాణిక్‌రావు గెలుపును అడ్డుకోలేకపోయారు. 1972లో ఏకగ్రీవంగా ఎన్నికై రికా ర్డుల కెక్కారు. మిగిలిన మూడు ఎన్నికల్లో ప్రత్యర్థులపై భారీమెజార్టీ సాధించారు. పీవీ నర్సింహారావు, టి.అంజయ్య, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, భవనం వెంకట్రామిరెడ్డి, మర్రి చెన్నారెడ్డి, జల గం వెంగళరావు మంత్రివర్గాల్లో 14 ఏళ్లపాటు మంత్రిగా సేవలందించారు. రెం డు దఫాలుగా ఎమ్మెల్సీగా కొనసాగారు. 1969లో జరిగిన తొలి విడత తెలంగాణ ఉద్యమంలో కీలక పా త్ర పోషించిన మాణిక్‌రావు రాజమండ్రి సెంట్రల్ జైలులో శిక్ష అనుభవించారు. 1959లో తాండూరు పంచాయతీ సమితి అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికై రాజకీయ ప్రవేశం చేసి న మాణిక్.. 2016లో భౌతికంగా దూరమయ్యారు. జయ‘కేతనం’ రాజకీయ దురంధరుడు, కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి కల్వకుర్తి సెగ్మెంట్ నుంచి వరుసగా నాలుగుసార్లు జయకేతనం ఎగురవేశారు. తొలి రెండుసార్లు కాంగ్రెస్ తరఫున, ఆ తర్వాత రెండుసార్లు జనతా పార్టీ నుంచి గెలిచారు. 1969లో జరిగిన ఉప ఎన్నిక ద్వారా తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆయన.. 1983 ఎన్నికల వరకు క్రమం తప్పకుండా విజయాలు నమో దు చేశారు. దీంతో పాటు నాలుగుసార్లు లోక్‌సభకు, రెండుసార్లు రాజ్యసభకు ఎన్నికయారు. 2009లో చేవెళ్ల పార్లమెంట్ సభ్యుడిగా విజయం సాధించారు. కేంద్ర సమాచార, సాంస్కృతిక శాఖ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. శేఖరుని జైత్రయాత్ర వికారాబాద్‌లో ఎ.చంద్రశేఖర్ జైత్రయాత్ర సాగించారు. ఈ సెగ్మెంట్ నుంచి వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి సరికొత్త రికార్డును సృష్టించారు. ఇప్పటివరకు ఉమ్మడి జిల్లా పరిధిలో ఈయన మినహా.. మరెవరూ ఐదుసార్లు గెలిచిన దాఖలాలు లేవు. 1985 నుంచి 2004 వరకు వికారాబాద్ సెగ్మెంట్లో ఓటర్లు ఇతరులకు అవకాశం ఇవ్వకపోవడం విశేషం. 23 ఏళ్లపాటు ఎమ్మెల్యేగా పనిచేయడం అరుదైన విషయంగా చెప్పవచ్చు. 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో ఇద్దరు చొప్పున కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, ఇండిపెండెంట్లను ఓడించి శాసనసభలో అడుగుపెట్టారు. ఆ తర్వాత పార్టీ మారిన ఆయన 2004 ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగి టీడీపీ అభ్యర్థి బి.మధురవేణిపై నెగ్గారు. ఆ తర్వాత తెలంగాణ వ్యూహంలో భాగంగా 2008లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. 2009 ఎన్నికల్లోనూ పోటీచేసినప్పటికీ కాంగ్రెస్ అభ్యర్థి జి.ప్రసాద్‌కుమార్ చేతిలో ఓటమిని చవిచూశారు. -
తనయుడి కోసం మాతృమూర్తి ఎన్నికల ప్రచారం
రంగారెడ్డి/ పరిగి: తనయుడి కోసం ఆ మాతృమూర్తి ఎన్నికల ప్రచార బాట పట్టింది. 40 ఏళ్ల వారి కుటుంబ రాజకీయ జీవితంలో ఆమె ఏ రోజూ ప్రచారంలో పాల్గొనలేదు. మొదటిసారిగా తన కుమారుడి తరఫున జనంలోకి వచ్చారు. పరిగి అసెంబ్లీ స్థానం నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా పోటీచేసి అత్యధికంగా ఐదుసార్లు శాసన సభ్యునిగా గెలుపొందిన కొప్పుల హరీశ్వర్‌రెడ్డి ఇప్పుడు తనయుడికి పగ్గాలిచ్చి ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకున్నారు. భర్త హరీశ్వర్‌రెడ్డి కోసం ఎప్పుడూ ఎన్నికల ప్రచారంలో పాల్గొనని ఆయన సతీమణి గిరిజాదేవి తనయుడు కొప్పుల మహేష్‌రెడ్డి కోసం ప్రచార బాటపట్టారు. ఆయనను ఎమ్మెల్యేగా చూడాలనే కాంక్షతో ఇంటిల్లిపాది శ్రమిస్తున్నారు. హరీశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా పోటీచేసిన ప్రతిసారి ప్రచారంలో అన్నీతానై వ్యవహరించే వారు. ఇద్దరు తనయులు మహేశ్‌రెడ్డి, అనిల్‌రెడ్డిలు సైతం ఏ రోజూ మైకు పట్టుకుని ప్రచారం చేసే వారు కాదు. కేవలం వారు తెరవెనక వ్యవహారాలు మాత్రమే చూసేవారు. ప్రస్తుతం కుటుంబ సభ్యులతో పాటు బంధుగణం అందరు ప్రచారంలో చెమట చిందిస్తున్నారు. సోదరుడు అనిల్‌రెడ్డి, మహేశ్‌రెడ్డి భార్య ప్రతిమారెడ్డి, బాబాయ్ నాగిరెడ్డి తదితర కుటుంభ సభ్యులందరూ మహేశ్‌రెడ్డి కోసం కష్టపడుతున్నారు. ఆయన తల్లి గిరిజాదేవి టీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకుల్లో నూతనోత్తేజాన్ని నింపుతున్నారు. ఆమె ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానప్పటికీ ప్రతి ముఖ్యకార్యకర్తను గుర్తుపట్టగలరు. నాయకులు, కార్యకర్తల ఇళ్లలో శుభకార్యాలకు ఆమె వెళ్లేవారు. ఆ పరిచయాలతో ఇప్పుడు ప్రచారం చేయడం సులువుగా మారింది. -
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డికి కేసీఆర్ ఫోన్
సాక్షి, ఇబ్రహీంపట్నం : పట్టాదారు పాస్‌పుస్తకాలు, రైతుబంధు చెక్కుల పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సాధారణ ఎన్నికల్లో గెలుపునకు సోపానంగా మారుతుందని భావిస్తున్న ఈ కార్యక్రమంపై ముఖ్యమంత్రి కేసీఆర్ భారీ ఆశలు పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో రైతుబంధు, పాస్‌పుస్తకాల జారీపై ప్రజల మనోగతాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులోభాగంగా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డితో సీఎం కేసీఆర్ ఫోన్లో సంభాషించారు. తాళ్లపల్లిగూడెంలో కిషన్‌రెడ్డి చెక్కులు పంపిణీ చేస్తుండగా.. ముఖ్యమంత్రి ఫోన్ చేసి రైతుబంధు గురించి ప్రజలు ఎమనుకుంటున్నారని అడిగి తెలుసుకున్నారు. ప్రజల స్పందన ఎలా ఉంది.. ఇంకా ఏం చేస్తే బాగుంటుందో తెలుసుకోవాలని సూచించారు. -
కల్లాల్లో కల్లోలం
అకాల వర్షం.. అపార నష్టం నేలపాలైన పంటలు.. అన్నదాతల కన్నీళ్లు యార్డుల్లో తడిసిపోయిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి ఉమ్మడి నల్లగొండ, వరంగల్ జిల్లాలు అతలాకుతలం ‘రంగారెడ్డి’ని హడలెత్తించిన పిడుగుల వాన యాదాద్రి జిల్లాలో ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య సాక్షి నెట్వర్క్: అకాల వర్షం అపార నష్టం మిగిల్చింది. గాలివాన, వడగళ్లు, ఈదురుగాలుల ముప్పేట దాడితో కళ్లెదుటే కష్టార్జితం నేలపాలై రైతు గుండె చెరువైంది. పంటలు చేతికొచ్చే దశలో రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న వర్షాలు అన్నదాత పొట్టగొట్టాయి. పలుచోట్ల ఇప్పటికే పంటలు దెబ్బతినగా.. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు కురిసిన వానలతో ఉన్న కొద్దిపాటి పంటలు ఊడ్చిపెట్టుకుపోయాయి. కల్లాల్లో ఆరబెట్టిన ధాన్యం, మక్కలు, పసుపు, మిర్చి తడిసిపోయాయి. ఉమ్మడి నల్లగొండ, వరంగల్, ఖమ్మం, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. వివిధ జిల్లాల్లో పిడుగుపాటుకు 30 వరకు మూగజీవాలు చనిపోయాయి. అటు చేలల్లో.. ఇటు యార్డుల్లో.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పంట నష్టం ఎక్కువగా ఉంది. సూర్యాపేట మార్కెట్‌తోపాటు అర్వపల్లి, ఆత్మకూరు (ఎస్) మండలాల్లోని ఐకేపీ కేంద్రాల్లో ఆరబెట్టిన ధాన్యంతో పాటు 8 వేల ధాన్యపు బస్తాలు తడిసిపోయాయి. నల్లగొండ నియోజకవర్గ వ్యాప్తంగా 3,500 ఎకరాల్లో పంటలు నీటమునిగాయి. తిప్పర్తిలో 20 వేల క్వింటాళ్ల ధాన్యం తడిసిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. అధికారులు రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్లే ధాన్యం తడిసిపోయిందంటూ రహదారిపై ధర్నా చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో 7 మండలాల్లోని 3,035 ఎకరాల్లో వరి పంట నేలకొరిగింది. 700 ఎకరాల్లోని మామిడి తోటలు దెబ్బతిన్నాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో వందలాది ఎకరాల్లో మొక్కజొన్న, వరి, పసుపు, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. నర్సంపేట డివిజన్ పరిధిలోని 6 మండలాల్లో మార్కెట్లు, కల్లాల్లో ఆరబోసిన మొక్కజొన్న నీటిపాలైంది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలో కల్లాల్లో ఉడికించి ఆరబెట్టిన పసుపుతోపాటు కొన్నిచోట్ల మిర్చి తడిసిపోయింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలను పిడుగుల వాన హడలెత్తించింది. 2 జిల్లాల్లో వందలాది ఎకరాల్లోని వరి, మామిడి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. 10 రోజుల్లో కోతకు రానున్న మామిడి నేలపాలవడంతో రైతులు కంటతడి పెట్టుకున్నారు. తలకొండపల్లి మండలంలో దాదాపు 500 వందల ఎకరాల వరిపంట నీట మునిగింది. పిడుగుపాటుకు గురై పదుల సంఖ్యలో పశువులు మృత్యువాతపడ్డాయి. వికారాబాద్ జిల్లాలోని బొంరాస్‌పేట మండలంలో 200 ఎకరాల్లో వరి దెబ్బతింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో బలమైన ఈదురుగాలులతో వరి, మొక్కజొన్న నేలవాలాయి. సంగారెడ్డి జిల్లాలో శుక్రవారం నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకు వాన ముంచెత్తింది. సిద్దిపేట జిల్లాలోని రాయపోలు, దౌల్తాబాద్, చిన్నకోడూరు మండలాల్లో ఈదురుగాలులకు పంటలు దెబ్బతిన్నాయి. మెదక్ జిల్లాలో రెండ్రోజులుగా కురిసిన వర్షానికి 1,850 ఎకరాల్లో వరి, 50 ఎకరాల్లో మొక్కజొన్న దెబ్బతిన్నది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వరి, మొక్కజొన్న, మామిడి, జీడిమామిడి, అరటి పంటలకు తీరని నష్టం వాటిల్లింది. భద్రాద్రి జిల్లాలో 45 ఎకరాల్లోని అరటి తోటలు దెబ్బతిన్నాయి. జీడిమామిడి తోటల్లో మొక్కలు సగానికి విరిగి పడిపోయాయి. ధాన్యం తడవడంతో రైతు ఆత్మహత్య అకాల వర్షానికి ధాన్యం తడిసిపోవడంతో తట్టుకోలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు (ఎం) రైతు ఎలిమినేటి యాదిరెడ్డి (52) 13 ఎకరాల్లో వరి సాగు చేశారు. శుక్రవారం నుంచి కురుస్తున్న అకాల వర్షానికి వడ్లు నేల రాలడంతో మనస్తాపం చెందిన యాదిరెడ్డి.. ఆదివారం పొలంలోని గుడిసెలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నేడూ తీవ్రమైన ఈదురుగాలులు ఉత్తర మధ్య మహారాష్ట్ర, విదర్భలో నెలకొన్న ఉపరితల ద్రోణి కారణంగా సోమవారం కూడా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులు, వడగళ్ల వానలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళవారం కూడా కొద్దిమేర ఉపరితల ద్రోణి ప్రభావం కనిపించవచ్చని వివరించింది. మరోవైపు గత 24 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. ఉట్నూరు, వికారాబాద్‌లలో 6 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. పాలకుర్తిలో 5, దోమకొండ, రామన్నపేట, జూలపల్లి, చేవెళ్లల్లో 4 సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. సూర్యాపేట, నల్లగొండ, హుజూరాబాద్, భువనగిరి, సంగారెడ్డి, సత్తుపల్లి, ఇల్లందు, కొందుర్గులలో 3 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. అటు హైదరాబాద్‌లోనూ భారీ వర్షం కురిసింది. రాజేంద్రనగర్, బాచుపల్లి, నాంపల్లి, ఆస్మాన్‌ఘడ్ తదితర ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. -
రూ.వంద కోట్లతో ఉపాధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు వచ్చే ఏడాది విస్తృతంగా చేపట్టేందుకు యంత్రాంగం కార్యాచరణ సిద్ధం చేసింది. సుమారు రూ.100 కోట్లు ఖర్చు చేసి కూలీలకు మరింత ఉపాధి కల్పించడంతోపాటు గ్రామాలను అభివృద్ధి పథంలో నడిపించాలని నిర్ణయించింది. జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్డీఏ) 2018–19 సంవత్సరానికి ప్రణాళిక రూపొందించింది. ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త పనులు చేపట్టేందుకు ఇప్పటి నుంచే అధికారులు కసరత్తు చేస్తున్నారు. పని కావాలని కోరిన ప్రతి కుటుంబానికి ఏడాదిలో గరిష్టంగా వంద రోజులపాటు ఉపాధి కల్పించాలన్నది జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ముఖ్య ఉద్దేశం. వచ్చే ఏడాది రూ.100 ఖర్చు చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోగా.. ఇందులో సుమారు రూ.70 కోట్లను కూలి కిందనే చెల్లించనుండడం విశేషం. జిల్లాలో 415 గ్రామ పంచాయతీలు ఉండగా ఇందులో 356 పంచాయతీల్లో ఉపాధి పనులు జరుగుతున్నాయి. వీటి పరిధిలో జాబ్ కార్డులు పొందిన 1.36 లక్షల కుటుంబాలు ఉపాధి పనులకు ఏ డాది పొడవునా హాజరవుతున్నట్లు అధికారిక లెక్కలు స్పష్టం చేస్తున్నా యి. ఇందులో కనీసం లక్ష కుటుంబాలకు వంద రోజుల పని కల్పించా లని డీఆర్డీఏ లక్ష్యం పెట్టుకుంది. మరో రూ.30 కోట్లను మెటీరియల్ కోసం వెచ్చించనున్నారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, శ్మశాన వాటికలు, ప్ర భుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్లు, కిచెన్ షెడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. నీటి సంరక్షణకు పెద్దపీట వర్షపు నీటి సంరక్షణకు పెద్దపీట వేయనున్నారు. వాన నీటిని ఎక్కడికక్కడ నిల్వచేసి ప్రతి బొట్టుని భూమిలోకి ఇంకించేందుకు విస్తృతంగా నిర్మాణాలు చేపట్టాలని యోచిస్తున్నారు. జిల్లాలో 90 శాతం పంటల సాగుకు భూగర్భ జలాలే ప్రధాన వనరు. వాన నీటి నిల్వ, సంరక్షణ కోసం విస్తృతంగా ఊట కుంటలు, చెక్‌డ్యాంలు, ఇంకుడు గుంతలు నిర్మించాలని నిర్ణయించారు. అలాగే వ్యవసాయానికి అనుబంధంగా రైతులకు ఉపయోగపడేలా బావుల పూడికతీత, నీటి పారుదల కాల్వల నిర్వాణం, ఫీడర్ చానెళ్ల ఏర్పాటు తదితర పనులకూ ప్రాధాన్యం ఇస్తామని అధికార వర్గాలు వెల్లడించాయి. ‘వచ్చే ఏడాది మరింత ఉత్సాహంతో పనులు చేపట్టనున్నాం. ప్రతి కుటుంబానికి వంద రోజుల పని కల్పించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’ అని డీఆర్డీఓ ప్రశాంత్ కుమార్ తెలిపారు. అలాగే స్వచ్ఛభారత్‌లో భాగంగా పెద్ద ఎత్తున వ్యక్తిగత మరుగుదొడ్లను త్వరితగతిన నిర్మిస్తామని చెప్పారు. ఈ ఏడాది రూ.80 కోట్లు ఖర్చు ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31తో ముగియనుంది. దాదాపు 10 నెలల కాలంలో ఉపాధి హామీ పథకం కింద రూ.80 కోట్లు ఖర్చు చేశారు. 7,200 కుటుంబాలకు వంద రోజుల పని కల్పించారు. హాజరైన కూలీల కు సుమారు రూ.57 కోట్లు కూలి రూపంలో చెల్లించారు. మరో రూ.24 కోట్లను మెటీరియల్ పనులకు ఖర్చు చేశారు. మార్చి 31లోగా మరో రూ.10 కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. -
ఫార్మాకు ప్రత్యేక రైల్వే లైన్
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ఫార్మాసిటీకి ప్రత్యేక రైల్వేలైన్ వేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టులో పెట్టుబడులు పెట్టేందుకు ఔషధరంగ దిగ్గజ కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్న నేపథ్యంలో సరుకు రవాణాకు రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే దిశగా ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ప్రాజెక్టు సమగ్ర నివేదికలో పొందుపరిచింది. వారం రోజుల క్రితం యాచారం మండ లం మేడిపల్లిలో ‘హైదరాబాద్ గ్రీన్ ఫార్మాసిటీ’పై ప్రజాభిప్రాయసేకరణ జరిపిన సర్కారు.. ఇందులో ఈపీటీఆర్ఐ రూపొందించిన పర్యావరణ ప్రభావం, అంచనా(ఈఐఏ) నివేదికను బహిర్గతం చేసింది. ఈ క్రమంలోనే షాద్‌నగర్ నుంచి ప్రత్యేక రైల్వేలైన్‌ను ప్రస్తావించింది. సికింద్రాబాద్ నుంచి కర్నూలు మీదుగా డోన్ వెళ్లే బ్రాడ్‌గేజ్ రైల్వేలైన్‌ను అనుసంధానం చేస్తూ ఫార్మాసిటీకి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు తెలిపింది. ఔషధనగరికి దక్షిణం వైపు ఉత్తర–దక్షిణ దిశలో 33కి.మీ. (షాద్‌నగర్ చేరువలో)దూరంలో ఈ లైన్‌ను కలిపితే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. ఈ రైలు మార్గాన్ని ప్రయాణికుల అవసరాలకు కాకుండా సరుకు రవాణాకే వినియోగించుకోవాలని ప్రతిపాదించింది. తద్వారా వివిధ పరిశ్రమలు తయారుచేసే ఉత్పత్తులను సులువుగా ఇతర ప్రాంతాలకు రవాణా చేయవచ్చని అంచనా వేసింది. మరోవైపు ప్రాజెక్టుకు నలు దిశలా రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. రీజినల్ రింగ్‌రోడ్డు సహా ప్రస్తుత ఔటర్‌రింగ్ రోడ్డు నుంచి ఫార్మాసిటీని కలుపుతూ ప్రత్యేక మార్గాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. కందుకూరు– యాచారం మీదుగా నాగార్జునసాగర్ హైవేను లింకు చేస్తూ రోడ్డు విస్తరణ పనులను ఆర్అండ్బీ చేపట్టింది. మరోవైపు రావిర్యాల దగ్గర ఔటర్ ఎగ్జిట్ 13 నుంచి కూడా ఒక రహదారిని ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి–సాగర్ హైవేను అనుసంధానిస్తూ మరికొన్ని రోడ్లను నిర్మించనున్నట్టు ఈఐఏ నివేదికలో స్పష్టం చేసింది. జిల్లాను రెండో జోన్లో కొనసాగించాలి దోమ(పరిగి): వెనుకబడిన వికారాబాద్ జిల్లాను (పాత జోనల్) రెండో జోన్లోనే కొనసాగించాలని పీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తిరుపతయ్యగౌడ్, దోమ మండల అధ్యక్షుడు గిరమోని గోపాల్ అన్నారు. జిల్లాను పూర్వ రంగారెడ్డి జిల్లాలో కలపి రెండో జోన్లో కొనసాగించాలని కోరుతూ తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దార్‌కు పీఆర్టీయూ మండల శాఖ ఆధ్వర్యంలో వినతిపత్రాన్ని శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పునర్విభజనలో భాగంగా జిల్లాను 1వ జోన్లో కలపడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు, నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనిని అంగీకరించేది లేదని ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకుని రెండో జోన్లోనే కలపాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ముందు ముందు ఉపాధ్యయ సంఘాల తరుపున నిరసనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు పురందాస్, రాష్ట్ర కార్యదర్శి హరిలాల్, జైపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
విద్యార్థుల భవితకు నవోదయం
కరన్‌కోట్: గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు అధునాతన, నాణ్యమైన, క్రమశిక్షణ, క్రీడల్లో ప్రతిభతో పాటు అనేక సదుపాయాలతో విలువలతో కూడిన విద్యను అందించేందుకు కేంద్ర మానవవనరులశాఖ ఆధ్వర్యంలో జవహర్ నవోదయ విద్యాలయాలు ఏర్పడ్డాయి. దేశవ్యాప్తంగా 595 నవోదయ విద్యాలయాలు ఉండగా, తెలుగు రాష్టాల్లో 24 ఉన్నాయి. ఈ విద్యాలయాలు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్ఈ) సిలబస్‌లో విద్యా బోధనలు అందిస్తున్నాయి. రూ.లక్షలు వెచ్చించి కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పించినా కేవలం విద్యపైనే దృష్టి సారిస్తున్నారు తప్ప ఇతర రంగాల్లో తమ పిల్లలు రాణించలేకపోతున్నారనే అపోహ తల్లిదండ్రుల్లో నెలకొంది. కాగా నవోదయ విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాల్లో రాణిస్తుండటంతో ఈ విద్యాలయాల్లో ప్రవేశానికి వందల సంఖ్యలో మాత్రమే ఉన్న ప్రవేశాలకు వేలాదిమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సీటు లభించాలని వేచి చూస్తుంటారు. రానున్న విద్యాసంవత్సరంలో ప్రవేశానికి తాజాగా నవోదయ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ వెలువడింది. ఈ విద్యాలయాల్లో 2018–19 విద్యాసంవత్సరానికి గాను ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. రిజర్వేషన్ల పద్ధతి ద్వారా విద్యార్తులకు ప్రవేశపరీక్ష నిర్వహించి ఆరో తరగతిలో ప్రవేశం కల్పిస్తారు. వచే ఏడాది ఫిబ్రవరి 10న జరిగే ఈ పరీక్షలో అర్హత సాధించిన వారికి ప్రవేశం లభిస్తుంది.దీనికై వచ్చేనెల నవంబర్ 25లోగా దరఖాస్తులు చేసుకోవాలి. అర్హతలు, రిజర్వేషన్ విధానం.. నవోదయ ప్రవేశ పరీక్షకు అన్ని ప్రభుత్వ, ప్రభుత్వంచే గుర్తింపు పొందిన పాఠశాలలో ప్రస్తుతం అయిదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. వీరు 2005 మే1 నుంచి 2009 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. 3, 4, 5వ తరగతులను విద్యార్థులు తప్పనిసరిగా గ్రామీణ ప్రాంతలలో చదివి ఉత్తీర్ణులవ్వాలి. నవోదయ విద్యాలయలో ప్రవేశానికి రిజర్వేషన్ విధానం పక్కాగా ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులకు 75శాతం, పట్టణ ప్రాంత విద్యార్థులకు 25శాతం సీట్లు కేటాయిస్తారు.షెడ్యూల్ కులాలకు 15,షెడ్యూల్ తరగతులకు 7,వికలాంగులకు 3శాతం రిజర్వేషన్లు ఉన్నాయి.బాలికలకు 33శాతం అమలుచేస్తున్నారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు.. గతంలో విద్యార్థులు సంబంధిత మండల విద్యాశాఖ అధికారి(ఎంఈవో) కార్యాలయంలో దరఖాస్తు పత్రాన్ని తీసుకుని మాన్యువల్ చేతిరాత ద్వారా నింపి అదే కార్యాలయంలో స మర్పించేవారు. కాగా ఆ విధానంలో పలు ఇబ్బదులు ఎదురవుతున్నాయని గుర్తించి కేంద్రీయ నవోదయ విద్యాలయ అధికారులు ఈ విద్యాసంవత్సరం నుంచి తొలిసారిగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియను ప్రారంభించారు. సమీ పంలోని మీసేవ కేంద్ర నుంచి రూ.10 చెల్లించి ఆన్లైన్ ద్వా రా దరఖాస్తు పత్రం తీసుకొని విద్యార్థి చదివే పాఠశాల ప్రధనోపాధ్యాయుడి సంతకాన్ని తీసుకోవాలి.ప్రవేశ పరీక్ష దరఖాస్తు కోసం మరో రూ.35 చెల్లించి విద్యార్థి పాస్‌పోర్టు సైజ్ ఫొటోను జత చేసి పూరిత వివరాలు నింపాలి. ఫోన్ నంబర్‌ను కూడా నమోదు చేయాలి. దరఖాస్తు ఆన్లైన్లో అప్‌లో డ్ చేయగానే సంబంధిత ఫోన్‌కు వచ్చిన వోటీపీ నమోదు చేయగానే దరఖాస్తు స్వీకరించినట్లు నిర్ధారణ అవుతుంది. ప్రవేశ పరీక్ష విధానం.. నవోదయ ప్రవేశ పరీక్షను ఏభాషలోనైనా రాయవచ్చు. విద్యార్థులు ప్రస్తుతం చదువుతున్న భాషను ఎంచుకోవచ్చు. 2 గంటల సమయం కేటాయించే ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కు ఉంటుంది. మూడు విభాగాల్లో ప్రశ్నలు ఉంటాయి. మేధాశక్తికి 50, గణితం 25 మూడో విభాగంలో 25 మార్కులకు భాష సంబంధిత ప్రశ్నలు ఉంటాయి. పోటీ తీవ్రమే అయినా.. నవోదయ విద్యాలయలో ప్రవేశం కోసం ఏటా ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 12 వేలకు పైగా విద్యార్థులు ప్రవేశ పరీక్షకు హాజరవుతారు. కాగా ప్రణాళిక బద్ధంగా చదువుకుని పరీక్షకు సిద్ధమైతే ఫలితాలు సాధించవచ్చు. ఒకటవ తరగతి నుంచి ఐదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలలో ఉన్న గణిత అంశాలపై సాధన చేయాలి.అలాగే ప్రవేశ పరీక్ష బుక్‌లెట్‌లో ఇచ్చిన సిలబస్ ఆధారంగా ఆయా అంశాలపై దృష్టిసారిస్తే పరీక్షలో నెగ్గడం ఎంతో సులభం. ఈ పరీక్షలో అర్హత సాధిస్తే 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులు బంగారు బాటకు భరోసా సాధించినట్టే. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ ఇద్దరి మృతి
వే గంగా వెళ్తున్న లారీ ముందు వెళ్తున్న బైక్‌ను ఢీకొట్టడంతో.. ద్విచ క్రవాహనం పై ఉన్న ఇద్దరు యువకులు అక్కడిక క్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం ఫతేపూర్ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్, లక్ష్మణ్‌లు బైక్ పై వెళ్తుండగా.. వేగంగా వస్తున్న లారీ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో శంకర్, లక్ష్మణ్‌లు అక్కడికక్కడే మృతిచెందగా.. మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించి పోలీసులకు సమాచారం అందించారు. -
ఔటర్‌పై రోడ్డు ప్రమాదం వ్యక్తి మృతి
ఔటర్ రింగ్‌రోడ్డు పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వెళ్తున్న డీసీఎంను ఓవర్టేక్ చేసే క్రమంలో టాటాఏస్ దాన్ని ఢీకొట్టడంతో.. రెండు వాహనాలు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడ్డాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతిచెందగా.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ఒకరి పరస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన మహేశ్వరం మండలం తుక్కుగూడలోని పహడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. శంషాబాద్ నుంచి ఘన్‌పూర్‌కు కుర్చీల లోడుతో వెళ్తున్న డీసీఎం పటాన్చెరు నుంచి రామోజీఫిల్మ్ సిటి వైపు వస్తున్న టాటాఏస్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా, ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఇది గుర్తించిన హైవే పోలీసులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు బలవన్మరణం
వికారాబాద్: అప్పుల బాధతో ఓ రైతు బలవన్మరణానికి పాల్పడ్డాడు. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పులుసుమామిడి గ్రామానికి చెందిన ఎండీ కాశీం(40)తనకున్న రెండెకరాలతో పాటు మూడెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి, మొక్కజొన్న సాగు చేశాడు. పంటలు సరిగా పండకపోవటంతో కాశీం తీవ్ర నిస్పృహకు గురయ్యాడు. ఈ నేపథ్యంలోనే సోమవారం ఉదయం పొలానికి వెళ్లి, పురుగు మందు తాగాడు. సాయంకాలం అయినా తిరిగిరాకపోవడంతో అతడిని వెతుక్కుంటూ వెళ్లిన కుటుంబసభ్యులకు పొలంలో విగత జీవిగా కనిపించాడు. వెంటనే అతడిని వికారాబాద్ ఆస్పత్రికి తరలించగా అర్థరాత్రి సమయంలో మృతి చెందాడు. అతడికి భార్య, కుమార్తె ఉన్నారు. -
గుప్త నిధుల తవ్వకాలు: 9 మంది అరెస్టు
తుర్కయాంజల్: గుప్త నిధుల కోసం తవ్వకాలు జరుపుతున్న9 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కయాంజల్ ఏవీనగర్‌లోని వెంకటేశ్వరస్వామి ఆలయం సమీపంలో కొందరు వ్యక్తులు ముప్పై అడుగుల లోతైన గుంతను తవ్వారు. అక్కడ పూజలు చేసిన ఆనవాళ్లు ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు పోలీసులు తవ్వకాలు జరుపుతున్న 9 మందిని అదుపులోకి తీసుకుని, ఒక ట్రాక్టర్‌ను సీజ్ చేశారు. అయితే, వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకే గుంతను తవ్వుతున్నట్టు నిందితులు చెబుతున్నారు. -
వికారాబాద్‌లో చైన్ స్నాచింగ్
వికారాబాద్: రోడ్డుపై వెళ్తున్న మహిళ మెడలోంచి గుర్తుతెలియని దుండగులు మూడున్నర తులాల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా వికారాబాద్ మండలం పెద్దులూరు గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన పద్మమ్మ(38) వ్యవసాయ పనులకు కోసం వెళ్తుండగా.. బైక్ పై వచ్చిన ఇద్దరు దుండగులు ఆమె మెడలోంచి బంగారు గొలుసును లాక్కొని పరారయ్యారు. ఈ మేరకు బాధితురాలు వికారాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
కీసరలో భారీ చోరీ
కీసర: అర్ధరాత్రి సమయంలో ఇంట్లోకి చొరబడిన దొంగలు.. భార్య భర్తలను కట్టేసి ఇంట్లో ఉన్న బంగారంతో ఉడాయించారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం కుందనపల్లి, వికలాంగుల కాలనీలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. కాలనీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి ఇంట్లోకి అర్థరాత్రి గుర్తుతెలియని దుండగులు ప్రవేశించి భార్యాభర్తలను బంధించి.. బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. అదే సమయంలో సాయం కోసం అరవడానికి ప్రయత్నించిన శ్రీనివాస్ రెడ్డిని తీవ్రంగా గాయపరిచారు. దుండగులు పరారయ్యాక లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
మూసీని పరిశీలించిన ఢిల్లీ బృందం
ఘట్కేసర్: సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆరుగురు సభ్యుల బృందం రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ మండలంలో మూసీ నది పరిసర ప్రాంతంలో పర్యటించింది. ఈ మేరకు మూసీ నది కాలుష్యంపై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ మ్యానేజింగ్ కమిటీ మంగళవారం పర్యటించి నివేదికను తయారు చేసింది. ఈ నివేదికను త్వరలోనే సుప్రీంకు సమర్పిస్తామని కమిటీ సభ్యులు తెలిపారు. -
కీసరగుట్ట గోపురం ఎక్కి పూజారి హల్చల్
కీసర: దేవాదాయశాఖ అర్చకులు, ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓ పూజారి కీసరలోని రామలింగేశ్వర స్వామి ఆల య గోపురం ఎక్కి హల్చల్ చేశాడు. సమస్యల పరిష్కారం కోసం దేవాదాయ శాఖ అర్చకులు, ఉద్యోగులు మూడు రోజులుగా చేస్తున్న సమ్మెను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా గురువారం సుమారు 300 మంది అర్చకులు, ఉద్యోగులు నగరంలోని దేవాదాయశాఖ కార్యాలయం నుంచి రంగారెడ్డి జిల్లా కీసరగుట్ట ఆలయం వరకు బైక్‌ర్యాలీ నిర్వహించారు. ఇక్కడి ఆలయ గోపురం ఎదురుగా నిర్వహించిన సమ్మెలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్చక, ఉద్యోగ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గంగు భానుమూర్తి మాట్లాడుతూ అర్చక, సిబ్బందికి ట్రెజరీ 010 ద్వారా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యల పరిష్కారంపై పాలకులు, అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ కీసరగుట్ట పూజారి వెంకటేష్ గోపురం ఎక్కి ఆత్మాహత్యకు యత్నించారు. తోటి అర్చకులు వారించి కిందకు దింపడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. -
రైలు కిందపడి వ్యక్తి ఆత్మహత్య
ఘట్కేసర్: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా ఘట్కేసర్ పరిధిలోని మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో శనివారం జరిగింది. వివరాలు.. కాలనీకి చెందిన శ్రీధర్(43) కల్లు ఆర్థిక ఇబ్బందులు తలెత్తడంతో బ్రిడ్జి సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
దొంగబాబాకు దేహశుద్ధి
-
దొంగబాబాకు దేహశుద్ధి
బంట్వారం : ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించినందుకు దొంగబాబాకు దేహశుద్ధి చేశారు. ఈ సంఘటనం బంట్వారం మండలం తుర్మామిడి గ్రామంలో చోటుచేసుకుంది. కర్ణాటక రాష్ట్రానికి చెందిన రెయిన్‌బాబా అనే వ్యక్తి గ్రామంలోని ఓ వ్యవసాయపొలంలో చిన్నకుటీరం వేసుకుని జాతకాలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు. ఈ క్రమంలో ఓ మహిళ జాతకం చెప్పించుకోవడానికి బాబా దగ్గరకు వెళ్లింది. తన భర్త 3 సంవత్సరాల నుంచి కనిపించడం లేదని ఎక్కడున్నాడో తెలపాలని బాబాను కోరింది. అయితే రాత్రికి రండి అని చెప్పి పంపించాడు .ఆ మహిళ ఆదివారం రాత్రి తన తల్లితో కలిసి బాబా దగ్గరకు వచ్చింది. తల్లిని బయట ఉంచి కూతుర్ని లోపలికి రమ్మని చెప్పాడు. లోపలికి వెళ్లిన తర్వాత సదరు మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని గ్రామస్తులకు తెలపడంతో వారు దొంగస్వామిని చెట్టుకు కట్టేసి చితకబాదారు. ఈ సంఘటనపై గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
ముక్కలుగా నరికి బోరుబావిలో వేశారు
పరిగి: రంగారెడ్డి జిల్లాలో ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన శనివారం రంగారెడ్డి జిల్లా పరిగి మండలం చీగురాలపల్లి గ్రామంలో వెలుగు చూసింది. వివరాలు.. మండలంలోని నారాయణపూర్‌కు చెందిన ముక్తార్(22) పరిగిలో నెట్ సెంటర్ నిర్వహిస్తుంటాడు. కాగా, గత నెల 27న చీగురాలపల్లిలో తన స్నేహితుడు రాఘవేంద్రను కలిసేందుకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ముక్తార్ తిరిగి కనిపించలేదు. దీంతో 30 వతేదీ తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు స్నేహితులను అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయట పడింది. ముక్తార్‌ను హత్య చేసి ముక్కలు ముక్కలుగా నరికి చీగురాలపల్లి గ్రామంలోని ఒక బోరుబావిలో వేసినట్లు నిందితులు తెలిపారు. దీంతో పోలీసులు బోరు బావిలో నుంచి ముక్తార్ దేహాన్ని బయటకు తీసేందుకు ప్రయత్నిస్నున్నారు. కాగా, హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. -
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ విడుదల
చేవేళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి జులై 2 వరకు 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం చేవేళ్లలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పొల్గొన్నారు. జిల్లాలోని 7 నియోజకె వర్గాల్లో 15 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి షర్మిల పరామర్శ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్ ఓదార్పు పూర్తికాగా, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్రను చేపట్టనున్నారు. -
గుర్తు తెలియని వ్యక్తి హత్య
హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని ఆదిబట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన సోమవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. నాదురుగల్ గ్రామ సమీపంలో వ్యక్తిని బండరాయితో మోదీ హత్య చేశారు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పాత కక్ష్యల నేపథ్యంలోనే హత్య జరిగిఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
రేషన్ దుకాణాలపై విజిలెన్స్ దాడులు
ఎల్బీనగర్ : రంగారెడ్డి జిల్లాలోని రేషన్ దుకాణాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఎల్బీనగర్, నాగోలులోని బుధవారం ఓ రేషన్ దుకాణంపై ఆకస్మిక దాడులు చేశారు. రికార్డులను పరిశీలించి 101 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్టు అధికారులు గుర్తించారు. అంతేకాకుండా 600 లీటర్ల కిరోసిన్ ను సీజ్ చేశారు. రేషన్ డీలర్ రవి, దుకాణం నిర్వాహకుడు సత్యనారాయణలపై కేసు నమోదు చేశారు. కాగా సత్యనారాయణ పరారీలో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. జాయింట్ కలెక్టర్ ఆదేశాలతో విజిలెన్స్ అధికారులు రేషన్ దుకాణాలపై దాడులు నిర్వహించారు. -
జీడిమెట్లలో చోరి
జీడిమెట్ల : ఇంట్లో ఎవరు లేని సమయం చూసి పట్టపగలే దొంగలు తెగబడ్డారు. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా జీడిమెట్ల పోలీసు స్టేషన్ పరిధిలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. జీడిమెట్ల పరిధిలోని కుత్బుల్లాపూర్ దత్తసాయి రెసిడెన్సిలోని 104 ప్లాట్‌లో పట్టపగలు చోరీ జరిగింది. ప్లాట్‌లో నిమాసముంటున్న పరమేశ్వర్ అనే వ్యక్తి ఇంట్లో ఎవరులేని సమయంలో దొంగలుపడి 19 తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానకి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు. -
బైక్ ను ఢీకొన్నకారు..ఇద్దరికి తీవ్ర గాయాలు
కీసర : వేగంగా వచ్చిన లారీ, కారుని ఢీకొట్టడంతో ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన కారు డ్రైవర్ ముందు వెళ్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా కీసర మండలం రాంపల్లి గ్రామంలో గురువారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. కరీంగూడ నుంచి రాంపల్లి వైపు అతివేగంగా వస్తున్న లారీ కుషాయిగూడ నుంచి వెళ్తున్న కారును రాంపల్లి చౌరస్తా వద్ద ఢీకొట్టింది. దీంతో ప్రమాదం నుంచి తప్పించడానికి డ్రైవర్ చేసిన ప్రయత్నంలో కారు ఎదురుగా వస్తున్న బైక్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ మీద ప్రయాణిస్తున్నభార్యభర్తలకు తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నగరంలోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారు ఘట్కేసర్ మండలం ఎన్నంపేట గ్రామానికి చెందిన బహదూర్ అలి, ముంతాజ్ బేగం గా గుర్తించారు. సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. -
బైక్‌ను ఢీకొట్టిన లారీ.. వ్యక్తి మృతి
శంకర్పల్లి: రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి వద్ద బుధవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. వివరాలు...శేరిగూడ గ్రామానికి చెందిన మైలారం రాములు (35) అనే వ్యక్తి శంకర్పల్లి నుంచి బైక్‌పై హైదరాబాద్ వైపు వెళుతుండగా ఎదురుగా వస్తున్న డీసీఎం లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రాములు అక్కడికక్కడే మృతి చెందాడు. స్తానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. -
పందుల దాడి : 25 మేకలు మృతి
రంగారెడ్డి: రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలంలోని తొర్రూర్ గ్రామంలో మేకల మందపై గురువారం అర్ధరాత్రి ఊరపందులు దాడి చేశాయి. ఈ సంఘటనలో 25 మేకపిల్లలు మృతి చెందాయి. మేకపిల్లలు చనిపోవడంతో యజయానులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వపరంగా నష్టపరిహారం ఇప్పించాలని వారు కోరారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. (హయత్‌నగర్) -
ఇసుక లారీ ఢీకొని మహిళ మృతి
శంషాబాద్: ఇసుక లారీ ఢీకోని గురువారం ఓ మహిళ మృతి చెందింది. ఈ సంఘటన శంషాబాద్ మండలం పెద్ద శాపూరు బస్టాండ్ వద్ద జరిగింది. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలం మక్తగూడానికి చెందిన మణెమ్మ(55) మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా ఈ దుర్ఘటన జరిగింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. షాద్‌నగర్ నుంచి శంషాబాద్ వైపు వేగంగా వెళ్తున్న ఇసుక లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు లారీ డ్రైవర్‌ను అదుపులో తీసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక క్లస్టర్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.