కొండా వెంకట రంగారెడ్డి, చిరాగ్ ప్రతాప్‌లింగంగౌడ్, కొండా లక్ష్మారెడ్డి
సాక్షి, వికారాబాద్: మండల పరిధిలోని పెద్దమంగళారం రాజకీయ కీర్తిని ఘడించింది. ఉమ్మడి రాష్ట్రానికి ముగ్గురు ఎమ్మెల్యేలను అందించి రాజకీయ చరిత్రకెక్కింది. 1952, 1957లో షాబాద్ ఎమ్మెల్యేగా, 1959లో రెవెన్యూ మంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన కొండా వెంకట రంగారెడ్డి పెద్దమంగళారం వాసి. 1978–82 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యేగా ఉన్న చిరాగ్ ప్రతాప్‌లింగంగౌడ్, 1983–85 మధ్యకాలంలో చేవెళ్ల ఎమ్మెల్యే పదవిలో ఉన్న కొండా లక్ష్మారెడ్డి పెద్దమంగళారం పంచాయతీకి చెందినవారే.
విలీనానికి వ్యతిరేకం కేవీఆర్..
1890 డిసెంబర్ 12న పెద్దమంగళారంలో రైతు కుటుంబంలో జన్మించిన కొండా వెంకట రంగారెడ్డి స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నారు. జమీందార్లకు, జాగీర్‌దార్లకు వ్యతిరేకంగా ఉద్యమించిన ఆయన రైతుల పక్షాన పోరాటం చేశారు. ఆ సమయంలో జైలు జీవితం సైతం అనుభవించారు. 1952–57 వరకు షాబాద్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు.
1956లో హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రాలో విలీనం చేయడాన్ని ఆయన తీవ్రంగా వ్యతిరేకించారు. పెద్దమనుషుల ఒప్పందంలో ఆయన కీలక భూమిక పోషించారు. 1959లో నీలం సంజీవరెడ్డి ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ఆయన అనంతరం ఉపముఖ్యమంత్రి పదవిని చేపట్టారు. 1969లో తెలంగాణ ఉద్యమాన్ని లేవనెత్తి ప్రత్యేక రాష్ట్రంకోసం పోరాటం చేశారు. 1970 జూలై 24న ఆయన తుదిశ్వాస విడిచారు.
ఇవి చదవండి: సీఎంను అందించిన భాగ్యనగరం!
Comments
Please login to add a commentAdd a comment