
వైఎస్ షర్మిల పరామర్శ యాత్ర పోస్టర్ విడుదల
చేవేళ్ల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి షర్మిల ఈ నెల 29 నుంచి జులై 2 వరకు 4 రోజుల పాటు రంగారెడ్డి జిల్లాలో పరామర్శ యాత్రను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ ను మంగళవారం చేవేళ్లలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివకుమార్, పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి పొల్గొన్నారు.
జిల్లాలోని 7 నియోజకె వర్గాల్లో 15 కుటుంబాలను వైఎస్ షర్మిల పరామర్శించనున్నారు. వైఎస్ మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శిస్తానని వైఎస్ జగన్ ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తరఫున సోదరి షర్మిల పరామర్శ యాత్రను చేపట్టిన విషయం తెలిసిందే. తెలంగాణలోని ఖమ్మం జిల్లాలో ఇదివరకే వైఎస్ జగన్ ఓదార్పు పూర్తికాగా, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో షర్మిల పరామర్శ యాత్రను పూర్తిచేశారు. తాజాగా రంగారెడ్డి జిల్లాలో యాత్రను చేపట్టనున్నారు.